10/01/2026
కెవికె ఫార్మసీ కళాశాలలో సంక్రాంతి వేడుకలు
విశాల భారతి, అల్లాపూర్: సంక్రాంతి పండుగ తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుందని కెవికె ఫార్మసీ కళాశాల కరస్పాండెంట్ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. అల్లాపూర్ మండలంలోని కెవికె ఫార్మసీ కళాశాలలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి ప్రత్యేకతను చాటారు. ముగ్గుల పోటీలు, హరిదాసుల వేషధారణ, భోగి సంబరాలు విద్యార్థులను అలరించాయి. మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు రంగురంగుల చీరల్లో సందడి చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసే పండుగ అని, విద్యార్థులు తమ సంస్కృతిని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.