Seshadri ayurvedic

Seshadri ayurvedic Are you suffering from a lung problem ....
మీరు అస్తమా, సైనస్, డస?

మా పేజీని లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి కృష్ణుడి తలనొప్పికి మందుఒకసారి కృష్ణుడి పుట్టినరోజు నాడు, సంగీతం, నాట్యం ...
10/09/2022

మా పేజీని లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి
కృష్ణుడి తలనొప్పికి మందు

ఒకసారి కృష్ణుడి పుట్టినరోజు నాడు, సంగీతం, నాట్యం ఇంకా బాణసంచాతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలామంది జనం వచ్చారు. కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా, నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు. కానీ, ఆరోజు మాత్రం, ఎందుకనో ఆయన ఇష్టపడటం లేదు.
రుక్మిణి వచ్చి "స్వామి, ఏమైంది మీకు? ఏమిటిది?, ఎందుకని మీరు వేడుకలో పాల్గొనటం లేదు?" అని అడిగింది. “నాకు తల నొప్పిగా ఉంది", అన్నాడు కృష్ణుడు. ఆయనకు నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండొచ్చు కానీ ఆయన నటించడంలో కూడా సమర్ధుడు.

"వైద్యుని పిలిపించండి", అన్నది రుక్మిణి. వైద్యులు వచ్చారు. కృష్ణుడికి ఆ మందు, ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నించారు."ఇవన్నీ నాకు పనిచేయవు", అన్నాడు కృష్ణుడు. "మరి ఇంకేం చేద్దాం", అడిగారు జనం. ఆపాటికి చాలా మంది జనం వచ్చిచేరారు. సత్యభామ వచ్చింది. నారదుడు వచ్చాడు. "ఏమైంది? ఏం జరిగింది?". ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్నారు. "కృష్ణుడికి తలనొప్పిగా ఉంది. మనమేం చేయాలి?" అని.

"నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు, ఎవరైనా మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తలమీద రుద్దండి. నొప్పి తగ్గిపోతుంది" అని కృష్ణుడు చెప్పాడు. అప్పుడు సత్యభామ "ఏమిటీ అర్థం లేని మాటలు ? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ నా పాదధూళి తీసి మీ తల మీద పెట్టటం మాత్రం చేయను. అలాంటివి చేయ తగని పనులు" అని అంది. ఇక రుక్మిణి కూడా "ఇది ఎలా చేయగలం? మహా పాపం..ఇది మనం చేయలేము" అంటూ ఏడ్చింది. అక్కడ ఉన్న నారదుడు కూడా "నేను కూడా ఇలాంటి పని చేయ దలుచుకోలేదు. నువ్వు సాక్షాత్తూ భగవంతుడివి. దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు. ఇందులో దాగివున్నకుట్ర ఏంటో తెలీదు. నా పాదాల దగ్గర మట్టి తీసి మీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను" అని నారదుడు వెనుదిరిగాడు.

ఈ విషయం అంతటా పాకిపోయింది. ప్రతి ఒక్కరు భయపడ్డారు "మేము ఇలాంటి పని చేయలేము. ఆయనంటే ప్రేమే గానీ, ఇలాంటి పని చేసి నరకానికి పోలేము"అని. ఉత్సవం కృష్ణుడి కోసం ఎదురుచూస్తోంది, కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నాడు.

ఈ వార్త బృందావనం చేరింది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకి తెలిసింది. రాధ తన పవిటచెంగు తీసి నేల మీద పరిచింది. గోపికలందరూ దానిమీద తీవ్రంగా నృత్యం చేశారు. వాళ్లు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి "దీన్ని తీసుకెళ్లి, కృష్ణుడి తలచుట్టూ కట్టండి" అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి కృష్ణుడి తలచుట్టూ కట్టగానే కృష్ణుని తలనొప్పి మటుమాయమైంది!

ఆయన ఎప్పుడూ తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తారో స్పష్టం చేసేవారు. రాజులతో పాటు తిరిగినా, రాజ్యాలను తనకు కానుకలుగా ఇచ్చినా, ఆయన అవి తృణప్రాయంగా భావించేవారు. కానీ భక్తితో, ప్రేమతో చేసే పని మాత్రం ఆయనకు ఎంతో విలువైనది.

09/09/2022

ఇది నిజమే

మా పేజీని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే
09/09/2022

మా పేజీని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే

మా పేజీని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కృష్ణుడి సగం భక్తుడుసద్గురు : ఒక రోజు కృష్ణుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నా...
09/09/2022

మా పేజీని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి

కృష్ణుడి సగం భక్తుడు
సద్గురు : ఒక రోజు కృష్ణుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. చాలా ఆనందంగా, గర్వంగా సత్యభామ ఆయనకి వడ్డిస్తోంది ఎందుకంటే ఆయన ప్రతిరోజూ ఇంటికి వచ్చే మనిషి కాదు. ఆయనకి భోజనం పెట్టడానికి తనకి చాలా అరుదుగా అవకాశం దొరుకుతుంది. అందువల్ల ఆమె చాలా ఆనందంతో, సంతోషంగా భోజనం పెడుతోంది.
కానీ భోజనం మధ్యలో, కృష్ణుడు హఠాత్తుగా లేచి, చేతులు కూడా కడుక్కోకుండా, ద్వారం వైపు పరిగెత్తాడు. సత్యభామ నిర్ఘాంతపోయింది. ఆమె "ఇదేమిటి? దయచేసి భోజనం పూర్తి చేసి వెళ్లండి" అంది. ఆయన "లేదు. నేను ఇప్పుడు వెళ్లాలి", అంటూ ముఖ ద్వారం వైపు పరిగెత్తాడు.

కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి భోజనం చేయడం కొనసాగించాడు. అప్పుడు ఆవిడ "అలా పరిగెత్తారు ఎందుకు, మళ్లీ తిరిగి వచ్చారు ఎందుకు? ఏమిటిది?", అని అడిగింది. ఆయన ఇలా చెప్పాడు,"నా భక్తుడు ఒకడు అడవిలో కూర్చుని ఉన్నాడు. అతని జీవంలో ప్రతి శ్వాస "కృష్ణ, కృష్ణ, కృష్ణ" గా మారిపోయింది.అతనివైపు ఆకలిగొన్న ఒక పులి వస్తుండగా చూశాను, కాబట్టి పరుగెత్తాల్సి వచ్చింది. ద్వారం వరకు వెళ్లాను, కానీ ఆ మూర్ఖుడు ఒక రాయి తీసుకున్నాడు. దాంతో సరే "అతని సంగతి..అతన్నేచూసుకోనీ" అని నేను వెనక్కి తిరిగి వచ్చేసాను.

మా పేజీని లైక్ చేయండి ఫాలో చేయండి సృష్ట్యాది లీలావిలాసముల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు.నల్లని వర్ణము కలవాడు. ...
08/09/2022

మా పేజీని లైక్ చేయండి ఫాలో చేయండి

సృష్ట్యాది లీలావిలాసముల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు.
నల్లని వర్ణము కలవాడు. నీలమేఘ శ్యాముడు.
తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు.
నాగలివలె భూమిని దున్ని జీవ సమృద్ధి కలిగించువాడు.
కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు.
వ్యాసునిగా వేదములను విభజించి భక్తులకు మనోవ్యవసాయము కలిగించి జ్ఞానమును పండించువాడు.
కానరాని, తెలియరాని, అందజాలనివాడు. సంపూర్ణభక్తికి మాత్రమే లభ్యమయ్యేవాడు.
అనేక దేవాలయాల విగ్రహాలలోను, ఇతర శిల్పాలలోను, చిత్రాలలోను, ప్రార్థనలలోను, కావ్యాలలోను, సాహిత్యంలోను, పురాణాలలోను, సినిమాలలోను కృష్ణుని రూప స్వభావాల చిత్రణ ఉంది. ఉదాహరణగా "కృష్ణాష్టకం" అనే ప్రార్థనలో కృష్ణుని వర్ణించిన విధానం - దేవకీవసుదేవుల నందనుడు, కంసచాణూర మర్దనుడు, నల్లని మేనికాంతి (అతసీపుష్ప సంకాశం) కలవాడు, నెమలి పింఛము, వివిధ ఆభరణములు, మందారమాల, పీతాంబరములు, తులసి మాలలు ధరించినవాడు, మెలిదిరిగిన ముంగురులు కలవాడు, రుక్మిణీసత్యభామాది భామలతో విహరించువాడు, గోపికల కుచముల కుంకుమ అంటిన వక్షస్థలము, శ్రీవత్స చిహ్నము కలవాడు, వనమాల, శంఖచక్రములు ధరించినవాడు.

మా పేజీని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి.కృష్ణుడిని భగవంతుడిగా పూజించేవారి కన్నాస్నేహితుడిగా, గురువుగా భావించిన వా...
07/09/2022

మా పేజీని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి.
కృష్ణుడిని భగవంతుడిగా పూజించేవారి కన్నాస్నేహితుడిగా, గురువుగా భావించిన వారినే ఎక్కువగా అనుగ్రహించాడు. ఎక్కడ తగ్గాలి,ఎక్కడ నెగ్గాలి,ఎలా ప్రవర్తించాలి అన్నీ అర్థం కావాలంటే కృష్ణతత్వం అర్థం కావాలి..

మా పేజీ ని లైక్ చేయండి షేర్ చేయండి
07/09/2022

మా పేజీ ని లైక్ చేయండి షేర్ చేయండి

మా పేజీని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి
07/09/2022

మా పేజీని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి

మా పేజీని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి
07/09/2022

మా పేజీని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి

మా పేజీని లైక్ చేయండి షేర్ చేయండి
07/09/2022

మా పేజీని లైక్ చేయండి షేర్ చేయండి

మా పేజీని ఫాలో అవ్వండి లైక్ చేయండి
07/09/2022

మా పేజీని ఫాలో అవ్వండి లైక్ చేయండి

06/09/2022

Address

Anantapur

Alerts

Be the first to know and let us send you an email when Seshadri ayurvedic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Seshadri ayurvedic:

Share