Dr.Dasari Sudha MLA, Badvel.

  • Home
  • Dr.Dasari Sudha MLA, Badvel.

Dr.Dasari Sudha MLA, Badvel. YSRCP, BADVEL CONSTITUENCY M.L.A.,

ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పై ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవటం పై వైయస్ఆర్ సీపీ నేతల ఆగ్రహం..వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాల...
27/04/2026

ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పై ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవటం పై వైయస్ఆర్ సీపీ నేతల ఆగ్రహం..

వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి వినతిపత్రం ఇచ్చిన వైయస్సార్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి అంజాద్ భాషా, CEC సభ్యులు కే.సురేష్ బాబు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామి రెడ్డి, మరియు వైయస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు..

ఏబీఎన్ రాధాకృష్ణ వైయస్ఆర్ సీపీ నేతల భార్యలపై అగౌరవంగా మాట్లాడి కించపరిచాడు, ఏబీఎన్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసినా పట్టించుకోవటం లేదు, ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. వైయస్ఆర్ సీపీకి వ్యతిరేకంగా తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీస్ వ్యవస్థ బండారం బయటపడింది. పబ్లిక్ గా వైయస్ఆర్ సీపీ నేతల భార్యలపై మాట్లాడిన ఏబీఎన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? తాము ఫిర్యాదు చేస్తుంటే ఆ లెటర్ తీసుకోవటానికి కూడా భయపడుతున్నారు, టీడీపీ నేతలకి పోలీసులు ఎందుకు భయపడుతున్నారు? నిజంగా మహిళలు అంటే గౌరవం ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.

అట్లూరు మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బోవిళ్ల చిన్న సూరా రెడ్డ...
24/04/2026

అట్లూరు మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బోవిళ్ల చిన్న సూరా రెడ్డి గారు ఇటీవల హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కంటి సంబంధిత చికిత్స పొందారు. చికిత్స అనంతరం ప్రస్తుతం ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధ గార్లు వారి స్వగ్రామానికి వెళ్లి సూరా రెడ్డి గారిని పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, వైద్యులు సూచించిన జాగ్రత్తలను పాటిస్తూ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో పలు ప్రజాప్రతిని నాయకులు తదితరులు పాల్గొన్నారు

బద్వేలు పట్టణంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ... పాల్గొన్న ఎమ్మెల్...
24/04/2026

బద్వేలు పట్టణంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ...

పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా గారు, ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి గారు, విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు...

సమాజం కోసం సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి..

ఆయన రచించిన రాజ్యాంగం వల్ల ప్రతి ఒక్కరు ఎంతో స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంటే ఆ గొప్పతనం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వలనే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి...

నిన్నటి దినం పులివెందుల పర్యటన సందర్భంగా 2వ రోజు మాజీ ముఖ్యమంత్రి జననేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వైఎస్ఆ...
23/04/2026

నిన్నటి దినం పులివెందుల పర్యటన సందర్భంగా 2వ రోజు మాజీ ముఖ్యమంత్రి జననేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు...

ఈరోజు పులివెందుల క్యాంప్ కార్యాలయం నందు జననేత మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎస్.బి.అంజాద్ భాషా గారు, కడప ఎంపీ శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి గారు, CEC సభ్యులు కే.సురేష్ బాబు గారు, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా గారు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి గారు, కొరుముట్ల శ్రీనివాసులు గారు, అతహర్ చాంద్ బాషా, ఎమ్మెల్సీలు రామ సుబ్బారెడ్డి గారు, రామచంద్రా రెడ్డి గారు, రమేష్ యాదవ్ గారు, కదిరి ఇన్చార్జి మక్బూల్ అహ్మద్ గారు, SEC సభ్యులు యానాదయ్య గారు.

అంబేద్కర్ గారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు భారత రాజ్యాంగం పిత డా.బి.ఆ...
14/04/2026

అంబేద్కర్ గారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు

భారత రాజ్యాంగం పిత డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి ని పురస్కరించుకొని స్థానిక నెల్లూరు రోడ్ నందు గల అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు

అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు ఒక గొప్ప మానవతా వాది అని,అణగారిన వర్గాలు కోసం నిరంతరం పాటు పడిన ఒక గొప్ప మహనీయుడు అని కొనియాడారు

సమానత్వం,సామాజిక న్యాయం కోసం మరియు అభ్యుదయ భావాలే ఊపిరిగా జీవించి,ఆయన చూపిన మార్గం మన అందరికీ ఒక దిక్సూచి అని తెలిపారు

అంతేకాకుండా ప్రపంచం లేకెళ్ళ అతి పెద్ద రాజ్యాంగం అయిన మన భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ ఒక మార్గదర్శకుడు లాగా నిలిచిన ఒక గొప్ప మేధావి అని తెలిపారు. ఆయన రచించిన రాజ్యాంగం అనేది మన అందరికీ ఒక దిక్సూచి లాంటిది అని తెలిపారు.కావున మనం అందరం ఆయన ఆశయాలు కోసం పాటు పడాలని కోరారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ రాజ గోపాల్ రెడ్డి,పార్టీ అధ్యక్షుడు శ్రీ సుందర రామిరెడ్డి,అట్లూరు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ రెడ్డి,రాష్ట్ర బూత్ కన్వీనర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ యద్దా రెడ్డి,మాజీ మున్సిపాల్ వైస్ చైర్మన్ శ్రీ సాయి, శ్రీ గోపాల స్వామి ఇతర ముఖ్యమైన నాయకులు,ప్రముఖ దళిత సంఘాలు నాయకులు పాల్గొన్నారు

💐భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న శ్రీ డా.బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి నేడు💐"కుల రహిత సమాజ స్థాపనలో ఆయన‌ అడుగుజాడలే మనకు ...
14/04/2026

💐భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న శ్రీ డా.బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి నేడు💐
"కుల రహిత సమాజ స్థాపనలో ఆయన‌ అడుగుజాడలే మనకు మార్గదర్శకం"

09/04/2026


వైయస్ఆర్ సీపీ నేతల భార్యలను కించపరుస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గార్లు వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు..!!

వైయస్ఆర్ సీపీ నేతల భార్యలు, కుటుంబాలపై ఆంధ్రజ్యోతి వ్యాఖ్యలు పరాకాష్టకు చేరాయి. నేతల వ్యక్తిగత జీవితాలను దూషిస్తూ రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాధాకృష్ణ తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోనీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పకుంటే వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు నీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. ఇలాంటి వికృతమైన రాతలు రాసే రాధాకృష్ణను ఇకపై జర్నలిస్ట్ గా సంబోధించవద్దని పాత్రికేయ లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

మహిళల గౌరవాన్ని కాపాడటంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గార్లు వైయస్ఆర్ సీపీ నాయకులు బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏబీఎన్ రాధాకృష్ణ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాధు చేశారు...

బాబు జగ్జీవన్ రామ్ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజద్ భాష, జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనా...
05/04/2026

బాబు జగ్జీవన్ రామ్ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి.

మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజద్ భాష, జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి, CEC సభ్యులు కే.సురేష్ బాబు, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ మేయర్ పాక సురేష్.....

బాబు జగ్జీవన్ రామ్ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజద్ భాష, జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి , CEC సభ్యులు కే.సురేష్ బాబు, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ మేయర్ పాక సురేష్.....సంయుక్తంగా పేర్కొన్నారు.

కడప స్థానిక కొత్త కలెక్టరేట్ సమీపంలోని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజద్ భాష, జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి , CEC సభ్యులు కే.సురేష్ బాబు, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ మేయర్ పాక సురేష్ లు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

తొలుత మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజద్ భాష, జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి, CEC సభ్యులు కే.సురేష్ బాబు, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ మేయర్ పాక సురేష్.. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు నడిపించడం జరిగింది, మరియు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు మాజీ కో ఆప్షన్ సభ్యులు, డివిజన్ ఇంచార్జీలు, జిల్లా మరియు నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

"టి.టి.డి చైర్మన్ బి.ఆర్.నాయుడు వెంటనే రాజీనామా చేయాలి : ఎమ్మెల్సీ శ్రీ డి.సి గోవింద రెడ్డి గారు,ఎమ్మెల్యే శ్రీమతి డా.దా...
04/04/2026

"టి.టి.డి చైర్మన్ బి.ఆర్.నాయుడు వెంటనే రాజీనామా చేయాలి : ఎమ్మెల్సీ శ్రీ డి.సి గోవింద రెడ్డి గారు,ఎమ్మెల్యే శ్రీమతి డా.దాసరి సుధ మేడం గారు"

*తిరుమల పవిత్రత ను కాపాడాలని మరియు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నాయుడు గారు వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ ఈ రోజు బద్వేల్ నియోజక వర్గ వై.యస్.ఆర్.సి పార్టీ ఆధ్వర్యం లో నెల్లూరు రోడ్ నందు గల శ్రీ వెంకటేశ్వర గుడి నందు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి,స్వామి ఆశీస్సులు తీసుకొని అనంతరం ఆలయం వెలుపల 101 కొబ్బరి కాయలు కొట్టడం జరిగింది*

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రపంచం లో కెల్లా అత్యంత పవిత్రమైన స్వామి అని ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది భక్తులు కలిగి ఉన్నారు అని

అటువంటి గుడి నందు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వలన భక్తులు తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోవడం జరిగింది

అంతేకాకుండా స్వయంగా చైర్మన్ నాయుడు గారి పైన సభ్య సమాజం తలదించుకునేలా వీడియో లు రూపం లో వచ్చినా అలాగే ఆ పదవిలో ఉండటం చాలా సిగ్గు చేటు అని తెలిపారు

కావున తిరుమల పవిత్రత ను కాపాడి కోట్ల మంది భక్తుల మనోభావాన్ని కాపాడాలని కావున వెంటనే బి.ఆర్.నాయుడు వెంటనే రాజీనామా చేయాలని మీడియా ముఖంగా తెలిపారు

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

"రంజాన్ పండుగ శుభాకాంక్షలు"   రంజాన్ మాసంలో అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు పాటించి రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్ల...
21/03/2026

"రంజాన్ పండుగ శుభాకాంక్షలు"
రంజాన్ మాసంలో అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు పాటించి రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ ముబారక్. అల్లా దయతో అందరి జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యాలు నిండుడుగా ఉండాల‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటు అందరికీ "రంజాన్ పండుగ శుభాకాంక్షలు".

"శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు" రాష్ట్ర ప్రజలందరికీ, బద్వెల్ నియోజకవర్గం ప్రజలకు, వై.యస్.ఆర్.సి.పి నాయకులకు,...
19/03/2026

"శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు" రాష్ట్ర ప్రజలందరికీ, బద్వెల్ నియోజకవర్గం ప్రజలకు, వై.యస్.ఆర్.సి.పి నాయకులకు, కార్యకర్తలకు, మిడియా మిత్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు "ఉగాది పండుగ శుభాకాంక్షలు"

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Dasari Sudha MLA, Badvel. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share