
25/07/2025
ోగం
ధనం మూలం ఇదం జగత్ " అంటారు పెద్దలు .
అవును మరి… డబ్బు ఉంటేనే సక్సెస్.
డబ్బు ఉంటేనే సంఘంలో గౌరవం.
డబ్బు ఉంటేనే మనిషికి విలువ.
ధనం లేకపోతే… మనం ఏదీ చెయ్యలేం. అన్నింటికీ డబ్బే ముఖ్యం.
డబ్బు సంపాదించాలన్న ..
సంపాదించిన డబ్బును కాపాడుకోవాలన్న మనిషికి అదృష్టం కచ్చితంగా ఉండాలంటుంది జ్యోతిష్య శాస్త్రం.
జన్మ కుండలిలో
లగ్న,ధన,పంచమ,భాగ్య మరియు లాభాధిపతుల స్థితిని బట్టి ధన యోగం ఏర్పడుతుంది.
2వ , 5వ, 9వ మరియు 11వ గృహాలు తమ తమ అధిపతులతో కలిసి ఉంటే, ఏర్పడే యోగం ధనయోగం అంటారు.
ఈ యోగం ఒక వ్యక్తి యొక్క సంపద, సంపాదన మరియు శ్రేయస్సుకు మూలం.
మొదటి గృహాన్ని లగ్నం అంటారు. ఇది ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఆశయాలను తెలియజేస్తుంది.
రెండో గృహం ధన స్థానము సంపదకు ముఖ్య స్థానం , కూడబెట్టిన సంపదను సూచిస్తుంది. 5వ గృహం అదృష్ట స్థానం ఊహాజనిత లాభాలను సూచిస్తుంది, 9వ గృహం భాగ్య స్థానం అదృష్టాన్ని మరియు ఆశీర్వాదాలను సూచిస్తుంది అకస్మాత్తుగా, ఉన్నపళంగా లాభాలు వచ్చేలా చేస్తుంది, 11వ గృహం లాభ స్థానము సంపద ప్రవహించేలా చేస్తుందని పండితులు చెబుతున్నారు.
ధన యోగం కలిగించే కొన్ని గ్రహ కలయికలు
గురువు అభివృద్ధి మరియు శ్రేయస్సుకు కారకుడు.గురువు 2 వ, 5 వ, 9 వ లేదా 11 వ ఇంట్లో బలంగా ఉన్నప్పుడు, అది శక్తివంతమైన ధన యోగాన్ని ఇస్తుంది
శుక్రుడు భోగం మరియు విలాసాలకు, అందం మరియు భాహ్య సుఖాలకు సంబంధం ఉన్న గ్రహం.
ఇది గురువు తో సంయోగం లేదా ప్రయోజనకరమైన అంశాన్ని ఏర్పరుచుకున్నప్పుడు, కలయిక సంపదను పెంచుతుంది.
బుధుడు వ్యాపారం, తెలివి మరియు కమ్యూనికేషన్ యొక్క గ్రహం, ఇది బృహస్పతి లేదా శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఆర్థిక లాభాలకు దోహదం చేస్తుంది. 2వ, 5వ, 9వ, లేదా 11వ ఇంటితో దాని అనుబంధం ధన యోగాన్ని బలపరుస్తుంది.
మల్లారెడ్డి కొమ్మిడి
Astrologer & Spirtual healer