11/03/2026
సంస్కృత విశ్వ విద్యాలయంలోని విద్యార్థుల సమస్యలు పై నిర్లక్ష్యం వీడాలి.- SFI
సంస్కృత విశ్వావిద్యాలయం విద్యార్థుల హాస్టల్ సమస్యలు పట్ల తీవ్ర నిర్లక్ష్యం నిన్న వందలాది మంది విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేయడం ద్వారా బయట పడింది అని ఈ సమస్యలు పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాంమోహన్, ప్రసన్న కుమార్ లు డిమాండ్ చేశారు.
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం హాస్టళ్లలో తీవ్రమైన నీటి కొరత నెలకొనడం, విద్యార్థులకు అందిస్తున్న చపాతి, పుల్కా, వైట్ రైస్ మరియు కర్రీల నాణ్యత చాలా దారుణంగా ఉండడం అత్యంత దారుణమైన విషయం అని వారు పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చిన రెండువేల మంది విద్యార్థులకు కనీస వసతులు కూడా అందించలేకపోవడం విశ్వవిద్యాలయ పరిపాలన వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోందని అన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల నిర్వహణకు ఇస్తున్న ప్రాధాన్యత విద్యార్థుల సమస్యలను పరిష్కారానికి ఉపకులపతి ఇవ్వకపోవడం చాలా దారుణమైన విషయమని పేర్కొన్నారు.
హాస్టల్ విద్యార్థులకు తగినంత తాగునీరు, పరిశుభ్రమైన వసతి, నాణ్యమైన ఆహారం అందించడం యూనివర్సిటీ పరిపాలన యొక్క ప్రాథమిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఆహారం ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుందని తెలిపారు.
విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ మరియు యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోతే అని విద్యార్థి సంఘాలు తో కలుపుకోని మరింత విస్తృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం అని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.