Mgm hospitals srikalahasti

Mgm hospitals srikalahasti Mgm hospitals where good health meets people

01/05/2026
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ‘మీ ఇంటికి - మీ డాక్టర్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్ --...
27/03/2026

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ‘మీ ఇంటికి - మీ డాక్టర్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్ --ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన "మీ ఇంటికి - మీ డాక్టర్" కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్, ఐ.ఏ.ఎస్ గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 'మీ ఇంటికి - మీ డాక్టర్' కార్యక్రమానికి ఎంపికైన డాక్టర్ దేదీప్యను మరియు ఇతర సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమ ప్రారంభోత్సవం అనంతరం కలెక్టర్ గారు నూతనంగా ఏర్పాటైన బ్లడ్ స్టోరేజ్ బ్యాంక్ (రక్త నిల్వ కేంద్రం)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. గత అక్టోబర్ నెలలో ఈ నూతన కార్యవర్గం ఏర్పాటైనప్పటి నుండి, గతంలో కంటే వేగంగా మరియు చురుకుగా ప్రజా ఉపయోగకరమైన అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.
అనంతరం కలెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్ గారు మాట్లాడుతూ.. నూతన బ్లడ్ బ్యాంక్ మరియు రెడ్ క్రాస్ కార్యకలాపాలను కేవలం నగరానికే పరిమితం చేయకుండా, జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని కార్యవర్గాన్ని కోరారు. జిల్లా ప్రజలందరికీ ఈ సేవలు చేరువయ్యేలా చూడాలని సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టే ఇటువంటి మంచి కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరపున తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
సమిష్టి కృషితోనే మంచి కార్యక్రమాలు: వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ గారు మాట్లాడుతూ.. "ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒక సేవా దృక్పథంతో పనిచేస్తుందని, ఇందులో ఉండే ప్రతి సభ్యుడు ఏదో ఒక రకంగా సమాజానికి ఉపయోగపడుతున్నారని" అన్నారు. అలాగే నూతన కార్యవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఒక్క సభ్యుడు మరియు లైఫ్ మెంబర్లందరి కృషితోనే ఈరోజు బ్లడ్ బ్యాంక్, 'మీ ఇంటికి - మీ డాక్టర్' లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టగలిగామని ఆయన తెలియజేశారు.
పాల్గొన్న ముఖ్య అతిథులు మరియు కార్యవర్గ సభ్యులు:
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా చైర్మన్ డాక్టర్ డి. శ్రీహరి రావు గారు, వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ గారు, సెక్రటరీ శ్రీ జి. ప్రతీత్ గారు, ట్రెజరర్ శ్రీ జి. వి. సుబ్బారావు గార్లు పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు శ్రీ మణి శ్రీనివాస్, శ్రీ కృష్ణ కుమార్, శ్రీ సుధీర్, శ్రీ శివకుమార్, శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్రీ గుణశేఖర్, శ్రీ రవి గార్లు మరియు తదితరులు పాల్గొన్నారు.

HAPPY UGADI 2026
19/03/2026

HAPPY UGADI 2026

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో 5K వాకథాన్​ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్...
04/02/2026

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో 5K వాకథాన్

​ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (తిరుపతి జిల్లా) మరియు టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ సంయుక్తంగా 5K వాకథాన్‌ను నిర్వహించారు. ఈ ర్యాలీ ఇందిరా మైదానం నుండి ప్రారంభమై గాంధీ రోడ్ మీదుగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వరకు సాగింది.
​ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ (IAS) గారు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి వాకథాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని, దురలవాట్లకు దూరంగా ఉంటే క్యాన్సర్ దరిచేరదని తెలిపారు. ఒకవేళ క్యాన్సర్ వచ్చినా, ప్రాథమిక దశలోనే గుర్తించి (early screening) చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుందని తెలియజేశారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా బృందాన్ని మరియు టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ వారిని ఆయన అభినందించారు.
​అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వై.డి. రామారావు గారు మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా కార్యవర్గం ఏర్పడిన మూడు నెలల్లోనే బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ తెచ్చుకోవడం శుభపరిణామమని, త్వరలో గవర్నర్ గారి అపాయింట్‌మెంట్ తీసుకుని బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామని తెలిపారు.
​ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి టాటా కేర్ ఫౌండేషన్ డైరెక్టర్ ప్రశాంత్ గారు మాట్లాడుతూ.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, క్యాన్సర్‌కి భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు అవగాహన కల్పించారు.
​అనంతరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వద్ద వాకథాన్‌లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమ విజయవంతానికి కారణమైన వారందరినీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వై.డి. రామారావు గారు సన్మానించారు.
​ఈ సందర్భంగా డాక్టర్ మయూర్ గుడ్లూరు మాట్లాడుతూ.. ఇటువంటి మంచి అవగాహన కార్యక్రమంలో భాగస్వామినవ్వడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో తన పాత ఎం.జి.ఎం (MGM) విద్యార్థులను కలుసుకోవడం, వారు ప్రస్తుతం డాక్టర్లుగా పనిచేస్తున్నారని తెలుసుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
​ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DMHO) డాక్టర్ బాలకృష్ణ నాయక్ గారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా చైర్మన్ దగ్గుమాటి శ్రీహరి రావు, వైస్ చైర్మన్ డాక్టర్ మయూర్ గుడ్లూరు, ఇతర కార్యవర్గ సభ్యులు, టాటా కేర్ ఫౌండేషన్ డాక్టర్లు, తిరుపతి ప్రజలు మరియు పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

26/01/2026
MGM హాస్పిటల్ లో ఘనంగా రథ సప్తమి వేడుకలు.   రథ సప్తమి పండుగ సందర్భంగా  శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ నందు ఆదివారం వేద పండ...
25/01/2026

MGM హాస్పిటల్ లో ఘనంగా రథ సప్తమి వేడుకలు.

రథ సప్తమి పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ నందు ఆదివారం వేద పండితులతో శాశ్రోక్తంగా డైరెక్టర్ గుడ్లూరు మయూర్ ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ రథ సప్తమి వేడుకల్లో డైరెక్టర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సూర్య భగవానుని ప్రార్థించానని తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి ప్రజల ఆరోగ్య దృష్ట్యా MGM హాస్పిటల్స్ స్థాపించామని అందరూ సద్వినియోగ పరచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో MGM హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ వివేక్ చైతన్య గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

MGM హాస్పిటల్స్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం.    శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామంలో శ్రీకాళహ...
19/12/2025

MGM హాస్పిటల్స్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం.

శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామంలో శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తం గా శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో దాదాపు 150 మంది అక్కుర్తి గ్రామ మహిళలు మరియు ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న 9,10 వ తరగతి విద్యార్ధినులు పాల్గొని వారికి సంబంధించిన స్త్రీ సంబంధిత, ఋతు క్రమ సమయంలో వారు ఎదుర్కొనే సమస్యలు మరియు పరిశుభ్రత పాటించాలి అనే విషయంపై MGM హాస్పిటల్స్ డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. ఈ వైద్య శిబిరానికి విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సహాయ సహకారాలు అందించి వైద్య శిబిరం విజయవంతం కావడానికి ప్రత్యేక శ్రద్ద చూపించారు. అలాగే MGM హాస్పిటల్స్ డైరెక్టర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి మరియు చుట్టుప్రక్క గ్రామాల ప్రజల ఆరోగ్యం కోసం MGM హాస్పిటల్స్ స్థాపించామని ప్రజలు సద్వినియోగ పరచుకొనగలరని తెలిపారు. ఈ శిబిరం లో MGM హాస్పిటల్స్ స్త్రీ సంబంధిత వైద్యురాలు డాక్టర్ లు శ్రీమతి లక్ష్మి ప్రసన్న గారు మరియు చిన్నపిల్లల సంబంధిత వైద్యులు డాక్టర్ ఉమా మహేశ్వర్ రావు గార్లు మరియు MGM హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

MGM హాస్పిటల్స్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆరోగ్య అవగాహనా సదస్సులు. శ్రీకాళహస్తి ఆక్సి్ఫర్డ్ డిగ్రీ కాలేజీ...
22/11/2025

MGM హాస్పిటల్స్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆరోగ్య అవగాహనా సదస్సులు.

శ్రీకాళహస్తి ఆక్సి్ఫర్డ్ డిగ్రీ కాలేజీ విద్యార్ధినులకు శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్త్రీ సంబంధిత ఆరోగ్య అవగాహనా సదస్సులను నిర్వహించారు. MGM హాస్పిటల్స్ స్త్రీ సంబంధిత వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీమతి లక్ష్మి ప్రసన్న గారు విద్యార్ధినులకు ఋతుక్రమ సమయంలో అవసరమగు జాగ్రతలు మరియు తీసుకోవలసిన శుభ్రతా విధానాలను గురించి వివరంగా తెలియ జేశారు. ప్రతీ విషయంలోనూ అమ్మాయిలు తగు నియమాలను పాటిస్తూ ఆరోగ్యం గా ఉండాలని తెలిపారు.MGM హాస్పిటల్స్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఉమా మహేశ్వర్ రావు గారు క్యాన్సర్ సంబంధిత వాక్సిన్ లు తగు సమయంలో వేసుకుంటూ ఆరోగ్యం గా ఉండాలని తెలిపారు. అలాగే విద్యార్ధినులు అడిగిన ప్రతీ సందేహాలకు వివరంగా విశదీకరించారు. ఈ సదస్సులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ మయూర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రతీ జూనియర్ కాలేజీ మరియు డిగ్రీ కాలేజీ లలో నిర్వహించి విద్యార్ధినులకు అవగాహన కల్పించడమే MGM హాస్పిటల్స్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న MGM హాస్పిటల్స్ డైరెక్టర్ గారికి ఆక్సిఫోర్డ్ డిగ్రీ కాలజీ కరెస్పాండంట్ మధుసూదనరెడ్డి గారు ధన్యవాదములు తెలిపారు.

Address

Mgm Hospitals Circle
Srikalahasti
517644

Alerts

Be the first to know and let us send you an email when Mgm hospitals srikalahasti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mgm hospitals srikalahasti:

Share

Category