bhirava rudra

bhirava rudra Exploring the mystical world of Rudraksha beads from the heart of Nepal �� Embrace authenticity and

10/03/2025

గత జన్మ పాపాలు - నేటి ఖర్మలు..........!!
ఈ లోకంలో ఏదీ కారణం లేనిదే జరుగదు. ప్రతిదానికీ ఓ కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, ఖర్మకు పూర్వకర్మయే కారణం. ఎందుకంటే ఈ లోకమున ప్రతి జీవి జన్మించడానికి కారణం.. ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం. పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్ధంతమే హిందూ మతానికి పునాది కూడా.

కర్మ సిద్దాంతము ప్రకారం.. జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు.

మొత్తానికి పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం. పూర్వ జన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గత జన్మలో మనం చేసిన పాప పుణ్యములను బట్టేయే మన జన్మ ఆధారపడి ఉంటుంది. మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది. మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపములోనో లేదా వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి.

మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏంటీ..? వాటిని ఎలా నివారించుకోవాలి అనే విషయాలను వివరించగలగడం జ్యోతిర్విజ్ఞానంలోని అద్భుతాలలో ఒకటి.

గతజన్మ పాపాలు వాటి ప్రభావాలను గురించి అంపశయ్యమీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు. ఈ వివరాలు భారతంలో మనం చూడవచ్చు. కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడమూ ఉన్నదని స్పష్టమవుతోంది.

సాధారణ జ్యోతిష్యంవల్ల కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. నాడీగ్రంధాల నుంచి కూడా తెలుసుకోవచ్చు. కాని నాడీ గ్రంధాలు ఈ విషయాలలో స్పెషలైజుడ్ రీసెర్చి చేసినవి గనుక వాటి నుంచి ఈ వివరాలు బాగా తెలుస్తాయి. పూర్వ జన్మలో మానవులు చేసే పాపాలు, ప్రస్తుత జన్మలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో కొన్నింటిని పరిశీలిద్దాం.

గత జన్మలో ఓ వ్యక్తి తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికొదిలేశాడు. ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకుల తిరస్కారంతో వృద్ధాశ్రమంలో చేర్చబడి, పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం అనుభవిస్తున్నాడు.

గత జన్మలో ఓ వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు. ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలూ విషాద పరిస్థితుల్లో మరణించారు. వయసు అయిపోతోంది. చేతిలో డబ్బులేదు. ముసలి వయసులో ఫుట్ పాత్ మీద అడుక్కుంటూ దిక్కులేని చావు గతి అయ్యేటట్లు ఉంది.

గత జన్మలో ఒక అమ్మాయి అసూయతో తన తోటి అమ్మాయిల పెళ్ళి సంబంధాలు చెడగొట్టేది. ఈ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్ గా కనిపిస్తున్నది. ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్ళిసంబంధాలు వచ్చినా ఒక్కటీ కుదరటం లేదు. గట్టిరెమెడీలు చేస్తే గాని ఈ దోషం తొలగదు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జన్మలో పూర్వ జన్మ ప్రభావం ఎదుర్కొంటున్నారు కనిపిస్తారు. వీరందరూ సరియైన రెమెడీలు పాటిస్తే ఈ సమస్యలు ఆగిపోతాయి. అయితే, సరియైన సమయంలోనే ఆ రెమెడీలు పాటించాల్సి ఉంటుంది.

గత జన్మ పాపాలకు ప్రస్తుతం పూజలెందుకు?

పూర్వ జన్మలో చేసిన పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం పూర్వ జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని అనుకుంటారు. అయితే, పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ వ్యాధి వస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది.

అదే మాదిరిగా గత జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి. దోషాలు పోతాయి.

03/03/2025
తాంత్రిక పూజలు..............!!తంత్ర పూజలు 5 విధములు అవి:1.సూర్య  2.గణపతి 3.విష్ణువు4.శివుడు 5.శక్తి పూజ లనునవి.ప్రతి శక్...
21/11/2024

తాంత్రిక పూజలు..............!!
తంత్ర పూజలు 5 విధములు అవి:
1.సూర్య 2.గణపతి 3.విష్ణువు
4.శివుడు 5.శక్తి పూజ లనునవి.
ప్రతి శక్తికి 5 రూపములు 5 సాధనలు గలవు.

ఉపాసకుని శక్తి సామర్థ్య,భావముల ననుసరించి సాధనలు 4 విధములుగా పేర్కొనబడినవి.
అవి:
1.పూజ 2. జపము 3.ధ్యానము
4.బ్రహ్మత్వము అనునవి.
వీనిలో సాధకుని భావములు
మూడు తెగలుగా విభజింపబడినవి.
అవి:
1.పశుభావము 2.వీరభావము
3.దివ్యభావము

1.పశుభావము:
లజ్జ,కామ,క్రోధాది అరిషడ్వర్గములచే కట్టబడిన వారు పశ్వాచారులు.

2.వీరభావము:
పశుపాశములను విడిపించుకొనిన జితేంద్రియులు వీరాచారులు

3.దివ్యభావము:
బ్రహ్మజ్ఞానులైనవారు
దివ్యాచారులనదగిన వారు.
వివిధ సాధనా విధానములను గమ్యమును చేరుకొను అంతస్థులను,ఆచారములనినారు.
కులార్ణవతంత్రము ఈ ఆచారములను
ఆరునొక్కటి (7)గా పేర్కొనినది.

అవి:
1.వేదాచారము:
బహిః పూజాపద్ధతి దీనిలోనిది క్రియామార్గమై స్థూలదేహము వంటిది.

2.వైష్ణవాచారము:
భక్తి యోగ ప్రాధాన్యమై హృదయ సాధనకు దోహదమిచ్చును.

3.శైవాచారము:
జప యోగముతోకూడి
ధర్మస్థాపన కుపక్రమించినది.

4.దక్షిణాచారము:
దక్షిణ కాళిక పూజా పూర్వకమైనది.
ఈ తెగవారికి సమయాచారులని మరియొక పేరు గలదు. వీరికి దేవి గాయత్రీ మంత్ర ముపదేశింపబడును.
త్రిశక్తుల కావ్యశక్తి బ్రహ్మశక్తి యగుటవలన బ్రాహ్మణత్వ సాధనకిది నాందియై శక్తి పూజార్హత్వము లభించును.
ఈ ఆచారములో ధ్యాన యోగ ప్రాప్తియై ప్రవృత్తి మార్గమునుండి నివృత్తికి,
తన్మూలమున యోగసిద్ధి కలుగుటకు
ప్రారంభమగును.

5.వామాచారము:
దక్షిణాచారములో పుట్టిన మానవుడు గురువులచేత దీక్షనందుకొని (తంత్ర దీక్ష) వామాచారుడగును.వామమనగా వ్యతిరేక పక్షము,విప్లవ మార్గము అని పేరు. ఇచ్చట సాధకుడు ప్రవృత్తి మార్గమును పూర్తిగా వదలి నివృత్తి పదములో నిమగ్నుడగుటయే ప్రత్యేకత.అనగా సంసార బంధ విముక్తుడై యోగిగా నుండు స్థితి.
వీరినే వీరాచారులని,హఠయోగులని పిల్తురు.

6.సిద్ధాంతాచారము:
లజ్జ,భయ,మోహాది అరిషణ్మార్గములకుకుల శీలాలకు నతీతులుగా వీరు స్మశాన వాసులై
శివ స్థితి నొందినవారు.
వీరికి యోగ రహస్యములు కరతలామరకములు.
మనో నిగ్రహము,ప్రాణవాయు
సంచార సమస్థితి,
వాని గతులయొక్క జ్ఞానము
వీరికి అనుభవ సిద్ధము.
వీరికి గురువులు వేదాచార
రహస్య ముల నుపదేశించి దీక్షయొసంగుదురు.
అష్టాంగయోగ సాధనచే
వీరు తురీయులై కాలాచార పరాయణులగుటకు
అర్హతను బడయుదురు.
వీరినే అఘోరయోగాచారులని,
దివ్యాచారులని వ్యవహరింతురు.
(శివుని వామ పార్శ్వమగు శక్తిని పూజించువారుగూడా వామాచారులనబడుదురు.)

7.కౌలాచారులు:
ఇచట శత్రు మిత్రత్వము,శీతోష్ణ సుఖ దుఃఖ స్థితి కతీతమైన స్థిత ప్రజ్ఞత్వము కలిగి బ్రహ్మీభూతులగుదురు.ఇచటి వారు లాభ నష్టముల (మన్ను-పొన్ను) భేదము లెరుంగని ద్వందాతీతులైనారు.వీరికి సర్వము బ్రహ్మమయమే.బేధభావన యుండదు. భగవద్గీతలో చెప్పబడిన బ్రహ్మభావము నంది,సమతా భావము గలవారు వీరు. అప్పుడప్పుడు భ్రష్టులవలె,ఉన్మత్తులవలె,శిశువులవలె,భూత,ప్రేత,పిశాచవర్తనులై
కాన నగుదురు.
ఏకాంత స్థలములలో
శ్మశాన వాటికలో నుండి
నిర్వికల్ప సమాధి స్థితి
నందుకొనెడివారు.
వీరిని జీవన్ముక్తులు,పూర్ణమానవులు, పరమహంసలని పిల్తురు.

ఈ పై పేర్కొనిన వివిధ తంత్ర శాస్త్ర మార్గములలో సామాన్యులు మొదటి నుండి ప్రారంభించి జన్మజన్మల సంస్కారమునొంది చివరకు కౌలాచారమున సిద్ధులగుదురు.
కాని పూర్వజన్మ సంస్కారము కలవారు మాత్రము సిద్ధాంతాచారము
నుండియే సాధనచేసి పరమహంస లగుదురు.దీనికి తార్కాణముగా రామకృష్ణపరమహంస ,
తురీయాచారములైన సిద్ధాంత కౌలాచారముల సాధనతో మహా భావన కలిగి వామాచార పరాయణులుగానే సిద్ధినొందిరి.
వీరికి జగజ్జనని పిలిచిన వెంటనే సాక్షాత్కరించెడిదట.
అంతటి మహనీయులు వారు కనుకనే పరమహంసయని పిలువబడిరి.

ఇట్టి తంత్ర రహస్యములను మన దేశములోని హిందువులేగాక హేతువాద ప్రధానముగా గల ఆంగ్లదేశములో పుట్టి, పెరిగి, ఉన్నతవిద్యనభ్యసించి,క్రైస్తవ మత
సిద్ధాంతాచారము కలిగిన వంగదేశ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, పనిచేసిన ప్రఖ్యాత న్యాయశాస్త్రజ్ఞులు,
మేధావులునైన, సర్ జాన్ ఉడ్ రాఫ్ దొర గారు చక్కటి కృషిచేసి కొన్ని విషయములలో భారతదేశము తంత్ర శాస్త్రమునకు ఎంతయో ఋణపడి యున్నదని వాక్రుచ్చినారు.
వైద్య నిపుణులకు కూడ నయముకాని మొండి వ్యాధులు కేవలము మంత్రములచేత నయమగుటను
వారు స్వయముగా చూచి,పరీక్షించి
ఏ తన్మాహాత్మ్యమునకు కచ్చెరువంది సంస్కృతభాష నభ్యసించి తంత్ర శాస్త్రములో చక్కని కృషిచేసి,
ఈ గ్రంథములను ఆంగ్లభాషలో వివరించి వ్రాసి,తంత్ర శాస్త్రమును పునరుజ్జీవింపజేసినారు.శరీరము,
ప్రాణము,మనస్సు,బుద్ధి, నాడి,జ్యోతిష, వైద్య,రసాయన, శాస్త్రముల కెంతయో తంత్ర శాస్త్రము దోహదమిచ్చి మహత్తర సేవ గావించినదని వీరు చాటినారు.
శ్రీ మాక్సుముల్లర్ దొరగారు
వేదములకెట్టి సేవ చేసినారో అట్టి సేవనే వీరు తంత్ర శాస్త్రమునకుచేసి,యందు గల శాస్త్రీయ విజ్ఞానమును బయట పెట్టిరి.తంత్ర శాస్త్రముల విలువ ఎట్టిదో
వాని ప్రాధాన్య మెట్టిదో మనకిపుడు బోధపడినది గదా!

మరియు నింకొక విషయము.ఆత్మజ్ఞాన గ్రంథములు రహస్య గ్రంథములని పెద్ద లనినారు.అందువలన రహస్య భాషలోనే ఈ తంత్ర శాస్త్రములను రచియించినారు.దీనినే సంధ్యాభాష యని గూడ యందురు.సంధ్యలో చీకటి వెలుగులున్నట్లు వీనిలో వాడిన పదములకు కూడా రెండర్థములు గలవు.అనగా సామాన్యులకు సామాన్యర్థము,సాధకులకు విశేషార్థములందు బోధపడును.
దీనిచే నివి గోప్యమైనవని చెప్పబడినవి.రహస్యముగా నుంచబడుటచే వీని పవిత్రత చెడకుండా మహిమతో నొప్పియుండుటయైనది.
దీనినే గీతాచార్యుడు
"జ్ఞాన మాఖ్యాంతం గుహ్యాద్గుహ్యంతరం" అని నుడివియున్నాడు.
ఇట్లు తంత్ర శాస్త్రములు నిగూఢమైన శక్తులతో నిండి సాధకులకు పరమార్థ మార్గదర్శకములై విలసిల్లినవి.

5 face nepal smal size 14mm to 16 mm avilble con : 7382321231
07/10/2024

5 face nepal smal size 14mm to 16 mm avilble con : 7382321231

🇳🇵Nepal 🇳🇵 5 muki rudraksha avilble bulk order concrete call or watsap 7382321231
07/10/2024

🇳🇵Nepal 🇳🇵 5 muki rudraksha avilble bulk order concrete call or watsap 7382321231

Con ::7382321231Nine Mukhi Rudraksha is blessed by Durga, the Goddess Shakti, who took birth on Earth nine times in diff...
06/10/2024

Con ::7382321231
Nine Mukhi Rudraksha is blessed by Durga, the Goddess Shakti, who took birth on Earth nine times in different forms to protect her followers. Sins committed by a person get condoned by wearing this Rudraksha. It also makes a person fearless and stress-free. Wearing it is like getting one’s conscience purified through fire.As per Rudrakshajabalopanisad, there are nine types of power in this Rudraksha. It protects the wearer from untimely death, as it is blessed by Bhairav.

5 muki rudraksha mala Con : 7382321231
06/10/2024

5 muki rudraksha mala
Con : 7382321231

Follow us. bhirava rudra సిద్ధులను గుర్తించటం ఎలా ............!!భారత దేశం కర్మభూమి.లౌకిక ఙ్ఞానానికి అతీతమైన సిద్ధులతో,తమ...
04/10/2024

Follow us.
bhirava rudra
సిద్ధులను గుర్తించటం ఎలా ............!!
భారత దేశం కర్మభూమి.లౌకిక ఙ్ఞానానికి అతీతమైన సిద్ధులతో,తమ తపోశక్తితో భారత భూమిని సుసంపన్నం చేసిన సిద్ధులెందరికో ఈ పుణ్యభూమి పుట్టినిల్లు తమ తపోశక్తితో కేవలం, భారత దేశానికే కాక యవత్తూ మానవాళికి ఉపకారం చేసే సిద్ధ పురుషులు ఈ నాటికి హిమాలయపర్వత శ్రేణుల్లో ఉన్నారు.

అట్టి మహాత్ముల తపోశక్తి వలననే నేడు భారతావని ఈ మాత్రం అయినా సుభిక్షముగా ఉంది. వారి తపస్సు వలన కలిగే ప్రకంపనలు వలనే నేటికీ భారతదేశంలో ఇంకా ఆధ్యాత్మికత నెలకొని ఉంది. సిద్ధ పురుషులు అఙ్ఞాతముగా ఉంటూ మానవునికి ఊహకందని సేవలు చేస్తూ ఉంటారు.

ప్రకృతి,సూర్యకాంతి,పంచభూతాలు మానవాళికి చేసే ప్రయోజనం ఎటువంటిదో సిద్ధులైన పురుషుల తపోశక్తితో అంతటి ఉపకారం చేస్తు ఉంటుంది.

1)సిద్ధులను గుర్తించటం ఎలా ?

2)వారి లక్షణాలు ఎమిటి ?

3)వారి నివాసము ఎచ్చట ?

వంటివి ఆసక్తికరమైన ప్రశ్నలు.

అయితే సిద్ధులను గుర్తించటం అంత తేలికైన విషియం కాదు.

భగవద్గీత,బ్రహ్మ గీత,సూత సంహిత,భాగవతం ఇంకా ఉపనిషత్తులతో అక్కడక్కడ సిద్ధులను గురించి చెప్పబడింది. భగవద్గీతలో సాంఖ్యాయోగంలో చెప్పబడిన స్థిథ ప్రఙ్ఞుని లక్షణాలు పూర్తిగా కలిగి ఉన్నవారిని సిద్ధ పురుషులుగా పేర్కొనవచ్చు.

భగవద్గీత లో అర్జునుడు స్థిత ప్రఙ్ఞుని గురించి నాలుగు ప్రశ్నలు వేశాడు.

1) స్థిత ప్రఙ్ఞుడు ఎలా ఉంటాడు
అనగా అతని లక్షణములు ఏమిటి ?

2)స్థిత ప్రఙ్ఞులు ఏ విధంగా భాషిస్తారు ?

3)స్థిత ప్రాఙ్ఞుడు ఏ రీతిగా ఉంటాడు ?

4)స్థిత ప్రాఙ్ఞుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు ?

పైనాలుగు ప్రశ్నలలో మొదటి ప్రశ్నయే సమగ్రమయినది.

మిగిలిన మూడుప్రశ్నలు అందులోని భాగమే.

అత్యంత సమగ్రమైన అర్జునుని ఈ ప్రశ్నకు సాంఖ్య యోగం చివరి వరకూ శ్రీ కృష్ణ భగవానుడు సవివరముగ సమాధానం ఇచ్చాడు.

మనస్సులోని కోరికలను పూర్తిగా పాలద్రోలి నిర్మల చిత్తంతో ఆత్మయందే స్థిరంగా ఉండి సంతుష్టి పొందే స్థితిని స్థిత ప్రఙ్ఞత్వం అని అంటారు.

అట్టి స్థితిని చేరుకున్న సిద్ధుని ప్రతి చర్యలో పవిత్రత ,శాంతి ,దైవత్వం గోచరిస్తుంది.అట్టి సిద్ధుని ముఖం ఎల్లప్పుడూ తృప్తి ,ఆనందంతో తాండవిస్తుంది.

అతని హృదయం నిత్యం బ్రహ్మానంద సాగరంలో తేలియాడూతూ ఉంటుంది.మనోవికారాలైన రాగభయ క్రోధాదులు అతని దరి చేరవు.

శరీరధారులు కనుక కొన్ని భౌతికావసరాలకు తప్ప ఏ వస్తువులు యందు ప్రత్యేకమైన కోరిక గాని అమిత ఇష్టంగాని కలిగిఉండరు.

సిద్ధులైన మహాపురుషులు దర్శనం వలన కలిగే పుణ్యఫలమును గురించి ఒక చిన్న కథ ఉంది.

ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువును ” సాధుదర్శనం” వలన కలిగే ఫలం ఏమిటి? అని ప్రశ్నించాడు. దానికి విష్ణువు “నారదా! భూలోకంలో ఇప్పుడే ఒక పేడపురుగు జన్మించింది.వెళ్ళి దానిని అడుగు. నీ ప్రశ్నకు జవాబు లభిస్తుంది”అన్నాడు.

నారదుడు పేడపురుగు వద్దకు పోయి “సాధుదర్శనం వలన కలిగే ఫలము ఏమిటి? “అని ప్రశ్నించాడు. వెంటనే ఆ పేడపురుగు మరణించింది. నారదుడు కంగారుపడి విష్ణువుకు జరిగినదంతా చెప్పాడు.

విష్ణువు “నారదా ! భూలోకంలో ఒక గోవు ప్రసవిస్తున్నది.వెళ్ళి ఆ ఆవు దూడను ఇదే ప్రశ్నను అడుగు” అని పంపాడు. నారదుడు తిరిగి భూలోకం వచ్చి అప్పుడే ప్రసవించిన లేగదూడను తిరిగి ప్రశ్నించాడు. ఆ లేగదూడ ప్రశ్న విన్న వెంటనే మరణించింది.

నారదుడు తనకు గోహత్యా పాపం కలిగింది అని చింతించి ,మళ్ళి విష్ణువు వద్దకు వెళ్ళి జరిగినది అంతా వివరించాడు. వెంటనే శ్రీ మహా విష్ణువు :”ఈ సారి భూలోకంలో ఫలానా రాజుగారి భార్య ఇప్పుడే ప్రసవించింది.మగ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ ను ఈ ప్రశ్న వెయ్యి, నీకు సమాధానం దొరుకుతుంది ” అని చెప్పాడు.

నారదుడు సందేహించి “శ్రీమన్నారాయణ ! ఇప్పటికే నావలన రెండు మరణాలు జరిగాయని వ్యాకుల పడుతున్నాను. నీ మాయ నాకు అర్థం కాకుండా ఉంది. మరోక్కసారి నీవు చెప్పినట్లు చెయ్యటానికి ధైర్యం సరిపోవడంలేదు ,నన్ను అనుగ్రహించు తండ్రి ! ” అని ప్రార్థించాడు .

శ్రీ మహావిష్ణువు నవ్వి “ఈ సారి నీ ప్రశ్నకు తప్పక జవాబు లభిస్తుంది.పోయిరమ్ము” అని పంపాడు. నారదుడు భూలోకానికి తిరిగి వచ్చి అప్పుడే ప్రసవించిన రాకుమారుని ” సిద్ధ పురుషులు దర్శన ఫలం ఏమిటి ?” అని ప్రశ్నించాడు.

వెంటనే ఆ రాకుమారుడు నారదునికి నమస్కరించి “మహాత్మ! మీ ప్రశ్నకు, నా జీవితమే జవాబు ! నేను ముందు పేడపురుగుగా జన్మించినప్పుడు మీ దర్శనభాగ్యం వలన ఆవుదూడగా ఉత్తమజన్మ లభించింది. తిరిగి మీ దర్శనం వల్లనే ఉత్తమోత్తమైన ఈ మానవ జన్మ లభించింది ” అని జవాబు ఇచ్చాడు.

కాబట్టి, సిద్ధ పురుషులు దర్శనం వలన లభించే పుణ్య ఫలం ఎంతని చెప్పగలం?

సాధూనాం దర్శనం పుణ్యం,
స్పర్శనం పాప నాశనం
సంభాషణం కోటితీర్థం,
వందనం మోక్ష సాధనం II

సాధువులు అయిన ఙ్ఞానులను దర్శించతం వల్ల పుణ్యం, పాద స్పర్శతో పాపనాశనం,సంభాషించటం వలన అన్ని పుణ్యతీర్థాలలో స్నానము ఆచరించటం వలన కలిగే పుణ్య ఫలం, నమస్కారం చెయ్యడం మోక్షదాయకమని భాగవతం లో చెప్పబడింది.

ఏ ప్రదేశాలలో సిద్ధ పురుషులు ఆశ్రమాలు నిర్మించుకుంటారో అక్కడి ప్రజలు ఆ సిద్ధులు సాంగత్యంతో పునీతులు అవుతూ ఉంటారు.

ఆత్మ ఙ్ఞానం పెంపొందించుకునే వాతావరణం సిద్ధ పురుషుల ఆశ్రమాలలో లభించగలదు. అట్టి మహాపురుషుల ఉనికి అన్ని రకాల తాపత్రయాలను పారద్రోలి శాశ్వతమైన ఆధ్యాత్మిక శాంతిని చేకూర్చుతుంది.

నిరంతరం సంసార వ్యామోహంలో కొట్టుమిట్టాడే నేటి ప్రజలు, అట్టి మహాపురుషుల సాంగత్యం కొరకై తరచూ ప్రయత్నం చేయుట వలన శాంతి సౌఖ్యాలను పొందగలరు. పలు సిద్ధ పురుషుల జీవిత చరిత్రలు దీనికి ఉదాహరణలు.

గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు  కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడు...
04/10/2024

గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు

కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.

నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.

గాయత్రీ మంత్రము అంటే…
“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం,
భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”
ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…



ఓం

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్



ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.

ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.

గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.

1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.

2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.

3. పురాణ కధనం ప్రకారం 24 ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. ధర్మచక్రం లో వున్నా 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.

4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.

5. 24 కేశవ నామాలు

6. 24 తత్వాలు : ఐదు జ్ఞానేన్ద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 5 మహాద్భూతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు

7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”

8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.

9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు

10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.

11. మన వెన్ను బాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.
12.మనకు గల సమయం 24 గంటలు.. ఒక్కొక్క గంటకు ఒకొక్క అక్షరం మనలలను కాపాడుతూ వుంటుంటుంది ఆ గాయత్రి మాత
“న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు . 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు. సకల దేవతా స్వరూపం గాయత్రీ. రామాయణ సారం గాయత్రీ . కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ .. సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ .. 24 బీజాక్షర సంపుటి గాయత్రీ.. అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.


యిరువది నాలుగు దేవతా మూర్తులు
క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి
1 తత్ విఘ్నేశ్వరుడు 13 ధీ భూదేవి
2 న నరసింహస్వామి 14 మ సూర్య భగవానుడు
3 వి మహావిష్ణువు 15 హి శ్రీరాముడు
4 తుః శివుడు 16 ధి సీతాదేవి
5 వ శ్రీకృష్ణుడు 17 యో చంద్రుడు
6 రే రాధాదేవి 18 యో యముడు
7 ణ్యం శ్రీ మహాలక్ష్మి 19 నః బ్రహ్మ
8 భ అగ్ని దేవుడు 20 ప్ర వరుణుదు
9 ర్గోః ఇంద్రుడు 21 చో శ్రీమన్నారాయణుడు
10 దే సరస్వతీ దేవి 22 ద హయగ్రీవుడు
11 వ దుర్గాదేవి 23 య హంసదేవత
12 స్య ఆంజనేయస్వామి 24 త్ తులసీమాత
ఈ ఇవరై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి,దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.

!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!

Mysore palace
28/07/2024

Mysore palace

Mysore Palace part -1'|మైసూరు మహారాజా ప్యాలెస్ palace palace,mysore palace inside video,mysore palace video,mysore,mysore palace histor...

Address

Nellore
524002

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

+917382321231

Website

Alerts

Be the first to know and let us send you an email when bhirava rudra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to bhirava rudra:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram