
28/04/2023
#దశావతార_వెంకటేశ్వర_ఆలయం
#ఎక్కడ_ఉంది.. ిశిష్టత_ఏమిటి?
,🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🕉️🕉️🕉️కలియుగ దైవంగా భక్తులు వెంకటేశ్వరస్వామిని కొలుస్తారు.మన దేశంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.
🕉️దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు.ఈ విధంగా మనదేశంలో ఎన్నో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి.
🕉️అయితే ఈ ఆలయాలన్నింటికీ ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంది.ఈ విధంగా విశిష్టత కలిగినదే #దశావతార_వెంకటేశ్వర_స్వామి_ఆలయం.
అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశిష్టత లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
🕉️ #గుంటూరు జిల్లా సమీపంలో ఉన్న #లింగమనేని #టౌన్‌షిప్‌లో #ఏకశిలతో_శ్రీమహావిష్ణువు_ఏకాదశ రూపాలు అయిన 11 అడుగుల ఎత్తున్న దశావతార శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహా రూపంలో కొలువై ఉండి భక్తులను దర్శనమిస్తున్నాడు.
#హిందుటెంపుల్స్
🕉️పురాణాల ప్రకారం మహావిష్ణువు ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో మనకు దర్శనమిచ్చారు.ఈ క్రమంలోనే ఒక్కో అవతారంలో స్వామివారికి ఒక ఆలయం నిర్మించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
🍁ఈ విధంగా దశావతారాలు ఎత్తిన విష్ణుమూర్తికి ప్రత్యేక ఆలయాలు ఉండటమే కాకుండా, ఈ దశావతారాలు అన్నింటిని ఒకే చోట చూడటం ఎంతో అద్భుతంగా ఉంటుంది.ఈ దశావతారాలలో శ్రీ వెంకటేశ్వరస్వామి రూపంలో ఉండటం ఈ ఆలయం విశిష్టత.
🌻ఈ ఆలయంలో ఉన్న స్వామివారు తిరుమల శ్రీవారి పాదాలతోను, మోకాళ్ళ వరకు మత్స్యావతారంలో, నడుము వరకు కూర్మావతారంలో దర్శనమిస్తారు.అలాగే శ్రీనివాసుడు, నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖంగా ఉండగా ఈ విగ్రహానికి ఎనిమిది చేతులు ఉంటాయి.ఇక వామన అవతారానికి సూచికగా గొడుగు, రామ అవతారానికి సూచికగా బాణం, పరశురాముడికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణుడికి సూచికగా నెమలి పించం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం విష్ణుమూర్తి చేతిలోని శంఖ చక్రాలను ధరించి, భక్తులకు దర్శనమిస్తున్నారు.
🍁ఈ విధంగా దశావతారాలను ఒకే విగ్రహంలో కొలువై ఉండి భక్తులను దర్శనం కల్పించటం వల్లే ఈ స్వామివారిని దశావతార వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు.ఈ ఆలయంలోని స్వామి వారిని దర్శించుకోవడం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటార🚩🕉️🕉️🕉️ #ఓం_నమో_వేంకటేశాయ🚩🕉️🕉️🕉️🕉️🕉️🍁🌻