17/01/2026
హార్ట్ స్ట్రోక్ (గుండెపోటు) మరియు బ్రెయిన్ స్ట్రోక్ (మెదడు స్ట్రోక్) రెండూ ప్రాణాంతకమైన పరిస్థితులే కానీ, వాటి ప్రభావం పూర్తిగా వేరు.
హార్ట్ స్ట్రోక్‌లో గుండెకు రక్త సరఫరా అకస్మాత్తుగా తగ్గిపోతుంది. దాంతో గుండె కండరాలు దెబ్బతింటాయి మరియు EF (Ejection Fraction) తగ్గిపోతుంది. గుండె పంపింగ్ పవర్ తగ్గితే శరీరానికి సరైన రక్త సరఫరా జరగదు. ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్‌లో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే — అర్రిథ్మియాస్ రావడం. గుండె రిధమ్ పూర్తిగా తప్పిపోతే, రోగి అకస్మాత్తుగా మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు హార్ట్ స్ట్రోక్‌లో సమస్య గుండెకే పరిమితం అవుతుంది కానీ పరిణామాలు వెంటనే ప్రాణాలకు ముప్పుగా మారతాయి.
బ్రెయిన్ స్ట్రోక్‌లో పరిస్థితి వేరేలా ఉంటుంది. మెదడులోని రక్తనాళం మూసుకుపోయినా లేదా పగిలినా, ఆ రక్తనాళం సరఫరా చేసే మెదడులోని భాగం దెబ్బతింటుంది. అందుకే బ్రెయిన్ స్ట్రోక్‌లో ఒకేలా లక్షణాలు ఉండవు. కొంతమందికి చేతి లేదా కాలి పక్షవాతం రావచ్చు, కొంతమందికి మాట రావడం ఆగిపోవచ్చు, వినికిడి తగ్గవచ్చు, చూపు పోవచ్చు లేదా శరీరంలో స్పర్శ అనుభూతి కోల్పోవచ్చు. అంటే మెదడులో ఏ భాగం దెబ్బతిందో, దానికి అనుగుణంగా జీవితాంతం ఉండే సమస్యలు రావచ్చు.
అందుకే సాధారణంగా చెప్పాలంటే —
హార్ట్ స్ట్రోక్‌లో మరణ ప్రమాదం (mortality) ఎక్కువగా ఉంటుంది,
బ్రెయిన్ స్ట్రోక్‌లో దీర్ఘకాలిక వికలాంగత (long-term morbidity) ఎక్కువగా ఉంటుంది.
హార్ట్ స్ట్రోక్‌లో గుండె పంపింగ్ తగ్గడం ప్రధాన సమస్య అయితే, బ్రెయిన్ స్ట్రోక్‌లో వ్యక్తి జీవితం మొత్తం ప్రభావితం అయ్యే నరాల సమస్యలు వస్తాయి. రెండింటికీ సమయానికి చికిత్స అత్యంత కీలకం. లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లడం ప్రాణాలను కాపాడుతుంది.
ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి. ఒక చిన్న అవగాహన కూడా ఎవరో ఒకరి జీవితాన్ని మార్చవచ్చు.
Heart stroke and brain stroke are both medical emergencies, but their impact on the body and long-term outcomes are completely different.
In a heart stroke (heart attack), blood supply to the heart muscle suddenly reduces or stops. This leads to damage of the heart muscle and a reduction in Ejection Fraction (EF), meaning the pumping power of the heart decreases. The most dangerous complication of a heart stroke is the development of life-threatening arrhythmias. When the heart rhythm becomes abnormal, patients can collapse suddenly and may die if treatment is not immediate. In heart stroke, the problem is mainly confined to the heart, but the risk of sudden death is high.
In contrast, brain stroke affects the blood supply to the brain. Depending on which blood vessel is blocked or ruptured, different areas of the brain get damaged. As a result, symptoms vary widely. A patient may develop paralysis of the arm or leg, loss of speech, hearing impairment, loss of vision, loss of sensation, or difficulty in understanding or communication. Brain stroke often leads to long-term disability rather than immediate death, leaving patients with lifelong neurological deficits.
Simply put —
Heart stroke is more associated with mortality,
Brain stroke is more associated with long-term morbidity and disability.
While heart stroke weakens the pumping function of the heart, brain stroke can permanently alter a person’s quality of life. Early recognition of symptoms and timely medical treatment are critical in both conditions.
Watch this video till the end and share it with your loved ones. Awareness can save lives.