03/12/2025
పోరాడి గెలిచిన మూడ అడుగుల డాక్టర్ !
మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలం అని మరోసారి రుజువు అయింది. వ్యవస్థ పై పోరాడి ఓ మూడు అడుగుల వ్యక్తి ఏకంగా డాక్టర్ అయిపోయాడు. దీంతో గుజరాత్ కు చెందిన డాక్టర్ గణేష్ బరయ్య పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పట్టుదల ఉంటే, ఎత్తు ఏ మాత్రం అడ్డంకి కాదని ఈ మూడు అడుగుల డాక్టర్ గణేష్ బరయ్య నిరూపించాడు. మనం అనుకున్నది సాధించాలనే పట్టుదలతో కృషి చేస్తే, కొండను కూడా పిండి చేయగలమని డాక్టర్ గణేష్ బరయ్య సక్సెస్ స్టోరీ చూస్తే అర్థమవుతుంది.
2004 సంవత్సరంలో డాక్టర్ గణేష్ బరయ్య గ్రోత్ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అయిందట. దీంతో అతడు పుట్టడంతోనే ఎత్తు మూడు అడుగులే పెరిగారు. ఈ నేపథ్యంలో నీట్ లో మంచి మార్కులు సాధించినా, గణేష్ కు సీట్ ఇచ్చేందుకు కౌన్సిల్ మాత్రం అంగీకరించలేదు. దీంతో అతను ఎక్కడ కూడా నిరాశ చెందకుండా... హైకోర్టు మెట్లు ఎక్కారు. అక్కడ కేసు ఓడిపోతే, సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. చివరికి 2019 సంవత్సరంలో గణేష్ బరయ్య కేసు గెలిచి, బావ్ నగర్ లో MBBS సీటు సంపాదించారు. ఇక ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ గా సేవలు అందిస్తున్నారు. గణేష్ డెర్మటాలజిస్ట్ కావాలని అనుకుని, మొత్తానికి తన 23 ఏళ్ల వయస్సులో డాక్టర్ అవతారం ఎత్తారు.