15/10/2022
*💢 కోట లోని ముస్లిం విధి, డాక్టర్ రవికుమార్ హాస్పిటల్ రోడ్డు వద్ద ప్రగతి క్లినికల్ లాబొరేటరీ & ఎక్స్-రే సెంటర్*
*💢కోట లో ప్రగతి క్లినికల్ లాబొరేటరీ & ఎక్స్-రే సెంటర్ 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా..*
*💢వారం రోజులు షుగర్ టెస్ట్ లు ఉచితం,మరికొన్ని టెస్టులు రాయితీలో*
*💢నేటి నుండి ప్రగతి క్లినికల్ లాబొరేటరీ & ఎక్స్-రే సెంటర్ లో వారం రోజులు ఉచిత సేవలు*
*💢ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: ప్రో" మోసా నళిని దేవి*
*ప్రజాబంధం-ఆంధ్రప్రభ✍️మీజూరు మల్లి✍️: కోట పట్టణంలో ని ముస్లిం విధి, డాక్టర్ రవికుమార్ హాస్పిటల్ రోడ్డు, మొలలు ఆసుపత్రి వద్ద ప్రగతి క్లినికల్ లాబొరేటరీ & ఎక్స్-రే సెంటర్ నందు ఈ రోజు బుధవారం ఉదయం 7 గం"ల నుండి 11 గంటల వరకు షుగర్ పేషెంట్ లకు ఉచితంగా టెస్టులు, మరికొన్ని టెస్ట్ లు రాయితీ ల పై చేస్తున్నట్లు ప్రగతి క్లినికల్ లాబొరేటరీ & ఎక్స్-రే సెంటర్ ప్రోపరేటర్ మోసా నళిని దేవి తెలిపారు.*
*బుధవారం ప్రగతి క్లినికల్ లాబొరేటరీ & ఎక్స్-రే సెంటర్ కోట లో ఏర్పాటు చేసి 20 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా నూతనం ప్రగతి క్లినికల్ లాబొరేటరీ & ఎక్స్-రే సెంటర్ ను కోట ముస్లిం విధి,డాక్టర్ రవికుమార్ హాస్పటల్ రోడ్డు, మొలలు హాస్పటల్ పక్కన ప్రారంభించి షుగర్ టెస్ట్ లు ఉచితంగానిర్వహిస్తున్నారు. మరికొన్ని టెస్ట్ లు రాయితీకి చేస్తున్నారు.*
*ఈ సందర్భంగా ప్రోపరేటర్ మోసా నళిని దేవి మాట్లాడుతూ ప్రగతి క్లినికల్ లాబొరేటరీ & ఎక్స్-రే సెంటర్ ను కోటలో 2002 లో స్థాపించి కోట,వాకాడు,చిట్టామూరు,చిల్లకూరు మండలాల ప్రజలకు అత్యాధునిక పరికరాలతో టెస్ట్ లు, ఎక్స్-రేలు చేస్తున్నాము అని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా మెరుగైన సేవలు అందించేందుకు మా ల్యాబ్ ముందు ఉంటుంది అనీ తెలిపారు. మా ల్యాబ్ ప్రారంభించి 20 ఏళ్ళు అయిన సందర్భంగా వారం రోజులు పాటు షుగర్ టెస్ట్ లు ఉచితంగా చేస్తూ మరికొన్ని టేస్ట్ లు రాయితీ కి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అనీ ఆమె కోరారు.*