Ayurveda Medicine

Ayurveda Medicine Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ayurveda Medicine, hyderabad, Hyderabad.

Happy women's day
08/03/2019

Happy women's day

29/01/2019
31/12/2018

ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

కొర్రలుశరీరానికి ఎంతో మేలు చేసే 'కొర్రల'కు తృణ ధాన్యాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు జొన్నలు, సజ్జలు, రాగుల లాగే వీట...
26/12/2018

కొర్రలు

శరీరానికి ఎంతో మేలు చేసే 'కొర్రల'కు తృణ ధాన్యాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు జొన్నలు, సజ్జలు, రాగుల లాగే వీటిని ఎక్కువగా తినేవారు, కానీ కాలక్రమేణా వీటి వాడకం ఇప్పుడు తక్కువైంది. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీసుకుంటున్న ధాన్యపు ఆహారంలో కొర్రలు 6వ స్థానంలో ఉన్నాయి.

భారత్, చైనా, నైజీరియాల్లో వీటిని ఎక్కువగా పండిస్తున్నారు. కొర్రలు చాలా తక్కువ కాలంలోనే పక్వానికి వస్తాయి. మన దేశంతోపాటు ప్రధానంగా చైనా, జపాన్, రష్యా, ఆఫ్రికా, ఈజిప్ట్ దేశాల్లో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. పోషక పదార్థాలు అధికంగా ఉండే కొర్రలను నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్యకర ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. తృణ ధాన్యాలన్నింటిలోనూ సులభంగా జీర్ణమయ్యే ఆహారంలో కొర్రలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది.

2. పెద్దపేగును ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడంతోపాటు మలబద్దకాన్ని తొలగించడంలో కొర్రలు అద్భుతంగా పనిచేస్తాయి.

3. గోధుమలు, వరి అన్నం కన్నా చాలా తక్కువ మొత్తంలో తీపిని కొర్రలు కలిగి ఉంటాయి. దీంతో ఇవి మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి వారి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
foxtail-millets
4. బరువు తగ్గాలనుకునే వారు నిరభ్యంతరంగా కొర్రలను తీసుకోవచ్చు, దీని వల్ల ఎటువంటి కొవ్వు శరీరంలో చేరదు. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మెటబాలిజం ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది.

5. మానసిక వ్యాధులు, టెన్షన్, ఒత్తిడి తదితర సమస్యలతో సతమతమయ్యేవారికి సెరటోనిన్ అధికంగా అవసరమవుతుంది. అలాంటి సెరటోనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు కొర్రలు ఉపయోగపడతాయి.

6. వీటిలో ఉండే మెగ్నిషియం మైగ్రేన్ తలనొప్పులు, హార్ట్ ఎటాక్‌లు, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. నియాసిన్ (విటమిన్ బి3) చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలతోపాటు ప్రోటీన్లు కూడా కొర్రల్లో ఎక్కువగానే ఉన్నాయి.

7. కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనతను తొలగిస్తుంది. ప్రధానంగా మహిళలకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి.

అన్నం, ఆలుగడ్డలకు బదులుగా కొర్రలను తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. డైరెక్ట్‌గా తినలేని వారు సలాడ్ రూపంలోనూ, కూరగాయలతో ఉడికించి కూడా దీన్ని తీసుకోవచ్చు. కొర్ర అన్నం వండాలంటే తీసుకున్న ధాన్యానికి సుమారు 3 రెట్ల నీరు పోసి ఉడికించాలి. అన్నం రూపంలోనే కాకుండా పిండి, రవ్వగా చేసుకుని వాటితో ఉప్మా, దోశ, ఇడ్లీ, సంకటి, కిచిడీ, పాయసం, రొట్టె ఇలా ఏది కావాలంటే అది చేసుకుని తినవచ్చు.

మిరియాల తీగ
15/11/2018

మిరియాల తీగ

కాఫీ గింజలుకాఫీ తోటలు అరకులోయ చాలా ఉన్నాయి. ఆదివాసీలకు కాఫీ తోటలు వాళ్లకు జీవనాధారం. నేను కొన్ని ప్రాంతాల్లో కొద్ది రోజు...
14/11/2018

కాఫీ గింజలు

కాఫీ తోటలు అరకులోయ చాలా ఉన్నాయి. ఆదివాసీలకు కాఫీ తోటలు వాళ్లకు జీవనాధారం. నేను కొన్ని ప్రాంతాల్లో కొద్ది రోజుల క్రితం కాఫీ తోటలను దర్శించిన సందర్భంగా కొన్ని చిత్రాలు

హెయిర్‌ డై: జుట్టును సంరక్షించటంలో కాఫీ గింజల పాత్ర కీలకం. ఇవి సహజ గుణాలు కల్గి ఉంటాయి. దీంట్లో రసాయనాలు అస్సలు ఉండవు.
ఎరువు: కాఫీ గింజలను ఉపయోగించిన తరువాత వచ్చే పొడిని వృథాగా బయట పడవేయకుండా ఇంట్లో ఉండే మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు. దాంట్లోని పోషకాలు మట్టికి కావాల్సిన ఆమ్లాలను, ఖనిజలవణాలను అందించి మొక్కలు బలంగా పెరగటానికి దోహాదపడతాయి.
ఫ్రెష్‌నర్‌: ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్‌ను శుభ్రంగా ఉంచుకోవాలంటే.. కాఫీ గింజల బాక్స్‌ను ఉంచాల్సిందే. ఫ్రిజ్‌లో దుర్వాసన రాకుండా ఉండాలంటే దాంట్లో కాఫీ గింజల బాక్స్‌ మూతను కొంచెం ఓపెన్‌ చేసి ఉంచితే సరిపోతుంది.
ఫర్నిచర్‌: ఇంట్లో ఉండే పాత ఫర్నిచర్‌ను కాఫీ గింజలతో శుభ్రం చేసుకోవచ్చు. ఫర్నిచర్‌ పై మచ్చలు పడితే దాన్ని కాఫీ గింజలతో తుడిస్తే మచ్చలు కనిపించకుండా పోతాయి.
మైక్రోఓవెన్‌: మైక్రోఒవెన్‌లో దుర్వాసన వస్తుందా..? అయితే ఇలా చేయండి ఒక కప్పు నీటిలో రెండు చెంచాల కాఫీ గింజలను కలిపి మైక్రోఓవెన్‌లో పెట్టి వేడి చేస్తే సరిపోతుంది. దాంట్లో ఉండే దుర్వాసన పోతుంది.
స్క్రబ్‌: ఇంట్లో ఉండే పాత్రలను, జార్‌లను శుభ్రం చేయటానికి కాఫీ గింజలను స్క్రబ్‌లా ఉపయోగించుకోవచ్చు. కొద్ది నీటిలో కాఫీని కలిపి పాత్రలను రుద్దితే సరిపోతుంది. కొత్తవిగా కనిపిస్తాయి.
చర్మానికి: ముఖంపై చర్మం నిర్జీవంగా ఉందా? అయితే ఆలివ్‌ నూనెలో ఒక చెంచా కాఫీ గింజలను కలిపి ముఖానికి పది నిమిషాల పాటు పట్టించండి. ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.
ఐస్‌క్రీమ్‌: ఐస్‌ క్రీమ్‌ మంచి టేస్టు రావాలంటే దాంట్లో కాఫీ గింజలను, ఐస్‌ క్యూబ్స్‌ను కలిపి ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.
కాఫీ పెప్స్‌ల్‌: కాఫీీ తయారు చేసుకున్న తరువాత దాంట్లో కొంచెం ఐస్‌పెప్స్‌ల్‌ అంటే కాఫీక్యుబ్స్‌ను కలిపితే చాలా రుచిగా ఉంటాయి. అయితే కాఫీలో వీటిని ఐదునిమిషాల పాటు కలిపిన తరువాత తాగితే మరింత రుచిగా ఉంటుంది.

కర్పూరం చెట్టు
12/11/2018

కర్పూరం చెట్టు

07/11/2018

దీపావళి శుభాకాంక్షలు

రామ ఫలం  రామ ఫలం అనేది సీతా ఫలం లాంటిదే.పేరుకు తగ్గట్టుగానే ఈ పండులో సుగుణాలు కూడా మెండుగా ఉండు. రామ ఫలం లోపల గుజ్జు చాల...
19/10/2018

రామ ఫలం

రామ ఫలం అనేది సీతా ఫలం లాంటిదే.

పేరుకు తగ్గట్టుగానే ఈ పండులో సుగుణాలు కూడా మెండుగా ఉండు. రామ ఫలం లోపల గుజ్జు చాలా సాప్ట్ గా ఉంటుంది. అంతే కాదు ఈ పండులో అనేక ఔషధ గుణాలను కనుగొనడం జరిగింది. ఈ పండు తినడం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ నివారించబడుతుంది. అంతే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందుతారు.

రామ ఫలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ, జుట్టు సమస్యలను నివారించడంలో నిజంగా రామఫలం దానికదే సాటి. రామఫలంలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి. వీటిని అనేక చర్మ, జుట్టు సమస్యలను నివారించడంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఆలస్యం చేయకుండా రామ ఫలంలోని చర్మ, జుట్టుకు సంబంధించిన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

తలలో దురదను నివారిస్తుంది :

రామ ఫలంలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలలో దురద తగ్గిస్తుంది. దాంతో తలలో దురద, చీకాకును తొలగిస్తుంది. రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల ఇది తలలో దురద తగ్గిస్తుంది. హెల్తీ స్కిన్ అందిస్తుంది. రామ ఫలాన్ని చర్మానికి ఉపయోగించడానికి రామ ఫలంలోని గుజ్జును 5 స్పూన్లు తీసుకుని, అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ పెరుగు చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాడీకి లేదా చర్మానికి అప్లై చేసి, ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవాలి.

మొటిమలను నివారిస్తుంది

మొటిమలను నివారించడంలో రామ ఫలంగా గ్రేట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు, చర్మ సమస్యలను నివారిస్తుంది. స్కిన్ కొత్త కణాలను పునరుత్పత్తి చేస్తుంది.

మొటిమలను నివారణకు రెండు స్పూన్ల రామ ఫలం గుజ్జు తీసుకోవాలి. తర్వాత అందులో రెండు స్పూన్ల పాలు, ఒక స్పూన్ అలోవెర జెల్, అరటీస్పూన్ పసుపు మిక్స్ చేయాలి. తర్వాత మొటిమలున్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు

ముఖంలో ముడతలు, మచ్చలు, చారలు వంటి ఏజింగ్ లక్షణాలను దూరం చేసుకోవాలంటే రెగ్యులర్ స్కిన్ కేర్ లో రామఫలం చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఫలంలో ఉండే యాంటీఆక్సిడెంట్ ఏజింగ్ లక్షణాలకు దారితీసే ఫ్రీరాడికల్స్ తో పోరాడటంలో ముఖ్య పాత్రపోషిస్తుంది.అందుకోసం రెండు, మూడు స్పూన్ల రామఫలం పేస్ట్ తీసుకుని, అందులో అలోవెర జెల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిముషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్కిన్ రాషెస్ మరియు ఎగ్జిమా

ముందుగా మనం సూచించినట్లు, రామఫలంలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ అయినా నివారిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా ఎగ్జిమాను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. కొద్దిగా రామఫలం పేస్ట్ తీసుకుని, లేదా రామఫలం వాటర్ తీసుకుని,ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి.

హైపర్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది

రామ ఫలంలో విటిమన్ సి మరియు ఆస్కార్బిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మం కాంతి పెంచడంలో, హైపర్ పిగ్మెంటేషన్ నివారిచండంలో ప్రధాణ పాత్ర పోషిస్తుంది. మీ చర్మం నల్లగా మారినా ఇతర సమస్యలున్నా, రామఫలం జ్యూస్ కు కొద్దిగా కొబ్బరినూనె మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. రాత్రుల్లో అప్లై చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, తర్వాత రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి.

తలలో దుర, చెమటను నివారిస్తుంది

తలలో దురద మరియు చుండ్రు, చెమట నివారించడంలో గ్రేట్ రెమెడీ. ఒక రామఫలం తీసుకుని, సగానికి కట్ చేసి, వాటర్ లో వేసి బాయిల్ చేయాలి. తర్వాత ఈ వాటర్ తీసుకుని, చల్లార్చి తర్వాత ఈ నీటిని తలకు ఉపయోగిస్తే తలలో దురద, ఇతర సమస్యలను నివారించబడుతాయి.

తలలో పేలను నివారిస్తుంది

తలలో పేలను నివారించడంలో మంచి రెమెడీ. తలలో పేలు ఉన్నట్లైతే జుట్టు రాలడం, తలలో చుండ్రు, మురికి వంటి సమస్యలు అధికమౌతాయి. ఈ సమస్యలను నివారించుకోవాలంటే రెండు మూడు ముక్కలు రామఫలం తీసుకుని పేస్ట్ చేయాలి. తర్వాత దీనికి ఒక స్పూన్ మెంతి పౌడర్ జోడించి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీన్ని తలకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

చుండ్రు నివారిస్తుంది:

తలను శుభ్రం చేసి, చుండ్రు సమస్యను నివారించడంలో రామఫలం గ్రేట్ గా పనిచేస్తుంది. రామఫలంను పేస్ట్ చేసి, తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు చుండ్రును ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.

అవొకాడోఅవెకాడోలో పోషకాలు సమృద్ధిగా మరియు A,B మరియు E వంటి విటమిన్లు అధిక కంటెంట్ లో ఉన్నాయి. అంతేకాక ఫైబర్స్ మరియు ప్రో...
14/10/2018

అవొకాడో

అవెకాడోలో పోషకాలు సమృద్ధిగా మరియు A,B మరియు E వంటి విటమిన్లు అధిక కంటెంట్ లో ఉన్నాయి. అంతేకాక ఫైబర్స్ మరియు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అవెకాడో అనేది చాలా కొవ్వు కలిగిన పండ్లలో ఒకటి అని చెప్పవచ్చు. అంతేకాక అధిక కేలరీలను కూడా కలిగి ఉంటుంది. కానీ కొవ్వు ఆరోగ్యకరమైనది మరియు స్వభావరీత్యా మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది.

అవెకాడోలో ప్రోటీన్లు,విటమిన్లు,ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్దిగా ఉండుటవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటిగా ఉంది. కొన్ని వ్యాధులు మరియు రుగ్మతలను నయం చేసే గుణాలను కూడా కలిగి ఉంది. అవెకాడో యొక్క ఆరోగ్య ప్రయోజనాలు కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి.

బరువు పెరిగే వారి కోసం

అవెకాడోలో కేలరీలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉంటుంది. అందువలన బరువు పెరిగే వారి ప్రయోజనం కోసం చాలా మంచి పండుగా పరిగణిస్తారు. ఈ పండులో కొవ్వులు మరియు పిండి పదార్థాల మంచి మూలం ఉంది. 100 గ్రామూల అవెకాడో సుమారు 60-80 కేలరీలను కలిగి ఉంటుంది. అందువల్ల అదనపు బరువును పెంచడానికి ఖచ్చితంగా వారి ఆహార ప్రణాళికలో అవెకాడోను చేర్చాలి.

గుండెకు మంచిది

అవెకాడోలో గుండె వ్యాదులను నివారించటంలో సహాయపడే B6,ఫోలిక్ ఆమ్లం సమృద్దిగా ఉంటాయి. అందువలన అవెకాడో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదంతో బాధపడుతున్న వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. అధిక మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండుటవల్ల గుండె స్ట్రోక్స్ నిరోధించడానికి మంచిదని భావిస్తారు.

చర్మంనకు మంచిది

అవెకాడో పండు నూనె చర్మపు నిర్మాణం మరియు నాణ్యత మెరుగుపర్చడానికి ఉత్తమ నూనెలలో ఒకటిగా ఉంది.పొడి చర్మంపై నూనె మర్దనా కూడా కఠినమైన పాచెస్ ను మెరుగుపరుస్తుంది. అంతేకాక చర్మం మళ్ళీ అందంగా మరియు ప్రకాశవంతముగా తయారవుతుంది. అందువలన అవెకాడో నూనెను అనేక సౌందర్యసాధనాలలో ఉపయోగిస్తారు.

షుగర్ వ్యాదిగ్రస్తులకు

అవెకాడో రక్తంలో చక్కెర స్థాయిలను నిలబెట్టడానికి సహాయపడే మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాల కంటెంట్ ను కలిగి ఉంటుంది. ఈ కొవ్వులు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి స్థాయిని నియంత్రిస్తాయి.అందువలన అవెకాడో తక్కువ చక్కెర స్థాయి సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల కోసం ఉపయోగకరంగా ఉంటుంది.

ఆర్థరైటిస్ నొప్పి కొరకు

అవెకాడో పండును ఆర్థరైటిస్ నొప్పి నివారణ కొరకు ఉపయోగిస్తారు. ఇది యాంటీ శోథలక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల కీళ్లనొప్పి కారణంగా వచ్చే జాయింట్ మంట మరియు నొప్పి కొరకు ఉపయోగకరంగా ఉంటుంది. అవెకాడోలో కొవ్వులు,విటమిన్లు మరియు ఇనుము మరియు పొటాషియం వంటి ఖనిజాలు ఉండుటవల్ల నొప్పి స్వస్థత లక్షణాలు కలిగి ఉంటుంది. అవెకాడో నూనెను మసాజ్ చేయటం ద్వారా దీర్ఘకాలిక నొప్పి సమస్యలను తగ్గించవచ్చు.

అవెకాడోలో యాంటి ఏజింగ్ లక్షణాలు ఉండుటవల్ల చర్మం తాజాగా మరియు తక్కువ వయస్సు వారిగా కనపడేలా చేస్తుంది. క్యాన్సర్ నివారించేందుకు మరియు మధుమేహం నియంత్రణకు సహాయపడుతుందని చెబుతుంటారు. గుండె,చర్మం మరియు కండరములకు సంబంధించిన వ్యాధులకు గొప్ప నొప్పి నివారణిగా పరిగణిస్తారు.

చియా విత్తనాలుచియా విత్తనాల్లో గల అదనపు పోషక విలువలుశరీరానికి అవసరమైన ముఖ్య ఫ్యాటీ యాసిడ్స్ –  ఆల్ఫా-లినోలెనిక్ మరియు లి...
13/10/2018

చియా విత్తనాలు

చియా విత్తనాల్లో గల అదనపు పోషక విలువలు

శరీరానికి అవసరమైన ముఖ్య ఫ్యాటీ యాసిడ్స్ – ఆల్ఫా-లినోలెనిక్ మరియు లినోలెనిక్ ఆమ్లం వీటిలో లబిస్తాయి.
విటమిన్ A, B, E మరియు D
వీటిలో సల్ఫర్, ఇనుము, అయోడిన్, మాంగనీస్, మెగ్నీషియం, నియాసిన్ మరియు థయామిన్ వంటి ఖనిజాలు మరియు యాంటిఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.

చియా విత్తనాల ఆరోగ్య ప్రయోజనాలు

ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్:

చియా విత్తనాలు పాలి అన్ సాచురేటేడ్ ఫ్యాట్స్, ప్రత్యేకించి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. చియా విత్తనాలు లిపిడ్ ప్రొఫైల్ 60% ఒమేగా-3 తో కూడి ఉంటుంది, ఈ ఫ్యాటీ యాసిడ్స్-ముఖ్యంగా, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం, లేదా ALA యొక్క మోతాదు వీటిలో ఎక్కువగా ఉంటుంది. చియా విత్తనాలలోని ఒమేగా-3 అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, శరీర పనితీరును మెరుగుపరుస్తుంది మరియు ఇన్ఫ్లమేషన్ (మంట) లను తగ్గిస్తుంది.

ఫైబర్:

చియా విత్తనాలలో ఫైబర్ (పీచు పదార్ధం) అధికంగా ఉంటుంది. కేవలం రెండు టేబుల్ స్పూన్ల చియా గింజల్లో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఒక వ్యక్తి తీసుకోవలసిన రోజువారి మోతాదులో మూడవ వంతు అన్నమాట. ఆహారం లో ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మరియు ప్రేగు యొక్క పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

యాంటిఆక్సిడెంట్స్:

చియా గింజలలో యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటిఆక్సిడెంట్స్ శరీరాన్ని ఇన్ఫెక్షన్లు,కాన్సర్ నుండి కాపాడడంలో ఇంకా శరీరాన్ని యవ్వనంగా ఉంచుకోవడానికి కూడా తోడ్పడుతాయి. యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రిజ్ లో ఉంచనప్పటికీ ఎక్కువకాలం నిలువ ఉంటాయి.

మినరల్స్:

రెండు టేబుల్ స్పూన్లు చియా గింజలలో 18% DRI (డైలీ రెకమెండేడ్ ఇన్టేక్) కాల్షియం, 35% భాస్వరం, 24% మెగ్నీషియం, మరియు 50% మాంగనీస్ లభ్యం అవుతాయి. ఈ పోషకాలు రక్తపోటు నివారించడంలో, ఆరోగ్యకరమైన శరీర బరువును ఉంచుకోవడానికి, మరియు DNA తయారీకి తోడ్పడుతాయి.

పొట్టని నిండుగా ఉంచుతాయి:

చియా విత్తనాలలో ఫైబర్ మరియు ప్రోటీన్స్ మెండుగా ఉండడం వల్ల వీటిని తిన్నపుడు పొట్ట నిండుగా ఉండడం వల్ల తరచూ తినాలన్నా ఆలోచన ఉండదు. తద్వారా బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతాయి

గ్లుటేన్-ఫ్రీ:

చియా గింజలలో గ్లూటెన్ ఉండదు. సిలయాక్ వ్యాధి మరియు ఇతర జీర్ణశయ సమస్యలు ఉన్న వారికి చియా గింజలు చాలా ఉపయోగంగా ఉంటాయి.

రక్తంలో చక్కెర మోతాదు నియంత్రణ:

ఇన్సులిన్ స్థాయిలు నియంత్రించడంలో చియా విత్తనాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి మరియు రక్తంలో ఇన్సులిన్ అసాధారణ స్థాయిలను తగ్గిస్తాయి.

ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలకు మంచిది:

చియా గింజలలో చాలా రకాల పాల ఉత్పత్తులలో కన్నా కాల్సియం అధికంగా ఉంటుంది. 28 గ్రామాల చియా గింజలలో రోజువారి కావాల్సిన మొతాదులో సుమారు 18% లభిస్తుంది. చియా గింజలను భోజనంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీర ఎముకలు మరియు దంతాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

సహజ సౌందర్య ఆహారం:

చియా విత్తనాలలోని పోషక విలువలు మరియు వీటిలోని ప్రోటీన్, జింక్, మినరల్స్ వల్ల జుట్టు, గోర్లు, మరియు చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.

మానసిక స్థితి మెరుగుపరచడానికి:

చియా విత్తనాలు అమినో యాసిడ్ ట్రిప్టోఫాన్ను కలిగి ఉంటాయి, ఇది ఆకలి, నిద్ర మరియు మానసిక స్థితి మెరుగుపరచడానికి మరియు నియంత్రించడానికి సహాయపడుతుంది.

29/08/2018

జుట్టు నలుపు కోసం

కొబ్బరి నూనె
ఆముదం నూనె
సమపాళ్లలో తీసుకొని
Vitamin E టాబ్లెట్స్ కలిపి నిలువ ఉంచుకొని రోజు తప్పి రోజు 3 నేలలు వాడితే తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతువచ్చును

Address

Hyderabad
Hyderabad

Telephone

9014353747

Website

Alerts

Be the first to know and let us send you an email when Ayurveda Medicine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ayurveda Medicine:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram