Our Health మీ ఆరోగ్యం

Our Health మీ ఆరోగ్యం to propagate for good health

25/04/2025

వేసవి తన ప్రభావాన్ని చూపిస్తుంది.. వేసవిలో ఆరోగ్యంగా ఉండేందుకు:

వేసవి వడగాలులు, దాహం, నీరసం, అలసట...వీటివల్ల చిరాకుతో మరింత నీరసం. తీసుకొస్తుంది. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు.
ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు

కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెలా ఆస్వాదించొచ్చు.
వేసవి చిట్కాలు:--
1) ఆహారపథార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.
2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.
4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.
5) మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.
6) కూల్ డ్రింక్స్ కన్నా, కొబ్బరి నీళ్ళు..మజ్జిగ చాలా మంచివి.
7) కాఫీ , టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.
8) కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.
9) సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. ప్రస్తుత కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున
పిల్లలను బయటకు వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి. సాయంత్రం వేళ లాక్డౌన్ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి తల్లిదండ్రులు కూడా వారితో కలిసి కొన్ని సరదా గేమ్స్ లేదా మంచి పుస్తకాలు చదివించడం నీతి కథలు చెప్పడం చేయాలి.
10) పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ లేదా దబ్బాకులు వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
11) వేసవిలో బయట జ్యూస్ లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్ లు చేసుకుని తాగాలి.
12. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి ఒ.ఆర్.ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.
13. తాటిముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే.
కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి.
అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.
14. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి.
15. వేసవిలో భయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి
Important note ***
16. వయస్సు 50 దాటన వారు తమ ప్రయాణాలలో తప్పక ORS packets పాకెట్స్ వెంట తీసుకెళ్ళాలి.
17.ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటె మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి.
గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్న వారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్'కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.
18.వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి.
వదులుగా, కాటన్'తో తయారుచేసిన బట్టలను ధరించండి.
దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా జరుగుతుంది.
19.ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
20. వేసవికాలంలో భయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకెళ్ళండి.....కూలింగ్ వాటర్ దొరుకుతుంది కదా అని ఈ స్థితిలో ఎక్కువ తీసుకోకండి.
దాహం తీరటం మాట అటుంచి గొంతు ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
21.ఎక్కువ AC లలో కాక ఇంటి ఉష్ణోగ్రత కే అలవాటు పడాలి..ఎటయినా వెళ్ళినప్పుడు తట్టుకునే శక్తి కలుగుతుంది..
22. పిల్లలు మొబైల్ గేమ్స్ ఎక్కువగా ఆడించకుండా పుస్తక పఠనం అలవాటు చేయాలి

23. చంటి పిల్లలకు అన్నంలో నేయి వేసి పెడతాం..కానీ.ఈ కాలంలో నెయ్యి తగ్గిస్తే మంచిది.దాహమయిన చెప్పలేరు.ఏడుస్తుంటారు..
చిరాకు పడుతుంటారు..
24.పెద్దవారికి చలవ పానీయాలు ఇవ్వాలి.
25.చెరుకురస౦ ఐసు వేయకుండా తాగండి.
అరటిపండు ముక్కలుగా కోసి పాలతో కలిపి మిక్సిలో వేసి బనానా షేక్ చేయండి..పంచదార బదులుగా తేనే కలిపితే బావుంటుంది.రుచికి ఒక యాలుక వేసినా బావుంటుంది.....!! బయట ఆహారం మరియు పానీయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంట్లోనే పైవన్నీ తయారు చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని మనవి.

22/04/2025

*రుజిత దివేకర్ భారత దేశంలో ఎక్కువ వేతనం ఇవ్వబడుతున్న డైటీషియన్*

జూనియర్ అంబానీ 108 కిలోల బరువు తగ్గేలా చేసిన వ్యక్తి

ఆమె షుగరు వ్యాధి గ్రస్తులకు చెప్పే ఆహార సూత్రాలు
(కొన్ని అందరికీ కూడా వర్తిస్తాయి)

1. మీకు స్థానికంగా దొరికే పండ్లను తినండి
అరటిపళ్ళు,ద్రాక్ష,సపోటా,మామిడి,ఏదైనా సరే! పళ్ళు అన్నిటిలోనూ ఫ్రక్టోజు ఉంటుంది.మామిడి తినడం ఆపిల్ తినడం కంటే హానికరం కాదు.ఎందుకంటే మామిడి మీకు లోకల్ ఆపిల్ మీకు లోకల్ కాదు, (ఆపిల్ కాశ్మీరు నుండి వస్తుంది మామిడి మీకు లోకల్ గా దొరుకుతుంది)
ఫ్రక్టోజు మీ గ్లూకోజును నియంత్రణలో ఉంచుతుంది కనుక మీరు పళ్ళను నిరభ్యంతరంగా తినండి

2.మీరు గింజలనుండి వచ్చిన నూనెలను వాడండి వేరుశనగ నూనె,నువ్వులనూనె, కొబ్బరినూనె,ఆవనూనె,పేకింగ్ లో వచ్చే vegetable నూనెలకన్నా ఆలివ్,రైస్ బ్రాన్,refined ఆయిల్స్ మీరు ఆడించుకున్న ఆయిల్స్ మంచివి.

3.రుజిత ఎక్కువగా నెయ్యి గురించి చెబుతారు ప్రతిరోజూ నెయ్యి ఎక్కువగా తినండి అంటారు నెయ్యి వాడడం వలన కొలెస్టరాల్ తగ్గుతుంది.

4.మీ ఆహారంలో కొబ్బరి ఎక్కవగా వాడండి అటుకుల పులిహార (పోహా) లో ఇడ్లీ,దోశల చట్నీగా అన్నంలో చట్నీగా తినమని చెప్తారు కొబ్బరిలో కొలెస్టరాల్ అస్సలు ఉండదు మీ నడుము సన్నబడేలా చేస్తుంది.

5.మీరు ఓట్స్ గానీ,ధాన్యాలు గానీ టిఫిన్ గా తినవద్దు అంటారు ఆమె అవి ప్యాకేజ్డ్ ఆహారం అవి మనకు అవసరం లేదు వాటికి రుచీ పచీ ఉండదు బోరు కొడుతూ ఉంటాయి మనం మొదటి ఆహారం బోరు కొట్టకూడదు అంటారు రుజిత

Breakfast గా పోహా,ఉప్మా,ఇడ్లీ,దోశ, పరోటా తినమని ఆమె సలహా !

6. Farhaan Akhtar ఓరియో బిస్కట్ యాడ్ లో కొరికిన ప్రతి ముక్కలోనూ పీచు ఉంది అంటారు మన ఇంటి పెంటలో కూడా పీచు ఉంటుంది పీచుకోసం ఓరియో తినక్కరలేదు ఓట్స్ బదులు పోహా,ఉప్మా , ఇడ్లీ,దోశ,(Instead of poha, upma, idli, dosa)

7.మీ నోట్లో పళ్ళు ఉన్నంత కాలం జ్యూసులు త్రాగకండి.మీకు పళ్ళు ఉన్నది కూరలూ పళ్ళూ తినడానికే !

8.చెరుకు రసం మిమ్మల్ని డీ టాక్సిఫై చేస్తుంది.అది ఫ్రెష్ జ్యూస్ రూపం లో తాగినా చెరుకు ముక్కలు తిన్నా సరే !

9.Pcos, Thyroid - ఉన్నవారు శక్తి కారకాలు బరువు తగ్గేవి అయిన వ్యాయామాలు చెయ్యండి
ప్యాకేజీ ఆహారం వదిలిపెట్టండి

10.రైస్ మామూలు తెల్లని అన్నం తినండి. బ్రౌన్ రైస్ తినవలసిన అవుసరం లేదు. అది ఉడికేటపుడు మీ కుక్కర్ కు ఉడికాక మీ పొట్టకు శ్రమను కలిగిస్తుందిఎందుకు ఆ శ్రమ? రైస్ యొ

18/03/2025

*`ఔషధాలు లేని జీవితం`*

*1.త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం.*

*2. ఓం జపించడం ఔషధం.*

*3.యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం.*

*4. ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం.*

*5.ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం.*

*6. సూర్యకాంతి కూడా ఒక ఔషధం.*

*7.కుండ నీరు తాగడం కూడా ఔషధమే.*

*8.చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే.*

*9.ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే.*

*10. ఆహారంలాగే, నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం.*

*11.ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం.*

*12.సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం.*

*13.కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం.*

*14.నవ్వు మరియు జోకులు ఔషధం.*

*15. సంతృప్తి కూడా ఔషధం.*

*16.మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం.*

*17.నిజాయితీ మరియు సానుకూలత ఔషధం.*

*18. నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం.*

*19.అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే.*

*20.ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం.*

*21.అందరితో కలిసి జీవించడం ఔషధం.*

*22.తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే.*

*23.మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్.*

*24.సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి, ఇది కూడా ఔషధం.*

*25.ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే.*

*26.చివరగా ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం.*

*ప్రకృతి యొక్క "గొప్పతనం"ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఔషధం.*

*`ఈ ఔషధాలు అన్ని మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.`*

08/03/2025
22/05/2024

కూరగాయల మనో భావాలు..
😏😄😏😄😏😄😏

😏 గోంగూరకి ఆహం ఎక్కువ..
ఎందుకంటే తాను గుంటూరు వాసినని...

🥰 తోటకూరకి వయ్యారం ఎక్కువ ..
ఎందుకంటే నవనవ లాడతానని ...

😏 పొట్లకాయకి పొగరు ఎక్కువ..
ఎందుకంటే ఐదడుగుల ఎత్తు అని...

😲 చిక్కుడుకు చికాకు ఎక్కువ..
ఎందుకంటే తనని గోరుతో గోకుతారని...

😏 కందకి వెటకారం ఎక్కువ..
ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని...

😏 చేమకు చిమచిమలు ఎక్కువ ..
ఎందుకంటే కూర, పులుసు, ఫ్రై గా ఉపయోగ పడతానని ...

😄 పెండలానికి పెంకితనo ఎక్కువ ....
కత్తిపీటతో తరుగు తారని ...

🤗 మునగ కాయకి మురెపం ఎక్కువ ..
మగవారికి దివ్య ఔషధం అని ...

😏 వంకాయకి గర్వ మెక్కువ ..
కూరగాయలన్నింటికీ తానే రారాజునని...

😊 అరటికాయకి అభిమానం ఎక్కువ .. శాఖాహార కూర నయినా తనను మాంసంతో పోల్చి లంక మాంసం అంటారని.

🤗 బెండకాయకి ఆనంద మెక్కువ..
తనను మగువల చేతి వేళ్ళతో పోలుస్తారని...

🤔 దొండకాయకి ఆందోళ నెక్కువ..
కాకి తనను ఎక్కడ ముక్కున పెట్టుకుంట దోనని...

😊 కాకరకాయకి శాంత మెక్కువ..
ఎవరూ ఇష్టపడక పోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా...

🤗 బంగాళాదుంప కి సహన మెక్కువ..
కూరల కైనా, చిరు తిండ్లకైనా, పూరీ కైనా, పానీపూరీ కైనా అన్నిటికీ తానే దిక్కు మరి....

😏 గుమ్మడికాయ కి గాంభీర్యమెక్కువ.. కూరగాయల నన్నింటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా...

😄 ఆనపకాయ కి ఆనందం ఎక్కువ ..
ఎలాగయినా అన్ని రకాలుగా తనని తింటారని ...

💃 ఉల్లి పాయకి టెక్కు ఎక్కువ..
తాను లేనిదే ఆ కూరకి రుచి ఎక్కడిదని...

😠 మిర్చి కి కోప మెక్కువ..
ముందు నోటిని, తరువాత కడుపుని మండించేస్తుంది...

😏 కరివేపాకు కి మిడిసి పాటు ఎక్కువ..
కొంచెమైనా సరే కూర సువాసన కి తానే దిక్కు అని...

😔 బీర కాయకి దిగులెక్కువ..
తనను ఎడాపెడా వాడేస్తారని, పీచుని కూడా వదల రని...

😎 కారెట్ కి బీట్ రూట్ కి హంగామా ఎక్కువ..
తమంతటి రంగు ఎవరికీ లేదని...

😊 ఆఖరిగా పనస పొట్టుకి పరువం ఎక్కువ (గ్లామర్ హీరోయిన్ టైప్ ) ..
ఎలాంటి వాళ్ళనైనా సంతృప్తి పరుస్తానని ...

👏😊👏😊👏

16/05/2024

*మ‌న శ‌రీరంలో ఏయే విట‌మిన్లు లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకుందాం*.:-

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. అప్పుడే పోష‌కాహార లోపం ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. దీంతోపాటు ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. అయితే పోష‌కాల విష‌యానికి వ‌స్తే.. వాటిలో విట‌మిన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ క్ర‌మంలోనే మనం రోజూ అన్ని విట‌మిన్లు అందేలా చూసుకోవాలి. ఇక ఏయే విట‌మిన్లు లోపిస్తే మ‌న శ‌రీరం ఎలాంటి ల‌క్ష‌ణాల‌ను చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

(1) *విట‌మిన్ A* లోపిస్తే కంటి చూపు మంద‌గిస్తుంది. త‌క్కువ కాంతిలో ఏమీ చూడ‌లేరు. చ‌ర్మంపై దుర‌ద‌లు వ‌స్తుంటాయి. ద‌ద్దుర్లు ఏర్ప‌డుతుంటాయి. క‌ళ్లు పొడిగా మారుతాయి. దుర‌ద‌లు పెడ‌తాయి.

(2) *విట‌మిన్లు B2, B6* లోపిస్తే నోట్లో పుండ్లు ఏర్ప‌డుతాయి. నోట్లో నాలుక మీద ప‌గిలిన‌ట్లు అవుతుంది. చుండ్రు బాగా వ‌స్తుంది. జుట్టు కుదుళ్ల మీద చుండ్రు పేరుకుపోతుంది. త‌లలో దుర‌ద పెడుతుంది.

(3) *విట‌మిన్ B7* లోపిస్తే గోళ్లు చిట్లిపోతాయి. సుల‌భంగా విరుగుతాయి. అల‌స‌ట బాగా ఉంటుంది. కండ‌రాల నొప్పులు ఉంటాయి. రాత్రి పూట కాలి పిక్క‌లు ప‌ట్టేస్తాయి. కాళ్లు, చేతుల్లో సూదుల‌తో గుచ్చిన‌ట్లు అవుతుంది.

(4) *విట‌మిన్ B12* లోపిస్తే త‌ర‌చూ త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. చ‌ర్మం ప‌సుపు లేదా తెలుపు రంగులోకి మారుతుంది. నోట్లో పగుళ్లు వ‌స్తాయి. వాపులు ఏర్ప‌డుతాయి. డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న ఉంటాయి. తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుంది.

(5) *విట‌మిన్ C* లోపిస్తే చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అవుతుంది. గాయాలు ఆల‌స్యంగా మానుతాయి. జుట్టు పొడిగా మారుతుంది. చ‌ర్మం పొడిగా మారి దుర‌ద‌లు పెడుతుంది. ముక్కు నుంచి ర‌క్త‌స్రావం అవుతుంది. పాదాలు ప‌గులుతాయి.

(6) *విట‌మిన్ E* లోపిస్తే రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. పాదాలు, చేతుల్లో స్ప‌ర్శ ఉండ‌దు. శ‌రీర భాగాలు వాటిక‌వే క‌దులుతుంటాయి. నియంత్ర‌ణ‌ను కోల్పోతాయి. కండ‌రాలు బ‌ల‌హీనంగా మారి శ‌క్తిని కోల్పోతారు. కంటి చూపు మంద‌గిస్తుంది.

(7) *విట‌మిన్ D* లోపిస్తే రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. ఎముక‌లు, దంతాలు బ‌ల‌హీనంగా మారుతాయి. త్వ‌ర‌గా విరిగిపోయే అవ‌కాశాలు ఉంటాయి. ఎముక‌లు నొప్పిగా ఉంటాయి. తీవ్ర‌మైన అల‌స‌ట ఏర్ప‌డుతుంది. మూడ్ మారుతుంది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు త్వ‌ర‌గా వ‌స్తుంటాయి.

(8) *విట‌మిన్ K* లోపిస్తే గాయాలు అయిన‌ప్పుడు ర‌క్త స్రావం ఆగ‌దు. అవుతూనే ఉంటుంది. ర‌క్తం త్వ‌ర‌గా గ‌డ్డ‌క‌ట్ట‌దు. ఫ‌లితంగా ర‌క్తం ఎక్కువ‌గా పోతుంది. గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మాన‌వు. వాంతులు అయిన‌ప్పుడు లేదా ముక్కు నుంచి ర‌క్తం ప‌డుతుంది. ఈ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే ఆ విట‌మిన్ లోపం ఉన్న‌ట్లు గుర్తించాలి. వెంట‌నే ఆయా విట‌మిన్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో వాటి లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. త‌రువాత ఆయా ల‌క్ష‌ణాలు కూడా కనిపించ‌వు. మీకు ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే మీకు దగ్గర్లో వున్న మంచి డాక్టర్ గారిని సంప్రదించి తగిన మంచి నిర్ణయాలు తీసుకోవాలి. సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి.

05/05/2024

*అతి వేడి నుండీ శరీరానికి చలువ చేసే ఆహార పదార్థాలు.*

*మంచి నీళ్ళు*
నీళ్లు కొద్దికొద్దిగా చప్పరించి తాగడం వలన మన నోటిలో ఉన్న లాలాజలంతో కలిసి శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది.

*మజ్జిగ*
ఒక గ్లాస్ పెరుగుకు ఎనిమిది గ్లాసులు నీళ్లు కలిపి పల్చగా మజ్జిగ చేసి కొద్దిగా ఉప్పు కొంచెం నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.

*బార్లీ నీళ్లు*
బార్లీ గింజలను కొంచెం రవ్వగా మిక్సీలో పట్టి ఒక రెండు స్పూన్లు బార్లీ గింజలకు ఒక లీటర్ నీళ్లు పోసి కాసేపు మరిగించి ఆ నీటిని వడపోసి అందులో కొంచెం ఎలక్ట్రాల్ పౌడర్ కొంచెం కలుపుకొని తాగవచ్చు చాలా తొందరగా చలువ చేస్తుంది. శక్తి కూడా వస్తుంది. నీరసం తగ్గిపోతుంది. ఎండ దెబ్బ తగిలినప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది.

*సబ్జా గింజలు*
సబ్జా గింజలు నీటిలో నాన పెడితే చక్కగా ఉబ్బుతాయి. తెల్లగా.అవి నీళ్లలో కలుపుకొని తాగవచ్చు. ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా తాగవచ్చు చలువ చేస్తుంది.

*బాదం బంక*
బాదం బంక అంటారు ఇది తుమ్మ బంక రెండు ఒకే తీరుగా కనిపిస్తాయి. రెండిటికి తేడా ఏమిటి అంటే ఒకటి నీళ్లలో కరిగిపోతుంది నాన పెట్టినప్పుడు బాదం బంక మాత్రం ఉబ్బుతుంది కొంచెం పెడితే చాలా ఎక్కువ అవుతుంది. ఇది రాత్రి నానబెట్టి ఉదయాన్నే నీళ్లలో కలుపుకుని తాగవచ్చు. పాయసం చేసుకుని తినవచ్చు. సేమియాలో వేసుకుని తినవచ్చు. ఎలా అయినా వాడుకోవచ్చు. కాస్త చక్కెర కలుపుకుని కూడా తినొచ్చు చలువ చేస్తుంది చక్కగా.

*సుగంధ పాల (నన్నారి)*
రక్త శుద్ధి కూడా జరుగుతుంది. ఇది తాగడం వల్ల చర్మవ్యాధులు కూడా తగ్గిపోతాయి. ఏదైనా చర్మవ్యాధులతో బాధపడేవారు వేడి చేసి చర్మం బాగా దురద వచ్చేటప్పుడు ఇది క్రమం తప్పకుండా తాగడం వల్ల వేడి తగ్గి చర్మంలోఉన్న వేడి, దురద, మంటకూడా తగ్గిపోతుంది.

*వట్టివేర్లు షర్బత్*
ఇది కూడా నన్నారి సోడా లాగే ఉంటుంది. చక్కగా చలువ చేస్తుంది. వేడి చేసి యూరినల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా మంచి మందు. నీళ్లలో కానీ సోడాలో కానీ కలుపుకొని తాగవచ్చు.

*మారేడు షర్బత్*
ఇది కూడా నన్నారి. వట్టివేళ్ళు లాగానే మారేడు అంటే బిల్వ.
బిల్వ పండుతో చేసిన రసం. ఇది పైల్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. వేడి బాగా తగ్గిస్తుంది. పైల్స్ ద్వారా విరోచనంలో రక్తం పోతుంటే ఇది నీళ్లలో కానీ సోడాలో కానీ కలిపి తీసుకోవాలి. అప్పుడు చాలా శరీరానికి చలువ చేస్తుంది. రక్తం పడే సమస్య ఆగిపోతుంది.

*సగ్గుబియ్యం జావ*
సగ్గుబియ్యాన్ని పాలు పోయకుండా పల్చగా జావ చేసుకుని అందులో చక్కెర కలుపుకొని తాగవచ్చు. చాలా తొందరగా చలువ చేస్తుంది.

*రాగి జావ*
రాగి జావలో మజ్జిగ కలుపుకొని తాగితే చలువ చేస్తుంది.

11/08/2023

Address

Guntur
522007

Telephone

9440262421

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Health మీ ఆరోగ్యం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share