ఆరోగ్య వ్యాసాలు Health Articals

ఆరోగ్య వ్యాసాలు  Health Articals Ayurarogyalu

21/07/2025

• అత్యంత ఆరోగ్యకరమైన తులసి

తులసిని అత్యంత పవిత్రంగా కొలిచే వాళ్లు మన పూర్వీకులు. ఉదయం లేవగానే తులసి పూజ చేయకుండా పనులు మొదలు పెట్టేవాళ్లు కాదు. పురాణాలలో కూడా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అత్యంత ఆరోగ్యకరమైన అంశాలు తులసిలో ఉన్నాయి.

ఇంతటి పవిత్రత గల తులసి గురించి ......

ఎన్నో ఏళ్ల తరబడి హిందువులు భగవంతుడికి కానుకలు, పువ్వులు సమర్పించడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఎంతో పవిత్రతను, ప్రాధా న్యతను సంతరించుకున్న తులసి నేడు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు దీనిలో ఉన్న ఔషధ గుణాలను సౌందర్య పోషణకు వాడుకుంటున్నారు. ఎందుకంటే తులసి కొమ్మలు, ఆకులు, విత్తనాలు, కాడలే కాదు మొక్క కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్ర మైనదని, ఔషధాలతో కూడుకున్నదని పద్మ పురాణంలో పేర్కొ న్నారు.

‘‘తులసి మొక్కను చూసినా లేదా తాకినా అన్ని రకాల ఒత్తిడులు, జబ్బుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి మొక్కపై నీళ్ళు పోస్తే భయాలన్నీ తొలగిపోతాయి. ఎవరైనా తులసి మొక్కను నాటినా, నీళ్లు పోసినా వారు కృష్ణుడికి ప్రీతి పాత్రమవుతారని’’ స్కందపురాణం చెబుతోంది. అయితే కేవలం దైవాత్వా నికే కాకుండా తులసిలో కొన్ని రకాల ఔషధ గుణాలున్నాయని వైద్య నిపుణులు చెబతున్నారు.

• తులసితో...

ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి వల్ల లాభా లెన్కో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.
కాచిచలార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయని అంటారు.

అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. పొట్టలో నులిపురుగులు నశిస్తాయి.
జలుబు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్‌ స్పూన్‌ తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.

బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గు ముఖం పడతాయి.

* ఆకులు

జ్వరాన్ని తగ్గిస్తుంది.

అల్సర్‌ల నుంచి రక్షిస్తుంది.

రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా నియంత్రిస్తుంది.

కాలేయం శక్తివంతంగా పనిచేయడానికి
దోహద పడుతుంది.

నోటినుంచి దుర్వాసన వెలువడకుండా నిషేధిస్తుంది.

అలర్జీలనుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఎండవల్ల సోకే అలర్జీలు, పొగ, దుమ్ము నుంచి
శరీరానికి కలిగే హానిని అరికడుతుంది.

ఒత్తిడిని దూరం చేస్తుంది.

దాదాపు అందరి ఇళ్లలోనూ ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా పెరట్లో తులసి మొక్క ఉంటుంది. ఎందు కంటే తులసి ఆకుల నుంచి వచ్చే సువాసన ఇల్లంతా పరుచుకొని మంచి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తూ వ్యాధులు రాకుండా చేస్తుందని విశ్వసిస్తారు.

తులసి ఆకులను చప్పరించడం వల్ల దానిలో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తులసి ఆకులో ఉండే రసం ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అందుకే చాలా దేవాలయాలలో తీర్ధంలో తులిసీ దళాలను వేసిస్తారు.

#ఆయురారోగ్యాలు

18/07/2025

• ఆనంద శక్తి!

రోగనిరోధక శక్తి బలోపేతం అనగానే మంచి తిండి, వ్యాయామం వంటివే ముందుగా గుర్తుకొస్తాయి. కానీ ఆనందం, సంతోషం కూడా ఎంతగానో తోడ్పడతాయి. జబ్బుల బారినపడకుండా దీర్ఘకాలం కాపాడతాయి. అధ్యయనాలు ఈ విషయాన్ని బలంగా నొక్కి చెబుతున్నాయి.

మంచి కబురు విన్నప్పుడో, కలలుగంటున్న ఉద్యోగం లభించినప్పుడో, విజయం సాధించినప్పుడో.. ఇలాంటి సందర్భాల్లో ఎవరికైనా ఆనందం, సంతోషం కలుగుతాయి. ఇంతకీ ఆనందమంటే? దీనికి ఇదమిత్థమైన నిర్వచనమంటూ లేదు. శరీరపరంగా చూస్తే- ఆనందమనేది ఓ భావోద్వేగ స్థితి. ఒంట్లో డోపమిన్‌, సెరటోనిన్‌ వంటి నాడీ సమాచార వాహికలు విడుదలైనప్పుడు ఇలాంటి స్థితి కలుగుతుంది. అయితే ఇది మనసుకే పరిమితం కాదు. ఆరోగ్యం మీదా సానుకూల ప్రభావం చూపుతుంది. వ్యక్తులు హాయిగా, ఆరోగ్యంగా జీవిస్తుండటానికీ ఆనంద స్థాయులకూ సంబంధం ఉంటున్నట్టు అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయి. సంతోషం లేదా సానుకూల ప్రభావం గుండెజబ్బుల నుంచి కాపాడుతున్నట్టు.. ఆనందంగా ఉన్న రోజుల్లో గుండె కొట్టుకునే తీరు సాఫీగా సాగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. సానుకూల భావోద్వేగాలకూ రోగనిరోధకశక్తికీ మధ్య సంబంధం గురించి ఇంకా పూర్తిగా అవగతం కాలేదు. కానీ ఆనందంగా ఉండే వారిలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటున్నట్టు, ఫలితంగా జబ్బులను మరింత సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.

ఏంటీ సంబంధం?

ఆరోగ్యం, ఆనందం పరస్పరం ఆధారితాలు. వీటి మధ్య పరోక్ష సంబంధం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటాం. మంచిగా ప్రవర్తిస్తాం. మంచి ఆహారం తినటం, వ్యాయామం చేయటం, త్వరగా నిద్రకు ఉపక్రమించటం వంటి అలవాట్లన్నీ మూడ్‌ను ఉత్సాహ పరుస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అంటే ఆరోగ్యం మంచి ప్రవర్తనకు.. మంచి ప్రవర్తన ఆనందానికీ దోహదం చేస్తాయన్నమాట. నిద్ర సమస్యలతో బాధపడేవారి మీద 2008లో నిర్వహించిన అధ్యయనమూ ఇదే సూచిస్తోంది. వీరిలో దాదాపు సగం మందిలో సానుకూల దృక్పథం తక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. కంటి నిండా నిద్రపోవటమనేది మన భావోద్వేగ స్థితి మీద నేరుగా ప్రభావం చూపుతుందనటానికిదో నిదర్శనం.

నేర్చుకోవచ్చు!

ఆశ్చర్యంగా అనిపించినా ఆనందంగా, సంతోషంగా ఉండటాన్నీ నేర్చుకోవచ్చు. దీన్నొక అలవాటుగానూ మార్చుకోవచ్చు. మనలోని అసలు మనిషిని గుర్తించటం ద్వారా దీన్ని సాధించొచ్చు. సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ చాలామంది భావోద్వేగాలను కోల్పోతుంటారు. లోపల దాగున్న పిల్లల మనస్తత్వాన్ని మరచిపోతుంటాం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటం, బాధ్యతలను నెరవేర్చటంలో మునిగిపోయి మనల్ని మనుషులుగా మలచే, జీవితానికి విలువను చేకూర్చే చిన్న చిన్న పనులను ఆస్వాదించటంలో విఫలమవుతుంటాం. దీన్ని గుర్తిస్తే చాలావరకు ఆనందంగా ఉండటాన్ని నేర్చుకున్నట్టే.

* లోపలి పిల్లాడితో స్నేహం: మనలోని పిల్లల మనస్తత్వం అలాగే ఉంటుంది. ఎంత పెద్దవాళ్లయినా పిల్లల మాదిరిగా ఆడుకోవాలని, ఆనందించాలని ఎప్పుడో అప్పుడు అనుకోవటమూ సహజం. ఈ నిజాన్ని అంగీకరించాలి. ఒకసారి లోపలి పిల్లాడికి అనుమతించి చూస్తే తేడా ఇట్టే తెలుస్తుంది. జీవితాన్ని ఆస్వాదించటమెలాగో అవగతమవుతుంది.

* మనసుకు నచ్చే పనులు: చాలావరకు మనం ఎవరో నడిచిన దారిలో నడవాలని ప్రయత్నిస్తుంటాం. ఎవరినో చూసి, అలాగే కావాలని పరుగులు పెడుతుంటాం. ఈ యావలో అసలు మనకు కావాల్సిందేంటో విస్మరిస్తుంటాం. నిజానికి మనసుకు నచ్చిన పనులతోనే లక్ష్యం త్వరగా అందుతుంది. ఆనందమూ సొంతమవుతుంది.

* ఏదీ ఎల్లకాలం ఉండదు: కొన్నిసార్లు జీవితంలో అనూహ్య, అవాంఛిత ఘటనలు జరుగు తుంటాయి. కష్టాలు, నష్టాలు ఎదురవుతుంటాయి. వాటినే తలచుకుంటూ ఉంటే విచారం తప్ప మిగిలేదేమీ ఉండదు. ఎంతటి విపత్కర పరిస్థితులైనా ఎల్లకాలం ఉండవని అర్థం చేసుకోవాలి. ప్రతి సవాలునూ అవకాశంగా మలచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆనందానికి బాట పడుతుంది.

* సంతృప్తి పడటం: తృప్తి పడటమనేది అద్భుతమైన భావన. ఇదొక మానసిక ధోరణి. జీవన మార్గం. చిన్న చిన్న విషయాలకూ తృప్తి పడటం నేర్చుకొని చూడండి. జీవితం కొత్త సొబగులు అద్దుకుంటుంది. మనసూ ఆనంద డోలికల్లో తేలియాడుతుంది.

17/07/2025

‎Follow the

ఆయురారోగ్యాలు 💪 AYURAROGYALU 🩺

channel on WhatsApp: 👌👌🤩

17/07/2025

మామిడి, ఆపిల్‌, సీతాఫలం, సపోటా, కమలా, బొప్పాయి... వంటి పండ్లను చాలామంది ఇష్టంగానే తింటుంటారు. కానీ వగరూ తీపీ కలగలిస....

17/07/2025

#చిలగడదుంప #ఆయురారోగ్యాలు

 #చిలగడదుంప      #ఆయురారోగ్యాలు
17/07/2025

#చిలగడదుంప #ఆయురారోగ్యాలు

14/07/2025

• సంప్రదాయంగా ఆరోగ్య సంరక్షణ

వెనకటి పెద్దలు మార్గనిర్దేశం చేసిన మాటలమాటున దాగున్న ఆరోగ్య సూత్రాలు కొన్ని మాత్రమే నేడు అరుదుగా అనుసరిస్తున్నాం. నికార్సయిన కొన్నింటిని విస్మరిస్తున్నాం. భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి. సహజంగా స్త్రీలు వంటపాత్రలు శుభ్రం చేసే సందర్భంలో ఎక్కువసేపు నీళ్లలోనే కాళ్లు తడపాల్సి ఉంటుంది. కాబట్టి కాళ్లకు పసుపు రుద్దుకునేవారు. బ్యాక్టీరియా సోకకుండా యాంటీసెప్టిక్‌గా, యాంటీ బయాటిక్‌గా పసుపు పనిచేస్తుంది. పెళ్ళిళ్లలోనూ వధూవరులకు నలుగు పెట్టి పసుపు నీళ్ల స్నానం చేయించడం తెలిసిందే. సాధారణంగా శరీరం నలతగా ఉన్నప్పుడు- వేడినీళ్లలో వాయిలాకు వేసి మరిగించిన నీళ్లతో స్నానం చేస్తే... ఎలాంటి నొప్పులున్నా కాస్తంత ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరువెచ్చని నీళ్లలో సున్నిపిండితో స్నానం మంచిదని పెద్దలు చెబుతారు. పిల్లలకు అమ్మవారు(వైరల్‌ ఇన్ఫెక్షన్‌) సోకితే క్రిమికీటకాల పీడ వదలడానికి వేపాకుల్ని రోగి చుట్టూ రక్షణ కవచంలా పేర్చడం వంటి ఎన్నో పూర్వాచారాల్ని మరచిపోతున్నాం.

మన ఇంటికి అతిథులైనా, బంధువులైనా వచ్చారంటే వెంటనే చెంబుతో నీళ్లు ఇచ్చి స్వాగతించడం ఆనవాయితీ. బయటినుంచి వస్తారు గనుక కాళ్లు కడుక్కుని లోపలికి రావాలని చెప్పేవారు. చెప్పులు కూడా ఆరుబయట వదిలేయడం అప్పటివారి తప్పనిసరి అలవాటు. తద్వారా క్రిములు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అలాగే వండిన భోజనం వెంటనే తినమని పెద్దలు సూచించేవారు... చల్లారిన పదార్థంలో క్రిములు చేరతాయని! అప్పట్లో ఆహార పదార్థాల తయారీకి మట్టి, ఇత్తడి, రాగి పాత్రలను ఉపయోగించిన తీరు అద్భుతం. వాటివల్ల పోషకాల నిల్వ పుష్కలంగా సమకూరుతుంది. కాలుష్యం బారిన పడే అవకాశమే లేదు. పర్వదినాల్లో ఇంటి గుమ్మాలకు తప్పనిసరిగా తోరణాలు కట్టేవారు. గతంలో ఇళ్లలో సూక్ష్మక్రిముల తాకిడికి నివారణగా సాంబ్రాణి పొగ వేసేవారు.

హిందూ సంప్రదాయ పండుగల్లో దర్శనమిచ్చే రకరకాల పిండి వంటకాల ప్రత్యేకతల వెనక అన్న ఆరోగ్య రహస్యాలున్నాయి. తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ రోజున పచ్చడిలో, శ్రీరామనవమి నాటి బెల్లం పానకంలోనూ శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే దసరా సంక్రాంతి పండుగ ప్రత్యేక వంటకాల్లో వాడే బెల్లం, నువ్వులు, వాము వంటివి దేనికదే ప్రత్యేకత కలిగి ఉన్నాయి. బతికుంటే బలుసాకు తినొచ్చునన్న సామెత ఊరకే పుట్టలేదు. పొలాల గట్లమీద, చిత్తడినేలల్లో బలుసాకు అరుదుగా లభిస్తుంది. దీన్ని పల్లెల్లో కొందరు వినాయకచవితి సమయంలో పులుసుగా, పప్పుతోనో వండుకుని తినడం అలవాటు. దీన్ని పచ్చడిగా తింటే అతిసారం తగ్గించడానికి, ఆకలిని పెంచడానికి తోడ్పడుతుంది. ఆషాఢమాసంలో పెట్టుకునే గోరింటాకు శరీరంలో వేడిని తొలగించి ఒత్తిడిని జయిస్తుంది. భారతీయ హిందూ సంప్రదాయంలో ‘బొట్టు’కు అత్యంత ప్రాధాన్యం ఉంది. నుదుట దృష్టి కేంద్రంపై కుంకుమ బొట్టు పెడితే ఏకాగ్రతతో కూడిన మానసిక ఉల్లాసం ఉట్టిపడుతుంది.
వ్యక్తులు తారసపడితే చేతులు జోడించి నమస్కరించడం ఎంతో ఆరోగ్యకరం. ఇది భారతీయుల తొలి సంస్కారం. పూర్వం ఆదివాసులలో సామాజిక దూరం కాస్త కఠినంగా ఉండేది. ఆడపిల్లలు రజస్వల అయితే ఇంటికి దూరంగా ఉంచేవారు. ఏ పద్ధతి పాటించినా మానవతా దృక్పథంతో కూడి ఉండాలి. ఆ కాలంలో జనసమూహంలో ఎవరైనా తుమ్మినా అపచారంగా భావించేవారు. దాని చెడు ప్రభావం దృష్ట్యా కొన్ని సామాజిక దూరాలు పాటించేవారు. అలాగే అశుభాలకు సంబంధించిన ఆచారాల్లోనూ అదే జాగ్రత్త కనిపించేది. క్షౌరశాలకు, అంత్యక్రియలకు వెళ్లి వస్తే దేన్నీ తాకకుండా స్నానం చేశాకే ఇంట్లోకి వెళ్లడం అప్పటి సంప్రదాయం. వ్యాధులు సంక్రమించకుండా ఓ జాగ్రత్తగా ఇది సూచించేవారు. పురుళ్ల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలు ఉండేవి. మైల, అంటు వంటివి పాటించడంతో ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం. వాటిని మూఢాచారాలుగా మార్చేసిన కొందరివల్ల అటువంటి పద్ధతులపై విరక్తి, అనాసక్తి ఏర్పడ్డాయి. అందులోని శాస్త్రీయతను ఆరోగ్య సూత్రాలను కొట్టిపారేయలేం. మానవత్వానికి మచ్చలేని విధంగా ఆనాటి సంప్రదాయాలను పాటించడం, అనుసరించడం నేడు చాలా అవసరం. కరోనా ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఆ తరం అలవాట్లను కొంతమేరకైనా ఒంటపట్టించుకోవాల్సిందే.

- గుమ్మడి లక్ష్మీనారాయణ (సామాజిక విశ్లేషకులు)



😊🤣🤔🤩   #ఆయురారోగ్యాలు
14/07/2025

😊🤣🤔🤩

#ఆయురారోగ్యాలు

Address

Hyderabad

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919866555598

Alerts

Be the first to know and let us send you an email when ఆరోగ్య వ్యాసాలు Health Articals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram