10/07/2023
ది.21.06.2023 వ తేదినాటి సమాచారం.
_*ప్రియమిత్రులారా!*_
_*ఈరోజు ఐ.కా.స జరిపిన PRC,2022 చర్చల వివరాలు క్లుప్తంగా;-*_
_యాజమాన్యం గరిష్ట మాస్టర్ స్కేలు దాటిన మూలవేతనం *పర్శనల్ పే* గా, గరిష్ట కేడర్ స్కేలు దాటినప్పటికి మూలవేతనాన్ని *యధాతథంగా పాతపధ్ధతిలో మూలవేతనం గరిష్ట మాస్టర్ స్కేలు ప్రకారం కొనసాగిస్తాము* గరిష్ట *మాస్టర్ స్కేలు* ను పొడిగింపు కు అంగీకారాన్ని తెలియజేయడంతో పాటు *ఫెన్సనరీ బెనిఫిట్ లకు రక్షణ కల్పిస్తాము.*_ కాంట్రాక్టు/పొరుగుసేవల సిబ్బంది సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని, చర్చించి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తమన్నారు
_*పై విషయాలపై ఐ.కా.స వ్యక్తపరిచిన అభిప్రాయం*_
గరిష్ట మాస్టర్ స్కేలు దాటిన మూలవేతనం *పర్సనల్ పే* గా పరిగణించుటను వ్యతిరేకించుటడంతో పాటు *స్పెషల్ పే/పర్సనల్ పే* లాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ మాస్టర్ స్కేల్ రూపొందించి, పాతవిధానంలో *పే ఫిక్సెషన్* చేయవలెను.
సర్వీస్ వైటేజీలు కొనసాగించాలని, ఒకవేళ సర్వీస్ వైటేజీలు ఇవ్వని పక్షంలో ఫిట్మెంట్ భేనిఫిట్ ఎక్కువ శాతం ఇవ్వాలని కొరడమైనది. కాంట్రాక్టు/పొరుగుసేవల సిబ్బంది సమస్యలపై ప్రత్యేక సమావేశం త్వరగా ఏర్పాటు చేసి, వారి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కొరడమైనది.
గౌ!! *ఇంధన శాఖ మాత్యులు మాన్యశ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు* పైన పేర్కొన్న విషయాలన్నింటినీ గౌ!! రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు *మాన్యశ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి* దృష్టికి తీసుకువెళ్లి, వారితో చర్చించి ఒక వారం రోజులలో మరొక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.