Mana Avanigadda BLOOD Donors

Mana Avanigadda BLOOD Donors Every one can join this page Diviseema BLOOD Donors....
voluntary blood donors.

రక్తదానం చేద్దాం....ప్రాణదాతలు అవుదాం...
28/04/2018

రక్తదానం చేద్దాం....ప్రాణదాతలు అవుదాం...

నియోజకవర్గంలో రక్తదానంలో ముందుకు దూసుకెళ్తున్న *మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్*👉అవనిగడ్డ నియజకవర్గం వరకే కాకుండా వేరే జిల్లాల...
10/09/2017

నియోజకవర్గంలో రక్తదానంలో ముందుకు దూసుకెళ్తున్న *మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్*

👉అవనిగడ్డ నియజకవర్గం వరకే కాకుండా వేరే జిల్లాల నుండి కూడా బ్లడ్ కావాలని పోస్ట్ రాగానే స్పందించే తీరు మాది...
👉ఎలాగైనా బ్లడ్ అందించాలనే పట్టుదల మాది.

👉ఫోన్ లేదా సోషల్ మీడియాలో బ్లడ్ కావాలని అడగగానే కొన్ని నిమిషాల వ్యవధిలోనే స్పందించే తీరు మాది...

👉సోషల్ మీడియానే మా అడ్రస్...

*వివరాలు:* చల్లపల్లి లోని *కీర్తి హాస్పిటల్* లో చికిత్స పొందుతున్న పేషెంట్ కి రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం తో అత్యవసరంగా O+ve బ్లడ్ కావాలని వారి కుటుంబ సభ్యులు మన అవనిగడ్డ గ్రూప్ అడ్మిన్ బృందానికి ఫోన్ చేసారు. మేము అది మన అవనిగడ్డ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసాము. అది చూసి స్పందించిన
మన అవనిగడ్డ సభ్యుడు *కొల్లిపర రాధాకృష్ణ (శారదా మెడికల్స్, అవనిగడ్డ)*వెంటనే వెళ్ళి రక్తదానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా రక్తదానం చేసి నిజమైన హీరో అనిపించుకున్న అవనిగడ్డ కి చెందిన రాధాకృష్ణ ని ప్రతి ఒక్కరూ అభినందించారు.

అలాగే ఆ పేషెంట్ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ....
*మన అవనిగడ్డ బృందం..*

*కలసి ఉంటె కలదు సుఖం.......*కలసికట్టుగా ఉంటె మనలో ఎవ్వరికి కష్టం కలిగినా మనలో ఎవరో ఒకరు ఆపన్న హస్తం ఇవ్వడానికి ఎప్పుడూ మ...
09/09/2017

*కలసి ఉంటె కలదు సుఖం.......
*కలసికట్టుగా ఉంటె మనలో ఎవ్వరికి కష్టం కలిగినా మనలో ఎవరో ఒకరు ఆపన్న హస్తం ఇవ్వడానికి ఎప్పుడూ మన అవనిగడ్డ యువత ముందు ఉంటారు అనడానికి ఉదాహరణలు నిత్యం జరుగుతున్నాయి.....*

రక్తసంబంధం లేదు, బంధువులం కాదు,
స్నేహితులం కూడా కాదు..
కనీసం మొఖపరిచయం కూడలేకుండా మనవాళ్ళు అనేవాళ్ళు ఆపదలో ఉన్నారంటేచాలు మేము ఉన్నామంటూ మన సోదరులు చేయుతనిస్తున్నారు.

ఈ రోజు చల్లపల్లి లోని #కీర్తి_హాస్పటల్ లో పేషెంట్ కి రక్తకణాలు తగ్గి వెంటనే 0+ బ్లడ్ కావాలి అని అవనిగడ్డ లోని ్రాంతి_డిగ్రీ_కాలేజి కి వెళ్లి అడగగానే స్పందించి నేను ఇస్తాను అంటూ ముందుకు వచ్చి రక్తదానం చేసిన విద్యార్థి #కందుల_గణేష్ కి మన అవనిగడ్డ యువత తరపున కృతజ్ఞతలు. అలాగే మా విద్యార్థులు చదువులోనే కాదు...సాటి మనిషికి ఆపద వస్తే కాపాడటం లోనూ ముందు ఉంటారు అంటూ తమ విద్యార్థిని పంపిన SVL క్రాంతి కాలేజి యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు.
🙏🙏🙏
మీ
వెంకట్ ఇమ్మడిశెట్టి 7207539285

26/08/2017

Dt.27.08.2017
Patient Name: no name
Age: 5 months lady baby,
Heart surgery Purpose required : 1 unit,
Blood Group:A Negative(A-ve)
Andhra Hospital, Vijayawada,
Father Name : Moka Venkata Srinivasarao
Contact 9989778749, 7207539285
verified by venkat.

నియోజకవర్గంలో రక్తదానంలో ముందుకు దూసుకెళ్తున్న *మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్*👉అవనిగడ్డ నియజకవర్గం వరకే కాకుండా వేరే జిల్లాల...
30/07/2017

నియోజకవర్గంలో రక్తదానంలో ముందుకు దూసుకెళ్తున్న *మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్*

👉అవనిగడ్డ నియజకవర్గం వరకే కాకుండా వేరే జిల్లాల నుండి కూడా బ్లడ్ కావాలని పోస్ట్ రాగానే స్పందించే తీరు మాది...
👉ఎలాగైనా బ్లడ్ అందించాలనే పట్టుదల మాది.

👉ఫోన్ లేదా సోషల్ మీడియాలో బ్లడ్ కావాలని అడగగానే కొన్ని నిమిషాల వ్యవధిలోనే స్పందించే తీరు మాది...

👉సోషల్ మీడియానే మా అడ్రస్...

*వివరాలు:* G. ఆంజనేయులు అనే వ్యక్తి ఆరోగ్యం బాగోలేదని వారి కుటుంబసభ్యులు వారిని విజయవాడ లోని మణిపాల్ హాస్పిటల్లో చూపించగా అక్కడి వైద్యులు రక్తపరీక్షలు చేయించి పేషెంట్ రక్తంలో ప్లేటెలెట్లు తగ్గిపోయాయి, అత్యవసరంగా 5 యూనిట్ల ప్లేటెలెట్లను ఎక్కించాలి అని చెప్పారు.. దీంతో వారి బంధుమిత్రులలో ఒకరైన సుభాషిణి గారు మన అవనిగడ్డ గ్రూప్ అడ్మిన్ బృందానికి ఫోన్ చేసారు. మేము అది మన అవనిగడ్డ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసాము. అది చూసి స్పందించిన
మన అవనిగడ్డ సభ్యుడు *ఆలపాటి పవన్ కుమార్* అతని మిత్రులు *నంబూరి సత్యనారాయణ*, *సత్తుపల్లి దిలీప్* లతో మాట్లాడి, ఒప్పించి వెంటనే వెళ్ళి రక్తదానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా రక్తదానం చేసి నిజమైన హీరో అనిపించుకున్న అవనిగడ్డ కి చెందిన ఆలపాటి పవన్ కుమార్, నంబూరి సత్యనారాయణ మరియు సత్తుపల్లి దిలీప్ ని *మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్ గ్రూప్ అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి వెంకటేష్*,
ఉపాధ్యక్షుడు *అన్నపురెడ్డి సందీప్*,
*మన అవనిగడ్డ గ్రూప్ అడ్మిన్ బృందం*
మరియు పేషెంట్ బంధువులు అభినందించడం జరిగింది.

అలాగే పేషెంట్ ఆంజనేయులు గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ....
మన అవనిగడ్డ బృందం..
7207539285

ది. 23-07-2017 న  #స్వచ్ఛ_అవనిగడ్డ_సొసైటీ వారి ఆధ్వర్యంలో మన అవనిగడ్డ లోని నవజీవన్ స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన  #రక్తదానశ...
23/07/2017

ది. 23-07-2017 న #స్వచ్ఛ_అవనిగడ్డ_సొసైటీ వారి ఆధ్వర్యంలో మన అవనిగడ్డ లోని నవజీవన్ స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన #రక్తదానశిబిరం లో రక్తదానం చేస్తున్న రక్తదాతలు భోగాది చంద్రశేఖర్ గారు, అవనిగడ్డ శానిటరీ ఇనస్పెక్టర్ సుధాకర్ గారు, అవనిగడ్డ జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు గారు, రెడ్ క్రాస్ మెంబర్ డాక్టర్ గిరి గారు, లాయర్ పులి శ్రీనివాసు గారు, స్వచ్ఛ అవనిగడ్డ సభ్యులు అమర్ వీరంకి, గరికిపాటి వెంకటేశ్వరరావు(పెద్దబ్బాయి), స్వచ్ఛ అవనిగడ్డ సొసైటీ జనరల్ సెక్రటరీ లాయర్ బడే శేషగిరి గారు, మరికొంతమంది పౌరులు....
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అవనిగడ్డ సివిల్ కోర్టు జడ్జి Y. శ్రీనివాసు గారు, అవనిగడ్డ DSP ఖాదర్ బాషా గారు, అవనిగడ్డ SI గారు..
పర్యవేక్షించిన రేపల్లె రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు డాక్టర్ శ్రీ వసంతం విరరాఘవయ్య గారు.
ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మన అవనిగడ్డ లో ఏర్పాటుచేయించిన స్వచ్ఛ అవనిగడ్డ సొసైటీ అధ్యక్షుడు శ్రీ కొండవీటి ఈశ్వరరావు గారికి ప్రత్యేకంగా అభినందనలు.

గడిచిన 2 నెలలలో *మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్ గ్రూప్* ద్వారా రక్తం కావాలి అని అడిగినవారికి 68 మంది రక్త దాతలతో రక్తం ఇప్పిం...
22/07/2017

గడిచిన 2 నెలలలో *మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్ గ్రూప్* ద్వారా రక్తం కావాలి అని అడిగినవారికి 68 మంది రక్త దాతలతో రక్తం ఇప్పించడం జరిగింది. మన అవనిగడ్డ నియోజకవర్గం లో ఎవరైనా రక్తదానం చేయాలి అనుకునే వారు ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
*రక్తదానం చేయాలి అనుకునే వాళ్ళు మాత్రమే*

అవనిగడ్డ నియోజకవర్గం లో ఉన్న మీ ప్రతీ వాట్స్ ఆప్ గ్రూప్ కి ఈ లింక్ మరియు ఈ మెసేజ్ పంపించండి.
*మీతోపాటు మీ కుటుంబ సభ్యులు మరియు మీ స్నేహితులు రక్తదానం చేసేలా అవగాహన కల్పించండి*


రక్తం కావాలి అనుకునే వాళ్ళు అవనిగడ్డ లోని *మన అవనిగడ్డ గ్రూప్* సభ్యులను లేదా ఈ కింద ఇచ్చిన నంబర్స్ కి మెసేజ్ చెయ్యండి

*వెంకట్ 7207539285*

*సందీప్ 8106633445*

మాట సహాయం ఎవరైనా చేస్తారు...అవసరం అయినపుడు రక్తదానం చేయడం గొప్ప విషయం.
*రక్తదానం చేద్దాం...మరొకరి ప్రాణాన్ని కాపాడుదాం*
https://chat.whatsapp.com/4v6e1J6u8B32AebR78tyBV

Follow this link to join

అవనిగడ్డ నియోజకవర్గం లో సుమారు 215 మంది రక్త దాతల లిస్టుతో *మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్* గ్రూప్ ని రన్ చేస్తున్నాం. అవనిగడ...
21/07/2017

అవనిగడ్డ నియోజకవర్గం లో సుమారు 215 మంది రక్త దాతల లిస్టుతో *మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్* గ్రూప్ ని రన్ చేస్తున్నాం. అవనిగడ్డ నియోజకవర్గం లో ఎవరికైనా బ్లడ్ కావాలంటే
*మన అవనిగడ్డ* గ్రూప్ ని లేదా..

వెంకటేష్
7207539285
ను సంప్రదించగలరు.

అలాగే ఎవరైనా రక్తదానం చేయాలి అనుకునే వారు కూడా మన అవనిగడ్డ గ్రూప్ ని లేదా 7207539285, నంబర్ కి వాట్సాప్ చేయగలరు.

మాట సాయం ఎవరైనా చేస్తారు. రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం. ఇప్పటివరకు ఎవరైనా అడిగిన వెంటనే 100% చేయలేకపోయినా 90% వరకు రక్తదాతలను పంపి రక్తదానం చేయించి మరొకరి ప్రాణం ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాము.
ఇట్లు
మన అవనిగడ్డ బృందం.

ఈ మెసేజ్ ని నియోజకవర్గం లోని అన్ని గ్రూప్ లలో షేర్ చేయగలరు.

https://chat.whatsapp.com/4v6e1J6u8B32AebR78tyBV

Follow this link to join

ఈరోజు మన హీరో ఆనంద్. మాట సాయం ఎవరైనా చేస్తారు అపదలో అవసరమైన సమయంలో రక్తదానం చేయడం గొప్ప విషయమే.తెనాలి ఆసుపత్రిలో సుమలత ...
19/07/2017

ఈరోజు మన హీరో ఆనంద్.
మాట సాయం ఎవరైనా చేస్తారు అపదలో అవసరమైన సమయంలో రక్తదానం చేయడం గొప్ప విషయమే.
తెనాలి ఆసుపత్రిలో సుమలత అనే మహిళకు A+ve రక్తం కావాలని వారి బంధువులు నాకు ఫోన్ చేసి అడగగానే గతంలో నేను కూడా రక్తదానం చేస్తాను అని మెసేజ్ పెట్టిన అవనిగడ్డ పాతయడ్లంక కు చెందిన ఆనంద్ కి ఫోన్ చేసి అడిగాను.తప్పకుండా ఇస్తాను అని చెప్పి తెనాలి వెళ్లి రక్తదానం చేసి వచ్చిన ఆనంద్ కి ధన్యవాదాలు.
ఇదే విధంగా ప్రతి ఒక్కరు రక్తదానం పట్ల తమకున్న అపోహలను వదిలి అత్యవసర సమయాలలో రక్తదానం చేసే దిశగా అందరూ ఆలోచించాలని కోరుతున్నాము.
"రక్తదానం మహా దానం"
"అత్యవసర సమయాలలో రక్తదానం చేయండి..ప్రాణదాతలుగా నిలవండి"
ఇట్లు
మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్

16/07/2017



Needed A-ve blood

Date. 16-07-2017
Patient name : B. Swarana Kumari
Age : 68
No.of units : 2
Purpose : Bypass Operation
Contact no. 9866770484
Hospital : Aayush Hospitals

***Verified***

 #మనఅవనిగడ్డబ్లడ్_డోనర్స్ గ్రూప్ కి అన్ని జిల్లాల నుండి రక్తం కోసం ఫోన్ చేయడం, అదేవిధంగా మనం కూడా రక్తదాతలను పంపి రక్తదా...
11/07/2017

#మనఅవనిగడ్డబ్లడ్_డోనర్స్ గ్రూప్ కి అన్ని జిల్లాల నుండి రక్తం కోసం ఫోన్ చేయడం, అదేవిధంగా మనం కూడా రక్తదాతలను పంపి రక్తదానం చేయించడం జరుగుతుంది.
మరి కొంతమంది మిత్రులను, రక్త దాతలను మనతో చేర్చుకోవడం కోసం #కృష్ణాజిల్లా, #గుంటూరుజిల్లా #ప్రకాశంజిల్లా ల వాట్సాప్ గ్రూప్ లను మొదలు పెట్టడం జరిగింది. ఆయా జిల్లాల వారు రక్తదానం చేయదలచిన వారు ఈ కింది వాట్సాప్ లింక్ ద్వారా గ్రూప్ లో చేరి, అవసరం అయినపుడు రక్తదానం చేయగలరని కోరుతున్నాము.

"రక్తదానం చేయడం అంటే మరొకరికి పునర్జన్మ ని ఇవ్వడమే"
అడ్మిన్ మనఅవనిగడ్డ వెంకట్ 7207539285

మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్
https://chat.whatsapp.com/4v6e1J6u8B32AebR78tyBV

రక్తదానం౼కృష్ణా జిల్లా
https://chat.whatsapp.com/9iMAr71PtIaJ8YvhWZO4n1

రక్తదానం౼గుంటూరు జిల్లా
https://chat.whatsapp.com/4TNiIq4aufzA4CGySfKjOu

రక్తదానం౼ప్రకాశం జిల్లా
https://chat.whatsapp.com/DaGZBt4J40EInIo7cLDp8T

Follow this link to join

రక్తదానం విషయంలో విజయం సాధిస్తున్న మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్ గ్రూప్. ఒకప్పుడు మన అవనిగడ్డ వరకే తెలిసిన ఈ గ్రూప్ ఇపుడు ఈన...
10/07/2017

రక్తదానం విషయంలో విజయం సాధిస్తున్న మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్ గ్రూప్. ఒకప్పుడు మన అవనిగడ్డ వరకే తెలిసిన ఈ గ్రూప్ ఇపుడు ఈనాడు పేపర్ వలన ఆంద్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారికి తెలిసింది. ఎక్కడెక్కడి నుండో రక్తం కావాలని చాలామంది ఫోన్ చేస్తున్నారు. మాకు వీలైనంతవరకు మేము దాతలతో మాట్లాడి పంపిస్తున్నాము. నూటికి నూరు పంపలేకపోయినా రోజుకు ఒకరు లేదా ఇద్దరు దాతలతో రక్తదానం చేయించడం జరుగుతుంది.
ఇంతకుముందు రక్తదానం చేసినవారి పేరు మరియు వారి ఫోటో మన గ్రూప్ లో పోస్ట్ చేసేవాళ్ళం. కానీ ఇపుడు ఫోటో ని గ్రూప్ లో పెట్టలేకపోతున్నాము. ఎందుకంటే దాతలు మనకు దగ్గరలోని వారు కాకపోవడం మరియు వారి ఫోటోలు మనం సేకరించలేకపోవడమే....(వారు ఎవరో కూడా మనకు తెలియకపోవడం ఇంకొక కారణం).
ఇప్పటికే చాలామంది దాతల లిస్టు తయారు చేయడం జరిగింది.
మనమందరం కూడా రక్తదానం చేద్దాం....మరొకరి ప్రాణాన్ని కాపాడుదాం...
7207539285 మనఅవనిగడ్డ వెంకట్

28/06/2017

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో గుండె ఆపరేషన్ నిమిత్తం *షేక్ జానీ* అనే పేషెంట్ కి 28/6/2017కి A-ve బ్లడ్ 4 యూనిట్లు కావలెను. ఎవరైనా రక్తదాతలు ఉంటే సంప్రదించండి.
9032466427.
Posted by Mana avanigadda blood doners
రక్తదానం చేసి మరొకరి ప్రాణం కాపాడండి.

మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్....
28/06/2017

మన అవనిగడ్డ బ్లడ్ డోనర్స్....

గత కొన్ని రోజులుగా నాకు ఫోన్ చేసి "అన్నా...నేను కూడా రక్తదానం చేస్తాను. ఎవరికైనా కావాలంటే నాకు చెప్పు అన్నా *మన అవనిగడ్డ...
22/06/2017

గత కొన్ని రోజులుగా నాకు ఫోన్ చేసి "అన్నా...నేను కూడా రక్తదానం చేస్తాను. ఎవరికైనా కావాలంటే నాకు చెప్పు అన్నా *మన అవనిగడ్డ గ్రూప్ నుండి నాకొక అవకాశం ఇవ్వండి*అని" అడగడం....ఆ అవకాశం ఈరోజు రావడం....రక్తదానం చేయడం.
*ఇపుడు నేను హ్యాపీ, రక్తదాత హ్యాపీ, రక్త గ్రహీత హ్యాపీ*
ఎవరా అనుకుంటున్నారా....?
V. కొత్త పాలెం కి చెందిన చుండూరు నిరూప్(చంద్ర డిజిటల్ స్టూడియో, LIC ఏజెంట్).
నిన్న రాత్రి నన్ను అవనిగడ్డ కి చెందిన ఒకరు ఏదైనా బ్లడ్ 3 యూనిట్లు కావాలని అడిగారు. నేను వెంటనే నిరూప్ కి ఫోన్ చేసి చెప్పాను. ఉదయం మళ్ళీ ఫోన్ చేయగా తన షాప్ ని కట్టేసి మరీ రేపల్లె వచ్చి రక్తదానం చేసి వెళ్ళాడు.
రక్తదానం చేయండి....మరొకరి ప్రాణం కాపాడండి

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన తరువాత రక్తం తక్కువగా ఉండీ, డాక్టర్లు వెంటనే B+ve రక్తం ఎక్కించాలి అని చెప్పగా,...
22/06/2017

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన తరువాత రక్తం తక్కువగా ఉండీ, డాక్టర్లు వెంటనే B+ve రక్తం ఎక్కించాలి అని చెప్పగా, వారు మన అవనిగడ్డ గ్రూప్ ని సంప్రదించారు. మేము ఈ విషయాన్ని గ్రూప్ లో పోస్ట్ చేయగానే స్పందించిన కోలా సాయి అనే వ్యక్తి తన స్నేహితుడు *నడకుదిటి భాస్కర్* తో మాట్లాడి, నిన్న మధ్యాహ్నం అవనిగడ్డ నుండి విజయవాడ వెళ్లి రక్తదానం చేయించి వచ్చారు.
రక్తదానం చేసిన భాస్కర్ కి,
అతనితో మాట్లాడి ఒప్పించిన సాయి కి హృదయపూర్వక అభినందనలు.
మనం కూడా రక్తదానం చేద్దాం..మరొకరి ప్రాణం కాపాడుదాము.

విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో కోసూరు రమేష్ అనే వ్యక్తికి గుండె ఆపరేషన్ నిమిత్తం O-ve రక్తం లేక ఆపరేషన్ వాయిదా వేస్తున్నార...
22/06/2017

విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో కోసూరు రమేష్ అనే వ్యక్తికి గుండె ఆపరేషన్ నిమిత్తం O-ve రక్తం లేక ఆపరేషన్ వాయిదా వేస్తున్నారు. కావున వారు మన అవనిగడ్డ గ్రూప్ ని కూడా అడగడం జరిగింది. మేము 2 రోజులు ప్రయత్నించగా ఆ గ్రూప్ రక్తం వారు ఒక్కరు కూడా దొరకలేదు. దాదాపు నాదగ్గర 300 మంది రక్తదాతలు లిస్ట్ ఉంటే అందులో 4గురు మాత్రమే O negative గ్రూప్ వారు ఉన్నారు. వారు కూడా రక్తం ఇచ్చి ఎక్కువ రోజులు కాలేదని చెప్పారు. చాలా రేర్ గ్రూప్ అవడం వల్ల మేము ఆశ వదిలేసుకునే సమయంలో *బండ్రెడి హరి* నుండి మెసేజ్ వచ్చింది. "అన్నా నాది O-ve బ్లడ్, నేను ఇస్తాను అని"
అన్నట్లుగానే నిన్న సాయంత్రం విజయవాడ మణిపాల్ హాస్పిటల్ కి వెళ్లి రక్తదానం చేసి వచ్చాడు. మరొకరి ప్రాణం కాపాడటానికి కారణం అయ్యాడు.
హరి తమ్ముడికి హృదయపూర్వక అభినందనలు.

Address

Challapalli
521121

Telephone

+917981542654

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Avanigadda BLOOD Donors posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram