11/02/2024
*🦜శ్రీ శ్యామల గుప్త నవరాత్రులు🦜(2024 ఫిబ్రవరి 10 - 18) :: మంత్ర సాధన*
మాఘ మాసంలో వచ్చే "శ్యామల నవరాత్రులు" ఉపాసక సాధకులకు ప్రత్యేకము మరియు ఓ వరము లాంటివి. ఇవి సాధకులు మరియు ఉపాసకులు గోప్యంగా చేసుకునే విధానాలు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అన్నారు.
శ్రీ శ్యామల మాత ని శ్రీ శారదా మాతగా శ్రీ సరస్వతి మాతగా మాతంగి మాతగా కూడా పిలుస్తారు. ఈ తల్లి జ్ఞాన శక్తి స్వరూపం. శ్రీ లలిత అమ్మవారికి మంత్రిణి. శ్రీ లలితా అమ్మ ఈ సృష్టి పాలనకు సంబంధించి శ్రీ శ్యామల అమ్మ వారితో మంత్రాంగం చేస్తూ ఉంటారు.
ఈ అమ్మ విద్యలలో ఎన్నో రూపాలు ఎన్నో విద్యలు ఉన్నాయి. నవరాత్రులలో ఒక్కో రోజు అమ్మను ఒక్కో రూపంగా ఒక్కో విద్యతో సాధన చేస్తారు. లేదా మీరు పూజించే అమ్మవారిని శ్యామల అమ్మగా భావిస్తూ... సంకల్పం చెప్పుకొని,... మీరు సాధన చేసే గురూపదేశ మూల మంత్రంతో సాధన చేయండి లేదా స్తోత్రములు చదివి పూజ చేసుకుని నైవేద్యం సమర్పించుకోండి.
Feb 10 -లఘు శ్యామలాదేవి
11 - వాగ్వాధినీ శ్యామలాదేవి
12 - నకులి శ్యామలాదేవి
13 - హాసంతి శ్యామలాదేవి
14 - సర్వసిద్ధి మాతంగి
15 - వస్య మాతంగి
16 - సారికా శ్యామలాదేవి
17 -శుక శ్యామలాదేవి
18 - రాజశ్యామలాదేవి లేదా రాజమాతంగి
ఈ తల్లిని పూజా లేదా కొలిచిన వారికి లేదా సాధన చేసిన వారికి జ్ఞానము, విద్య, సంగీతం, కవితా శక్తి, లలిత కళలు, ఆకర్షణ శక్తి, భార్య భర్తల మధ్య అన్యోన్య దాంపత్యం, రాజకీయ పాలన శక్తి, సౌఖ్యము, ఐశ్వర్యం, సంపదలు మరియు ఉద్యోగం - ఉన్నత పదవులు ప్రాప్తిస్తాయి.
మీరు కానీ లేదా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు + ఇంటర్వ్యూలకు వెళ్లవలసిన వారు..... అందరూ ఈ మంత్రమును జపించండి. పిల్లల చేత పలికిస్తూ ఉండండి కొంతసేపు జపించమని వారిని ప్రోత్సహించండి.
:: గురూపదేశం ::
ఈ మంత్రం పనిచేసేందుకు మీరు ఒక పేపర్ పై ఈ మంత్రమును రాసి, శివాలయము వెళ్లి శివలింగమును తాకించి ఇవ్వమని పూజారికి చెప్పి ఆ పరమేశ్వరుడే ఈ మంత్రమును మీకు అనుగ్రహించినట్లుగా భావిస్తూ, గురువుగా స్వీకరించి సాధన చేయవచ్చు. మీ అభీష్టములు నెరవేరి మీకు
శ్రీ శ్యామల (సరస్వతి) మాత కటాక్షం సిద్ధించు గాక!
జ్ఞాన సిద్ధి లభించుగాక!
*1. మంత్రము :: "ఓం ఐం నమః"*
- కనీసం రోజుకు 108 సార్లు
*2. మంత్రము :: "ఓం హ్రీం క్లీం హుం మాతంగ్యై ఫట్ స్వాహా"*
- కనీసం రోజుకు 108 సార్లు
ఏ మంత్రము అయినా పని చేసేందుకు ఓ మండలం రోజులు --- రోజుకు 11 మాలలు కనీసం సాధన చేయాలి.
🦚🦢🦚🦢🦚🦢🦚🦢🦚
*𝗔𝗮𝗰𝗵𝗮𝗿𝘆𝗮 SEKHAR*
Spiritual Mentor & Healer
Meditation, Yoga and Healing Trainer
@ 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 𝘂𝘀, 𝗦𝗵𝗮𝗿𝗲 & 𝗟𝗶𝗸𝗲 ::
https://linktr.ee/AcharyaSekhar
*వాట్సాప్ ఛానల్ ::*
https://whatsapp.com/channel/0029VaDH7Yu0lwgvAXYEmm1E
*Instagram ::* https://www.instagram.com/aacharya_sekhar?igsh=MWt1bjAyYzA4NHN0cQ==
*Facebook ::* https://www.facebook.com/SomaSekharReddyS?mibextid=𝗭𝗯𝗪𝗞𝘄𝗟
*Give REVIEW* in Facebook &
*Rate with ⭐⭐⭐⭐⭐*
**ra