10/07/2025
#గురుగ్రహ దోషాలు తొలగి గురుబలం కలగాలంటే హయగ్రీవ స్వామిని ఆరాధించాలి*
#జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.
#భక్తి బావనలు, ఉన్నత విద్య, విదేశి విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి. గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు_
#సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.
#సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు.
#హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది..
#జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం,
హయగ్రీవ ముపాస్మహే
#జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు.
నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము..🙏
#హయగ్రీవుని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి.
#విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది.
#పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది...
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
#ఐశ్వర్యాలు ప్రసాదించే శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం...!!
#హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం
నరం ముచ్చంతి పాపాని దరి,ద్ర్యమివ యోషితః...!!
#హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్...!!
#హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః...!!
#శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం
వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం...!!🙏💐
#ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః🙏
#భావము :
#హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగుతుంది.
#హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చదువు వస్తుంది. అంటే సర్వవిద్యలూ వస్తాయన్నమాట.
#హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. అంటే వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది.
#హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు శ్లోకములు దివ్యమైనవి. ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి.
#జ్ఞానానికి ప్రతీకగా ప్రాదుర్భవించిన హయగ్రీవమూర్తి స్తుతి చేసినవారికి సర్వవిద్యాబుద్ధులూ లభిస్తాయి.
#విద్య ఉన్నచోట అడగకుండానే అష్టలక్ష్ములూ కొలువై ఉంటారు. అంటే మానవజీవితానికి సర్వసుఖాలు అందినట్లే.
#హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమినాడైనా హయగ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానం, సకల సంపదలు చేరువ అవుతాయి.
# పిల్లలు నిత్యం హయగ్రీవ స్తుతి చేస్తుంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు. చక్కని సత్ఫలితాలు తథ్యం.
#మంత్రశాస్త్రం ఏం చెబుతోందంటే
#ఉపాసనాపరంగా మానవ, జంతు ఆకృతులు కలగలిసిన దేవతలు శీఘ్ర అనుగ్రహప్రదాతలు. అటువంటి దైవాల్లో శ్రీ హయగ్రీవ స్వామివారు ఒకరు.
#శ్రీ హయగ్రీవస్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వవిద్యలూ కరతలామలకమవడమే కాక, సర్వ సంపదలు లభించడం తథ్యం.
# విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం!
విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షమ్!
దయానిధిం దేవభృతాం శరణ్యం!
దేవం హయగ్రీవమహం ప్రపద్యే..!!
(సేకరణ)
#సర్వేజనా సుఖినోభావంత్🙏
#అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు