Bhuvaneswari Devi

Bhuvaneswari Devi Abhi tho nahi

26/06/2025
01/06/2025
01/06/2025

శ్రీదత్త పురాణము (156)

సోహమ్ అనే అఖండార్థ దృఢ మనోవృత్తిలో సదా తన చైతన్యం వ్యాపించి వుంటుంది. అహంబ్రహ్మ- బ్రహ్మైవాహమ్ అనే వృత్తి తాలూకు ప్రవాహ దృఢత్వంలో చిత్తు ప్రతిబింబితమవుతుంది. సూర్యకాంతమణి యోగంతో దూదిలో అగ్ని రగుల్కొన్నట్లుగా చిత్ప్రతిబింబం తరుక్కుమంటుంది. విచక్షుణులైన విద్వాంసులకే ఇది సుకేయం. ఆ ప్రతిబింబంతో వ్యాప్తమైన ఈ మనోవృత్తి నిర్వికల్ప పరబ్రహ్మాన్ని చూపించి తానూ నశిస్తుంది.

అంటే ఈ వృత్తికి ప్రయోజనం తమోనాశకు తప్ప స్వప్రకాశ విషయీకరణంకాదు. తమోనాశంతో వృత్తి నాశమూ అవుతుంది. వృత్తి అనే ఉపాధి నాశనమవ్వడంతోనే చిత్ప్రతి బింబం చిత్తు అయిపోతుంది. అప్పుడు అది ఒక్కటే భాసిస్తుంది. కాంతిమంతమైన ఆ పరమానంద స్థితి వర్ణనాతీతం. అది మనో వాక్కులకు అందదు.

దీన్ని ఒక చిత్త వృత్తి అనీ మనస్సుతోనే దర్శించగలమని చెప్పడం దాని సంగతి అస్సలు తెలియని వారికి ఏదో కొంత తెలియచెప్పే ప్రయత్నమే తప్ప నిజానికి ఆ పరమానంద స్థితి మనస్సుకు అందుతుందా, వాక్కులకి అందుతుందా? స్వప్రకాశమూ నిత్యమూ అయిన ఆ పరంజ్యోతి వాజ్ఞ్మనస్సులకు ఆవలిది. అందనిది "యతో వాచో నివర్తంతే ఆప్రాప్యమనసా సహ- అని ప్రతి కీర్తించింది దీనినే. అయితే అజ్ఞానంతో అజ్ఞానాన్ని పోగొట్టినట్లు ఈ చిత్త వృత్తి అనేది దారి చూపించడానికి పనికి వస్తుంది. బ్రహ్మతత్వాన్ని గూర్చిన అజ్ఞానాన్ని పోగొట్టడానికి మాత్రమే ఈ వృత్తి వ్యాప్యత్వం అవసరమవుతుంది. సాధకుడు ఆ దారిన పోగా పోగా బ్రహ్మసాక్షాత్కారం అవుతుంది. ఆ దర్శనం అయ్యేంత వరకూ ఈ వృత్తి వుండాలి. అటు తర్వాత ఉండకూడదు. ఈ వృత్తిలో స్వభావ సిద్ధంగానే జ్ఞాతృక్షేయ విభాగం ఉంటుంది. కాబట్టే దీన్ని సవికల్ప సమాధి అనడం వృత్తి కూడా లయమైపోతే అదే నిర్వికల్ప సమాది. ఇందులో పరతత్వం అవిభాజ్యంగా (జ్ఞాతృజ్ఞేయవిభాగరహితంగా) అనుభూతమవుతుంది.

కార్తవీర్యార్జునా ! నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్న యోగికి కొన్ని విఘ్నాలు (ఆటంకాలు) వచ్చిపడుతూ వుంటాయి. అవే అణిమాది - ఆష్ట సిద్ధులు, యోగి వాటిని ఆశించాడో ఇంక భ్రష్టుడయ్యాడన్న మాటే, ఆ సిద్ధులు కూడా నశ్వరములు అని గుర్తించి వాటి జోలికి పోకుండా విరమించుకోవాలి.

16/03/2025

శ్రీ మాత్రే నమః

‌ ‌ ‌ భక్తుడు:
అమ్మా! భగవంతుడంటూ ఒకరు ఉండివుంటే, ఈ లోకంలో ఇంత దుఃఖమూ, ఇన్ని కష్టాలూ ఎందుకు ఉన్నాయి? ఆయన వీటినన్నీ పట్టించుకోరా?
వీటిని తొలగించే శక్తి ఆయనకు లేదా?

‌ మాతృదేవి:
సుఖదుఃఖాలతో కూడుకొన్నదే సృష్టి. దుఃఖమే లేకుంటే సుఖాను భూతి ఉంటుందా? అందరూ సుఖంగా ఉండడం సాధ్యమా?
సదాసర్వవేళలా సంతోషంగా ఉండేవారు ఎవరూ ఉండరు, అలాగే అన్ని జన్మలలోను దుఃఖాన్నే అనుభవించేవారూ ఉండరు. కర్మకు తగ్గట్లే ఫలితం; అందుకు తగ్గట్లే అవకాశాలు లభిస్తాయి.

భక్తుడు:
అంతా కర్మఫలానుసారమే జరుగుతుందా?

మాతృదేవి:
కర్మఫలం కాకపోతే మరేమిటి? నెత్తిన పెంట తొట్టెను మోసుకు పోయే పాకీవాణ్ణి నువ్వు చూడలేదా?

15/03/2025
15/03/2025

పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చేసిన సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనముల ప్రసారము రేపటి నుండి (16-3-2025) ప్రారంభం

శ్రీ చాగంటి వాణి యూట్యూబ్ ఛానలులో మాత్రమే

https://www.youtube.com/

15/03/2025

మార్చ్ 30ఉగాదిలోపు వంటగదిలో వుండే ఈ రెండు వస్తువులను తీసి బయట పడేయండి కొత్త సం.లో కష్టాలు తప్పవు

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhuvaneswari Devi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Bhuvaneswari Devi:

Share