Sri hari hara putra ayyappa swami

Sri hari hara putra ayyappa swami Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri hari hara putra ayyappa swami, Srinagar 7/7, Guntur.

05/12/2021

Over the past decade, RR REOSRTS AND DEVELOPERS has led many ventures on the path of development and successfully completed, Now RR REOSRTS AND DEVELOPERS has launched a new Residential plots venture "LOTUS PRIMES" with APCRDA approved layout LP No: 60/2019/GNT. our venture located at "LAM" next to the guntur with all aminities and developements.

18/11/2021
25/09/2021

“SRI SAVITHRU TOWNSHIP”
Hyderabad Pharma City open plots for sale at low prices.
Our venture is located next to the Regional Ring Road and
Pharma City at Srisailam Highway Facing For Enquiry or Booking Call now +917077778888. for more information click here: http://www.srisavithru.in/

3BHK Residential Luxurious Villas in GunturContact Now or Whatsapp Now 9160 99 66 77
14/06/2021

3BHK Residential Luxurious Villas in Guntur
Contact Now or Whatsapp Now 9160 99 66 77

04/11/2020

రులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం... అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించినా, రమణులు ఆత్మ స్వరూపంగా దర్శించినా ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహా క్షేత్రం కార్తిక పౌర్ణమినాడు దేదీప్యమానంగా వెలుగుతుంది.
స్మరణాత్‌ అరుణాచలే’ అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది. మహేశ్వరపురాణంలో వేద వ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. ‘సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్లు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది. అగ్ని లింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్‌ రూపాన్ని సంతరించుకున్నాడు. ‘ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే

వీటిని అందరమూ అక్కడకు వెళ్ళి దర్శించుకోలేకపోవచ్చు, కనీసం ఇలా చిత్రాలలో దర్శించి, వాటి వివరాలు తెలుసుకున్నా అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.

కార్తిక పౌర్ణమినాడు చేసే మహాదేవ అగ్నిలింగ ప్రదక్షిణకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంది. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడటానికి కారణమైన అద్వైత గురువు.. భగవాన్‌ రమణమహర్షి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. 53 సంవత్సరాల పాటు అరుణాచలాన్నే తన ఆవాసంగా చేసుకున్న మహర్షి.. ఈ క్షేత్రాన్ని ఇలకైలాసంగా అభివర్ణించారు. ‘అక్షరమణమలై’ పేరిట అరుణాచల ఘన యశస్సును కీర్తిస్తూ రమణులు శతకాన్ని రచించారు. గిరిప్రదక్షిణ చేసే సందర్భంలో తన మనోభావాలను ‘అరుణాచల అష్టకం’ ద్వారా అవిష్కరించారు. బాల్యంలో అరుణాచలాన్ని దర్శించిన రమణులకు ఈ కొండ ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించింది.

ఇది తమిళులకు కార్తీక మాసము, కార్తీక మాసములో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున శ్రీ అరుణాచల గిరిపైన మహా జ్యోతిని ప్రజ్వలింపజేస్తారు. దీనినే " కృత్తికా దీపోత్సవం " అంటారు. ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద ఇలా రాగితో చేయబడుతుంది. ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం 600 మీటర్లతో చేయబడుతుంది. ఈ ప్రమిదను, వత్తిని " జ్యోతి నాడార్ లేక దీప నాడార్ " అని పిలువబడే వంశస్తులు మాత్రమే అందజేస్తారు. ఇక 2500 కిలోల నెయ్యి అరుణాచలానికీ వచ్చే భక్తులు అందజేస్తారు. అలా వెలిగించిన అరుణాచల మహా దీపం మూడు రోజులు దేదీప్యమానంగా వెలుగుతుంది. షుమారు 24 కిలోమీటర్ల మేరకు ఈ దీపము దర్శనమిస్తుంది.

వీలైతే అరుణాచలం వెళ్లి ప్రత్యక్షంగా జ్యోతిని దర్శించు కోవడం అత్యంత పుణ్యప్రదం. ఈ జ్యోతిని దర్శించేందుకు దేశ విదేశాలలో ఉండే భక్తులు కూడా అరుణాచలం చేరుకుంటారు. కేవలం భారతీయులు మాత్రమే కాదు విదేశీయులు సైతం విచ్చేస్తుంటారు. గత జన్మల పుణ్యం ఉంటేనే కానీ " అరుణాచలం " అనే పదాన్ని కూడా తలవలేమని స్థల పురాణం చెబుతోంది. ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వారి జీవితంలో అప్పటి వరకూ వారు చేసిన పాపాలు, వారిని వెన్నంటి వచ్చిన గత జన్మల ప్రారబ్ధ, సంచిత పాప కర్మలు సైతం పటా పంచలవుతాయనీ, ఎవరైనా మరణించి నరకానికి వస్తే, వారి జీవితంలో అరుణాచల గిరి ప్రదక్షిణ చేశారా అని మొట్టమొదటగా యమధర్మరాజు ప్రశ్నిస్తాడటా. ఒకవేళ వారి పుణ్యం కొలదీ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినట్లయితే, వారి జీవితాన్ని అరుణాచల గిరి ప్రదక్షిణకు ముందు, అరుణాచల గిరి ప్రదక్షిణ తరువాతగా విభజించి, గిరి ప్రదక్షిణకు ముందు చేసిన పాపం రాశులను లెక్కించరని అరుణాచల క్షేత్ర మహత్యంలో ఉన్నది.

అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని వ్యవహరించారు.

04/11/2020

అరుణాచలంలో 29/11/2020 న మహా దీప జ్యోతి కోసం సిద్ధమైన రాగి ప్రమిద.

04/11/2020

కర్మ ఎవరిని బంధిస్తుంది-శరీరాన్నా, ఆత్మనా ?
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కర్మ ఫలితం అనుభవించాల్సిందే, తప్పదు అని చెప్తున్నారు. మరి కర్మ ఫలితం ఎవరిని బంధిస్తుంది, శరీరాన్నా, ఆత్మనా? సరైన సందేహమే కదా! దీనికి దాదాశ్రీ ఇలా సమాధానం చెప్పారు.
అసలు శరీరం అంటేనే కర్మ ఫలితం కదా, ఇక దాన్ని మళ్ళీ బంధించడం ఏముంటుంది? ఉదాహరణకి ఒకరు జైల్లో ఉన్నారనుకో, బంధనం దేనికి, జైలుకా లేక లోపలున్న వ్యక్తికా? అలాగే ఈ శరీరమే కారాగారం అయితే, ఆ లోపలున్న వ్యక్తికే బంధనం అన్నమాట! అయితే ఈ వ్యవహారంలో ఆత్మకు ఏ సంబంధం ఉండదు. అది స్వేచ్చగా, స్వతంత్రంగా ఉంటుంది. కానీ అపోహల ద్వారా పుట్టే అహంకారం – ఇగో ఉంటుందే, అది కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. నువ్వే పరిశుద్ద పరమాత్మవు అయి వుండి కూడా సుబ్బారావనో, సుబ్బమ్మ అనో అనుకుంటూ ఉంటావే అది అహంకారం. ఇదిగో ఆ అహంకారమే కర్త్రుత్వానికి దారి తీసి, కర్మ ఫలితం అనుభంవించేలా చేస్తుంది. ఆ అహంకారం వీడినప్పుడు నువ్వు మళ్ళీ యధాస్థితికి వెళ్తావు, ఇక బంధనం ఉండదు.
అసలు కర్మ కి – ఆత్మకి ఉండే సంబంధం ఎలాంటిది ?
కర్తృత్వం లేక పొతే రెండూ వేరు పది పోతాయి. దేని స్థానంలో అది ఉంటుంది. కర్తృత్వం లేకుండా కర్మ లేదు. అది ఉంటేనే ఇది ఉంటుంది. నువ్వు కర్తవు కానప్పుడు నువ్వేం చేసినా నువ్వు కర్మకు బద్దుడవు కావు. ఆత్మా, కర్మ వేరుగా ఉన్నప్పటికీ ఈ కర్తృత్వం అనేది వాటిని కలుపుతున్నట్లు అనిపిస్తుంది. ఈ చేసే ‘నేను’ లేకపోతె రెండూ వేర్వేరు గానే ఉంటాయి.
మనకి బయటి ప్రపంచంలో కనపడి జరిగే ప్రతి విషయం ఫలితమే. కర్మ ఎప్పుడో జరిగిపోయింది. దాని ఫలితమే మనం చూస్తున్నాం. ఉదాహరణకు మీరు పరీక్ష రాసి పేపర్ ఇచ్చేశారు. ఇక ఫలితం రావడమే తరువాయి. పరీక్ష పేపర్ ఇచ్చాం అంటే ఏదో ఫలితం రావాల్సిందే కదా – ఇక దాని గురించి దిగులు ఎందుకు? అంటే మనం ఫలితం ఒకలా రావాలని ఆశిస్తూ ఎదురు చూస్తున్నాం అన్నమాటేగా! ప్రపంచం మొత్తం ఇలాగే ఫలితాల గురించే మధన పడుతోంది.
కర్మ, ఫలితాల ఈ చక్రానికి మరి ఆది ఏది? ఇది ఎలా మొదలైంది ?
ఓ పూసల దండ ఉంది, దానికి ఆది ఏది,తుది ఏది? అలాగే ఈ చక్రంలో మొదలు, తుదలు లేదు. అలా జరుగుతూనే ఉంటుంది. ఇది ఎక్కడ మొదలైంది అంటే ఎప్పుడు వివేకం లేదా ప్రజ్ఞ మొదలైందో అక్కడ మొదలైంది, ప్రజ్ఞ ముగిసినప్పుడు ఇది కూడా ముగుస్తుంది. అలా కాదంటే దీనికి మొదలే లేదు. ప్రజ్ఞ ఉన్నప్పుడే నేను చేశాను అన్న భావన, దాన్ని బట్టి కర్మ, దాన్ని బట్టి ఫలితం.
జన్మాంతరాల నుంచి చేసిన ఈ కర్మలన్నీ ఒకే జన్మలో ఫలితం ఇవ్వవు కదా – అంటే వీటిని జన్మజన్మల నుంచి అనుభవిస్తూ వస్తున్నామా? ఈ కర్మలన్నీ ముగిస్తేనే కదా మోక్షం?
ఒక జన్మలో ఫలితాలన్నీ అనుభవించేసాక ఆ శరీరం పతనం అవుతుంది. కానీ ఈ జన్మలో చేసిన కర్మలు మళ్ళీ బంధిస్తాయి కదా – మరింక మోక్షం ఎక్కడిది? ఎప్పుడు కర్తృత్వం అంతమై, నేను పరిశుద్ధ ఆత్మను అనే అపరిమితమైన ఆనందం పొందగాలుగుతామో అప్పుడు ఈ కర్మ – ఫలితాల చక్రం నుంచి బయటకు వస్తాం. ఆలా కాక నేను చేశాను అని అనుకున్నంతసేపూ ఆ ఫలితాలకు బాధ్యత వహించి జననమరణాల చక్రంలో తిరుగాడుతూనే ఉంటాం!

🌷🌳🌷🌳🌷🌳🌷🌳🌷🌳🌷🌳

04/11/2020

మాటను నిలబెట్టుకోండి
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అనేకమంది యితరులకు సహాయం చేస్తామని చాలా తొందరగా వాగ్దానం చేస్తారు . కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేరు . ఇది చాలా పాపం . మన పూర్వీకులు మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవారు . హారిశ్చంద్రుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి చెప్పుకోలేని బాధలు పడ్డాడని పురాణాలు చెప్తున్నాయి . సత్యవాక్పాలానా ద్వారా కలిగే తృప్తి అతను పడ్డ కష్టాల కంటె చాలారెట్లు ఎక్కువ .

అలాగే శ్రీరాముని కథ చదివితే తానిచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ఆయన ఎన్నో బాధలు అనుభవించాడు . సుగ్రీవునితో స్నేహం చేసినప్పుడు రామునికి సుగ్రీవుని దుస్థితి తెలిసి " నీ కష్టాన్ని తొలిగించి , నీరాజ్యాన్ని నీవు తిరిగి పొందేటట్లు చేస్తాను " అని వాగ్దానం చేసాడు . సుగ్రీవునికి ఆవాగ్దానం నెరవేరుతుందా అనే సందేహం ఏర్పడి ఉండవచ్చు , రామునికి ఎటువంటి సందేహంలేదు . అందువలనే యిలా ఉన్నాడు .

" రామో ద్విర్నాభిభాషతే " !

" రాముడు రెండు రకాలుగా మాట్లాడదు " ఇంకోవిధంగా చెప్పాలంటే మాటమార్చడు . సుగ్రీవుని శత్రువైన వాలిని సంహరించి , సుగ్రీవునికి పట్టం కట్టాడు . విభీషణుడు శరణుజొచ్చినప్పుడు కూడా నీకు లంకారాజ్యాన్ని అప్పచెప్తానన్నాడు . ఆమాట ప్రకారమే రావణుని వధించి లంకను విభీషునికి అప్పచెప్పాడు . ఎట్టి పరిస్థులలోనైనా ఇచ్చినమాటను తప్పక నెరవేర్చాలని ఈ ఉదాహరణలద్వారా మనకర్ధమవుతుంది . సహాయం చేస్తామని చెప్పి సహాయం చేయకపోవటం మోసం చేయటంతో సమానం . మోసం చెయ్యటం పాపం . మాటివ్వకపోతే అది వేరే విషయం . కానీ మాట ఇచ్చి నిలబెట్టుకోకపోవటం తప్పు . అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకుని , మాటను నిలబెట్టుకోలేని సందర్భం రాకుండ జీవితంలో నడుచుకోవాలి . అందరూ తమ జీవితాలను అలా పవిత్రం చేసుకుందురుగాక !
" అంగీకృతం సుకృతినో న పరిత్యజన్తి " !
మహానుభావులు తాము అంగీకరించిన విషయాన్ని పూర్తి చేయకుండా వదిలిపెట్టరు .

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

05/07/2020

రూ. 15000 - రూ.25000 జీతంతో ఉద్యోగాలు
Jobs for Relationship Manager - Salary: 15000-25000
Callus: 9972750913, Mail ID: slcs11696@gmail.com

22/11/2019

స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప
శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి సేవ సమితి ఆధ్వర్యంలో శ్రీనగర్ 7/7 లైను చివర, గుంటూరు-2. శ్రీ నాగేంద్ర స్వామి మరియు నీలంపాటి అమ్మవారు దేవస్థానం నందు 18-11-2019 నుండి 8-12-2019 వరుకు జరుగుతున్న పంచమ భిక్ష కార్యక్రమము. మాకు సహకరిస్తున్న వారందరికి శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి సేవ సమితి కమిటీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటు వారిని వారి కుటుంబాన్ని శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి ఆయుర్ ఆరోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటున్నాము.
స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప
Address:
Sri hari hara putra ayyappa swamy seva samithi - Srinagar 7/7, guntur, AP-522002,

29/06/2018

low cost advertising and high reach to all ages and demographics. We are Digital Marketing Company

Address

Srinagar 7/7
Guntur
522002

Telephone

8886254369

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri hari hara putra ayyappa swami posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram