
11/08/2025
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న శనక్కాయల వారు....
ప్రభుత్వ మహిళా కాలేజీ నందు నూతన గదులు నిర్మాణం ...
సోమవారం ఉదయం 5 నెలల క్రితం గుంటూరు నగరంలోని స్థానిక ప్రభుత్వ మహిళ కాలేజ్ నందు 83వ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా ప్రభుత్వ మహిళా కాలేజీ నందు విధ్యార్ధినిలు ఎక్కువగా ఉండి చదువుకొనుటకు ఇబ్బందులు పడుచున్నారని తెలియడంతో అహల్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమా శంకర్ గారు మరియు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ శనక్కాయల రాజకుమారి వారి సొంత నిధులతో ప్రభుత్వ మహిళా కాలేజీ నందు చదువుతున్న విద్యార్ధుల కొరకు 3 గధులను స్వచ్చందంగా నిర్మించి ఇస్తాను అని చెప్పడం అదేవిధంగా వెంటనే అహల్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమా శంకర్ గారు మరియు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ శనక్కాయల రాజకుమారి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి గదుల నిర్మాణం చేసి ఈ రోజు హోమం జరిపించి గదులను ప్రారంభించారు. కార్యక్రమంలో డా శనక్కాయల గౌరీ శంకర్ గారు, మాజీ మంత్రివర్యులు డా అరుణ గారు డాక్టర్ శనక్కాయల ఉమా శంకర్ గారు మరియు డాక్టర్ శనక్కాయల రాజకుమారి గారు మరియు ప్రభుత్వ మహిళా కళాశాల యాజమాన్యం మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
#గుంటూరు