Surya Savarnika Manavu Ashramam

Surya Savarnika Manavu Ashramam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Surya Savarnika Manavu Ashramam, Medical and health, Surya Savarnika Manavu Ashramam, Enkoor.
(1)

"ఇక రాను ఆనుకున్నారా! మా అక్కని తీసుకు రాలేను అనుకున్నారా" అని బాంక్ అధికారుల ముందు చిరంజీవి గారి స్టయిల్లో ఒక డైలాగ్ కొ...
29/04/2026

"ఇక రాను ఆనుకున్నారా! మా అక్కని తీసుకు రాలేను అనుకున్నారా" అని బాంక్ అధికారుల ముందు చిరంజీవి గారి స్టయిల్లో ఒక డైలాగ్ కొట్టి,స్మశానం కి పోయిన,చనిపోయిన తన అక్క శవాన్ని, సమాధి తవ్వి,తీసి,భుజాన వేసుకుని, బేతాలుని భుజాన వేసుకున్న పట్టు వదలని విక్రమార్కుడిలా ,వీధుల్లో ,పబ్లిక్ అందరూ చూస్తుండగా తీసుకు వచ్చి ,ఒడిశా గ్రామీణ బాంక్ సిబ్బంది ముందు పడేస్తే,వాళ్ళకి చలి జ్వరం వచ్చి,వెంటనే ఆ గిరిజనుడు అక్క సొమ్మును ,చట్టబద్ద వారసుడిగా ఉన్న అతనికి ఇచ్చి పంపించారు ఆట.
కేసు ఏమిటంటే,ఒరిస్సా లో ఒక గిరిజనుడు అక్క చనిపోయింది.ఆమెకు ఈ అమాయకపు తమ్ముడు తప్ప,వారసులు లేరు.ఆమె ఖాతాలో 19 వేలుకు పైగా ఉంది.ఎన్ని సార్లు తిరిగిన బాంక్ వాళ్ళు పట్టించుకోవడం లేదు.చివరకు ఎలాగైనా వదిలించుకోవలని "మీ అక్కను తీసుకు రా ఇస్తాం అన్నారు అంట. దానికి ఒళ్ళు మండిన సదరు గిరిజనుడు పై విధంగా రియాక్ట్ అయితే ,దెబ్బకు సమస్య పరిష్కారం అయింది.

మృణ్మయ పాత్ర లో అమృతం - వింత స్వర్ణపాత్ర లో తన-మృతం!ఒకరేమో యాభై లక్షల నీటి బాటిల్..మరొకరేమో వంద రూపాయల మట్టి కుండ..ఒకటేమ...
28/04/2026

మృణ్మయ పాత్ర లో అమృతం - వింత స్వర్ణపాత్ర లో తన-మృతం!

ఒకరేమో యాభై లక్షల నీటి బాటిల్..
మరొకరేమో వంద రూపాయల మట్టి కుండ..
ఒకటేమో బంగారు మెరుపుల హంగు,
మరొకటేమో కమ్మని మట్టి పరిమళపు రంగు!
అక్కడ బాటిల్ ధరకే గుండెలు జారిపోతాయి,
ఇక్కడ కుండలోని చల్లదనానికి ప్రాణాలు లేచి వస్తాయి!
డబ్బుంటే దొరుకుతుందేమో ఆ విదేశీ నీరు,
కానీ కుండలో తాగే ఆ తృప్తి ముందు.. ఏ బాటిల్ సరిపోదు గురు!
చిన్న ముంతలో ఉన్నది ప్రకృతి ఇచ్చిన చల్లదనం,
పెద్ద బాటిల్ వెనుక ఉన్నది కేవలం ధన ప్రదర్శనం!
ధర ముఖ్యం కాదు, దాహం తీరడం ముఖ్యం..
అందుకే మట్టి కుండ నీరే అందరికీ క్షేమం!

"నిందితుడు బాధితురాలి పై గత పాతికేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు".    ఇలాంటి కంప్లైంట్ ల తో కూడిన F I R లు బహుశా భారతదేశం...
28/04/2026

"నిందితుడు బాధితురాలి పై గత పాతికేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు".
ఇలాంటి కంప్లైంట్ ల తో కూడిన F I R లు బహుశా భారతదేశం లోనే చూస్తామేమో! ఒక వ్యక్తి పై రేప్ కేసు పెట్టాలి అంటే,బాధితురాలిపై నిందితుడు ఏళ్ల తరబడి రేప్ చేయనక్కరలేదు.ఆమె అనుమతి లేకుండా ఒక్కసారి లైంగికదాడికి పాల్పడినా అది రేప్ గానే పరిగణిస్తారు.16 ఏండ్లలోపు మైనర్ బాలిక అయితే,అనుమతి ఉన్నా, అది చెల్లదు కాబట్టి,అది అత్యాచారమే.ఇక్కడ భార్యాభర్తల మధ్య జరిగే బలవంతపు సెక్స్ ను మాత్రం రేప్ గా పరిగణించరూ.అలాగే బలవంతం జరిగిందా,లేక మహిళ అనుమతితో జరిగిందా అనేది ప్రధానం గా పరిగణలోకి తీసుకున్నప్పుడు,పైన చెప్పిన "కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అత్యాచారం"అనే కేసులు వీగిపోతుంటాయి.
స్త్రీ ,పురుషుల రిలేషన్ లలో వివాహబందం స్తానం లో వచ్చిన నయా ట్రెండ్ ఏమిటంటే, సహజీవన సంబంధం.ఇష్టం వచ్చినన్నాళ్లు కలిసి ఉండడం,ఏదైనా గొడవ వస్తే,సహజీవణుడు పై రేప్ కేస్ పెట్టడం పరిపాటి గా మారింది కొంతమంది మహిళలకు.అలాంటి వారికి చెంప పెట్టు తీర్పు ఇచ్చారు గౌరవ సుప్రీం కోర్టు వారు.
మధ్యప్రదేశ్ కి చెందిన ఒక వితంతువు 15 ఏండ్ల పాటు నిందితునితో సహజీవనం చేసి,ఒక బిడ్డను కన్నాక,అతడు గొడవ పెట్టుకుని వెళ్ళిపోతే, చేసింది సహజీవనం కాబట్టి,భార్య గా అమెకేమి హక్కులు లేవు కాబట్టి,అతగాడి పై రేప్ కేసు పెడితే కోర్టులు ఎలా ఒప్పుకుంటాయి?ఆమె అనుమతి లేకుండా అతగాడు 15 ఏండ్లు సహజీవనం చేశాడా?అన్న పాయింట్ మీదే ఆమె పెట్టిన రేప్ కేసు వీగిపోయింది.కాబట్టి ఇకనైనా మహిళలు ఆలోచించాల్సింది పెండ్లి అనేది పురుషులకు దులుపుకు పోయే బంధం అయితే స్త్రీలకు ఎటువంటి హక్కులు లేని,ఇవ్వని బంధం.ఇష్టం అయితే డేటింగ్ లేకుంటే బ్రేక్ అప్ అనే విదేశీ బంధాలు ఇక్కడ సెలబ్రిటీలకు తప్ప సామాన్య స్త్రీలకు కష్టాలే కలిగిస్తాయి అని గ్రహిస్తే మంచిది.

వెనుకటికెవడో "పెంటపని" చేసి,కడుకోవడానికి చెరువు దూరంగా ఉందని చెరువు మీద అలిగాడు అట. అలా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత తీస...
27/04/2026

వెనుకటికెవడో "పెంటపని" చేసి,కడుకోవడానికి చెరువు దూరంగా ఉందని చెరువు మీద అలిగాడు అట. అలా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం.మద్యం కేసులో ట్రయిల్ కోర్టు డిశ్చార్జ్ చేసినప్పుడు సంబరపడిన సార్, హైకోర్టు వద్దకు వచ్చేసరికి,జడ్జి గారి మీద విశ్వాసం లేదని,వేరే బెంచ్ కు మార్చమని పిటిషన్ వేస్తే,దానిని ఢిల్లీ హై కోర్టు కొట్టేసింది.దానికి కేజ్రీవాల్ గారు అలిగి హియరింగ్ లకు నేను హాజరు కాను అంటున్నారు.కాకపోతే ఎవరికి నష్టం.
మీ మీద నమ్మకం లేక 7 గురు రాజ్యసభ M. P. లు మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లో కి వెడితే మీరు ఏమి చేశారు?కోర్టు కూడా తన పని తాను చేసుకొంటూ పోతోంది. చెరువు మీద అలిగితే చివరకు ఎండిపోయేది మీకే. ఎలాగూ మీ పార్టీకి ఎండటం మొదలు అయినట్లు ఉంది.సమస్య ను చాకచక్యంగా ఎదుర్కోవడం మానేసి ప్రతిదానికి అలుగుడు రాజకీయం చేస్తే,ఆమ్ ఆద్మీ కి సామాన్య మానవులు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది.

ఆధునిక జీవన శైలి పేరిట మనిషి తన వేగం పెంచాడు.సహనం,సంయమనం,ఆలోచించే గుణం,విచక్షణా జ్ఞానం ఆ వేగం లో కొట్టుకు పోతున్నాయి.భార...
27/04/2026

ఆధునిక జీవన శైలి పేరిట మనిషి తన వేగం పెంచాడు.సహనం,సంయమనం,ఆలోచించే గుణం,విచక్షణా జ్ఞానం ఆ వేగం లో కొట్టుకు పోతున్నాయి.భార్యాభర్తల సంబంధాలు తిరగబడుతున్నాయి.ఒకప్పుడు కూరలో ఉప్పు తక్కువైనదని,భార్యను కర్రతో కొట్టే భర్త చేతిలో ని కర్ర కొడవలి గా మారి, భార్య చేతిలోకి వచ్చింది."నాన్ వెజ్ ఎందుకు వండలేదు"అని అడిగినందుకు అది భర్తను నరికి చంపింది అట. కాబట్టి జాగ్రత్త. జీవిత భాగస్వాములు తో గొడవ పడాలి అనుకుంటే, జీవితభిమా చేసుకోవలసిన పరిస్థితులు వచ్చాయి.

ఈ మధ్య వెటరన్ సినిమా హీరోయిన్ లు  ఫంక్షన్ లు,సమావేశంలలో తమ హయం లలో జరిగిన కాస్టింగ్ కౌచ్ సంఘటనలు గురించి  వివరిస్తూ,పలాన...
25/04/2026

ఈ మధ్య వెటరన్ సినిమా హీరోయిన్ లు ఫంక్షన్ లు,సమావేశంలలో తమ హయం లలో జరిగిన కాస్టింగ్ కౌచ్ సంఘటనలు గురించి వివరిస్తూ,పలానా నిర్మాత,దర్శకులు తమకు అవకాశాలు ఇవ్వడం కోసం ఏ విధంగా వాడుకుంది చెపుతూ,పబ్లిక్ సింపతి కోసం తెగ తాపత్రయ పడిపోతున్నారు.అన్ని తెలిసిన వాళ్లు ఇదొక పబ్లిసిటీ స్టంట్ అంటుంటే,ఇంకొంతమంది "మీ టూ"అని వారి కథలు చెపుతున్నారు.J D చక్రవర్తి అనే నటుడు కూడా తాను,ఇంకొక హీరో ఒక హీరోయిన్ తో గెస్ట్ హౌస్ లో స్నేహపూర్వక డిన్నర్ లో ఉండగా, ఒక ముసలి నిర్మాత వచ్చి,ఆ కుర్ర హీరోయిన్ తో రొమాన్స్ చేస్తుంటే,తాము మంచం క్రింద దాక్కుని ఆ కామ వికార చేష్టలు చూసాం అని చెప్పాడు.
సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రొచ్చు గుంట.అక్కడ మగవాళ్లకు అవకాశాలు రావడం సంగతేమో కానీ,లేడీస్ కి సినిమా ఛాన్స్ రావాలంటే,నిర్మాతకో, డైరక్టర్ కో,లేకపోతే సొల్లు కార్చుకుంటూ తిరిగే ఏ స్టూడియో కుక్కకో ముందు సిగ్గుపడకుండా తన సినిమా మొత్తం చూపిస్తేనే ఆ తర్వాత రీల్ లైఫ్ లో స్థిరపడటం.పెద్ద పెద్ద నిర్మాతలు,డైరెక్టర్ లు,నటులు కూతుళ్ళకి మినహాయింపు ఉండవచ్చు.ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.మరి ఇప్పుడు అన్ని అయిపోయాక ఇన్నేళకు కాస్ట్ కౌచింగ్ అంటే ఎలా? "గొంగట్లో అన్నం తింటూ, వెంట్రుకలు ఉన్నాయి" అంటే ఎలా ?

ఓం నాగేంద్ర సహిత శ్రీ లక్ష్మినరసింహస్వామి నే నమో నమః
24/04/2026

ఓం నాగేంద్ర సహిత శ్రీ లక్ష్మినరసింహస్వామి నే నమో నమః

ఆన్లైన్ ఫుడ్/గ్రోసరి డెలివరీ చేసే వారికి,ఐటమ్  క్వాలిటీ గురించి పట్టింపు ఉండదు.హోటల్ వాళ్ళు ప్యాక్కింగ్ చేసి ఇస్తే,డెలివ...
24/04/2026

ఆన్లైన్ ఫుడ్/గ్రోసరి డెలివరీ చేసే వారికి,ఐటమ్ క్వాలిటీ గురించి పట్టింపు ఉండదు.హోటల్ వాళ్ళు ప్యాక్కింగ్ చేసి ఇస్తే,డెలివరీ బాయ్ లు తీసుకు వచ్చి మన ముఖాన పడేస్తారు.అది బాగుందా?లేదా పాడయిందా వారికి అనవసరం.రిటర్న్ పెట్టమంటారు.కొన్ని కంపెనీలు వెంటనే స్పందిస్తాయి.కొన్ని అంతే సంగతులు!డిస్కౌంట్ 40 ,50 పెర్సెంట్ ఉంది అంటే ఐటమ్ గురించి ఆలోచించాల్సింది-బయటకు వెళ్లి మనం తింటే 70 ,80 రూపాయలు అయ్యే టిఫిన్,ఆన్లైన్ లో తెప్పిస్తే, అవి ఇవి అని 170 నుండి 200 వరకు ఛార్జ్ చేస్తారు.వాళ్ళు ఒకవేళ తగ్గించినా ఆ ఎస్ట్రా చార్జెస్ లో తగ్గిస్తారు తప్ప,అసలు లో ఎప్పుడూ తగ్గించి ఇవ్వరు.
"లాభం లేని శెట్టి వరదకు పోడు" అని మనకు ఫ్రీ గా ఇచ్చే ప్రతిదాంట్లో వారికి లాభమే ఉంటుంది.ఉదాహరణకు నేను మొన్న ఇంస్టాగ్రామ్ లో రెండు పాల ప్యాకెట్లు,ఇతర ఐటమ్స్ తెప్పించాను.రెండు పాల ప్యాకెట్లలోని పాలు విరిగి పోయాయి.అయితే ఈ కొనుగోలు లో నాకు 1 రూపాయి పధకం క్రింద కిలో పంచదార్ మరియు కిలో ఉల్లిగడ్డలు 2 రూపాయలకు ఇచ్చారు.వాటి ఖరీదు ఇంచుమించు విరిగి పోయిన పాల ఖరీదు కు సమానం."చచ్చినోడి పెళ్లికి దక్కినంత"అని కామ్ అయి పోయాను.కాబట్టి ఓపిక ఉంటే బయటకు వెళ్లి నాణ్యత,రేట్లు పరిసిలించి తెచ్చుకోవడం ఉత్తమ్మం. ఓపిక లేకుంటే కనీసం రిటర్న్ చేసి,కంప్లైంట్ చేయండి.అది కూడా చేయలేకపోతే,ఇచ్చిన్నోడిని మీకు వచ్చిన బూతులు అన్ని తిట్టుకుని, రెండు మూడు సార్లు అలాగే జరిగితే ,ఆ కంపెనీ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టుకోండి.

ఈ సంవత్సరం వాతావరణం ఎల్ నినో ప్రభావం తో కరువుకాలం రావచ్చు అని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.ముఖ్యంగా ఇండియాలో జూన్ నుండి ఆ...
24/04/2026

ఈ సంవత్సరం వాతావరణం ఎల్ నినో ప్రభావం తో కరువుకాలం రావచ్చు అని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.ముఖ్యంగా ఇండియాలో జూన్ నుండి ఆగస్టు వరకు వర్షాలు అనుకున్న స్థాయిలో పడకపోవడం వలన ఈ పరిస్థితి రావచ్చు అంటున్నారు.కాబట్టి దీనివలన ఉద్యానవన పంటలు,కోళ్ల పెంపకం,డైరీ నిర్వహణ చేపల పెంపకం ,పై ప్రభావం పడుతుంది.గ్రామీణ,నగర ప్రాంతాల్లో నీటికి కట కట గా ఉంటుంది.ఇండ్లలో నీటిని పొదుపుగా వాడటం,పంటలకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మాత్రమే నీటిని అందించే యాజమాన్య పద్ధతులు అవలంబించాలి. ఎంతో అవసరం అయితే తప్ప,మనుషులను డి హైడ్రేట్ కి గురి చేసే ఏ కార్యక్రమాలు పెట్టుకోకపోవడమే మంచిది.ముఖ్యంగా రాజకీయ సభలు ,జనాల్ని సమావేశ పరచే కార్యక్రమాలు లాంటివి బంద్ చేయాలి.తిరిగి సానుకూల పరిస్తితులు ఏర్పడే దాకా జాగ్రత్తగా ఉండాలి.

"కట్టుకుంటేనే కారాగారం!ఎగేసుకుపోతే ఏమీలేదు" అన్నట్లు ఉంది,ఇటీవల సుప్రీం కోర్టువారు వివాహేతర సంబంధాలు పై ఇచ్చిన తీర్పును ...
23/04/2026

"కట్టుకుంటేనే కారాగారం!ఎగేసుకుపోతే ఏమీలేదు" అన్నట్లు ఉంది,ఇటీవల సుప్రీం కోర్టువారు వివాహేతర సంబంధాలు పై ఇచ్చిన తీర్పును ,అస్సాం అసెంబ్లీ పాస్ చేసిన బహుబార్యత్వ నిషేధ బిల్లును విశ్లేషిస్తే....
ఇటీవల ఒక ప్రియురాలు వివాహం అయిన తన ప్రియుడి తో సహజీవనం చేస్తూంటే, భార్య తరపు వాళ్ళు కేసు పెడితే"మేజర్ అయిన వ్యక్తులు, తాము తమకు నచ్చిన పరాయి వ్యక్తులతో , వివాహేతర సంబంధం లో అయినా సరే,సహజీవనం చేస్తున్నా, OYO రూమ్ లో దొరికినా, అదేమి నేరం కాదని,పై పెచ్చు వారు కోరితే పోలీస్ రక్షణ ఇవ్వాల్సిందేనని సుప్రీం కోర్టు వారు సెలవిచ్చారు.
మరి ఇప్పుడేమో అస్సాం అసెంబ్లీ ఏమో ,బహుభార్యత్వం నిషేధిస్తూ,ఒకటి కంటే ఎక్కువ పెండ్లిళ్ళు చేసుకంటే 10 ఏండ్ల కఠిన కారాగార శిక్ష అని బిల్ పాస్ చేశారూ అంట. అంటే ఈ బిల్ ని ఓడించాలి అంటే పెండ్లి గట్రా లేకుండా ఎంతమంది ప్రియుర్రాళ్ళు/ప్రియులతో అయినా,ఇష్టం వచ్చినంత కాలం సహజీవనం సాగిస్తుంటే,వాళ్లని కట్టుకున్న బాధిత భార్యలు లేక భర్తలు నిలువు గుడ్లేసుకుని చూస్తూ ఉండిపోవాలి అన్న మాట.
ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వివాహేతర సంబంధాలను నిషేదిస్తూ, ఉల్లంఘన కు 10 ఏండ్ల కఠిన కారాగార శిక్షను విధించేలా చట్టాలు చేయాలి.అప్పుడే బహు బార్యత్వ నిషేధ చట్టం కి ఒక విలువ ఉంటుంది.

ఒకటవ తరగతి చదవకుండా డైరెక్టుగా డిగ్రీ పాసయిన స్టూడెంట్ లాగ, చిన్నప్పుడు ఒక్కసారి అయినా ముడి కడుగకుండా,కనీసం డైపర్ అయినా ...
22/04/2026

ఒకటవ తరగతి చదవకుండా డైరెక్టుగా డిగ్రీ పాసయిన స్టూడెంట్ లాగ, చిన్నప్పుడు ఒక్కసారి అయినా ముడి కడుగకుండా,కనీసం డైపర్ అయినా మార్చే కష్టం పడకుండా,డైరెక్టుగా అమ్మమ్మ గా మారి,"మనవడా,నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఏనాడైనా చెప్పావా"అంటే పాపం!ఏమంటాడు ఆ మనవడు"
నందమూరి సంబంధికులను ను ఈ 'అమ్మ కానీ అమ్మ" తన కామెంట్లు తో వెంటాడుతున్న వైనం చూస్తుంటే"నిను వీడని నీడను నేనే"అనే పాట గుర్తుకు రావడం లేదూ!

వావ్!భూభారతి చట్టం ద్వారా ప్రతి రైతు కమతానికి భూదార్  ఇస్తాం అని రెవిన్యూ మంత్రి గారు గత రెండేళ్లుగా చెపుతుంది ఇన్నాళ్లక...
22/04/2026

వావ్!భూభారతి చట్టం ద్వారా ప్రతి రైతు కమతానికి భూదార్ ఇస్తాం అని రెవిన్యూ మంత్రి గారు గత రెండేళ్లుగా చెపుతుంది ఇన్నాళ్లకు తొలిసారిగా ఆవిష్కృతమైంది అన్న మాట.సంతోషం.ఇపుడు మాకు అర్థం అయింది ఏమిటంటే:
1).రైతు భూ కమతానికి భూదార్ రావాలంటే ఆ రైతు ఖచ్చితంగా తన భూమిని వేరేవారికి అమ్మి తీరాలి.
2)ఆ భూమికి తానే సర్వే చేయించుకుని,సదరు సర్వే మాప్ తో సేల్ రెజిస్ట్రేషన కోసం భూభారతిలో అప్లై చేస్తే,తహశీల్ధార్ గారు క్షేత్రస్థాయి పరిశీలన చేసి,సరిహద్దు రైతుల తో అభ్యంతరం లేదని దృవీకరించుకుని,అప్పుడు ఆ కమతానికి,భూదార్ నంబర్ కేటాయించి,ఆ నంబర్,సర్వే మాప్ తో రిజిస్ట్రేషన్ చేస్తారు అన్న మాట.అలా తెలంగాణ లో తొలి రెజిస్టేషన్ కూసుమంచి మండలం మోటాపురం గ్రామం లో ఎకరం పై చిలుకు కు చేసి,తొలి భూదార్ నంబర్ కేటాయించారు.
3).అయితే ,రాష్ట్రం లో ఉన్న కోట్లాది ఎకరాల భూమి కమతాల మొత్తానికి భూదార్ నంబర్ లు కేటాయించాలి అంటే ఎన్ని శతాబ్దాలు పడుతుంది?
4).రైతు తన భూమిని ఎవరికి అమ్మక పోతే,అతని భూ కమతానికి భూదార్ నంబర్ రానట్లేగా!?ఎందుకంటే భూదార్ నంబర్ రావాలంటే సర్వే మాప్ ఉండాలి.అది అతనికి అవసరం అయ్యేది తన భూమిని వేరే వ్యక్తికి అమ్మెటప్పుడు మాత్రమే.అప్పటి వరకు ప్రభుత్వం మీ భూమికి భూదార్ ఇవ్వదు.

5).ప్రభుత్వం రాష్ట్రం లోని మొత్తం భూమికి భూదార్ కేటాయింపు కోసం రీ సర్వే జరపాలంటే చేయించాలి అంటే 2029 ఎన్నికల్లోపు అది సాధ్యం కాదు,పైపెచ్చు చాలా రిస్క్ అని అభిప్రాయానికి వచ్చి,ఇలా రైతుల భూముల అమ్మకం రిజిస్ట్రేషన్ సమయం లో మాత్రమే భూదార్ కేటాయింపు చేయడానికి,సర్వే మాప్ కంపల్సరీ చేసింది.
6).ఏ రెవిన్యూ గ్రామం లో అయినా సరే,ఒక్క కమతానికి అయినా అమ్మకం జరిగి,భూదార్ కేటాయించబడితే,ఇక ఆ గ్రామము లో భూభారతి సక్సెస్ అయినట్లే.
7)మరి ఇప్పటివరకు ఉన్న పాస్ బుక్ లు,పహానిలు ఎందుకు అంటే,మీ భూమిని వేరేవారికి అమ్ముకోవడానికి మాత్రమే .మీకు భూదార్ తో కూడిన భూమి కావాలంటే,మీరు ఎవరి దగ్గరైన కొనాల్సిందే.లేదంటే మీ భూమిని మీ బంధువుల పేర రిజిస్ట్రేషన్ చేయించి,తిరిగి మీ పేరున రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.అప్పుడు ప్రభుత్వానికి డబుల్ రిజిస్ట్రేషన్ పిజు గ్యారంటీ.మీ భూమికి భూదార్ నంబర్ గ్యారంటీ.
తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని ఈ విషయం లో క్లారిటీ కోరుతున్నాం.

Address

Surya Savarnika Manavu Ashramam
Enkoor
507168

Alerts

Be the first to know and let us send you an email when Surya Savarnika Manavu Ashramam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Surya Savarnika Manavu Ashramam:

Share