04/12/2022
తల నొప్పి - శిరశూల - Headache
అతి సాధారణంగా కనిపించే వ్యాధులలో తలనొప్పి (Headache - సిపాల్జియా )ఒకటి. దీనికీ వయోభేదము స్త్రీ ,పురుష భేదం లేదు బాగా ఓవర్ స్ట్రెస్ అయినప్పుడు , అధిక శ్రమ చేసినప్పుడు , అదేపనిగా విశ్రాంతి లేకుండా పని చేసినప్పుడు, చదివినప్పుడు, సరియైన గాలి లేకపోవడం వలన, కొన్ని రకాల సెంట్స్ మరియు రసాయన పదార్థముల వలన , అతిగా ఆల్కహాల్ సేవించుట వలన, రక్తహీనత వలన, నిద్రలేమి వలన, ఫిట్స్ వచ్చిన తర్వాత ,రక్తంలో చక్కెర శాతం తగ్గినప్పుడు ,జ్వరాలు వచ్చినప్పుడు, దృష్టి లోపాల వలన, పంటి సంబంధ వ్యాధుల వలన, సైనసైటిస్ వలన, అతి చల్లటి గాలిలో సంచరించటం వలన, మెదడు లో కంతులు, గడ్డలు ఏర్పడటం వలన, మెదడు వాపు, మెదడులో నరాలు చిట్లడం వలన , మెదడు లోని రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడం వలన, మెదడులోని లేదా తలలోని నరాల్లో నీరు చేరటం వలన ,చెవిలో జిభిలి, చీము కారటం వలన , స్త్రీలు బహిష్టులయినపుడు , వృద్ధుల్లో కీళ్ళు అరిగిపోయిన సందర్భాల్లో, విపరీతంగా టెన్షన్ కు లోనయినపుడు మరియు మలబద్ధకం, రక్తపోటు గల వారి లో తలనొప్పి సాధారణం కనిపిస్తుంది
తలనొప్పి వలన అసౌకర్యం గా అనిపించుట రాత్రి ఎందుకు తలనొప్పి ఎక్కువై తలకు కట్టు కట్టిన లేక వేడి కాపడం పెట్టిన ఉపశమనం కలిగింది అలా అంటారు
తలనొప్పి మరియు అసౌకర్యంగా అనిపించుట, రాత్రి యందు తలనొప్పి ఎక్కువై తలకు కట్టు కట్టిన లేక వేడి కాపటం పెట్టినా ఉపశమనం కలుగునది వాత శిర శూల.
తలనొప్పి, నిప్పులు చల్లినట్లు మంట కళ్ళు ,ముక్కు మండుట ,చల్లటి పదార్థాలు సేవించిన్నపుడు తల నొప్పి, రాత్రి వేళల్లో శాంతించుట పైత్య శిర శూల అవుతుంది
తల అంతా బరువుగా నొప్పి , బీగదీసినట్లు ఉండుట, కనుబొమ్మలు మరియు ముఖం వాచుట అనునది కఫజ శిర శూల
తలకు ఒక వైపు వచ్చే తలనొప్పి MIGRAINE
అధికంగా ఆలోచించి టెన్షన్ పడే వారికి ఎక్కువగా వచ్చే జబ్బు మైగ్రేన్. ఒకవైపు మాత్రమే నొప్పి రావడాన్ని హేమిక్రీనియా మైగ్రేన్ లేదా అర్తావ భేదకం అని పిలుస్తారు. ఇది కొందరిలో చిన్నతనంలో మొదలవుతుంది . తలనొప్పితో పాటు ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి ఇది పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని రకాల పాల పదార్థాలు ముఖ్యంగా స్వీట్స్, చాక్లెట్స్, జున్ను తిన్నప్పుడు లేక అధికంగా పులుసు పదార్థాలు తిన్నప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. మంచులో తడిసిన లేక మలమూత్రాదులు వేగమును ఆపిన కూడా Migraine కలుగుతుంది.
Migraine symptoms:
* తలనొప్పి ఒక వైపు మాత్రమే ఉంటుంది. తర్వాత తల మొత్తం నొప్పిగా ఉంటుంది.
* గంటల తరబడి తలనొప్పి ఉంటుంది.
* వికారంగా ఉంటుంది, వాంతులవుతాయి ,కొందరికి వాంతులు అయిన తర్వాత ఉపశమనం కలుగుతుంది.
* నీరసము, బలహీనత, కోపము, ఆహారం తిన లేకపోవటం.
* తల మంటగా ఉండటం.
* చూపు మసకగా ఉండటం.
పొద్దు పొడుపు తలనొప్పి - సూర్య వర్తము (Chronic Sinusitis)
తలనొప్పి సూర్యోదయంతో మొదలై మధ్యాహ్నం వరకు విపరీతంగా ఉండి క్రమక్రమముగా తగ్గుముఖం పడుతూ ఉండే వ్యాధిని సూర్య వర్థము అంటారు.
Symptoms:
* ఇది ఎక్కువగా కన్నులకు మరియు కనుబొమ్మల మధ్య వస్తుంది.
* తలనొప్పి కణతలు విపరీతంగా లాగుట.
* ముక్కులు మూసుకుపోయి ఉంటాయి. (ముక్కు దిబ్బడ)
* ముక్కుదిబ్బడ కారణంగా కొన్ని సార్లు శ్వాస తీసుకోవటం ఇబ్బందికరంగా ఉంటుంది.
ఎటువంటి తలనొప్పి అయిన కచ్చితమైన పరిష్కారం ఇవ్వగలము..
శ్రీ నారాయణ ఆయుర్వేదం
పారంపర్య సిద్ధ వైద్యం
K.C. నిరంజన్ కుమార్ (D.A.M.S)
9059784787