16/10/2021
ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు గురించి
ఆరోగ్యకర ఆహారసేవనం
వేయించిన ఆహారపదార్థాలు, ఇతర చెత్త తిండ్లు (జంక్ ఫుడ్) తినడం ఆపి, మీ దిననిత్య ఆహారంలో పచ్చికూరగాయలు, తాజా పళ్ళు మరియు తృణధాన్యాలు వంటి ఆరోగ్యకర పదార్థాలను తినడం ప్రారంభించండి.
మద్యం తీసుకోవడం పరిమితం చేయాలి
మీకు మద్యపానం మరియు పొగాకుసేవనం అలవాటుంటే వాటిసేవనాన్ పరిమితం చేయడం లేదా వీలైతే అవి రెండింటినీ పూర్తిగా త్యజిస్తే గనుక మీ రక్తపోటు నియంత్రణకు ఎంతో సహాయపడుతుంది.
తక్కువ ఉప్పును ఉపయోగించడం, డబ్బాల్లో తినడానికి సిద్ధంగా ఉంచిన (canned foods) ఆహారాలు తినడాన్ని పూర్తిగా ఆపేయడం.
దృఢంగా ఉండటం (staying fit)
మీరు నడవడం మరియు జాగింగ్ వంటి సాధారణ వ్యాయామాలను మీ దినచర్యలో భాగంగా చేసుకుంటే మీరు దృఢంగా ఉండడమే కాకుండా మీ అధిక రక్తపోటు కూడా నిరోధించబడుతుంది. మీరు ఈత, తీవ్రతరమైన వ్యాయామం వంటి కసరత్తుల్ని చేయచ్చు కానీ, మీ డాక్టర్ అనుమతితో మరియు నిపుణుడి మార్గదర్శకత్వంలో మాత్రమే చేయాలి.
ఒత్తిడి నిర్వహణ
ఒత్తిడి కూడా అధిక రక్తపోటుకు ఒక ముఖ్యమైన కారణం కావచ్చు. యోగా, ధ్యానం, లోతైన శ్వాస-వ్యాయామాలు వంటి ఒత్తిడినిర్వహణా చర్యలు తీసుకోవడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవచ్చు మరియు మీ రక్తపోటునూ నిర్వహించుకోవచ్చు.
జీవనశైలి నిర్వహణ
మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే మీరు పాటించే జీవనశైలి మార్పులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీ రోజువారీ జీవితంలో మీరు చేసుకునే మార్పులు అధిక రక్తపోటును నియంత్రించడానికి చాలా ముఖ్యమైనవి. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆరోగ్యకరమైన చర్యలు మీ మందుల మోతాదు తగ్గింపుకు కూడా దారితీస్తుంది, అంటే కాదు, మరింత సంక్లిష్టతను నివారించి రక్తపోటును నియంత్రించవచ్చు. అటువంటి జీవనశైలి మార్పులు కొన్ని ఇక్కడ మీకోసం సూచిస్తున్నాం :