30/01/2022
కోరికలు తీర్చే పూజ దేవీ దేవతల పటాలకి చెయ్యాలి...మరియు *ఎందుకు కావాలో తెలీని, అసలు కావాలో వద్దో తెలీని ముక్తికోసం మాత్రమే శ్రీ పరబ్రహ్మ శ్యామాచరణ లాహిరీ మహాశయస్వామివారి బ్రహ్మవిద్యా సాధన* అని చాలామంది భక్తుల భావన.
అందుకే తిరుపతిస్వామి, సాయిబాబా, అయ్యప్ప, అమ్మవార్ల పూజలు, మొక్కులు ఒకవైపు చేస్తారు, చాలా ఎక్కువగా నిష్ఠభక్తులతో...
మరి బ్రహ్మవిద్యా ప్రదాత అయిన *పరబ్రహ్మవారికి పూజ చెయ్యాలంటే* సందేహం, లెక్కలేని అనుమానాలు..!!!
ఈ తిరుపతి వెంకటేశ్వరస్వామి, అయ్యప్ప సాయిబాబా అమ్మవారు అందరూ శ్రీ పరబ్రహ్మ శ్యామాచరణ లాహిరీ మహాశయ స్వామివారి వివిధ రూపాలే ఆని,
బ్రహ్మవిద్యా సాధన చేసే భక్తులకే తెలీదు, ఎన్నో రకాలుగా చెప్పినామాటలు కూడా ఎక్కించుకోరు....!!!🙄😔‼️
పూజామందిరాల్లో మాత్రం ఎంతో భక్తి విశ్వాసాలు శ్రద్ధ ప్రేమలతో ఈ రకరకాల దేవతల పటాలు...!!!!
*మరి సాక్షాత్తు దేవాదిదేవ పరబ్రహ్మ మానుషరూపేణ అయిన శ్యామాచరణ లాహిరీ మహాశయులవారిది మాత్రం ఫొటో కూడా ఇంట్లో ఉండదు...*🙄😱
ఆయన్ని పూజామందిరాల్లో అయితే అసలు ప్రతిష్ఠ చేసే ఆలోచనేలేదు...మన ఈ భక్త శిఖామణులకి..!!!
*ఇది వీళ్ళ హీనబుద్ధి సంపన్నత...!!!*
ఈ చరాచర సృష్టిని సృష్టించి పాలించే పోషించే పరబ్రహ్మ పరమేశ్వరులైన మహాదేవుడు శంకరుడు శ్రీ శ్యామాచరణ లాహిరీ మహాశయుల వారికి పూజ చేసే ఉద్దేశ్యం ఏమాత్రం లేదు..
కానీ దేవీదేవతలు అందరికీ పూజ నిరాఘాటంగా చేసేస్తూనే ఉంటారు...
బ్రహ్మవిద్య నిలకడగా సరిగ్గా సాత్వికంగా ఎలా సాధ్యం వీళ్ళకి????⁉️🙄
అందుకే బ్రహ్మవిద్యా సాధన పొందటం జరిగినా ఈ బుద్ధిహీనులైన భక్తులకు దాన్ని చేయడం తెలీదు...వజ్రం మట్టగడ్డ లాగా అనుకొనే అనాగరికుల్లాగా..
దాన్ని భగవంతుడిని అలక్ష్యం చేస్తూ, నిర్లక్ష్యంగా బతికేస్తున్నారు తమ తమ అంతులేని దుఃఖపు సామ్రాజ్యాల్లో.. నిలకడగా నిష్ఠగా...!!!!