Pratibha Speciality Clinic

Pratibha Speciality Clinic Takes care of your health by advising preventive measures, giving diet advise for various health pro

అగ్ని ప్రమాదాల విషయంలో మనం తీసుకోవలసిన చర్యలు వివరించే ప్రయత్నం..✍️డా. ప్రతిభా లక్ష్మి        బట్టలకు మంట అంటుకున్నప్పుడ...
26/09/2022

అగ్ని ప్రమాదాల విషయంలో మనం తీసుకోవలసిన చర్యలు వివరించే ప్రయత్నం..

✍️డా. ప్రతిభా లక్ష్మి
బట్టలకు మంట అంటుకున్నప్పుడు కంగారులో పరిగెత్తకూడదు. గాలికి మంట ఇంక ఎక్కువ అవుతుంది అని గుర్తు పెట్టుకోవాలి. ముందుగా దుప్పటి గానీ, నీరు కానీ పోసి మంటను ఆర్పే ప్రయత్నం చేయాలి. ఆ స్థలానికి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేయాలి.
అగ్ని కన్నా, పొగ వల్ల ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఎక్కువ. పొగ గదిలోని పైన భాగంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి, పొగ బాగా ఉన్న సందర్భంలో, వెంటనే, మోకాళ్ళ మీద వంగి, చిన్న పిల్లల లాగా అంబాడుతూ బయటకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ముక్కుకు ఒక శుభ్రమైన cloth, అవకాశం ఉంటే తడిగా చేసి పెట్టుకొని వెళ్ళాలి.
ఎవరినైనా కాపాడే ప్రయత్నంలో వెళ్ళే వారు, ముందు తమ safety చూసుకోవాలి. ఎదుటి వారి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాన్ని అపాయంలో పెట్టుకోవడం వల్ల ఏమీ లాభం ఉండదు.
ఇంట్లో ఏమైనా చిన్న కాలిన గాయాలు అయినప్పుడు, వెంటనే ఆ భాగాన్ని 10 నిమిషాల పాటు చల్లటి నీటి కింద పెట్టాలి. తరవాత శుభ్రమైన చేతులతో ఏదైనా antiseptic cream (silverex or burnol) పెట్టుకోవాలి. మట్టి, paste వంటివి, ice, లేదా ఎటువంటి నూనెలు పెట్టకూడదు. Blisters వస్తే పగలకొట్ట కూడదు.
ఎక్కువ కాలినట్లైతే శుభ్రమైన cloth లేదా bandage కట్టి, వీలైనంత తొందరగా, ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కాలిన గాయాల వల్ల కన్నా, వాటికి కలిగే ఇన్ఫెక్షన్ల వల్ల ప్రాణాపాయం ఎక్కువగా సంభవిస్తాయి అని గుర్తు పెట్టుకోవాలి. అందుకే శుభ్రమైన చేతులతో మాత్రమే ఉండాలి. శుభ్రమైన బట్టలతో మాత్రమే ఆ గాయాలను cover చేయాలి.
Prevention is better than cure. ముఖ్యంగా పిల్లల్ని ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఇంట్లో అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా, ముందుగా నియమాలను అతిక్రమించకుండా, నిర్మాణాలు చేసుకోవాలి.

ఈ మధ్య ఒక వైద్యుడి ఇంట్లో, అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో, కుటుంబంలోని ఇద్దరు సజీవ దహనం అయ్యి, ఇద్దరు చిన్నారులు పొగ వల్ల ఊపిరి ఆడక చనిపోయారు అనే హృదయ విదారక ఘటన చదివిన బాధాతప్త హృదయంతో... అలాగే కొద్ది రోజుల్లో వస్తున్న దీపావళి పండగను దృష్టిలో పెట్టుకొని..

World kidney day. 10th మార్చ్ 2022.మీకు తెలుసా, *మన దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు...
11/03/2022

World kidney day. 10th మార్చ్ 2022.

మీకు తెలుసా,
*మన దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు.
*కిడ్నీ సమస్యను తొలి దశలో గుర్తిస్తే చికిత్స సులువుగా అవుతుంది
*కేవలం రెండు చిన్న, అతి తక్కువ ఖర్చుతో చేసే పరీక్షలతో గుర్తించవచ్చు (Serum creatinine, urine protein/albumin)
*కిడ్నీ సమస్యలకు ఆలస్యమైనాక చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది
*ఒక cycle డయాలిసిస్ కి Rs.2000 చొప్పున, వారానికి 3సార్లు, ప్రతి సారి 4గంటలు, జీవితాంతం.
*ఒక సారి డయాలిసిస్ కి 150litres నీళ్లు ఖర్చు అవుతాయి
*మన దేశంలో కిడ్నీ transplant అవసరమైన వారు 2లక్షలు, కానీ ప్రతి సంవత్సరం కేవలం 12,000 transplants అవుతున్నాయి.
*కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణం Diabetes. అది కాక, ఎన్నో ఇతర infections, BP సమస్యలు కూడా కారణాలు

కిడ్నీ ని కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు:
*ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకోవాలి.
*అధికంగా మాంసం తీసుకోకూడదు.
*ప్రతి రోజు కనీసం 30 min వ్యాయామం చేయాలి
*ధూమపానం మానేయాలి (Quit smoking)
*నొప్పి గోళీలు, అనవసరంగా స్టరోయిడ్స్ వాడకూడదు
*BP, Sugar, regular గా చెక్ చేసుకుంటూ, మందులు వాడుకోవాలి.
*రక్త హీనత, నీరసం, ఒళ్ళు నొప్పులు, వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుల సలహా మీద పరీక్షలు చేయించుకోవాలి.

As the covid third wave starts to peak, there is a possibility that people with chronic diseases neglect their treatment...
10/01/2022

As the covid third wave starts to peak, there is a possibility that people with chronic diseases neglect their treatments, due to the fear of meeting their doctors or getting their prescriptions filled, and land up in emergencies.
So, we conducted a free medical camp, where we tested
Blood sugars,
Blood pressure,
Lipid profile,
Dietician advice and
Physician consultation
totally free of cost, today, i.e, 9th Jan 2022 from 9am to 12pm, where around 50 needy patients utilised our services, maintaining strict Covid protocol.
We distributed free medicines for acute ailments.
I request all the people not to neglect chronic diseases and be compliant in following the doctor's advice, to avoid emergency hospitalisations.

Third wave start అయింది.కంగారు వద్దు, జాగ్రత్తలు మానొద్దు.అనవసర tests వద్దు,అనవసరంగా admit అవ్వవద్దు,అనవసరమైన మందులు వద్...
07/01/2022

Third wave start అయింది.
కంగారు వద్దు, జాగ్రత్తలు మానొద్దు.
అనవసర tests వద్దు,
అనవసరంగా admit అవ్వవద్దు,
అనవసరమైన మందులు వద్దు,
మోసకారులను నమ్మ వద్దు,
మనకు రాదు అనుకోవద్దు,
అందరికి వస్తుంది, తగ్గిపోతుంది.
Mask తీయవద్దు,
దూరం మరవ వద్దు,
Sanitiser మాన వద్దు
వాక్సిన్ తీసుకోవడంలో ఆలస్యం వద్దు,
అనారోగ్యం ఉన్న వాళ్ళు బయటకు రావొద్దు.

All the best to all of us.
అందరం కలిసి క్షేమంగా బయట పడదాం.!!

12/10/2021

Precautions during festival season to protect from Covid.

Listen to this story of discovery of the first miracle drug.. INSULIN.!!
01/08/2021

Listen to this story of discovery of the first miracle drug.. INSULIN.!!

Science Stories - The Story of Insulin Narrated by Dr Prathiba LakshmiEdited by Arun Chigurh|| For all news related to Humanism ||SUBSCRIBE @ https://www.you...

23/07/2021

# # కోవిడ్ వచ్చి తగ్గినాక..!!

✍️డా. ప్రతిభా లక్ష్మీ

కోవిడ్ రెండవ దశ ముగింపుకు వస్తున్న ఈ తరుణంలో, రోజు రోజుకీ, కొత్త కేసులు తక్కువగా నమోదు అవుతుండగా, కోవిడ్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండగా, మళ్ళీ తొందర్లో మూడవ వేవ్ రానుందనే చర్చల మధ్య, కోవిడ్ తగ్గినాక కలిగే సమస్యలు, వారి నుండి బయట పడే పద్ధతుల గురించి తెలుసుకుందాం.. కోవిడ్ మానవాళి మీద ఆరోగ్యపరంగానే కాక, మానసికంగా, ఆర్ధికంగా, సామాజికంగా, ఎన్నో గాయాలను మిగులుస్తుంది.

ఆర్ధికంగా ఎక్కువ నష్టం కలగకుండా, అనవసరపు పరీక్షలు చేయించకుండా, వైద్యుల సలహాల మీద సరైన మందులు వాడుతూ, వ్యాధి తీవ్రంగా అవ్వకుండా జాగ్రత్త పడడం ముఖ్యం. తరవాత కూడా అవసరం అయితే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను వినియోగించుకోవడం మంచిది. ఇకనైనా ముందు చూపుతో ఇన్సూరెన్స్ చేసుకోవడం, ఆరోగ్యానికి ముందు నుండే ప్రతి నెల కొంత డబ్బు కేటాయించడం, వంటివి చేయవలసిందే. ఆరోగ్య వ్యవస్థ బలపరిచే లాగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవలసిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంది.

కోవిడ్ సోకిన వారు, ఒంటరిగా ఒక గదిలో, లేక ఆసుపత్రి నాలుగు గోడల మధ్య రెండు వారాల పాటు ఒంటరిగా ఉండడం వల్ల మానసికంగా కృంగిపోతున్నారు. అందరూ గుర్తు పెట్టుకోవలసింది ఏంటంటే, ఇది కేవలం రెండు వారాల ఆరోగ్య సమస్య. మన జీవిత కాలంలో అది చాలా తక్కువ సమయం. కాబట్టి మనోధైర్యంతో మంచి ఆలోచనలతో ఆ రెండు వారాలు గడిపి, తదుపరి అందమైన జీవితాన్ని ఆస్వాదించాలి. సమాజ పరంగా కూడా ఒకరికి ఒకరం సహాయం అందించుకుంటూ, మనం ఈ విపత్తు నుండి క్షేమంగా బయట పడాలి.

ఆరోగ్యపరంగా, కోవిడ్ నుండి కొలుకున్నాక, ఉండే సమస్యల గురించి ఇప్పుడు చర్చిద్దాం:

*ఆయాసం: యాభై నుండి డెబ్భై శాతం ఊపిరి తిత్తులు వ్యాధి వ్యాప్తికి గురైనప్పటికీ, చాలా వరకు రోగులు పూర్తిగా కొలుకున్నాక, ఊపిరితిత్తులు పూర్తిగా సాధారణ స్థితికి వస్తున్నాయి. రెండు నుండి నాలుగు వారాల వ్యవధిలో, పూర్తిగా ఏ ఇబ్బంది లేకుండా అవుతున్నారు. ఆయాసం ఉన్న వారు, నెమ్మదిగా ఊపిరి తిత్తుల వ్యాయామం చేస్తూ, వాటి కెపాసిటీ పెంచుకోగలరు. కొంత మందిలో మాత్రం (అయిదు శాతం కన్నా తక్కువ) శాశ్వతమైన నష్టం మిగిలిపోతుంది (ఫైబ్రోసిస్). అలాంటి కొందరికి మాత్రం దీర్ఘకాలికంగా ప్రాణవాయువు అవసరం ఉండ వచ్చు.

*దగ్గు: కోవిడ్ వల్ల కలిగే దగ్గు కొందరికి నెల రోజుల వరకు కూడా కొద్ధి కొద్ది గా బాధించే అవకాశం ఉంది. పొడి దగ్గు ఉన్నంత వరకు, పెద్దగా కంగారు పడనవసరం లేదు. జ్వరం ఏమీ లేకుండా, ఆక్సిజన్ సరిపడా ఉంటే, హార్ట్ రేట్ నార్మల్ గా ఉంటే, కేవలం దగ్గు తగ్గడానికి ఒక టాబ్లెట్ గానీ, టానిక్ గాని తాగితే సరిపోతుంది.

*ఒళ్ళు నొప్పులు, నీరసం: చాలా రోజులు నడవకుండా ఉండడం వల్ల, అంత కన్నా ముఖ్యంగా కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్లనే, చాలా మంది నీరసం, ఒళ్ళు నొప్పులు, బలహీనతగా ఉంటుందని చెబుతున్నారు. వారు, మెల్లి మెల్లిగా తమ దినచర్యలతో మొదలు పెట్టి, (graded physical activity) శరీరానికి వ్యాయామం అలవాటు చేయాలి. ఒకే సారి ఎక్కువ పని చేసి, ఇబ్బంది పడకూడదు.

*వాసన, రుచి తెలియక పోవడం: వాసన, రుచి, తెలియకపోవడం వంటి, చిన్న చిన్న లక్షణాలు, ఒక నెల రోజుల్లో మెల్లిగా తగ్గిపోతాయి. వాటి కోసం ప్రత్యేకంగా ఏమి చేయడం అవసరం ఉండదు. కాబట్టి కంగారు పడకూడదు.

*బ్లాక్ ఫంగస్ భయం: కోవిడ్ వచ్చి కోలుకున్న వారిని భయపెట్టిస్తున్న మరొక సమస్య మ్యూకర్ మైకోసిస్. (mucormycosis). కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో, ముఖ్యంగా మధుమేహం ఉన్న వారిలో, షుగర్ అదుపులో లేని వారిలో, లేక అధిక మోతాదులో స్టీరోయిడ్స్ వాడిన వారిలో, కన్ను/ కళ్ళు వాపు రావడం, ముక్కు దిబ్బడగా ఉండడం, ముక్కు నుండి రక్తం రావడం, మొహం ఒక వైపు వాపు, లేదా నొప్పి కలగడం, ఒక పక్క తల నొప్పి, పన్ను నొప్పి, పన్ను ఊడిపోవడం, నోట్లో లేదా ముక్కులో నల్లగా మచ్చ లాగా అవ్వడం, మొదలగు లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను కలవాలి. ఇది ప్రాణాంతక జబ్బు. ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకూడదు.

*దీర్ఘ కాలిక జబ్బులు: కొందరిలో కోవిడ్ వచ్చి తగ్గినాక కూడా, రక్తంలో షుగర్ ఎక్కువగా ఉంటూ, పూర్తి స్థాయిలో మధుమేహం వస్తుంది. తరుచూ షుగర్ చెక్ చేసుకొని, అధికంగా ఉంటే, వైద్యులను సంప్రదించి మధుమేహంకి చికిత్స మొదలు పెట్టడం మంచిది. అలాగే కొందరిలో, కోవిడ్ వచ్చి తగ్గినాక, అధిక రక్తపోటు నమోదవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని, బీ.పీ చెక్ చేసుకుంటూ, అవసరమైతే, మందులు వాడటం మేలు. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు.

*వాక్సినేషన్: వాక్సిన్ తీసుకోకుండా కోవిడ్ వచ్చి తగ్గిన వారు, లేదా, ఒక డోస్ వాక్సిన్ తీసుకున్నాక కోవిడ్ వచ్చిన వారు, మూడు నెలల తరువాత వాక్సిన్ తీసుకోవాలి. వాక్సిన్ తీసుకున్నాక కూడా కోవిడ్ వచ్చే అవకాశం లేకపోలేదు అనే నిజాన్ని గ్రహించి, మాస్క్ పెట్టుకోవడం, సామాజిక దూరం పాటిస్తే, సానిటైజర్ వాడడం వంటి అలవాట్లు కొనసాగించాలి. వాక్సినేషన్ లో జరుగుతున్న ఆలస్యం వల్ల, ప్రజలలో లోపిస్తున్న జాగ్రత్త వల్ల, మూడవ దశ తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి ఆరోగ్యాన్ని వారే పరిరక్షించుకుంటూ, ఇబ్బంది పడే అవసరం రాకుండా చూసుకోవాలి.

✍️డా. ప్రతిభా లక్ష్మీ

30/06/2021

MUST READ:

🌅VITAMIN D DEFICIENCY IN INDIA🌅
-------------------------------------------------------------

We all know that the main source of Vit D is Sunlight. So, we do not expect Vit D Deficiency in a tropical country like India. But many studies say that, upto 80% of Indians are Vit D deficient..

Let us now, try to know the reasons behind the Vit D deficiency in India.

Requirements to have sufficient Vit D levels in body are:

--> Exposure of skin to sunlight regularly, preferably between 10am and 3pm.

--> Healthy GIT for absorption of Vit D from dietary sources Vit D like fish, cod liver oil, egg yolk and mushroom(only vegetarian diet) etc.

--> Healthy liver for 1st step in metabolism of Vit D

--> Healthy kidney for metabolism of Vit D to form active form of Vit D i.e Vit D3.

Limitations to the requirements:

--> People of High socioeconomic status, particularly females, do not come out in sun without sunscreen or any protection over skin, for the fear of skin tan etc.

--> Women who cover their whole body due to religious reasons, are not exposed to sun.

--> People who are obese have high subcutaneous adipose tissue which limits Vit D absorption from skin.

--> Vegetarian food habits are common in Indians, which is a major reason for low dietary intake of Vit D.

--> Alcohol consumption is high in people in India irrespective of their socio economic status which gradually effects the liver functioning, and indirectly effects metabolism of Vit D to its active form.

--> Diabetes is Endemic in India, and is the leading cause of kidney failure. And, there are other tropical diseases also effecting the kidney functioning. Reduced Kidney functioning again hampers metabolism of Vit D to the active form.

--> People of low socio economic status do not know the importance of taking a balanced diet and diet with sufficient Vit D like fish, egg yolk, cod liver oil, mushroom etc..

In view of all these reasons, Vit D deficiency is very prevalent in India though it is a tropical country with sufficient sun light.

As the correction of the reasons is not so easy, it is advisable to at least take supplements of Vit D3 as prescribed by the physician so that people do not face the various consequences of Vit D3 deficiency..

❤️✍️Dr. Pratibha Lakshmi

Take precautions.. Save lifes!!
24/04/2021

Take precautions.. Save lifes!!

12/04/2021

కొత్త ఏడాది,
వచ్చింది కానీ.,
మారింది ఏది,
కేవలం తేదీ..!!

కోవిడ్ నియంత్రణ బాధ్యత ఏది,
మాస్క్ పెట్టకపోతే శిక్షలు వేసే పద్దతి,
గుంపులుగా తిరిగితే తప్పదు అధోగతి,
సానిటైజర్ సీసానే నమ్ముకున్న పరిస్థితి..!!

కుటుంబ సభ్యుల భవితను కాంక్షించి,
సమూహాలు సంబరాలు కొన్నాళ్ళు విడిచి,
మనోధైర్యంతో ముందుకు నడిచి,
ఈ ఏడాది చూపించాలి కోవిడ్ మీద గెలిచి.!!

షడ్రుచుల సంగమమే జీవితమని తెలిసి,
గత ఏడాది చేదు అనుభవాలను మరచి,
ఈ సంవత్సరం తీపిని ఇవ్వాలని ఆశించి,
సర్వేజనా సుఖినో భవంతు అందాం అంతా కలిసి.!!

ప్రభుత్వ సలహాలు పాటించాలని వినతి,
అప్పుడే చూడగలం జీవితాలలో ప్రగతి,
వాక్సిన్ వేసుకుంటే రాదనేది భ్రాంతి,
కానీ, ప్రాణాపాయం మాత్రం ఉండదని ఖ్యాతి.!!

జాగ్రత్తలను మన జీవన శైలిగా మలిచి,
చేసుకుందాం ఈ ఏడాదిని ఒక మధుర స్మృతి.,
వీక్షిద్దాం నవ వసంతపు నవోదయ క్రాంతి,
"ప్లవ" నామ సంవత్సర ఉషోదయ కాంతి..!!

✍🏼డా. ప్రతిభా లక్ష్మీ

Today's article in Eenadu Vasundhara!!
09/04/2021

Today's article in Eenadu Vasundhara!!

07/04/2021

Stop convincing yourself that the mild symptoms which u have are not due to Covid. The wave is fast, peak is high. Get tested and stop transmission.. stay safe.. Do not go out unless it's necessary..

Address

Near Mutyalamma Temple Arch, Near Santosh Matha Temple, Picket
Secunderabad
500026

Opening Hours

Monday 5pm - 8pm
Tuesday 5pm - 8pm
Wednesday 5pm - 8pm
Thursday 5pm - 8pm
Friday 5pm - 8pm
Saturday 5pm - 8pm

Telephone

+919885315750

Website

Alerts

Be the first to know and let us send you an email when Pratibha Speciality Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Pratibha Speciality Clinic:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram