01/01/2026
యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) కోసం మందులు ఎంతకాలం తీసుకోవాలి?
అంతర్గతంగా ఎటువంటి నిర్మాణ సంబంధిత కారణాలు (structural causes) లేకపోతే, మరియు పేషెంట్‌కి కేవలం సింపుల్ UTI మాత్రమే ఉంటే — యాంటీబయోటిక్స్ ఎంతకాలం తీసుకోవాలి? ఇది పేషెంట్లు తరచుగా అడిగే చాలా సాధారణమైన ప్రశ్న.
ఒకవేళ కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ పెరగడం, యూరినరీ స్ట్రిక్చర్స్ లేదా రిఫ్లక్స్ లాంటివి ఏవి లేకుండా ఒకే ఒక్క యూరినరీ ఇన్‌ఫెక్షన్ ఎపిసోడ్ ఉంటే, సాధారణంగా 5 నుండి 7 రోజుల యూరినరీ యాంటీబయోటిక్ కోర్స్ సరిపోతుంది.
అయితే, కొంతమంది పేషెంట్లకు ఇలాంటి కారణాలు లేకపోయినా, మళ్లీ మళ్లీ UTI వస్తుంటుంది.
అప్పుడు ప్రశ్న — రికరెంట్ UTI అంటే ఏమిటి?
అంటే, గత ఆరు నెలల్లో రెండు కంటే ఎక్కువ సార్లు యూరినరీ ఇన్‌ఫెక్షన్ ఎపిసోడ్‌లు వచ్చి ఉంటే, దానిని రికరెంట్ UTI అని అంటారు.