18/04/2023
మధుమేహం దీర్ఘకాలిక జబ్బు అనేది ఒక మూఢ నమ్మకమే
మధుమేహం మరియు గాంగ్రిన్
మధుమేహం ఇదొక దీర్ఘకాలిక జబ్బు అని,వస్తే తగ్గదు, జీవితకాలం మందులు వాడాలి అని జనాల బుర్రలోకి చొప్పించబడిన ఒక భయంకరమైన మూఢ నమ్మకం. ఇది తీపి పదార్థాలు ఎక్కువగా తింటే మత్రమే వచ్చే వ్యాధి కాదు, పిండి పదార్థాలు అధిక మొత్తంలో తీసుకుంటూ రోజుకి కావలసిన దానికంటే ఎక్కువ సార్లు తింటే వచ్చే వ్యాధి. మీరు తినే ప్రతి పిండి పదార్థం గ్లూకోజ్ గానే మారుతుంది.ఇది వంశపారంపర్యం తో సంబందం లేకండా వచ్చే వ్యాధి. ఎక్కువ మంది దీనిని కుటుంబ పరంగా వచ్చే వ్యాధి లాగా బ్రమపడుతూ ఉంటారు. మధుమేహం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గ్లూకోస్ ని అధిక మొత్తంలో తీసుకోవడం వలన దాన్ని మీ శరీరం ఫ్యాట్ రూపంలో దాచుకుంటూ దాచుకుంటూ ఇంక దాచుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు రక్తంలో మిగిలిపోయే హై గ్లూకోస్ నే మధుమేహం అంటాము. మనం తినే ఆహార పదార్థాలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి పిండి పదార్థాలు, రెండు ప్రోటీన్స్ ,మూడు ఫ్యాట్. పిండి పదార్థాలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తిని ప్రోటీన్స్ ఫ్యాట్ కలిగిన ఆహారాన్ని తక్కువగా తిన్నప్పుడు మాత్రమే మధుమేహం అనేది వస్తుంది. అదే మీరు పిండి పదార్థాలు కలిగిన ఆహారాన్ని తగ్గించి ప్రోటీన్ ఫ్యాట్ కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు మీకు వచ్చిన మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది. మీకు రాబోయే మధుమేహానికి మొట్టమొదటి లక్షణం కొన్ని సంవత్సరాల ముందే ప్రారంభం అవుతుంది. అది మీ శరీరం యొక్క మైలేజ్ పడిపోవడం. అంటే ఎంత తిన్నా ఆకలి తీరకపోవడం తినేకొందీ ఆకలి వేయడం. ఈ స్టేజ్ లోనే మీరు డైట్ లో మార్పులు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో రాబోయే మధుమేహాన్ని ముందే అరికట్టవచ్చు. మధుమేహం రెండు రకాలుగ ఉంటుంది. ఒకటి టైప్ వన్ డయాబెటిస్ ,రెండు టైప్ 2 డయాబెటిస్. మొదటి రకం లో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది లేదా ఉండదు. రెండవ రకంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది కానీ శరీరానికి ఉపయోగించుకోలేని స్థితిలో ఉంటుంది. రెండు రకాల మధుమేహాలను గ్లూకోస్ ఆహారాన్ని విస్మరించడం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చు. మధుమేహం అనేది మీ శరీరంలో ఉండే హార్మోన్స్ యొక్క అసమతుల్యతతో జరిగే ఒక ఆట. హార్మోన్స్ అనేవి చాలా సున్నితమైనవి. ప్రతి చిన్న ఎమోషన్స్ కి హార్మోన్స్ అనేవి ప్రభావితం అవుతూ ఉంటాయి. అలాంటి హార్మోన్స్ ని అదుపు చేయడానికి కావలసింది సున్నితమైన మందులతో పాటు తినే ఆహారంలో మార్పులు. హోమియోపతి మందులు చాలా సున్నితమైనవి. సున్నితమైన మందులకు ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.అదే మెటీరియల్ డోస్ ఎక్కువ ఉన్న మందులకు ఎఫెక్ట్స్ తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. హోమియోపతి మందులను కాన్స్టిట్యూషనల్ గా, ఇండివిడ్యువాలిటీని బట్టి, క్లినికల్ లక్షణాలను బట్టి చికిత్స చేసుకుంటూ ఆహారంలో మార్పులు చేయడం ద్వారా మధుమేహాన్ని పూర్తిగా నయం చేయవచ్చు.
గ్యాంగ్రిన్ అనేది మధుమేహం వలన కలిగే దీర్ఘకాలిక పుండ్ల వ్యాధి. ఇది షుగర్ వల్ల వచ్చే న్యూరోపతి తో కాళ్లలో ఉండే స్పర్స జ్ఞానం తగ్గడం వలన మరియు షుగర్ వల్ల గాని ధూమపానం వల్ల గాని కాళ్లలో ఉండే రక్తనాళాలలో ఫ్యాట్ పేరుకుపోయి రక్త ప్రసరణ తగ్గడం వలన గాని వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ మందుల వాడక ఎక్కువ రోజులు కంట్రోల్ లో లేకపోయినా గ్యాంగ్రిన్ వచ్చే అవకాశం ఎంత ఉంటుందో అలాగే షుగర్ ని మందులతో జస్ట్ కంట్రోల్లో ఎక్కువ రోజులు ఉంచిన కూడా గ్యాంగ్రిన్ వచ్చే అవకాశం అంతే ఉంటుంది. బ్లడ్ షుగర్ ని టాబ్లెట్స్ తో కంట్రోల్ లో ఉంచడం అంటే షుగర్ జబ్బుని ఇంకా ఇంకా పెంచుతున్నట్లు మరియు ఇంకా ఇంకా గ్లూకోస్ ని మీ శరీర బాగాల్లో దాచుకున్నట్లు. అలా దాచుకోవడం వలన వచ్చే కాంప్లికేషన్స్ లో భాగమే గ్యాంగ్రీన్. ఇలాంటివి వచ్చినప్పుడు శరీర భాగాన్ని కూడా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. గ్యాంగ్రీన్ వచ్చినప్పుడు షుగర్ని ఇంకా కంట్రోల్ చేయడం ద్వారా అది ఫ్యూచర్లో ఇంకా ఇంకా పెరుగుతూ వెళ్తుందే కానీ పూర్తిగా తగ్గదు. గ్యాంగ్రిన్ పూర్తిగా తగ్గిపోవాలి అన్న ఫ్యూచర్లో రాకుండా చేయాలి అన్న మీ ఒంట్లో దాచుకున్న షుగర్ ని మొత్తం గ్లూకోస్ ఆహారాన్ని మానివేయడం ద్వారా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాంగ్రీన్ కి కావాల్సిన బెస్ట్ ట్రీట్మెంట్ హోమియోపతిలో సాధ్యం. ఇక్కడ మీరు సరైన అనుభవం ఉన్న హోమియోపతి డాక్టర్ నీ సంప్రదించాల్సి ఉంటుంది. క్లినికల్ గా ఎలాంటి కేసునైనా పూర్తిగా తగ్గించే అవకాశం హోమియోపతిలో ఉంది. నేను కొన్ని వందల కేసులు వారి శరీర భాగాలు కోల్పోకుండా నయం చేయగలిగాను. షుగర్ నీ కంట్రోల్ మాత్రమే చేసుకుంటే ఫ్యూచర్లు గ్యాంగ్రిన్ వస్తుంది. అదే షుగర్ ని కంట్రోల్ చేయకుండా పూర్తిగా మీ శరీరం దాచుకున్నదంతా తిరిగి మీ శరీరమే వాడుకోబడేలా చేయడం ద్వారా గ్యాంగ్రీన్ పూర్తిగా తగ్గుతుంది మరియు ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది .