
02/03/2025
*ఆరాధన.....*
*దైవానుగ్రహం పొందడానికి సులభమైన మార్గం ప్రకృతిలో లభించే పుష్పాలతో భక్తితో దేవుని పూజించడమే.*
*పుష్పాలలో కూడా సాత్వీక, రాజస ,తామస గుణాలు కలిగిన పుష్పాలున్నట్లు మన పురాణగ్రంధాలు, శాస్త్రాలు వివరిస్తున్నాయి.*
*శ్వేత వర్ణ కుసుమాలు సాత్వీక గుణం కలవి. తెల్లని ఉమ్మెత్త,కరవీర, గన్నేరు, చిన్న సంపెంగ, బొగడపువ్వులు, తెల్ల తామరలు, జాజి,మల్లి , నందివర్ధనాలు, తుమ్మి మొదలైనవి సాత్వీక పుష్పాలు. ఈ పుష్పాలతో పరమేశ్వరుని పూజిస్తే ముక్తి లభిస్తుంది.*
*ఎఱుపు రంగు పుష్పాలు రాజస గుణం కలవి. ఎఱ్ఱ తామరలు, ఎఱ్ఱ కరవీర పుష్పాలు మందారపువ్వులు, మొదలైనవి యీ రకం. ఈ పువ్వులతో ఈశ్వరుని పూజిస్తే ఇహ పర సౌఖ్యాలు లభిస్తాయి.*
*గణపతి, పరమేశ్వరుడు షణ్ముఖుడు, మహావిష్ణువు, కాళి మొదలైన దైవాలకి రాజసగుణ పుష్పాలు సమర్పించవచ్చును.*
*నీల వర్ణపుష్పాలు తామస గుణం కలిగినవి. ఈ రకపు పుష్పాలలో నీలోత్పలాలు మాత్రమే పరమేశ్వర పూజకు అర్హము. తమోగుణ రూపులైన శాస్తా, భైరవుడు, యమధర్మరాజు శనీశ్వరుడు మొదలైన ఉగ్రరూప దేవతలకు తామసగుణాలు కల పువ్వులు సమర్పించడం వలన శత్రువుల బాధలు తొలగిపోతాయని ఆగమాలు తెలుపుతున్నవి.*
*ఈ విధంగానే మిశ్రమ పుష్పాలనే రకాలు వున్నవి. సంపెంగ, స్వర్ణ ఉమ్మెత్త, మొదలైన పసుపురంగు పువ్వులు మిశ్రమ పుష్పాలుగా పిలువబడుతున్నవి. ఇవి సాత్వీక రాజస గుణాలు కలిగినవి.*
*భగవంతుని అర్చించేప్పుడు 8,16, 108, 1000, 10,000 అనే లెక్కలో పువ్వులు సేకరించి పూజించవచ్చును. ఇందువలన ఉన్నతమైన శుభ ఫలితాలు కలుగుతాయి.*
*పుష్పార్చన చేసేటప్పుడు ఒకే రంగు పువ్వులతో పూజించేక మరో రంగు సుమాలతో పూజించాలి. పూజించేప్పుడు పువ్వుల పైభాగంలో కాడ క్రిందవైపుకి వుండేలా చూసుకోవాలి. పూజించాలి. దేవతార్చన కోసం సేకరించిన పువ్వులు శుచిశుభ్రతలు కలిగిన ప్రదేశాలలోనే భద్రపర్చాలి. వృక్షం పరమేశ్వర రూపంగా భావించి పూజించాలని ఆగమాలు తెలుపుతున్నవి.*
*పువ్వులు లభించని పక్షాన బిల్వ దళాలతో, తులసీ దళాలతో దేవుని పూజించవచ్చును. అవికూడా లభించనిచో పసుపు బియ్యం కలిపిన అక్షింతలతో పూజించవచ్చును.*
*ఫలం , పత్రం , పుష్పం, తోయం. వీటిలో వేటితోనైనా దేవుని అర్చించవచ్చును.*
*దేవతార్చనలో ముఖ్యమైనది భక్తి శ్రధ్ధలు మాత్రమే, అలంకరణ ఆడంబరము కాదు.*
*┈┉┅━❀꧁శివోహం꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🙏🙏🙏 🔔🕉️🔔 🙏🙏🙏