HEALY Frequencies - Telugu

HEALY Frequencies  - Telugu Health is the birth right of a human being. We envisage all families to be healthy and enjoy a healthy life with Healy.

We believe that all people are made in the image of God and can heal themselves easily.

18/09/2024

ఓ హీలీ కుటుంబ దివ్యాత్మా,

పవిత్రమైన భాద్రపద పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పవిత్ర క్షణాలలో మీకు ఒక ఆత్మీయ ప్రకటన.

మన మందరం హీలీని వాడుకంటూ శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక, ఎనర్జీ లెవల్స్ ల్లో హీలింగ్ ను పొందుతున్నాము. దానితోపాటు "రేకీ" హీలంగ్ కూడా మీరు నేర్చుకుంటే హీలీ మరియూ రేకీ రెండింటి ద్వారా ఎంతటి సమస్యనైనా అనగా శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక, ఎనర్జీ, ఆర్ధిక, కుటుంబ, వృత్తిపర ఇలా అన్ని రకాల సమస్యలకు మీకు మీరే హీల్ చేసుకుంటూ ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చును.

మేము "రేకీ హీలింగ్" వర్కుషాఫ్స్ రేపు ఆశ్వయుజ మాసములో (అక్టోబరు, 2024) మొదలు పెడుతున్నాము అని తెలియ చేయుటకు ఆనందిస్తున్నాము. ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాల లోనూ వర్కుషాఫ్స్ నిర్వహిస్తాము.

రేకీ అనగా "ఆధ్యాత్మిక శక్తి" అని అర్ధము. ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించుకుని శరీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఎనర్జీ లెవల్స్ లో అన్నిరకాల రుగ్మతలనకూ హీలింగ్ చేసుకోవచ్చును.

మొదటగా రేకీ Ist డిగ్రీ, IInd డిగ్రీ, IIIrd డిగ్రీ మరియూ కరుణా రేకీ వర్కుషాఫ్స్ నిర్వహించబడును. ప్రతి లెవల్ డిగ్రీ కూడా సర్టిఫికెట్ కోర్స్.

లక్ష్యం: సమాజ హితం కోసము విశిష్టమైన "రేకీ" హీలింగ్ నందు కనీసం వందమంది గ్రాండ్ మాష్టర్స్ ను, 500 మంది మాష్టర్స్ ను, వేలాది మంది హీలర్స్ ని తయారుచేయడం.

ఈ రేకీ హీలింగ్ గురించి తెలుసు కోవడానికి, మరియూ నేర్చుకోవాలనే ఆసక్తి వుంటే నాకు మెసేజ్ చేయండి.

భవదీయుడు
మీ విజయ భాస్కర్ రెడ్డి ఐ.
రేకీ గ్రాండ్ మాష్టర్

29/03/2024
Fatigue is a term used to describe an overall feeling of tiredness or lack of energy. When you’re tired, you have no mot...
25/03/2024

Fatigue is a term used to describe an overall feeling of tiredness or lack of energy. When you’re tired, you have no motivation and no energy to complete any tasks given.

Healy supports overall health and works wonders for balancing your energy level, negative experiences and emotions.

25/03/2024
అందరికీ నమశ్శులు. సృష్టిలోని ప్రతి వస్తువుకి, ప్రతి జీవికీ ఆరా వుంటుంది. అలాగే మనిషికి కూడా ఆరా వుంటుంది. ఆ ఆరా అనేది మన...
25/03/2024

అందరికీ నమశ్శులు. సృష్టిలోని ప్రతి వస్తువుకి, ప్రతి జీవికీ ఆరా వుంటుంది. అలాగే మనిషికి కూడా ఆరా వుంటుంది. ఆ ఆరా అనేది మనలో వున్న సహస్రార చక్రం మరియు షట్ చక్రాలు పనిచేస్తున్న దానిని బట్టి ఎంత బలంగా వున్నది తెలుస్తుంది. ఆరా వున్న స్థితిని బట్టి ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక సాధనలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య విషయాలు, ఆనందమయ జీవనం ఇలా అన్ని విషయాలు సాగుతాయి. కనుక మీ ఆరా ఎలా వుంది? మీ చక్రాలు ఎలా పనిచేస్తున్నాయి? బయటి వ్యక్తుల నుండి ఏమైనా నెగటివ్ ఎనర్జీలు వస్తున్నాయా? మీ స్థూల, సూక్ష్మ శరీరాలు ఎలా వున్నాయి? మొదలైన విషయాలు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా తెలుసుకోవాలని అనుకునే వారు నాకు మెసేజ్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9985609099.

Healy and Maghealy అనబడే ఎనర్జీ healing divice గురించి అందరి అవగాహన కోసం..హీలీ అనేది ఫ్రీక్వెన్సీ స్పెసిఫిక్ మైక్రో కరెం...
08/02/2024

Healy and Maghealy అనబడే ఎనర్జీ healing divice గురించి అందరి అవగాహన కోసం..

హీలీ అనేది ఫ్రీక్వెన్సీ స్పెసిఫిక్ మైక్రో కరెంట్ డివైజ్. అది ఒక మనిషి యొక్క మానసిక, శారీరక ఆరోగ్యాలకు సంబంధించి వివిధ అంశాల్లో అంతర్గత ఫ్రీక్వెన్సీలను కలిగి ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ మెడిసిన్ టెక్నాలజీ అనేది ఎలా పనిచేస్తుందో సైంటిఫిక్‌ గా తెలుసుకోవాలంటే ఈ 455 పేజీల బుక్ ఓపికగా చదివి తెలుసుకోవచ్చు - https://amzn.to/3ENzNzP

టైమ్ వేవర్ అనే 2011 నుండి అందుబాటులో ఉన్న పెద్ద డివైజ్‌‌లో ఉండే వివిధ శారీరక, మానసిక రుగ్మతలకు లక్షలాది ఫ్రీక్వెన్సీల నుండి తరచూ వచ్చే సమస్యలకు సంబంధించి కొన్ని లక్షల ఫ్రీక్వెన్సీలను ఓ చిన్న పోర్టబుల్ డివైజ్‌లో పొందుపరచబడిందే ఈ హీలీ అనే డివైజ్. గత సంవత్సరం అక్టోబర్ 23న అంటే సరిగ్గా ఏడాది నుండి దీన్ని నేను వాడుతున్నాను. ఊరికే మాటల్లో దీని గురించి రాయడం కన్నా స్వయంగా వాడి చూస్తే ఇలాంటి డివైజ్ గురించి ఇంతకాలం తెలుసుకోలేకపోయామన్న భావన కలుగుతుంది. ఫిజికల్ హెల్త్, ఎనర్జీ లెవల్స్ మాత్రమే కాకుండా నా మానసిక ప్రశాంతతకి ప్రధాన కారణాల్లో మెడిటేషన్ మాత్రమే కాదు.. సగం ఈ హీలీలో ఉన్న Pure, Mental Balance, Relax, Emotions వంటి అనేక ప్రోగ్రామ్స్. వీటి గురించి నాలుగు ముక్కల్లో వివరించగలిగే విషయం కాదు... స్వయంగా వాడాక మాటల కన్నా పనితీరు ముఖ్యమని తెలుస్తుంది.

అదే సంస్థ హీలీకి అదనంగా MagHealy అనే ప్రోగ్రామ్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. హీలీకి ఇండియాలో సంబంధిత డిపార్ట్‌మెంట్స్ నుండి పూర్తి అనుమతులు ఉన్నాయి.

హీలీ అనేది మైక్రో కరెంట్ అనే టెక్నాలజీ రూపంలో వైర్ల ద్వారా గానీ, లేదా టెస్లా కాయిల్ రూపంలో ఎలక్ట్రో మేగ్నటిక్ ఫీల్డ్ సృష్టించి శరీరంలో సెల్ మెంబ్రేన్ ఓల్టేజ్ మీద పనిచేస్తుంది. భూగర్భంలో ఉన్న ఖనిజాలను గుర్తించడానికి వాడే క్వాంటమ్ సెన్సార్ దీంట్లో పొందుపరచబడింది. ఇది రిజనెన్స్ విధానం ద్వారా శరీరంలోని వివిధ ఆర్గాన్ల యొక్క సెల్ మెంబ్రేన్ ఓల్టేజ్‌ని ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి వారి ప్రస్తుత పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ తెలుసుకుని తగినంత సెల్ మెంబ్రేన్ ఓల్టేజ్ అందేలా మైక్రో కరెంట్స్ పంపిస్తుంది. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్య మెరుగవుతుంది అన్నమాట.

అదే కొత్తగా వచ్చిన Mag Healy విషయానికి వస్తే ఇది మాగ్నటిక్ పల్సేషన్ అనే టెక్నాలజీ ఆధారంగా ఒకేసారి రెండు ఫ్రీక్వెన్సీలను విడుదల చేస్తూ బాహ్య ప్రపంచాన్ని, కొన్ని అంతర్గత రుగ్మతలను మేగ్నటిక్ ఎనర్జీతో ప్రభావితం చేస్తుంది. ఉదా.కి. విశ్వంలో ఉన్న ప్రతీదీ ఎనర్జీ ఎక్స్‌ప్రెషన్‌గానే ఉంటుంది. సో కొన్నిచోట్ల ఆయా వ్యక్తులు చేసే ఆలోచనలను బట్టి గానీ, లేదా కంప్యూటర్లు ఫోన్లు వంటి వాటి ద్వారా ఎలక్ట్రిక్ సెన్సిటివిటీ ఏర్పడడం గానీ, లేదా ఇతర నెగిటివ్ ఎనర్జీస్ గానీ వ్యక్తమవుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని గుర్తించి బలమైన మాగ్నటిక్ పల్సేషన్స్ విడుదల చెయ్యడం ద్వారా ఎన్విరాన్‌మెంట్‌ని ఇది మెరుగుపరుస్తుంది.

అలాగే చదువుకోవడానికి కావలసిన మెరుగైన ఎన్విరాన్‌మెంట్, ఆఫీస్ వర్క్, మీటింగ్స్ వంటి వాటికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్.. వాటర్ యాక్టివేషన్ అనే మాడ్యూల్‌లో తాగే వాటర్‌‌, మొక్కలకు పోసే వాటర్‌ మాగ్నటిక్ ఫీల్డ్‌ని ప్రభావితం చేసి వాటర్‌ని సరిగా హైడ్రేట్ అయ్యేలా.. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ వ్యక్తి, ఎనర్జీ మరో రూపమైన కారు మాగ్నటిక్ ఫీల్డ్‌ని ప్రభావితం చేసి స్మూత్ డ్రైవింగ్‌కి ఉపయోగపడే ఫ్రీక్వెన్సీస్ ఇలా.. ఇదీ అదీ అని కాదు.. ఎన్నో ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి.

ఆల్రెడీ ఉన్న హీలీతో పాటు కొత్తగా వచ్చిన Mag Healy చాలా ప్రామిసింగ్ గా ఉంది. హీలీ అఫీషియల్ సైట్ ఇది:
https://india.healy.shop/?partnername=3061-3171-5599

New and suppressed breakthroughs in energy medicine, ways to combat toxins and electromagnetic fields, and the importance of non-GMO foods • Explores the use of microcrystals, ozone and hydrogen peroxide therapy, and how to tap in to healing antioxidant electrons from the Earth • Reveals the sci...

03/02/2023

ఉచిత బుకింగ్ ప్రారంభం
ఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే పెళ్లి వారికి కావలసిన పాత్రలు, పాదుకలు, కుర్చీలు అన్నీ సమకూరుస్తున్నారు.

పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం.

దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు.

కానీ లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టె శ్రీనివాస్ సుమారు రూ.4 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు.

ఇది పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక.

అన్నవరం దేవస్థానంలో అధికారులు బుకింగ్‌లు ప్రారంభించారు ఈ మండపంలో ఒకేసారి 12 జంటలకు వివాహం జరిపించేందుకు వీలుగా ఉంటుందని దేవస్థానం అధికారులువివరించారు.

పెళ్లి వారికి కావలసిన పాత్రలు, పాదుకలు, కుర్చీలు ఇలా అన్నీ దాత శ్రీనివాస్ సమకూరుస్తారు.

పెళ్లి పేదలకు తలకుమించిన భారమే. అయితే వారు కూడా సాదాసీదాగా కాకుండా ఉన్నతంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు దాత శ్రీనివాస్ చెబుతున్నారు.

వివాహాలు చేసుకునే వారి కోసం దేవస్థానం అధికారులు ఆదివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించారు.

సంబంధిత పత్రాలు తీసుకువస్తే ఆయా తేదీలలో మండపాలను బుక్ చేస్తారు.

ఏసీ కళ్యాన మండపంలో వివాహం చేసుకోదల్చిన వారు లగ్న పత్రిక, వధూవరుల ఆధార్ జిరాక్స్,
వారి తల్లిదండ్రుల ఆధార్ జిరాక్స్‌లను రత్నగిరిపై ఉన్న సీఆర్‌వో కార్యాలయంలోఅందజేయాలి.

వారికి ఉచిత కళ్యా వేదిక నెంబరును కేటాయిస్తారు. ఆ నంబర్‌ను ఉచిత కళ్యాణ వేదిక వద్ద చూపించి వివాహ సామాగ్రిని పొందాల్సి ఉంటుంది.

ఈ మొత్తం ప్రక్రియలో ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదని ఆలయ అధికారులు వెల్లడించారు.

మీకు తెలిసిన
పదిమందికీ పంపండి, అవసరమైన వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు.... 💐💐💐

03/02/2023

శ్రీవరాహమూర్తి, వరాహావతారము, వరాహ స్వామి (Varaha incarnation) - ఇవన్నీ శ్రీమహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నామములు.[1][2][3] హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. వరాహావతారం హిరణాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము. స్వామి ప్రార్థనలలో ఒకటి:.
ఆది వరాహ మూర్తి, యజ్ఞవరాహ మూర్తి, మహా సూకరం అని నామాలు కూడా ఉన్నాయి. తిరుమల కొండలపై మొదట వెలసిన స్వామి వీరే, వీరి అనుమతితోనే వేంకటేశ్వరుడు అక్కడ నివాసము ఏర్పాటుచేసుకున్నారు.
రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.

లింగ రూపంలో వెలిసిన నరసింహస్వామి

నరసింహస్వామి అనగానే సింహం ముఖంతో, మానవ రూపంతో రౌద్ర రూపాన్నే వూహించుకుంటాంకదా. కానీ నరసింహస్వామి లింగ రూపంలో కూడా దర్శనమిస్తాడని తెలుసా మీకు!? నమ్మలేకపోతే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో వున్న సింగోటం వెళ్ళండి. అక్కడ నరసింహస్వామి లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. ఆలయం బయట లక్ష్మీ గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలున్నాయి. ఆ స్వాముల దర్శనం చేసుకుని లోపలకి వెళ్తే, అక్కడ పత్రం (రోట్లో పిండి రుబ్బేది) సైజులో వున్న లింగాన్ని చూడవచ్చు. నరసింహస్వామే అక్కడ ఆ రూపంలో వెలిశాడు. దాని కధేమిటంటే...

వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్నిసురభి వంశానికి చెందిన సింగమనాయుడు అనే రాజు పరిపాలిస్తున్న సమయంలో ఈ స్వామి ఆవిర్భావం జరిగింది. సింగపట్టణం గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలం దున్నుతున్న సమయంలో నాగలికి ఒక రాయి అడ్డు వచ్చేది. ఎన్నిసార్లు దానిని తీసి పక్కకి పెట్టినా తిరిగి అలాగే నాగలికి అడ్డువస్తుంటే, ఆ రైతు చేసేది లేక, తాను పేదవాడినని, పొలం పండిస్తేగానీ తన కుటుంబాన్ని పోషించలేననీ, తన పనికి ఆటంకాలు రానీయవద్దని శ్రీమన్నారాయణుడిని ప్రార్ధించాడు. భక్తుడి మొరవిన్న భగవంతుడు ఆ రోజు రాత్రి సింగమనాయుడి కలలో కనిపించి, తాను ఉత్తర దిశలో వున్న పొలంలో వెలిశానని, తనని రైతు గుర్తించలేక పోయాడని, తనని గుర్తించి, ప్రతిష్టించి, పూజలు జరపమని ఆదేశించాడు. రాజు తలచుకుంటే కాని పనేమిటి? ఆయన తన పరివారంతో వెళ్ళి స్వామి చెప్పిన గుర్తుల ప్రకారం వెదుకగా లింగ రూపంలో వున్న ఒక శిల కాంతులీనుతూ కనిపించింది.

అదే రాత్రి కలలో స్వామి చెప్పిన విగ్రహంగా గుర్తించి, దానిని ఊరేగింపుగా తీసుకుని ఊరిలోకి రాగా ప్రస్తుతం ఆలయం వున్న వెనక ఎత్తైన బండ దగ్గరకి వచ్చేసరికి స్వామి ఆ శిలను తెస్తున్న వ్యక్తిని ఆవహించి తాను లక్ష్మీ నృసింహుడినని చెప్పారుట. ప్రధమంగా స్వామి ప్రతిమని ఇక్కడే దించారు. కనుక దీనికి “పాదం గుడి” అని పేరు. ఇక్కడ స్వామి పాదం గుర్తులున్నాయి. అప్పటినుంచీ ఇప్పటిదాకా స్వామికి నిత్య పూజలు జరుగుతున్నాయి. అంతేకాదు, స్వామికి ఎండ తగలకుండా వుండటానికి మొదట్లో నాపరాయితో చిన్న గుడి నిర్మించారు. దానిని నేటికీ గర్భగుడిలో భక్తులు దర్శించవచ్చు.

నరసింహస్వామికి ఒక కన్ను కిందకు, ఒక కన్ను మీదకు, ఎగుడు దిగుడుగా వుంటాయి. ఎడమ కన్ను కింద భాగంలో కమలం వున్నది. కమలం లక్ష్మీ స్ధానం కనుక స్వామిని లక్ష్మీ నరసింహుడు అన్నారు. ఈ కొండకు శ్వేతాద్రి అని పేరు. నరసింహస్వామిని ప్రతిష్టించిన సమయంలోనే ఆంజనేయస్వామినికూడా ప్రతిష్టించారు.

ఈ స్వామి విశేషం లింగాకారంలో వుండటమేకాదు, హరి హరులకు భేదం లేదు అని తెలుపటానికా అన్నట్లు స్వామికి త్రిపుండ్రం (అడ్డ నామాలు), ఊర్ధ్వ పుండ్రాలు (నిలువు నామాలు) వున్నాయి. పూర్వం శైవులకు, వైష్ణవులకు ఎవరికి వారే గొప్ప అనే వివాదం వుండేది. ఆ సమయంలో ఈ స్వామి అర్చకత్వం ఎవరు వహించాలనే వాదన ఏర్పడింది. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి రత్నమాంబ, సమస్య పరిష్కారానికి పుష్పగిరి పీఠాధిపతులను, జీయర్ స్వాములను ఆహ్వానించారు. వారు స్వామివారికి అభిషేకం చేసి చూస్తే హరి హరులకు బేధాలు లేవు అని తెలపటానికా అన్నట్లు, స్వామికి అడ్డ నామాలతోపాటు నిలువు నామాలు కూడా కనిపించాయి. అప్పటినుంచీ ఈ బేధాలు లేని స్మార్తులైన ఓరుగంటి వంశీయులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే ఆలయానికి పక్కన శివాలయం, పుష్కరిణి కూడా నిర్మించారు.

మొదట నాపరాయితో చిన్నగా కట్టబడిన ఈ గుడి తర్వాత కాలంలో అభివృధ్ధి చెందింది. నిజాం కాలంలో మంత్రి చందూలాల్ బహద్దూర్ ఈ దేవాలయానికి అనేక భూములు ఇచ్చారు. అతి ప్రాచీనుడైన ఈ దేవునికి ఆలయం క్రీ.శ. 1795 లో నిర్మింపబడింది.

పుష్కరిణి
ఇక్కడ పుష్కరిణిలో భక్తి శ్రధ్ధలతో స్నానం చేస్తే అన్ని రోగాలూ పోతాయని భక్తుల విశ్వాసం. భక్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాదు, భక్తులు ఈ పుష్కరిణిలో బెల్లం గడ్డలు వేసి స్వామికి మొక్కుకుంటే తమకు లేచిన గడ్డలు, కురుపులు పోతాయని విశ్వసిస్తారు. తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి ఆ ప్రాంతంలో జలాశయాలన్నీ ఎండిపోయినా, ఈ పుష్కరిణిలో మాత్రం నీరు వుండటం ప్రత్యేకత.

రత్నలక్ష్మి అమ్మవారు
శ్రీ నరసింహస్వామి ఆలయం ఎదురుగా అర కిలో మీటరు దూరంలో రత్నగిరి అనే కొండ వున్నది. ఈ కొండమీద క్రీ.శ. 1857 లో రాణి రత్నమాంబ రత్నలక్ష్మీదేవిని ప్రతిష్టించారు. ఈ కొండమీద కనిపించే భవనం కొల్లాపూర్ రాజావారి పురాతన విడిది భవనం.

ఉత్సవాలు
సంక్రాంతి నుంచి వారం రోజులపాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు, తర్వాత 25 రోజులు జాతర జరుగుతాయి. వీటికి అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారు.

మార్గము
మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మండలంలో వున్న ఈ క్షేత్రం కొల్లాపూర్ నుంచి 9 కి.మీ. ల దూరంలో వున్నది
సేకరణ

03/02/2023

విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత

రోజుకు కనీసం ఒక్క సారైనా
విష్ణుసహస్ర నామ పారాయణం చేయండి.
ఉత్తమ ఫలితాలు పొందండి..

మంత్రాల ఘనికి మూల మంత్రం శ్రీ విష్ణుసహస్రనామం
ఓం నమో నారాయణాయ .
ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది...

విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన
అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యము కలుగును,
పాపములు తొలగును.

స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం.
మన నిత్య జీవితంలోని అన్నీ సమస్యలకు పరిష్కరాలు ఇందులో వున్నాయి

విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు.

అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ.. ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంటి దేవతా పూజతో, ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు.

అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే..?

1. అదృష్టం

2. ఆర్థిక ఇబ్బందులు వుండవు

3. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం

4. కోరిన కోరికలు నెరవేరుతాయి

5. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది

విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్ర నామం నుంచి వెలువడే శబ్ధం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. అలాగే తులసీ మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు.

అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను
108 మార్లు జపించవలెను.
పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:

1. విద్యాభివృద్ధికి :-
14వ శ్లోకం.
సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||

2. ఉదర రోగ నివృత్తికి:-
16వ శ్లోకం.
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||

3. ఉత్సాహమునకు:-
18వ శ్లోకం.
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||

4. మేధాసంపత్తికి:-
19వ శ్లోకం.
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||

5. కంటి చూపునకు:-
24వ శ్లోకం.
అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |
సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||

6. కోరికలిడేరుటకు:-
27వ శ్లోకం.
అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |
సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||

7. వివాహ ప్రాప్తికి:-
32వ శ్లోకం.
భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||

8. అభివృద్ధికి:-
42వ శ్లోకం.
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |
పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||

9. మరణ భీతి తొలగుటకు:-
44వ శ్లోకం.
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||

10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:-
46వ శ్లోకం.
విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం |
అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||

11. జ్ఞానాభివ్రుద్ధికి:-
48వ శ్లోకం.
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |
సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||

12. క్షేమాభివ్రుధ్ధికి:-
64వ శ్లోకం
అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |
శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||

13. నిరంతర దైవ చింతనకు:-
65వ శ్లోకం.
శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||

14. దుఃఖ నివారణకు:-
67వ శ్లోకం.
ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |
భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||

15. జన్మ రాహిత్యమునకు:-
75వ శ్లోకం.
సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||

16. విద్యా ప్రాప్తి కి :-
80వ శ్లోకం.
అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||

17. శత్రువుల జయించుటకు:-
88వ శ్లోకం.
సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !
న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||

18. భయ నాశనమునకు:-
89వ శ్లోకం.
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |
అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||

19. సంతాన ప్రాప్తి కి :-
90వ శ్లోకం.
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|
అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||

20. మంగళ ప్రాప్తికి:-
96వ శ్లోకం.
సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |
స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||

21. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:-
97 & 98వ శ్లోకం.
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |
శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||

22. దుస్వప్న నాశనమునకు:-
99వ శ్లోకం.
ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |
వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||

23. పాపక్షయమునకు:-
106వ శ్లోకం.
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |
దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాసనః ||

24.సర్వ రోగ నివారణకు:-
103వ శ్లోకం.
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః
తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||

25. సుఖ ప్రసవమునకు:-
107వ శ్లోకం.
శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|
రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||
శ్రీ స్సర్వ ప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి

విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించవలెను.
(సేకరణ)

Address

Guntur
522002

Opening Hours

Monday 5:30pm - 8pm
Tuesday 5:30pm - 8pm
Wednesday 5:30pm - 8pm
Thursday 5:30pm - 8pm
Friday 5:30pm - 8pm
Saturday 5:30pm - 8pm
Sunday 5:30pm - 8pm

Telephone

+919985609099

Website

Alerts

Be the first to know and let us send you an email when HEALY Frequencies - Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to HEALY Frequencies - Telugu:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram