Psychology

Psychology A place for people with Autism and their family and friends to meet and discuss autism, Aspergers an

Hello   హరి రాఘవ్ స్కూల్ ఆఫ్ ఎక్సిస్టెన్షలిజం వారు నిర్వహిస్తున్న   at kurnool  తేదీని december 8,2024 నిర్ణయించటం జరిగి...
23/11/2024

Hello

హరి రాఘవ్ స్కూల్ ఆఫ్ ఎక్సిస్టెన్షలిజం వారు నిర్వహిస్తున్న at kurnool తేదీని december 8,2024 నిర్ణయించటం జరిగింది. ఈ ప్రోగ్రాం : St .Joseph Degree and PG College Kurnool లో జరగబోతుంది. ప్రోగ్రాం మధ్యహ్నం 1గం. నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ASK HR లో clients & participants అడిగే ప్రశ్నలకు హరిరాఘవ్ గారు సమాధానాలు చెబుతారు. ఈ ప్రోగ్రాం attend అవ్వటానికి ఎటువంటి ప్రవేశ రుసుం లేదు. Meet HR పాల్గొనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు Sunanda Bulusu గారి నెంబర్ 8019575422 కి వాట్సాప్ లో మెసేజ్ చేయగలరు.

Thankyou.

  వీడియోలు చూసినాక చాలా యూట్యూబ్ ఛానల్ వారు వారి ఛానల్ కి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిందిగా పదే పదే అడుగుతున్నారు. దాదాపుగ...
27/10/2024

వీడియోలు చూసినాక చాలా యూట్యూబ్ ఛానల్ వారు వారి ఛానల్ కి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిందిగా పదే పదే అడుగుతున్నారు. దాదాపుగా 6 సంవత్సరాల క్రితమే ఇతర యూట్యూబ్ చాన్నెళ్లకు, ఎలక్ట్రానిక్ మీడియా చాన్నెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేశాను. అందుకు కారణం వారు ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టడం వలన నా క్లయింట్లకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి.

దాదాపు 6 సంవత్సరాల క్రితం టీనేజ్ ఆడపిల్లలలో శారీరకంగా వచ్చే మార్పులు, సైకాలజికల్ ప్రభావం గురించి ఇచ్చిన ఇంటర్వ్యూ కి వారు 'ఆడపిల్లలలో కోర్కెలు ఎలా ఉంటాయో తెలుసా?' అంటూ థంబ్నైల్ పెట్టారు. వారిని అప్పటికి హెచ్చరించి మార్పించినప్పటికీ తరువాత నా పాత ఇంటర్వ్యూ వీడియోలను పిచ్చి పిచ్చి థంబ్నైల్స్ పెట్టి రీచ్ పెంచుకునే ప్రయత్నం చేశారు.

అప్పటి నుండి కేవలం హరి రాఘవ్ యూట్యూబ్ ఛానల్ కి మాత్రమే ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల ఒక దగ్గరి మిత్రుడు కోరిక మేరకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పటికీ వారిని ఫేక్ థంబ్నైల్ పెట్టవద్దని హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కొంత కాలం తరువాత ఆ వీడియోని ముక్కలుగా కత్తిరించి నా మాటలు వక్రీకరించి పెట్టారు. దానితో విసిగి పోయాను.

ఇక అనేది కేవలం నా క్లయింట్స్ కొరకు ప్రారంభించ బడినది. దానిలో హేట్ స్పీచులు, సెన్సేషన్ కామెట్లు, ఫేక్ థంబ్నైల్స్ ఉండవు. క్యాచీ థంబ్నైల్స్ ఉండవచ్చు కానీ ప్రేక్షకులను మిస్లీడ్ చెయ్యడం జరగదు. ఇక ఎవరికయినా నా ఇంటర్వ్యూలు కావాలంటే చక్కగా మా ఛానల్లో షూట్ చేసుకోవచ్చు. కానీ మొదట లో లోడ్ చేసిన తరువాత మాత్రమే మీ ఛానల్లో లోడ్ చేసుకోవాలి. దాని వలన ఆ వీడియోల పూర్తి కంట్రోల్ మావద్దనే ఉంటాయి. అలాగే ఎవరికయినా వీడియోలో కనిపించి నాతో చర్చించాలని ఉన్నా తప్పకుండా చర్చల్లో పాల్గొనవచ్చు. ధన్యవాదాలు.

27.10.2024

https://www.youtube.com/

        ఆ రోజు రాత్రి ఎలాగైనా చనిపోవాలి గట్టిగా నిర్ణయించుకుని మేడ మీదికి వెళ్ళాను. సన్నని చినుకులు పడుతున్నాయి. తల తడుస...
25/10/2024



ఆ రోజు రాత్రి ఎలాగైనా చనిపోవాలి గట్టిగా నిర్ణయించుకుని మేడ మీదికి వెళ్ళాను. సన్నని చినుకులు పడుతున్నాయి. తల తడుస్తుంది. నాకు తెలుసు ఆ చినుకులు నా కున్న ఆరోగ్య సమస్యను మరింత పెంచుతాయని. చుట్టూ చిమ్మ చీకటి. ప్రకాశం జిల్లా కనిగిరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల పల్లెటూరు మాది. పల్లెటూరు కావడం వల్ల ఎక్కడో దూర దూరంగా ఒకొక్క లైట్ కనిపిస్తున్నాయి. చిన్నప్పటి నుండి అలవాటే అయినా ఎందుకో ఆ రోజు చీకటి భయంకరంగా కనిపించింది.

నేనెందుకు ఇంకా బ్రతికి ఉన్నాను. నా బ్రతుకుకి అర్థం ఏముంది. 40 సంవత్సరాలుగా బాధలు అనుభవిస్తూనే ఉన్నాను. ప్రపంచంలో ఒక్కరన్నా నా భాధను అర్థం చేసుకోలేరా? ఎంతకాలం ఈ ఒంటరితనం. ఎంత కాలం ఈ జైలు జీవితం నాకు? నాకెవరు లేనపుడు నేనేందుకు బ్రతకాలి? బాల్యమంతా భారంగా బాధలతోనే గడిచిపోయింది. వయస్సు వచ్చీ రాగానే పెళ్లి చేసేసారు. వచ్చిన వాడు మూర్ఖత్వానికి ఫలితంగా 3 సంవత్సరాలకే కూతరుని పట్టుకుని పుట్టింటికి రావాల్సి వచ్చింది.

నిజానికి నన్ను అత్తమామలు చాలా అర్థం చేసుకున్నారు అనిపిస్తుంది. కన్న కొడుకుకి సపోర్ట్ చేస్తూ కోడలిని బానిస లాగ పడుండమని చెప్పే తల్లిదండ్రులున్న ఈ రోజులలో నా కొడుకు మంచి వాడు కాదు నీ జీవితం నువ్వు చూసుకోమన్నారు. కానీ చదువు లేని ఆడదాన్ని పైగా ఒక ఆడపిల్ల. ఆడపిల్లను తీసుకుని ఎక్కడకు వెళ్ళ గలను. పుట్టింటికే వచ్చాను. అప్పటి నుండి పుట్టింటిలోనే బ్రతుకుతున్నాను. అందరూ మంచి వారే కానీ ఎవరికీ మనసుని అర్థం చేసుకునే సున్నితత్వం లేదు.

నాన్న చదువుకోలేదు. అలాగే ఉంటాడు అని తెలిసినా ఎవరో ఒకరు ఎపుడో ఒకసారి ప్రేమగా పలకరిస్తే బాగుండు అని మనసు కోరుకుంటుంది. ఉదయం లేచిన దగ్గర నుండి పని పని పని... పెద్ద ఇల్లు. పని మనుషులు. కానీ పల్లెటూరిలో బ్రతికే ఆడవారికి పని తప్పదు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే దాకా పని చేస్తూనే ఉండాలి. ఒక రకంగా ఆ పని నన్ను ఒంటరితనం అనుభవించకుండా కాపాడిందేమో. కానీ ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు. కానీ ఎవరూ అర్థం చేసుకోరు. ఎవరినీ ఏమీ అనలేను. అడగలేను.

దానికి తోడు తాజాగా వచ్చిన సమస్య. ఎందుకీ జీవితం అనిపిస్తుంది. నా కూతురు కూడా నన్ను తిరస్కరించడాన్ని భరించలేక పోతున్నాను. ఎందుకు ఇంత శిక్ష నాకు? మానసికంగా అనాధ లాగా బ్రతుకుతున్న నాకు దేవుడు ఎందుకు ఈ శిక్ష వేసాడు. మొన్నటి దాకా నా కూతురే నా జీవితంగా బ్రతికాను. తను నవ్వితే నవ్వాను. తను ఏడిస్తే ఏడ్చాను. కానీ నేడు నా కూతురు కూడా నన్ను అసహ్యించుకుంటుంది. ఇన్నాళ్లూ తను చెన్నై హాస్టల్ నుండి ఇంటికి వస్తుంది అంటే ఎక్కడ లేని ఆనందం వేసేది. కానీ ఇప్పుడు భయంతో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.

ఆ రోజు రాత్రి ఎలాగయినా చనిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎలా చనిపోవాలో అర్థం కావడం లేదు. ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎలా చనిపోవాలి? నిజానికి నాకు చనిపోవాలని లేదు. ఒక్క సారిగా ఏడుపు పొంగుకు వచ్చింది. బోరున ఆ వర్షంలో ఏడ్చేసాను. కళ్ళలోంచి నీరు ధారలుగా కారుతున్నాయి. వర్షం పెద్దదయ్యింది. వర్షం కన్నా నా కళ్ళలో నీరే ఎక్కువగా వస్తుంది. వర్షం నీళ్లు చల్లగా గుచ్చుతుంటే, కన్నీళ్లు వెచ్చగా తాకుతున్నాయి. వెక్కి వెక్కి ఏడ్చాను. ఎంత ఏడ్చినా ఏడుపు ఆగడం లేదు. ఈ ప్రపంచంలో ఎవరూ నా ఏడుపుకి స్పందించరు.

దూరంగా లైట్ వెలుగులో కుక్క పడుకుని ఉంది. వర్షం చినుకులకు ఇబ్బంది ఉందేమో లేచి వరండా లోకి వెళుతుంది. ఆ కుక్కంటే ఈ ఇంట్లో అందరికీ ఇష్టం. నాక్కూడా ఇష్టమే. కానీ ఆ కుక్కకు లభించిన ప్రేమ కూడా నాకు లభించడం లేదు. ఎలా చనిపోవచ్చో ఆలోచిస్తున్నాను. ఇంతలో ఎందుకో మధ్యాహ్నం ప్రక్కింటి మహాలక్ష్మి గారి మాటలు గుర్తొచ్చాయి. వాళ్ళబ్బాయికి అద్దంకి నుండి ఒక సంబంధం వచ్చిందట. కానీ ఆ పిల్లకు తల్లి కానీ, తండ్రి గాని ఎవరూ లేరు. కాన్పులు, ఇతర కార్యక్రమాలన్నీ తమ మీదే పడతాయని వద్దనుకున్నారట.

ఒక్క సారిగా మనస్సులో ఏదో అలజడి. రేపు నేను లేకపోతే నా కూతురిని కూడా అలాగే అనుకుంటారు కదా? భయం వేసింది. రేపు నా కూతురు జీవితం ఏంటని? కానీ నా కూతురే నన్ను దూరం పెడుతుంది. అసహ్యించు కుంటుంది. తన కోసమైనా ఎందుకు బ్రతకాలి? అని ఒక్క క్షణం అనిపించింది. అప్పుడు మీరు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

'మీ కూతురికి మీ మీద ఉన్నది కోపమే తప్ప ద్వేషం కాదు. కొద్ది రోజులకు కోపం తగ్గిపోయే అవకాశాలున్నాయి. అప్పుడు అమ్మా అని పిలిస్తే అందుబాటులో మీరుండాలి. లేకపోతే ఆమె లేత మనస్సు భయపడుతుంది. ఆ భయం జీవితాంతం ఉంటుంది. బ్రతకడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది ఎవరి కోసమన్నా బ్రతకాలి. రెండవది ఎవరూ లేరనుకుని బ్రతకాలి. ఎవరి కోసమైన బ్రతుకు తున్నపుడు స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ తిరిగి ఏమీ ఆశించదు. చివరికి ఎవరి కోసం బ్రతుకుతున్నామో వారి ప్రేమను కూడా తిరిగి ఆశించదు. అలా బ్రతకలేను అనుకున్నపుడు ఎవరూ లేరనుకుని బ్రతకాలి. వ్యక్తికి ఎవరూ లేనపుడు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఎక్కడలేని ధైర్యం సొంతమవుతుంది. సామాజిక బంధనాలను తెంచుకుని బ్రతికినంత కాలం సీతాకోక చిలుకలాగా స్వేచ్ఛగా బ్రతక వచ్చు.'

మీ మాటలు గుర్తొచ్చాయి. ప్రస్తుతానికి నేనే మొదటి తరహా జీవితాన్నే కోరుకుంటున్నాను. రెండవ తరహా జీవితం కోరుకునే ధైర్యం నాకు లేదు. భవిష్యతులో వస్తుందో రాదో తెలియదు. మీ కౌన్సిలింగ్ వల్ల రావచ్చేమో. మీరు చెప్పారు. 'మీ కూతురు బండ బూతులు తిట్టినా అందులో అర్థాన్ని కాకుండా కోపాన్ని చూడండి' అని. నిజమే నా కూతురు నా మీద కోపంతో ఉంది. తనకు నేను కావలి. తన కోసం బ్రతకాలి. నెమ్మదిగా లేచి మేడ మీద నుండి క్రిందికి వెళుతున్నాను. వర్షం కూడా వెలిసింది. కానీ తడి మిగిలింది.

24.10.2019



నవంబర్ 3, 2024 ఆదివారం నాడు హోటల్  #కినారా గ్రాండ్, హబ్సిగూడ, హైదరాబాద్ లో హరి రాఘవ్ స్కూల్ ఆఫ్ ఎగ్జిస్టెన్షలిజం ( ) వార...
25/10/2024

నవంబర్ 3, 2024 ఆదివారం నాడు హోటల్ #కినారా గ్రాండ్, హబ్సిగూడ, హైదరాబాద్ లో హరి రాఘవ్ స్కూల్ ఆఫ్ ఎగ్జిస్టెన్షలిజం ( ) వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న - 6 ప్రోగ్రాంకు ప్రముఖ సైన్స్ ప్రచారకులు, విజ్ఞానదర్శిని వ్యవస్థాపకులు Ramesh Vignana Darshini గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది.

దాదాపుగా 120 మందికి పైన హాజరయ్యే ఈ ప్రోగ్రామ్ ఉదయం 9.30కి మొదలయి సాయంత్రం 4.00 వరకు కొనసాగుతుంది. 9.30 నుండి 12.30 వరకు మొదటి మూడు గంటలు క్లయింట్స్ తమ అనుభవాలను పార్టిసిపెంట్స్ తో పంచుకుంటారు. ఈ మధ్యలో రమేష్ గారి సమయాన్ని బట్టి ఆయన సందేశం ఉంటుంది. 12.30 నుండి 1.30 వరకు లంచ్ బ్రేక్ 1.30 నుండి 4 గంటల వరకు లో భాగంగా పార్టిసిపెంట్లు అడిగిన ప్రశ్నలకు ప్రముఖ ఎగ్జిస్టెన్షల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారితో సమాధానాలు ఇవ్వబడతాయి. పార్టిసిపెంట్లకు బ్రేక్ఫాస్ట్, లంచ్ మరియూ టీ సప్లయ్ చెయ్యబడుతుంది.

ఎంతో విజ్ఞాన దాయకమైన ఈ ప్రోగ్రామ్ ను పార్టిసిపెంట్లు అందరూ సద్వినియోగ పర్చుకోవాలని మనవి. ఇతర వివరాల కోసం Sunanda Bulusu గారిని 80195 75422 నంబరుకు వాట్సాప్ చెయ్యడం ద్వారా తెలుసుకోవచ్చు.

టీమ్,
హరి రాఘవ్ స్కూల్ ఆఫ్ ఎగ్జిస్టెన్షలిజం (HRSE)

సమాజం ఒక బంగారు కడియం పట్టుకున్న ముసలి పులి వంటిది. తాను శాకాహారిగా మారానని, బంగారు కడియం నీకు ఇచ్చి సహాయం చెయ్యదలుచుకున...
24/10/2024

సమాజం ఒక బంగారు కడియం పట్టుకున్న ముసలి పులి వంటిది. తాను శాకాహారిగా మారానని, బంగారు కడియం నీకు ఇచ్చి సహాయం చెయ్యదలుచుకున్నానని నమ్మించి దగ్గరకు వచ్చిన తరువాత నిన్ను చంపుకు తింటుంది. సమాజాన్ని సమాజం చెబుతున్న విధంగా అర్థం చేసుకుంటే ప్రతీ రోజూ ఒక యుద్ధమే. సమాజాన్ని అది ఏర్పడిన విధానాన్ని అనుసరించి లాజికల్ గా అర్థం చేసుకోవాలి. సమాజంలో ఉంటూనే సామజిక నియమాలను పాటిస్తూనే అవసరమైన శ్రద్ద నీ పట్ల నువ్వు తీసుకోవాలి.



సమాజం ఒక బంగారు కడియం పట్టుకున్న ముసలి పులి వంటిది. తాను శాకాహారిగా మారానని, బంగారు కడియం నీకు ఇచ్చి సహాయం చెయ్య...

ఎప్పుడయితే గుడ్ టైం అంటూ ఒకటి ఉంటుంది. అది వస్తుందని ఎదురు చూస్తూ ఉంటామో అప్పటి నుండి నీ బ్యాడ్ టైం మొదలవుతుంది. మంచి ఏక...
23/10/2024

ఎప్పుడయితే గుడ్ టైం అంటూ ఒకటి ఉంటుంది. అది వస్తుందని ఎదురు చూస్తూ ఉంటామో అప్పటి నుండి నీ బ్యాడ్ టైం మొదలవుతుంది. మంచి ఏకాదశి రోజున ఒక మర్డర్ చేసినా నీకు ఫలితం జైలు శిక్షనే. అష్టమి రోజున మంచి పని మొదలెట్టినా మంచి జరిగే అవకాశాలే ఎక్కువ. ఇటువంటి అంశాల గురించి ప్రముఖ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారితో చర్చ.



'అనేక ఫిలోసోఫీలు ఉన్నప్పటికీ  #ఎగ్జిస్టెన్షలిజంనే ఎందుకు సైకో థెరపీగా ఉపయోగిస్తున్నారు?' ఈ ప్రశ్న సహజంగా మేధావుల నుండి ఎ...
21/10/2024

'అనేక ఫిలోసోఫీలు ఉన్నప్పటికీ #ఎగ్జిస్టెన్షలిజంనే ఎందుకు సైకో థెరపీగా ఉపయోగిస్తున్నారు?' ఈ ప్రశ్న సహజంగా మేధావుల నుండి ఎదురవుతుంది. ఎగ్జిస్టెన్షలిజంను ఫిలాసఫీ అనే చట్రంలో బిగించి ఉంచలేము. ఇది ఒక శాస్త్రీయమైన ఆలోచన విధానం. #సైకాలజీలో ఏ విధంగా యితే ప్రతీ వ్యక్తి యూనిక్ అనే సూత్రం మీద విశ్లేషణ జరుగుతుందో అదే విధంగా ఎగ్జిస్టెన్షలిజంలో ప్రతీ సంఘటన భిన్నమైనదిగా భావించి కాంటెస్ట్ తో పాటుగా మారుతూ ఉంటుంది. ఎగ్జిస్టెన్షలిజంకి ఉన్న ఈ ప్రత్యేకత వలన దీనిని సైకో థెరపీగా వాడడం జరుగుతుంది.

నవంబర్ 4, 2024 నుండి ప్రారంభం కానున్న #ఎగ్జిస్టెన్షల్ - 4 ప్రోగ్రాం 20 రోజుల పాటు కొనసాగుతుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు సాయింత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు ఆన్లైన్ లో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. శని, ఆది వారాలు మరియూ జాతీయ సెలవు దినాల నాడు ఈ ప్రోగ్రాం ఉండదు. ఈ ప్రోగ్రాంకు హాజరవ్వాలనుకున్న వారిలో క్లయింట్లకు మొదటి ప్రాధాన్యత తరువాత సైకాలజీ అధ్యయనం చేసిన వారికి ఇవ్వబడుతుంది. ఇతరులు కూడా ఈ ప్రోగ్రాం హాజరు కావచ్చు.

ఈ ప్రోగ్రాం పూర్తిగా ఎగ్జిస్టెన్షల్ ఫిలాసఫీ గురించి ఉంటుంది. కొందరు దీనిని ఎగ్జిస్టెన్షల్ థెరపీతో పొరబడుతున్నారు. కానీ ఇది థెరపతిటిక్ పద్దతిలో కొనసాగదని గమనించ గలరు. థెరపీ బదులుగా ఈ ప్రోగ్రాం హాజరయితే సరిపోదు. కానీ థెరపీ తీసుకునే వారికి ఈ ప్రోగ్రాం చాల హెల్ప్ అవుతుంది. మరి కొందరు అకాడమిక్ అప్ప్రోచ్ గా భావిస్తున్నారు. ఈ ప్రోగ్రాం అకాడమిక్ అప్రోచ్ కూడా ఉండదు. ఈ ప్రోగ్రాం పరీక్షలు రాయడానికి ఉద్దేశించినది కాదు. కానీ అకాడెమికల్లీ ఫిలాసఫీ చదివేవారికి కూడా ఉపయోగ పడుతుంది.

ఈ ప్రోగ్రాం పూర్తిగా అప్లైడ్ మోడ్ లో కొనసాగుతుంది. ఎగ్జిస్టెన్షలిజంని నిత్య జీవితంలో వినియోగించడానికి ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడినది. అందుకు అవసరమైన మేరకు ప్రాధాన్యతను ఇవ్వబడుతుంది. ప్రతీ రోజూ మొదటి గంట లెక్చర్ రెండవ గంట చర్చ కొనసాగుతుంది. మధ్యలో 5 నిమిషాల విరామం ఉంటుంది. పూర్తి వివరాలు హాజరయ్యే సభ్యులకు తెలియజేయ బడతాయి.

ఈ ప్రోగ్రాంలో , , , , , , , , వంటి అంశాలతో పాటు ఇతర అంశాలు కూడా చర్చించబడతాయి. పై అంశాలను జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవచ్చో ఈ ప్రోగ్రాంలో చర్చించ బడతాయి. ఇప్పటికే చాలా మంది ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది. ఇతర వివరాలకు 9246165165 నెంబర్ కు వాట్సాప్ చెయ్యడం ద్వారా తెలుసుకోవచ్చు.

14.10.2024

ప్రకృతిలో వితంతువులు, పుణ్యస్త్రీలు అంటూ ఎవరూ ఉండరు. ఉండేదల్లా కేవలం స్త్రీలు, పురుషులు మాత్రమే. పూర్వకాలపు మూఢ విశ్వాసా...
19/10/2024

ప్రకృతిలో వితంతువులు, పుణ్యస్త్రీలు అంటూ ఎవరూ ఉండరు. ఉండేదల్లా కేవలం స్త్రీలు, పురుషులు మాత్రమే. పూర్వకాలపు మూఢ విశ్వాసాలను ఇప్పటికీ అనేక చోట్ల నమ్ముతున్నారు. వితంతువులు ఎదురువస్తే తిట్టుకుంటూ పోవడం వంటివి అనేకం ఇప్పటికీ చూస్తున్నాం. అసలు ఈ విశ్వాసాలు ఎందుకు ఏర్పడ్డాయి అనే అంశం పైన ప్రముఖ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారితో చర్చ.



ప్రకృతిలో వితంతువులు, పుణ్యస్త్రీలు అంటూ ఎవరూ ఉండరు. ఉండేదల్లా కేవలం స్త్రీలు, పురుషులు మాత్రమే. పూర్వకాలపు మూ.....

  with Clients, 2024 హాజరు కదలచిన వారు రిజిస్ట్రేషన్ కొరకు చివరి తేది ఈ నెల 20గా నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే అనేక మంద...
18/10/2024

with Clients, 2024 హాజరు కదలచిన వారు రిజిస్ట్రేషన్ కొరకు చివరి తేది ఈ నెల 20గా నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే అనేక మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా హాజరు కాదలచుకుంటే వెంటనే రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఏర్పాట్లకు సమయం దొరుకుతుంది. చివరి నిమిషంలో రిజిస్టర్ చేసుకోవడం కుదరదని గ్రహించగలరు.

'హరి రాఘవ్ స్కూల్ ఆఫ్ ఎగ్జిస్టెన్షలిజం' ( ) వారు నిర్వహించబోతున్న with Clients, 2024 తేదీని నవంబర్ 3, 2024, వేదికగా హోటల్ #కినార గ్రాండ్, హబ్సిగూడను నిర్ణయించడం జరిగింది. ఈ మీటింగ్ ఉదయం 9.30 నుండి సాయింత్రం 3.30 వరకు కొనసాగుతుంది. ఈ మీటింగుకు కేవలం క్లయింట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రాధాన్యత క్రమంగా మొదటి విదేశాల నుండి వస్తున్నవారికి, తరువాత ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారికి, తరువాత ఇతర ప్రాంతాల నుండి వస్తున్నవారికి చివరిగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వారికి ఇవ్వబడుతుంది.

ఈ మీటింగ్ మొదటి మూడు గంటలు క్లయింట్లు తమ అనుభవాలను వివరిస్తారు. లంచ్ తరువాత మూడు గంటల పాటు లో భాగంగా పార్టిసిపెంట్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం లో నాతో పాటుగా మరికొందరు ప్రాక్టీసింగ్ సైకాలజిస్టులు మరియూ సైకాలజీ అధ్యనం చేస్తున్న వారు కూడా పాల్గొంటారు.

కేవలం 120 మందికి మాత్రమే అవకాశం ఉండడం వలన ముందుగా రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. ఈ మీటింగ్ రిజిస్ట్రేషన్ కొరకు Sunanda Bulusu గారిని 80195 75422 నంబరుపై వాట్సాప్ లో సంప్రదించ గలరు. ఈ మీటింగ్ లో 'బ్రేక్ఫాస్ట్, లంచ్ మరియూ టీ' సప్లై చెయ్యబడుతుంది. అందుకు గాను ఖర్చుల నిమ్మిత్తం నిర్వాహకులు ప్రవేశ రుసుమును 750/- రూపాయలుగా నిర్ణయించారు.

14.10.2024

వాస్తవాలు కఠినంగా ఉంటాయి. చేదుగా కూడా ఉంటాయి. కానీ వాస్తవాలను విస్మరిస్తే వాటి వలన వచ్చే పర్యవసానాలను మాత్రం వ్యతిరకంగా ...
18/10/2024

వాస్తవాలు కఠినంగా ఉంటాయి. చేదుగా కూడా ఉంటాయి. కానీ వాస్తవాలను విస్మరిస్తే వాటి వలన వచ్చే పర్యవసానాలను మాత్రం వ్యతిరకంగా ఉంటాయి. జీవితంలో ఏది వాస్తవమో తెలుసుకోడం ఎలా? వాటిని అర్థం చేసుకుని మనల్ని మనం ఎలా మార్చుకోవాలి? ఇటువంటి అంశాల మీద ప్రముఖ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారితో చర్చ.



Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Psychology posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your practice to be the top-listed Clinic?

Share