14/09/2025
ఒకసారి రమణ భగవాన్ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు తన శిష్యుడు కి కొంచం తన గోచి గుడ్డ ను చింపి పట్టుకో అన్నాడు అంట కొంచం దూరం వెళ్ళక ఒక బండరాయి తన కాలికి తగిలి రక్తం వస్తుంది వెంటనే శిష్యుడు ఆ గుడ్డ భగవాన్ కాలికి కట్టు కట్టి స్వామి మీకు ముందే తెలిసినప్పుడు వేరే దారి నుంచి వెళ్ళచు గా అంటాడు అంట, ఈ జన్మ నే కర్మ అనుభవించడానికి వచ్చాము ఇంకా ఆ కర్మ నీ మారిస్తే ఆది ఇంకో 3 రోజుల తరువాత అయిన మళ్ళీ నీకు సమయం బాగా లేనప్పుడు అయిన నీకు ఇంకా పెద్దది అయి వస్తుంది తప్ప కర్మ పోదు అని చెప్తాడు .మనం ఏది అయిన కర్మ నీ అనుభవించాల్సిందే .మనం మహర్షి అంత గొప్పవాళ్ళం కాదు కాబట్టి ఆస్ట్రాలజీ హెల్ప్ తో ముందే తెలుసుకొని సిద్ధంగా ఉండడం లేదా దైవ సహాయం తో ఆ కర్మను అనుభవించే స్థితికి రావడం చేయచ్చు
నా దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటే నేను మీ కర్మ నీ మార్చేస్తా వచ్చేదాన్ని ఆపేస్తాను ఈ పూజ ఆ హోమం చేయిస్తా అని మాత్రం చెప్పాను.కర్మ నీ మీ పుణ్య ఫలితం పెంచి తగ్గించడం లేదా దైవ సహాయంతో తప్పించడమో ఇంకా మీ మీ జాతక చక్రం పాప పుణ్య ఫలితం బట్టి చెప్తాను కానీ ఏదో అద్భుతం నేను చేయలేను చేయను కూడా ,మీ కర్మ నేను ఎందుకు తీసేస్తా .మీరే మీ గుణం మార్చుకోవడం మీ చేసే పనులలో కొన్ని మంచి పనులు చేయడం చేసి మార్చుకోవాలి అవి ఎలా చేయాలో ఆది నేను చెప్తాను అంతే,మీకు మానసిక ధైర్యం రావడానికి ఏం చేయాలో ఆ సమస్య నుంచి బయటికి ఎలా రావచ్చో చెప్తాను .జ్యోతిష్యం లో అంత వరకే చేయగలరు మొత్తం ఎవరు మార్చలేరు మార్చిన అది మీరే మళ్ళీ అనుభవించాలి