24/05/2022
పెయిన్ కిల్లర్స్ వల్ల కలిగే డేంజరెస్ సైడ్ ఎఫెక్ట్స్...
పెయిన్ కిల్లర్స్ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఆరోగ్య పరంగా అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ మోతాదుకు మంచి రెగ్యులర్ గా తసీుకోవడం వల్ల కాలేయం, కిడ్నీ జబ్బులు తప్పవని అంటున్నారు . చాలా వరకూ ప్రతి ఒక మెడిసిన్ ఏదో ఒక రూపంలో సైడ్ ఎఫెక్ట్స్ కలిగే ఉంటాయి.
ఇలా మెడికేషన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను ఖచ్చితంగా ఒక కంటి కనిపెట్టి ఉండాల్సిందే....లేదంటే ఒకటి మరొకటి తోడైనా, తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి, అవసరం అయితే తప్ప మందులను ఉపయోగించుకూడదు. అందులో స్వంత వైద్యం ఎప్పుడూ ప్రమాదకరమే. కాబట్టి డాక్టర్ సలహా మరియు సూచన మేరకు మాత్రమే మందులు తీసుకోవల్సి ఉంటుంది.
డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే ఉపయోగించడానికి కొన్ని రకాల మందులు మనకు డ్రగ్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. చాలా వరకూ పెయిన్ కిల్లర్స్ అన్నీ ఓటిసి(ఓవర్ ది కౌంటర్లో)నే అందుబాటులో ఉన్నాయి.
వివిధ రకాల నొప్పులను తగ్గించే నేచురల్ పెయిన్ కిల్లర్స్:
సహజంగా పెయిన్ కిల్లర్స్ గా చెప్పుకొనే అనాజెసిస్, నొప్పులు మరియు ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనం కలిగిస్తాయి . కానీ, ఇలా సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం కంటే నొప్పి గల అసలైన కారణాన్ని కనుగొనుటకు, తగిన చికిత్సను సకాలంలో అందివ్వడానికి డాక్టర్ ను కలవడం మంచిది. గాయాల వల్ల , అలసట లేదా ఇతర చిన్న సందర్బాల్లో వచ్చే నొప్పుల నివారణకు తీసుకొనే పెయిన్ కిల్లర్స్ లైఫ్ సేవర్స్ గా ఉంటాయి. అందువల్ల అటువంటి వాటిని మనం ఖచ్చితంగా ఉపయోగిస్తుంటాము. అయితే నొప్పి దేనివల్ల వస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవడం వల్ల ఆ సమయంలో ఎలాంటి పెయిన్ కిల్లర్స్ ఉపయోగపడుతాయో తెలుసుకోవచ్చు . ఎందుకంటే కడుపునొప్పి, ఆర్థరైటిస్ పెయిన్, నెక్, బ్యాక్ పెయిన్ వంటి సాధారణ నొప్పులకు మెడికల్ షాప్స్ లో వివిధ రకాల పెయిన్ కిల్లర్స్ అందుబాటులో ఉంటాయి . అయితే కొన్ని రకాల నొప్పులు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.
మన వంటగదిలోని వస్తువులే మన పెయిన్ కిల్లర్స్...!
అందువల్ల, పైన చెప్పిన విధంగా అప్పడప్పుడు వచ్చే నొప్పిలకు పెయిన్ కిల్లర్స్ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే చీటికీ మాటికి తీసుకొనే పెయిన్ కిల్లర్స్ వల్ల ఆరోగ్యానికి చాలా హానికరంగా భావిస్తున్నారు. రీసెంట్ గా జరిపిన పరిశోధన ద్వారా ఐబ్రూఫిన్ తీసుకొనే చాలా మందిలో అనారోగ్య సమస్యలతో పాటు, ప్రాణాంతక సమస్యగా మారి సంవత్సరంలో 1000మందికి పైగా చనిపోతున్నట్లుగా గుర్తించారు. మరి మనం రెగ్యులర్ గా తీసుకొనే పెయిన్ కిల్లర్స్ వల్ల ఎదురయ్యే కొన్ని డేంజరెస్ ఎఫెక్ట్స్ ...
1. లివర్ డ్యామేజ్:
పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా, పారాసెటమాల్ ఇది లివర్ డ్యామేజ్ కు కారణా అవుతుంది. పారాసెటమాల్లో ఉండే పెరాక్సిడెస్ మెటబాలిజంకు అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి పారాసెటమాల్ తీసుకోవడం పరిమితం చేసుకోవాలి. ఒక రోజుకు 8మాత్రలు(500mg)తీసుకోవడం వల్ల సీరియస్ అక్యూట్ లివర్ డ్యామేజ్ కు కారణం అవుతుంది . అలాగే రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకొనే వారిలో కూడా లివర్ డ్యామేజ్ కు దారితీస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు! మీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఎలాంటి పండ్లు సహాయపడతాయో మీకు తెలుసా?
2. స్టొమక్ పెయిన్ అండ్ అల్సర్:
పెయిన్ కిల్లర్స్ లో ఐబ్రూఫిన్, ఆస్పిరిన్, మరియు నోప్రాక్సిన్ వంటివి పొట్టకు చీకాకు కలిగించి డ్యామేజ్ చేస్తుంది. పొట్టలో ఇన్నర్ లైన్ ను డ్యామేజ్ చేసి, అల్సర్ కు దారితీస్తుంది. మరియు ఉన్న అల్సర్ తో పాటు బ్లీడింగ్ కు దారితీస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? ఏరియల్ నియంత్రణను గురించి తెలుసా
3. డిప్రెషన్:
పెయిన్ కిల్లర్ డిప్రెషన్ ను తగ్గిస్తుంది. ఎవరైతే డిప్రెషన్ లో ఉంటారో వారు, యాంటీడిప్రెజెంట్స్ తీసుకోవడం వల్ల ఫ్రీక్కెవంట్ పెయిన్ కిల్లర్స్ కు దూరంగా ఉంటారు. వేసవి వేడి, వడదెబ్బతో పోరాడే శక్తిని ఇచ్చే పానీయాలు!
4. కిడ్నీ ఫెయిల్యూర్:
పెయిన్ కిల్లర్ లేదా అనాల్జిక్ మరియు ఐబ్రూఫిన్ మరియు నాప్రోక్సిన్ వంటి పెయిన్ కిల్లర్స్ కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది . ముఖ్యంగా డయాబెటిస్ మరియు బ్లడ్ ప్రెజర్ ఉన్నవారిలో ఇది మరింత తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇది వరికే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు, మరింత హైరిస్క్ కలిగి ఉంటారు.
5. మిస్కరేజ్:
మహిళలు రెగ్యురల్ గా తీసుకొనే పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో 20 వారాలపాటు తీసుకొనే డ్రగ్స్ వల్ల కూడా గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది . అంతే కాదు హార్మోన్స్ కు గర్భదారణకు దగ్గరి సంబంధం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ ప్రసవ సమయంలో ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి ప్రెగ్నెన్సీలో పెయిన్ కిల్లర్స్ తీసుకోవడానికి ముందు డాక్టర్స్ ను సంప్రదించాలి .
6. బ్లీడింగ్ కు కారణం అవుతుంది:
పెయిన్ కిల్లర్స్ ఆస్పిరిన్, ఐబ్రూఫిన్ మరియు నాప్రాక్సిన్ వంటి వాటిలో బ్లడ్ థిన్నింగ్ లక్షనాలు అధికంగా ఉండటం వల్ల ఇది బ్లడ్ క్లాట్స్ మరియు హార్ట్ సమస్యలున్న ఉన్నవారిలో ఆస్పిరిన్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇంకా బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్స్ తీసుకోవనే వారు అన్ని రకాల పెయిన్ కిల్లర్స్ ను నివారించాలి. ఇవి మరిన్ని బ్లడ్ క్లాట్స్ మరియు బ్లీడింగ్ కు దారితీస్తుంది.
7. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్:
పెయిన్ కిల్లర్స్ వల్ల మరో ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ గ్యాస్ట్రిక్ సమస్య. ముఖ్యంగా పరగడుపున తీసుకోవడం వల్ల హైపర్ అసిడిటి వల్ల వాంతులకు దారితీస్తుంది . ఎసిడిటి మరియు హార్ట్ బర్న్ తో బాధపడే వారు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ తోనే పెయిన్ కిల్లర్స్ వాడాలి.
పెయిన్ కిల్లర్ మాత్రలు ఎలా పని చేస్తాయి? ఎంత వరకు సురక్షితం?
చాలామంది తల నొప్పి, ఒళ్లు నొప్పులు, నడుం నొప్పిలను సాధారణ వ్యాధులుగా పరిగణిస్తూ, ఈ మాత్రం దానికి డాక్టర్ దగ్గరకు వెళ్లాలా? అనవసరమైన ఖర్చు అని భావిస్తూ,అలవాటుగా మందుల షాపుకెళ్లి , తమ బాధేమిటో చెప్పి అతనిచ్చిన మందులేవో తెచ్చుకుని వేసుకుంటూ వుంటారు. వీటినే "ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ "(OTC) అంటారు.
వీటిలో సాధారణంగా "పెయిన్ కిల్లర్ "అని పిలిచే "నాన్ స్టిరాయిడల్ ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ "(NSAIDS) వుంటాయి. అవి నొప్పులనీ, జ్వరాన్నీ, వాపులనీ తగ్గించడంతో ప్రపంచ వ్యాప్తంగా వీటి వాడకం సర్వ సాధారణమయింది. డాక్టర్లతో సహా ఒక్క అమెరికాలోనే వీటిని వాడే వారి సంఖ్య సంవత్సరానికి 3 కోట్ల పై మాటే.
వీటిలో ఆస్పిరిన్ ,ఐబూప్రోఫెన్ ,డిక్లోఫినాక్ ,అసిక్లోఫినాక్ ,నిమసలైడ్ ఎక్కువగా వాడే మందులు.
నేటి తరం ఏ బాధను భరించలేకపోతోంది. అందుకే తలనొప్పి, కడుపునొప్పి వంటి జబ్బులను కూడా తట్టుకోలేక నొప్పి నివారణ మందులు వాడుతున్నారు.ఆ సమయంలో నొప్పి నుండి తప్పించుకోవడానికి అవి మీకు సహాయపడతాయి. కానీ దాని ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా..? ఇప్పుడే మేల్కోండి... నొప్పి నివారణ మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే...
నొప్పి నుంచి ఉపశమనమిచ్చే సురక్షిత మార్గాలు:
అయితే, గుర్తు పెట్టుకోవలసిన విషయమేమంటే ఏ మందూ నూటికి నూరుపాళ్లూ సురక్షితమైనది కాదు. సర్వసాధారణంగా సేఫ్ అని భావించే పారాసిటమాల్‌కు కూడా రియాక్షన్ రావచ్చు. ఎక్కువ డోస్‌లో వాడితే లివర్ పైన ప్రభావం చూపవచ్చు.
రియాక్షన్‌కు విరుగుడుగా వాడే ఆంటీ హిస్టమిన్సయిన్ "అవిల్ "కు, స్టిరాయిడ్స్‌కు కూడా రియాక్షన్ వచ్చిన సందర్భాలున్నాయి.
అందువలన డాక్టర్ సలహాపైన, పర్యవేక్షణలో మాత్రమే పెయిన్ కిల్లర్స్ వాడాలి. చివరగా చెప్పేదేమంటే పెయిన్ కిల్లర్స్ నొప్పిని ఎంత సులభంగా తగ్గిస్తాయో అంత ప్రమాదకరమైనవి.
ఎప్పుడుపడితే అప్పుడు, ఎవరుబడితే వాళ్లు, తమంతట తాముగా వాడటం వలన ప్రమాదాలు సంభవించడమే కాక ప్రాణాలను పణంగా పెట్టవలసి వస్తుంది.
పెయిన్ కిల్లర్స్ వాడకాన్నిడాక్టర్ సలహా పై మొదలు పెట్టి కొద్ది కాలానికే పరిమితం చేసుకోవాలి. ఎవరికి ఏ మందు సరిపోతుందో, ఎవరు ఏ మందులకు దూరంగా ఉండాలో సమగ్రమైన అవగాహనతో వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా నిరోధించవచ్చు. నొప్పి నుండి నివారణ పొందవచ్చు.
మా చిరునామ:
విష్ణు ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్
R.s. road, రాజంపేట..
మీరు సంప్రదించవలసిన నంబర్లు : 8971483046, 9849602709.
ఈ పోస్ట్ ని అందరికిె షేర్ చేయండి మరియు ఈ విషయాన్ని తెలియపరచి సహయపడండి.