Dr.Yashoda Hospital

Dr.Yashoda Hospital Achivements
----------------------
Best Doctor Award
Mother Teressa Award
Vaidya Siromani Award
Indi

గర్భం దాల్చిన తరువాత పోషకాహారమే సేవిస్తున్నప్పటికి, బిడ్డ ఎదుగుదలకు సంబంధించి తగిన ముందు జాగ్రత చర్యలు పాటించినప్పటికీ, ...
03/05/2018

గర్భం దాల్చిన తరువాత పోషకాహారమే సేవిస్తున్నప్పటికి, బిడ్డ ఎదుగుదలకు సంబంధించి తగిన ముందు జాగ్రత చర్యలు పాటించినప్పటికీ, గర్భం దాల్చిననాటి నుంచి స్త్రీ కాన్పు సమయం వరకూ కొన్ని రకాల అనారోగ్యాలకు గురికాక తప్పదు...
వాటిలో కొన్ని సర్వసాధరణమైన సమస్యలను కింద పేపర్ ఆర్టికల్లో వివరంగా ఇవ్వబడినాయి అవగాహన కోసం చదువుకోగలరు.

ఇవి సర్వసాధరణమైనప్పటికి సరైన డాక్టర్ పర్యవేక్షణలో సలహాలు, చికిత్స తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

అసలు ఇలాంటి సమస్యలకు గల కారణాలు, వాటికి తాత్కాలిక ఉపశమన విధానాలు కూడా వివరించటం జరిగింది.
మీ ఇంట్లో గాని, మీ ఫ్రెండ్స్ లోగాని ఎవరైన బాలింతలుంటే అవగాహన కోసం ఈ ఆర్టికల్ షేర్ చేసి సెండ్ చేయండి వారికి చాలా ఉపయోగపడుతుంది....

థాంక్యూ.
© Dr-Yashoda Penubala

గర్భిణి స్త్రీలలో కొద్దిపాటి పొత్తి కడుపు నొప్పి సహజ లక్షణమే౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼గర్భాశయంలో బిడ్డ ఎదుగుదల కారణంగాగర్భ సంచి...
30/04/2018

గర్భిణి స్త్రీలలో కొద్దిపాటి పొత్తి కడుపు నొప్పి సహజ లక్షణమే
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
గర్భాశయంలో బిడ్డ ఎదుగుదల కారణంగా
గర్భ సంచి చుట్టూ వున్న అవయవాలు వాటి స్థానం నుంచి కొద్దిగా పక్కకు జరగాల్సి రావడం మరియు గర్భాశయ కండరాలు స్ట్రెచ్ కావటం వలన కూడా
కొద్దిపాటి పొత్తి కడుపు నొప్పి సహజమే....అటువంటి నొప్పికి భయ పడాల్సిన పని లేదు...దానికదే సర్దు కుంటుంది....

భరించలేనంత పొట్ట నొప్పి తో ఇతరత్రా లక్షణాలు వున్నపుడు మాత్రం తగు జాగ్రత్త వహించాలి...

మొదిటిసారిగా గర్భం ధరించినపుడు చాల మంది స్త్రీలు
ఏ చిన్నపాటి ఇబ్బంది కలిగినా సరే తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు. అలా టెన్షన్ పడటం తల్లి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇలాంటి సందేహాలను డాక్టర్ని సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.

© Dr.Yashoda penubala
MD OBS &GYN -AYU

గర్భిణీ స్త్రీలు జాగ్రత్త పడాల్సిన సందర్భం __________________________గర్భం దాల్చిన మొదటి నెలల్లో ఎక్కువ వాంతులు కావడం, వ...
24/04/2018

గర్భిణీ స్త్రీలు జాగ్రత్త పడాల్సిన సందర్భం
__________________________

గర్భం దాల్చిన మొదటి నెలల్లో ఎక్కువ వాంతులు కావడం, వాంతి వస్తూన్నట్టు వుండడం అనే సమస్యలతో గర్భిణీలు ఇబ్బంది పడుతుంటారు. ఇలా కావడానికి కారణం గర్భం కారణంగా HCG హోర్మోన్ ఎక్కువ విడుదల కావడమే.....

ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఎక్కువ మోతాదులో పాలు తాగడం,దానిమ్మ పళ్ళు తినడం మంచిది.మాదీఫల రసాయనం అనే ఆయుర్వేద సిరప్ ఈ సమస్యకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.....

ఎక్కువ సార్లు వాంతులవుతున్నా ,మందులతో వాంతులు ఆగకున్నా, పిండం నిర్మాణంలో లోపాలుగానీ కవల పిల్లలు( twins ) ముగ్గురు పిల్లలు(triplets ) తల్లి గర్భంలో ఎదగడం కూడా కారణం కావొచ్చు అలాంటపుడు ఏమి తిన్నా నిలవకుండా ఎక్కువ సార్లు వాంతులవుతూ వుంటాయి.....

అలాంటపుడు ఇది సాధారణ లక్షణమే అని అశ్రద్ద చేయకుండా తగు జాగ్రత్తలు పాటించాలి
అవసరమగు వైద్య పరీక్షలు చేయించాలి డాక్టర్ సలహా మేరకు.........!!!

డా.యశోద పెనుబాల
ప్రసూతి &స్త్రీల వైద్య నిపుణులు (Ayu)

సాధారణంగా స్త్రీలలో సంతానలేమి కి కారణమయ్యే అంశాల్లో ట్యూబల్ బ్లాక్ ప్రధాన కారణం ...ట్యూబ్లు ఓపెన్ కావడానికి అల్లోపతిలో ఎ...
20/04/2018

సాధారణంగా స్త్రీలలో సంతానలేమి కి కారణమయ్యే అంశాల్లో ట్యూబల్ బ్లాక్ ప్రధాన కారణం ...

ట్యూబ్లు ఓపెన్ కావడానికి అల్లోపతిలో ఎలాంటి మందులు లేవు .....

ప్రత్యామ్నాయంగా టెస్ట్ట్యూబ్ బేబీ కి వెళ్ళమని చెప్తూ వుంటారు ....

కానీ ఆయుర్వేదంలో వేదసంహితల కాలం నుంచి వాడుకలో వున్న ఒక ప్రత్యేక చికిత్సా విధానం ద్వారా మూసుకుని పోయిన ట్యూబులు ఓపెన్ అవుతాయి ....

అంతేకాకుండా కృత్రిమ గర్భధారణ పద్ధతులు అవసరం లేకుండానే ...సహజంగానే గర్భం దాల్చే అవకాశాన్ని కూడా పొందవచ్చు ......

శాస్త్రీయంగా నిరూపణ కాబడ్డ ఆ ప్రత్యేక చికిత్సా విధానం ద్వారా ఎంతో మంది స్త్రీలు సత్ఫలితాలు పొందుతున్నారు......

 #అమ్మ అనే కమ్మటి పిలుపు కలగా మిగిలి పోకూడదు ....పిల్లలు పుట్టకపోవడం అన్న సమస్య చాలా మంది మహిళలను బాధిస్తూ ఉంటుంది.అమ్మ ...
19/04/2018

#అమ్మ అనే కమ్మటి పిలుపు కలగా మిగిలి పోకూడదు ....

పిల్లలు పుట్టకపోవడం అన్న సమస్య చాలా మంది మహిళలను బాధిస్తూ ఉంటుంది.అమ్మ అనే పిలుపు కోసం వారి మనసు పరితపిస్తుంది.
సంతానం కలగకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. రుతువు, క్షేత్రం, అంబు, బీజం,త్రిదోషాల వంటి ఎన్నో అంశాలను ఆయుర్వేదం పరిగణనలోకి తీసుకుంటుంది.
ఈ వైద్య ప్రక్రియలో సంతానలేమిని పరీశీలించాల్సిన దృక్కోణం,ఆ సమస్యకు లభ్యమయ్యే చికిత్సలతో నేను రాసిన #మాతృత్వానికి_ఆయుర్వేదం అనే
పుస్తకంలో సవివరంగా రాసాను...
రీసెంట్ గానే బుక్ రిలీజ్ చేసాను....😊

©డా. యశోద పెనుబాల
ప్రసూతి&స్త్రీల వైద్య నిపుణులు
&అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ -AYU

మొదటి సారి వచ్చిన గర్భాన్ని తీసేయడం అంత మంచిది కాదుఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా ప్రెసియస్.అంతే గాక హేల్తీ బేబీ పుట్టే అవకాశాల...
18/04/2018

మొదటి సారి వచ్చిన గర్భాన్ని
తీసేయడం అంత మంచిది కాదు
ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా ప్రెసియస్.అంతే గాక హేల్తీ బేబీ పుట్టే అవకాశాలు కూడా ఎక్కువే. కానీ చాలా మంది
స్వతహాగా వచ్చిన గర్భాన్ని వివిధ కారణాల వల్ల తీయించుకోవడానికి ట్రై చేస్తుంటారు....
అదంత మంచిది కాదు....
ఎందుకంటే అబార్షన్ వల్ల గానీ. అబార్షన్ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల గానీ..... ట్యూబ్స్ మూసుకుని పోయే అవకాశం ఎక్కువ గా ఉంటుంది...
ఈ మధ్య నేను రిసీవ్ చేసుకున్న కాల్స్ లో ఎక్కువ కాల్స్
#ట్యూబల్ బ్లాక్ (గర్భ నాళాలు మూసుకుని పోవడవం) సమస్య ఉన్న పేషేంట్స్ నుంచి రావడం గమనార్హం...

పెళ్లి అయ్యాక మొదటినెలల్లో స్వతహాగా వచ్చే గర్భం ఒక వరం లాంటిదే... దాన్ని దూరం చేసుకుంటే తర్వాత మళ్ళీ పిల్లలు కనడానికి హాస్పిటల్స్ చుట్టూ సంవత్సరాల తరబడి తిరగాల్సి ఉంటుంది.....
గమనించుకోగలరు....
ట్యూబల్ బ్లాక్ పేషేంట్స్ కు (టెస్ట్ ట్యూబ్ బేబీ) కి వెళుతున్నా...ఫలితం పొందలేక పోతున్నారు....

అందుకే తొందరపడి మొదటి గర్భాన్ని తీయించుకోకూడదు.తల్లి బిడ్డకి ఏదైనా ఇబ్బంది ఉంటే తప్ప...

13/06/2017

My live show about

స్త్రీలలో సంతానలేమికి ముఖ్య కారణమవుతున్న అండం విడుదల లోపాలు ఎందువల్ల కలుగుతాయి ? నెలా నెలా అండం విడుదల ఎందుకు జరగదు ? అండం విడుదల కానపుడు పీరియడ్ వచ్చే అవకాశం వుందా ?
ఇలాంటి సమస్య సాధారణంగా ఏ స్త్రీలలో వుంటుంది? అండం విడుదలకు హార్మోన్లకు మధ్య సంబంధం ఎలా వుంటుంది ?
అనే అంశాలపై జరిపిన చర్చ వివరాలు ఈ క్రింది లైవ్ షో లో... చూడండి....

Thanqq all....

Dr-Yashoda Penubala

02/06/2017

My live show about
The permnant cure of
poly cystic o***y disease (PCOD)

29/05/2017

about Uterine fibroids

26/05/2017

Live show about

in females caused by stress

22/05/2017

MY LIVE SHOW about PCOD

45 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసులో పూర్తిగా  పీరియడ్లు ఆగిపోవడాన్నే మెనోపాజ్ అంటారు..సాధారణంగా ఆ వయసులో... వయసు తెచ్చే సమ...
09/05/2017

45 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసులో పూర్తిగా పీరియడ్లు ఆగిపోవడాన్నే మెనోపాజ్ అంటారు..సాధారణంగా ఆ వయసులో... వయసు తెచ్చే సమస్యలతో పాటూ మెనొపాజ్ దశ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు కూడ తోడై మరింతగా ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది....క్షీణించేపోయే ఆరోగ్యాన్ని శరీర పటుత్వం నిలుపుకోవడానికి ఆయుర్వేదంలోని రీ జువినేటివ్ చికిత్సలు చాల ఉపయోగపడతాయి.....!!!

డా.యశోద పెనుబాల

# My article about MENOPAUSE management
In Ayurveda.....

 పిల్లలు పుట్టని దంపతుల్లో మందులకే కాదు మనసుక్కూడా ముఖ్య పాత్ర వుంటుంది *******************************. ఇన్ఫెర్టిలిటీ ద...
28/04/2017



పిల్లలు పుట్టని దంపతుల్లో మందులకే కాదు మనసుక్కూడా ముఖ్య పాత్ర వుంటుంది
*******************************. ఇన్ఫెర్టిలిటీ దంపతులకు డాక్టర్స్ చేసే కౌన్సిలింగ్ చాలా అవసరం.

*మొదటగా దంపతులిద్దరికీ సంతానలేమికి గల కారణాలు, వైద్య పరీక్షలు, చికిత్సా పద్ధతుల గురించి సక్సెస్ పొందటానికి ఎంతకాలం పడుతుంది? మొదలైన విషయాల గురించి తెలుసుకోవాలి

*చాలా మంది స్త్రీలు నెలంతా గర్భం వస్తుందనే ఆశగా ఎదురుచూస్తుంటారు..ఇటువంటి వారిలో ఆందోళన అధికంగా పెరుగుతుంటుంది.

*అంతేకాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఉద్యోగరీత్యా కలిసి పనిచేసే వారు కూడా సంతానం లేని దంపతులను వేదనకు గురి చేస్తుంటారు.

*అందుకని దంపతులు పిల్లలు పుట్టనంత కాలం కుటుంబ సభ్యులకు దూరంగా జీవించటానికే ఇష్టపడుతుంటారు. ఇతరులను కలవటానికి కూడా నిరాకరిస్తుంటారు. ఫలితంగా మానసిక ఒత్తిడికి తీవ్ర విచారానికి లోనవుతుంటారు.హార్మోన్ల లోపానికి గురి అవుతుంటారు

*ఈ కారణాలన్నిటి వల్ల అధిక డిప్రెషన్ కు లోనవడం కారణంగా ఆహారపు అలవాట్లలో తేడాలు వస్తాయి. నియంత్రణ లేకుండా తినేస్తుంటారు. తద్వారా అధిక స్థూలాకాయం, స్త్రీల బహిష్టుక్రమంలో తేడాలు మొదలైనవి చోటు చేసుకుంటాయి.

*అందుకని మానసిక బలాన్ని పెంపొదించుకోవాల్సిన అవసరం గురించి దంపతులిద్దరికీ అవగాహన కల్పించాలి. వారికి ఉన్న సంతానలేమి కారణాలను, సాధ్యాసాధ్యాలను వివరించాల్సి ఉంటుంది.

*కొన్ని సందర్భాల్లో సంతానం పొందటానికి వేలకొద్ది డబ్బు ఔషదాల కోసం ఖర్చు చేస్తూ ఉద్యోగరీత్యా దూరంగా నివసిస్తుంటారు. అలాంటి వారికి ఫెర్టిలిటీ పిరియడ్ గురించి అవగాహన కల్పించాల్సి ఉంటుంది.

*కనీసం ఫెర్టిలిటీ పీరియడ్లో అయినా భార్యాభర్తలు ఒకచోట ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
చాలామంది సంతానం కలగకపోవటానికి స్త్రీలే ఎక్కువ శాతం కారణమంటూ ఉంటారు. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరకు రావటానికి కూడా పురుషులు నిరాకరిస్తుంటారు.

*ఒకవేళ ఏదైనా కారణం స్త్రీలో ఉందని తెలియగానే మనస్సును గాయపరిచే మాటలతో మరింత అశాంతికి గురిచేస్తుంటారు. ఫలితంగా భార్యభర్తల మధ్య దూరం పెరగటంతో పాటు ఫెర్టిలిటీ పిరియడ్లో అయినా ఒకచోట వుండి కూడ వారు విజయం సాధించలేకపోతున్నారు.

సాధ్యమైనంత వరకూ దంపతులిద్దరూ క్రమం తప్పకుండా డాక్టర్ ను సంప్రదించటం కంటే కూడా భార్యాభర్తలిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవటం, పొరపొచ్చాలు లేకుండా మెలగడం కూడా ముఖ్యమైన విషయమనేది గుర్తించాలి.

మందులకే కాదు, మనస్సుకు కూడా సంతానవంతులు కావటానికి ముఖ్యపాత్ర ఉంటుందని గుర్తించాలి. ఆందోళన కలిగించే ఏ అంశాన్నయినా దూరంగా ఉంచాలి

డా.యశోద పెనుబాల
ప్రసూతి &స్త్రీల వైద్య నిపుణులు -AYU

*సంతాన లేమికి కారణమయ్యే అంశాల్లో  ఏ  ఒక్కటీ లేనప్పటికీ చాలమంది దంపతులు పిల్లలను కనడంలో విఫలమవుతుంటారు.*దంపతులిద్దరికీ అన...
27/04/2017

*సంతాన లేమికి కారణమయ్యే అంశాల్లో ఏ ఒక్కటీ లేనప్పటికీ చాలమంది దంపతులు పిల్లలను కనడంలో విఫలమవుతుంటారు.

*దంపతులిద్దరికీ అన్ని రకాల వైద్య పరీక్షల్లో ఫలితాలు సక్రమంగానే ఉన్నా కూడా సంతానలేమికి గురవుతుంటారు.

*కొన్ని సందర్భాల్లో స్త్రీలలో ప్రతి నెల అండం విడుదల సక్రమంగానే అవుతుంటుంది. బహిష్టు క్రమంలో కూడా ఎలాంటి లోపం ఉండదు. ట్యూబ్స్ పనితీరు సవ్యంగానే ఉంటుంది. అయినప్పటికి ఫలితం కనిపించదు.

*పురుషులకు సంబంధించి శుక్రకణాల్లో ఎలాంటి లోపం లేనప్పుడు కూడా సంతానలేమికి గురవుతుంటారు. ఇటువంటి పరిస్థితిని అన్ ఎక్స్ ప్లేయిన్డ్ ఇన్పెర్టిలిటీ అంటారు.
అంటే కారణం తెలియని లేదా ఏ కారణం లేని సందర్భాల్లో కూడా సంతాన రాహిత్యంతో అనేకమంది దంపతులు వేదన చెందుతుంటారు. ఇలాంటి పరిస్థితి సుమారుగా 30 శాతం మందిలో ఉండే అవకాశాలున్నాయి.

*చాలా వరకు ఏ కారణం లేని లేదా అన్ ఎక్స్ ప్లేయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ కలిగిన దంపతులు అనుకోకుండా గర్భం దాలుస్తుంటారు. కొంతమంది మాత్రం దీర్ఘకాలం పాటు సంతానవంతులు కావటంలో విజయం సాధించలేక పోతుంటారు.

*ఇలాంటి వారిలో వివాహమైన తరువాత మూడు సంవత్సరాల వరకూ సంతానం కలగకపోతే ప్రతి సంవత్సరానికి 10 శాతం చొప్పున ఫెర్టిలిటీరేట్ తగ్గే అవకాశాలుంటాయి. 35 సంవత్సరాల వయస్సు దాటాక స్త్రీలలో పెర్టిలిటీరేటు బాగా తగ్గిపోతుంది.

 యుటిరైన్ పైబ్రాయిడ్స్(గర్భాశయగడ్డలు)సంతానలేమికి కారణమవుతాయా?అనే సందేహం చాల మందిలో వుంటుంది....కొంతవరకు అది నిజమే అని చె...
16/04/2017



యుటిరైన్ పైబ్రాయిడ్స్(గర్భాశయగడ్డలు)
సంతానలేమికి కారణమవుతాయా?
అనే సందేహం చాల మందిలో వుంటుంది....
కొంతవరకు అది నిజమే అని చెప్పొచ్చు.....

యుటిరైన్ పైబ్రాయిడ్స్ కారణంగా సుమారు 10% శాతం మంది స్త్రీలు సంతానవంతులు కాలేకపోతున్నారు.....
యుటిరైన్ పైబ్రాయిడ్స్ పిల్లలను కనే వయసులో వున్న స్త్రీలలో అధికంగా కనిపిస్తుంటుంది.

యుటిరైన్ పైబ్రాయిడ్స్ ఏర్పడదానికి గ్రోత్ హార్మోన్ ఎక్కువ విడుదల కావటం ప్రధాన కారణం....ఇవి మిల్లీ మీటర్ నుంచి సెంటీమీటరు సైజుల్లో ఒకటి కంటె ఎక్కువ ఏర్పడతుంటాయి

పైబ్రాయిడ్స్ పరిమాణంలో పెద్దదిగా వున్నప్పుడు
మాత్రం స్త్రీ గర్భం దాల్సితే..గడ్డల కారణంగా
గర్భాశయంలో ఎదగాల్సిన పిండానికి పోషణ అందకపోవటం వలన అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.....

డా యశోద పెనుబాల

ప్రీ మెన్ స్ట్రువల్ సిండ్రోమ్(PMS)/(PMT)ఈ రోజుల్లో ఈ సమస్య గురించి తెలియని స్త్రీలు వుండరు.సుమారుగా 75%స్త్రీలు ఈ సమస్య ...
14/04/2017

ప్రీ మెన్ స్ట్రువల్ సిండ్రోమ్(PMS)/(PMT)

ఈ రోజుల్లో ఈ సమస్య గురించి తెలియని స్త్రీలు వుండరు.సుమారుగా 75%స్త్రీలు ఈ సమస్య తో బాధ పడుతున్నారు

#లక్షణాలు:

*మానసిక ఆందోళన, ఒత్తిడి, విచారం

*కారణం లేకుండానే ఏడ్వడం,ప్రవర్తనలో మార్పులు వంటి లక్షణాలుంటాయి.

*రోజువారీ పనుల్లో అయిష్టత, పనిపై ధ్యాస నిలుపకపోవటం, ఏకాగ్రత కుదరకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

*కడుపులో గ్యాస్ చేరటం, శరీరంలో వాపు, బరువు పెరగటం, పార్శ్యపు తలనొప్పి, రొమ్ముల్లో వాపు, నొప్పి, అరుదుగా నడుంనొప్పి వంటివి వస్తాయి.

*బలహీనంగా అనిపించటం, ఆకలి తగ్గటం, నిద్రపట్టకపోవటం, తీపి, ఉప్పు కలిగిన ఆహారపదార్ధాలను తినాలనే కోరిక,దాంపత్య కోరికలు తగ్గటం వంటి లక్షణాలుంటాయి

*కొన్ని సమయాల్లో వాంతులు అవుతాయి. అప్పుడప్పుడు విరేచనాలవుతాయి.

ఇలాంటి లక్షణాలన్నీ పీరియడ్ రావడానికి వారం రోజుల ముందు నుంచి మొదలవుతాయి.పీరియడ్ రాగానే కొంత మందిలో తగ్గిపోతాయి కొంతమందిలో రుతుస్రావం ఆగే వరకూ వుంటాయి.

#చికిత్స

అశ్వగంధ చూర్ణం, అతి మధుర చూర్ణం, ఆకుపత్రి చూర్ణం సమానంగా కలుపుకుని ఒక స్పూన్ చొప్పున రెండుసార్లు సేవిస్తే మానసిక వికారాలను నివారిస్తాయి

ముండీ స్వరసంలో మిరియాల చూర్ణం కలిపి వేడిచేసి భోజనానికి ముందు సేవిస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. నరాల బలహీనత శమిస్తుంది.

కరివేపాకు రసం ఉసిరికాయ రసం సమానంగా తీసుకొని రోజూ అరకప్పు సేవిస్తే శరీరంలోని వాపు తగ్గుతుంది.

ఆముదపు ఆకులను వెచ్చచేసి లేదా సీతాఫలం ఆకులను దంచి రొమ్ములకు కడితే వాపు, నొప్పి తగ్గుతాయి. లేదా కలబంద గుజ్జులో పసుపును కలిపి లేపనం చేసినా ఫలితం ఉంటుంది.

#వీటితో తగ్గక పోతే డాక్టర్ సలహా తప్పనిసరి

డా యశోద పెనుబాల, MD ,AYU
ప్రసూతి &స్త్రీలవైద్య నిపుణులు

Address

Chanda Nagar

Telephone

9052250341

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Yashoda Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category