23/01/2024
ఒక ఊరిలో
సంపద, జ్ఞానం, విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారట.
వారు ఒకానొకరోజు విడిపోయి వేరేవేరే ప్రాంతాలకు పోవాల్సివచ్చింది.
అప్పుడు ఒకరినొకరు పలకరించుకుంటూ అడిగారట
మనం మళ్ళీ కలవాలంటే
ఎలా,
ఎప్పుడు,
ఎక్కడ కలుద్దాం అని.
అప్పుడు
జ్ఞానం : నేను విద్యాలయాలలో, పుస్తకాలలో ఉంటాను కాబట్టి మీరిద్దరూ అక్కడికొస్తే కలుద్దాం.
సంపద : నేను పెద్దపెద్ద ధనవంతులు, శ్రీమంతులు ఇళ్లలో ఉంటాను కాబట్టి మీరు అక్కడికొస్తే కలుద్దాం.
విశ్వాసం : నేను ఒక్కసారి ఒకచోటు నుండి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడికి తిరిగిరాను, రాలేను.
విజ్ఞానం, సంపద పొతే మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లైనా, ఎంతైనా సంపాదించుకోవచ్చు....
కానీ
విశ్వాసాన్ని ఒక్కసారి పోగొట్టుకుంటే
ఇక జీవితంలో ఎప్పటికి తిరిగి సంపాదించలేం !
So
Be Honest
Do Honest
Live Honest!