సనాతన ధర్మం హిందుత్వం, హిందువుగా పుట్టినందుకు నేను ఎంతొ గర్విస్తున్నాను, ఎందుకంటె సకలకోటి ప్రాణికి మూలదారం మన హిందుధర్మం,
వస్తున్న సాంకేతిక రంగ అభివృద్ది హిందుధర్మం పై ఎంతొ ప్రభావం చూపుతుంది,
అలాంటి ప్రభావం మన హిందుత్వం పై పడద్దనె చిన్ని ఆశ నాకు,దానికి అణుగూణంగా నా జీవితం మంచి, మానవత్వం, భక్తి, దైవత్వంకై అంకితం ఇచ్చిన భాషప్రావీణ్యం, అంతరిస్తున్న తెలుగు, ఇలా ఎన్నొ సమస్యలపై నా వంతుగా నేను నడుం బిగ
ించిన,
ఆద్యాత్మికంగా మందుకు సాగుతె ప్రతివారి జీవితంలో చీకటి వెళ్లి వెలుగు నింపుతుందని పదిమందికి చాటాలన్నది నా కోరిక .
దానికి అణుగూణంగా ధర్మోరక్షతి రక్షితః అన్నట్టు, నాలో ఉన్న దైవత్వం, మానత్వం, హిందుత్వం, కలగలిపి కాషాయాన్ని పదిమంది చేతిలోకి తీసుకువెళ్లి,
మన సంప్రాదాయాలు, మన సంసృతిపై పూర్తి అవగాహన కల్పించి, ఎలాంటి సమస్యలు వచ్చిన భక్తితో జయించాలన్నది నా అభిహిందుమతం,
అందుకె ఓ హిందు బిడ్డ నీ పుట్టుక నీకు తెలియదు, అది సృష్టి రహస్యం,
కాని నీవు పుట్టినందుకు హిందువుగా ఏం సాధించావన్ని ముఖ్యం,
అందుకె మేల్కో, హిందు భావాలను నీ తరం, వచ్చె తరం, మరో వచ్చె తరానికి ఆస్తిగా ఇవ్వు నీవు హిందుగా పుట్టినందుకు గర్వించు, గ్రామ, గ్రామాన హిందువుల ఆలయాలు, విగ్రహాలు, అంతరిస్తున్న ఆచారాలు, అన్నింటిని నూతనంగా ఈ సమాజానికి పరిచం చెయ్యు,
నీ ఒక్కడి వల్ల ఈ సమాజం మారదు అనుకోవద్దు ఎందరో మహనుభావులు ఒక్కరితోనె చరిత్రను తిరగేశారు, నేను హిందువుని అనె కనీష భావాన నీలో కలిగితె నీలో మార్పు సమాజానికి నీవు చూపిస్తున్న దారిగా భావించు.
మన సంసృతి చాలా పెద్దది, మన తరాలు ఎంతొ గొప్పవి, నేడు సాంకేతికంగా మార్పును చూపి మన విలువలను వెనుకకు నెట్టాలని చూస్తున్నారు,
కాని ప్రతి పని వెనుక మనిషి మనుగడ, జీవితం ఉంటుందని చెప్పిన ఎందరో వేదాంతులు జన్మించిన పుణ్యభూమి మనది,
అందుకె అంతరిస్తున్న మన ఆద్యాత్మికతను మందుకు సాగె విధంగా చేద్దాం. చైనీయులు చైనా భాషలోనె మాట్లాడుతున్నారు, జపానీలు వారి బాషాలోనె సంబోదిస్తున్నారు,
కాని మన హిందువులు ఎందుకు పశ్చాత్య పోకడలకు అలవాటు పడుతున్నారు.
ఒక చెట్టు పెరిగి పళ్లు ఇవ్వాలంటె విత్తనం విత్తాలి, నీరు పొయ్యాలి,అలాగె అది పెద్దయ్యంతవరకు పోసించాలి, అలా చేసినప్పుడె ఆ చెట్టు పదిమందికి నీడను ఇస్తుంది, తినటానికి పళ్లను ఇస్తుంది. అలాగె హిందుధర్మాన్ని నీవు కాపాడు, ఆధర్మం నిను కాపాడుతుంది.
మనకు స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్న పళ్లెల్లో ఇంకా అనాగరికం కొనసాగుతునే ఉంది, ఒక పేదవాడు తనకు నచ్చిన దైవాన్ని కొలిచేందుకు ఆలయానికి వెళితె నీకు ఆలయంలో ప్రవేశం లేదు నీవు పేదోడివి అంటు గెంటెసిన సంఘటనలు కోక్కోల్లలు, అలాంటి వారికి మాయమాటలు చెప్పి మతమార్పిడి చేయించుకుని మన సంప్రాదాయాలకు గండికొడుతున్నాడు, ఆ పేదవాడు మతమార్పిడి జరగటానికి ఎవరో కారణం కాదు మనమె. హిందువుగా పుట్టినందుకు నేను ఎంతగానో గర్వంగా ఉన్న ఏదో ఓ మూల నాకు భయం పట్టుకుంది, ఇలా ఆలయప్రవేశం లేదని ఎందరినో ఆకారణంగా బయటకు నెట్టివేయటం నిజంగా నీచకరం, ఎందుకంటె దేవుడికి పేదోడు, పెద్దోడు, అన్న బేధం లేదు, పుట్టినవాడు వారి, వారి కర్మఫలాలనుణుగూణంగా కష్టాలు పడుతారు అంతెకాని నీవు ఆలయానికి రావటం తప్పు అని ఎందరి మనోభావాలను దెబ్బతీస్తున్న వైనం నను ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టె విధంగా చేసింది,
ఇది ఇలాగే కొనసాగితె రానున్న 10 సంవత్సరాల్లో హిందుత్వం కనుమరుగైపోతుందనె భావన నాలో ఆందోళన చేసె విధంగా చేస్తుంది. డబ్బులు ఎర చూపి మతమార్పిడిలు చేసి మన మతంమీద గండి కొడుతున్న వారికి ఎవరో బుద్ది చెప్పరూ హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి తనవంతుగా మన మతాన్ని కాపాడుకొనె బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది.
ఇలా ఇతర మతాల వల్ల హిందుత్వధర్మం మందుకు సాగటం ప్రశ్నర్థకం అవుతుందనె ఆలోచనె నను స్థిరంగా ఉండనివ్వటం లేదు. ..,
అందుకె ఓ హిందు సోదరుల్లారా ఇలాంటి మంచి కార్యంను మీరు మందుండి నడిపించండి, మన హిందువు ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి..
హిందువుల్లారా మీలో మార్పు వచ్చె తరుణం ఆసన్నమైంది, మీరు మన మతంపై పోరాటం చెయ్యటం అనివర్యం...నేను చేస్తున్న హిందుత్వాన్ని కాపాడు ప్రయత్నానికి నీరు అందరు మద్దతు ఇవ్వాలని కోరుతూ..
శ్రీ గురూజీ మహరాజ్,
ఆధ్యాత్మిక ఆయుర్వేద నిలయం
జ్యోతిష్య శాస్త్ర ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత:
వాస్తు జ్యోతిష్య సంఖ్య రమల రత్న ప్రశ్న శాస్త్ర హస్త సముద్రిక ఆయుర్వేద మూలికా పావీణ్యులు..