02/05/2026
'నేను బాల్యం లో RSS శాఖ కు వెళుతూండేవాడిని... వారు నిర్వహించే 'గద్దె వేంకట సత్యనారాయణ శిశువిద్యా మందిరం' లోనే చదువుకున్నాను. అక్కడి గురుశ్రేష్ఠులు శ్రీ శనగవరపు వెంకటేశ్వర్లు, శ్రీ ఆకుల వెంకట రత్నారావు వంటి వారి వల్ల తెలుసుకున్నవే - దేశభక్తి, దైవభక్తి, కర్తవ్యనిష్ఠ, నిష్కామ కర్మ, భగవద్గీత, నిస్వార్ధపరులైన దేశభక్తుల కథలు, రామాయణ భారతాదుల లోని పాత్రల వైశిష్ట్యం .... ఇవే నన్ను సంపూర్ణ భగవద్గీతా గానం రికార్డింగ్ తో పాటు, గీతా ప్రచారానికే నా జీవితాన్ని అంకితమయ్యేలా స్ఫూర్తినిచ్చాయని భావిస్తాను. నా దృష్టి లో RSS అంటే నిస్వార్థపరులైన దేశభక్తులను తయారు చేసే కర్మాగారం. ఈ సంస్థలో ప్రచారకులు ప్రాంతాలకు అతీతం గా దేశం లో ఎక్కడికైనా వెళ్లి సేవలందించగలరు. ఈ సేవలకు శతవసంతాలు పూర్తి అయినా సందర్భం గా దేశవ్యాప్తం గా వేలాది హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరగడం ఆనందదాయకం... ఈ కార్యక్రమాల ప్రధానోద్దేశ్యం - శత సంవత్సరాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, హిందువులు సాధించిన ప్రగతి గుర్తుచేసుకుంటూ, ఈ దేశ ప్రస్తుత పరిస్థితులను కూడా సమీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేటి యువతరం లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించే 'శాఖ'ల పట్ల మరింత అవగాహన, ఆసక్తి ఏర్పరచవలసి ఉంది. ఒక పక్క 'మోదీ' మహాశయుడు ఈ దేశం అస్థిత్వాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తుంటే మరోపక్క - ఈ దేశం లో విపరీతం గాపెరుగుతున్న మత మార్పిడులు, సనాతన ధర్మం పైన విచ్చల విడిగా జరుగుతున్న దాడులు, దశాబ్దాలుగా లవ్ జీహాద్ పేరుతో హిందూ ఆడపిల్లలపై జరుగుతున్న దారుణాలు ఇప్పుడు టెక్ జీహాద్ పేరుతో మరో మలుపు తీసుకోవడం ఆందోళనకరమైన పరిస్థితే... హిందువులు తీవ్రం గా ప్రతిఘటించవలసిన స్థితే..! హిందువులను ఏమి చేసినా స్పందించరనే సంకేతాన్ని ఇవ్వడం మానుకోవాలి... జరుగుతున్న అనేక వరుస సంఘటనలు భారత దేశ ఆస్థిత్వాన్ని, భద్రతను, సనాతన ధర్మ ఉనికిని ప్రశ్నిస్తున్నాయి." అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. హైదరాబాద్ లోని హస్తినాపురం లో ఇటీవల జరిగిన హిందూ సమ్మేళనం లో ముఖ్య అతిథి గా పాల్గొని ప్రసంగించారు. ఆచరణాత్మక హిందువుల వల్లే సనాతన ధర్మం కాపాడబడుతుందని ఆయన అన్నారు. 'తల్లులారా ... ఈ దేశం లో పుట్టినందుకు భగవద్గీత శ్లోకం ... తెలుగు రాష్ట్రాలలో పుట్టినందుకు పోతన పద్యం మీ బిడ్డలకు నేర్పించి మీ అస్థిత్వాన్ని కాపాడుకోండి..." అని పిలుపునిచ్చారు. అమెరికా లో న్యూజెర్సీ లోని శాటన్ హాల్ యూనివర్సిటీ లో MBA చదివే విద్యార్థులకు 'A Journey Of Transfermation' పేరుతో భగవద్గీత కోర్స్ తప్పనిసరి గా నేర్పిస్తుంటే ... భగవద్గీతకు జన్మనిచ్చిన భారత దేశం లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి... హిందువులు ఏం చేస్తున్నారు ? అంటూ గంగాధర శాస్త్రి ప్రశ్నించారు. అందరినీ సమం గా ఆదరించాలనే secular భావజాలానికి పునాది అయిన సనాతన ధర్మాన్ని, భారత దేశాన్ని కాపాడుకుందామని అన్నారు. ఈ కార్యక్రమం లో హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు శ్రీ తేలుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి , RSS అఖిల భారత సామాజిక సమరసత కళావిభాగం కన్వీనర్ శ్రీ అప్పల ప్రసాద్ జీ పాల్గొన్నారు.
“I used to attend RSS shakhas during my childhood and studied at the Gadde Venkata Satyanarayana Shishu Vidya Mandir run by them. It was through revered teachers there—such as Sri Shanagavarapu Venkateswarlu garu and Sri Akula Venkata Ratna Rao garu—that I imbibed values like patriotism, devotion to God, commitment to duty, Nishkama Karma, the teachings of Bhagavadgita, inspiring stories of selfless patriots, and the greatness of characters from the Ramayana and Mahabharata. I believe it is these very influences that inspired me to dedicate my life to recording the complete Bhagavadgita in musical form and to the propagation of the Gita. In my view, RSS is a workshop that produces selfless patriots. The pracharaks of this organization serve anywhere in the country, beyond regional boundaries. It is heartening to see that, as this organization completes a hundred years of service, thousands of Hindu Sammelan programs are being conducted across the nation. The primary objective of these gatherings is to reflect on the progress achieved by the Rashtriya Swayamsevak Sangh and Hindus over the past century, and also to critically assess the current condition of the nation. There is a pressing need to create greater awareness and interest among today’s youth about the shakhas conducted by RSS. While on one hand, Shri Narendra Modi garu is striving to strengthen the nation’s identity, on the other hand, the alarming rise in religious conversions, relentless attacks on Sanatana Dharma, and the atrocities against Hindu girls under the guise of ‘Love Jihad’—now taking a new turn in the form of ‘Tech Jihad’—are deeply concerning. This is a situation that Hindus must strongly resist. We must stop sending the message that Hindus will not respond to any wrongdoing. The series of ongoing incidents is raising serious questions about the identity, security, and the very existence of Sanatana Dharma in India,” said Dr. L.V. Gangadhara Sastry, renowned Gita singer, preacher, propagator, and founder of the Bhagavadgita Foundation.
He was speaking as the chief guest at a recently held Hindu Sammelan in Hastinapuram, Hyderabad. He emphasized that only practicing Hindus can truly safeguard Sanatana Dharma. Addressing mothers, he urged: “Teach your children at least one Bhagavadgita shloka because they are born in this country, and a verse of Pothana because they are born in the Telugu land—this is how you preserve your identity.” He further questioned, “When MBA students at Seton Hall University in New Jersey, USA, are mandatorily taught a Bhagavadgita course titled ‘A Journey of Transformation,’ what are the governments in India—the birthplace of the Gita—doing? And what are Hindus doing?” He called upon everyone to protect India and Sanatana Dharma, which form the very foundation of the secular ideal of respecting all equally.
The program was also attended by Sri Telukuntla Srinivas Reddy garu, President of the Hindu Sammelan Samiti, and Sri Appala Prasad ji, Convener of the All India Social Harmony Arts Division of RSS.