Sky Hyderabad

Sky Hyderabad Simplified Kundalini Yoga Center. it's a Temple of Consciousness Center

https://youtu.be/OLdZ1pRx-xsజూన్. 17      దీర్ఘాలోచన         దీర్ఘాలోచన ముఖ్యమా?కాదా?వ్యక్తి జీవితంలో దీనికి అత్యంత ప్రా...
17/06/2021

https://youtu.be/OLdZ1pRx-xs
జూన్. 17
దీర్ఘాలోచన

దీర్ఘాలోచన ముఖ్యమా?కాదా?వ్యక్తి జీవితంలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఉన్నదా?జవాబు అవును, ఇది చాలా ముఖ్యమనే చెప్పాలి.ప్రతి విషయంలో పరిమితి - పద్ధతి పాటిస్తే ప్రపంచంలో శాంతి రాజ్యమేలుతుంది; దీనిని సాధించడం కష్టమేమీకాదు; నిజానికది సులభసాధ్యం.ఇప్పుడున్న ముద్రలు, ప్రారంభములో ఆ పని కష్ట మన్పించేలా చేస్తాయి;కాని కాలక్రమేణా అలవాటవుతుంది.మోటారు సైకిల్ కు కిక్ కొట్టడం కష్టమన్పించవచ్చు కాని ఒకసారి స్టార్టు అవుతే అది పరిగెత్తడం మొదలవుతుంది. వేగము మరియు బ్యాలన్సు సహజసిద్ధంగానే వస్తాయి.
దీర్ఘాలోచనలో స్పష్టమైన తప్పులను సరిదిద్దడానికి సిద్ధంగా ఉండండి. సుదీర్ఘముగా ఆలోచించకుండా జీవించడమంటే నది మధ్యలో తేలియాడడమే. ఉధృతంగా ప్రవహించే నీటిలో,సుడిగుండాలలో చిక్కుకు పోతావు లేదా దిశానిర్దేశం లేకుండా అపరిచిత ప్రదేశాలకు కొట్టుకుపోతావు. దీర్ఘాలోచన చాలా ముఖ్యం-సాధ్యమైతే ఈ రోజే సాధన మొదలుపెట్టండి.

తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి

పైన నీలిరంగు లింక్ క్లిక్ చెయ్యండి
Subscribe VeWa Vethathiri https://www.youtube.com/vewavethathiri
(Click on subscribe and bell icon)

You can view/hear t TVhe daily blossoms in Telugu @ 6am IST everyday

Stay tuned for a new Video everyday @ 6 am IST

# vewavethathiriJune 17. దీర్ఘాలోచన Contemplation దీర్ఘాలోచన ముఖ్యమా?కాదా?వ్యక్తి జీవితంలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఉన్నదా?జవాబ.....

https://youtu.be/0vgLcich8Noజూన్.  16      నిజ సంఘటనలు         మనలో ప్రతి ఒక్కరు ఈ భూమి మీద జన్మించి,ఇతరుల సహకారంతో జీవి...
16/06/2021

https://youtu.be/0vgLcich8No
జూన్. 16
నిజ సంఘటనలు

మనలో ప్రతి ఒక్కరు ఈ భూమి మీద జన్మించి,ఇతరుల సహకారంతో జీవిస్తారు. శతాబ్దాల తరబడి ఇతరులు సముపార్జించిన అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటారు.మరణించేతవరకు బాధ,సంతోషాన్ని అనుభవిస్తారు.
ఇది అందరికీ సర్వసాధారణం. ఈ విషయాన్ని గుర్తుంచుకుని మన శారీరక, మానసిక శక్తులను సద్వినియోగం చేసుకుంటూ సంపూర్ణమైన,ఫలవంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించుదాము. వ్యక్తి యొక్క జనన మరణాల మధ్య నున్న కొద్దిపాటి మానవజీవితం,జీవనతత్వాన్ని మరియు తన జీవిత కాలంలో వచ్చే కష్టసుఖాల స్వభావాన్ని అర్థంచేసుకోవడానికి ఉపయోగించాలి.చక్కటి ప్రణాళికా బద్ధమైన, శాంతియుతమైన జీవితానికి ఇది చాలా ముఖ్యం.

తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి

పైన నీలిరంగు లింక్ క్లిక్ చెయ్యండి
Subscribe VeWa Vethathiri https://www.youtube.com/vewavethathiri
(Click on subscribe and bell icon)

You can view/hear t TVhe daily blossoms in Telugu @ 6am IST everyday

Stay tuned for a new Video everyday @ 6 am IST

# vewavethathiriJune 16. MIND*THINK||నిజ సంఘటనలు||True Events||TODAY'S THOUGHTS||2020 మనలో ప్రతి ఒక్కరు ఈ భూమి మీద జన్మించి,ఇతరుల సహక...

https://youtu.be/O01-QOMxZ9k  జూన్.  15     ఆలోచనలు       ఆలోచనలు ఆత్మ నుండి వేరుగా లేవు;ఆలోచనలు ఘనపరిమాణము, వేగము,కాలము...
15/06/2021

https://youtu.be/O01-QOMxZ9k
జూన్. 15
ఆలోచనలు

ఆలోచనలు ఆత్మ నుండి వేరుగా లేవు;ఆలోచనలు ఘనపరిమాణము, వేగము,కాలము మరియు దూరము పరిధుల లోనే కాకుండా వాటికి అతీతంగా మౌనంలో కూడా పనిచేస్తాయి.వ్యక్తి తన లోతైన ఆలోచనల స్వభావాన్ని తెల్సుకోవడము, తన గురించి తాను తెల్సుకోవడం అవుతుంది.అంతవరకు ఆలోచనలను జాగ్రత్తగా విశ్లేషించాలి.ఆలోచనల నాపడానికెప్పుడూ ప్రయత్నించవద్దు. ఎందుకనగా ఆ ప్రయత్నం మనస్సును గమ్యంలేకుండా విచ్చలవిడిగా తిరిగేలా చేస్తుంది; ఆలోచనలను విశ్లేషించడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనస్సు ప్రశాంతస్థితికి వచ్చి క్రమంగా అవి తగ్గిపోతాయి.
ఆలోచనలు జీవితంలో ఒక భాగమై,మెలకువగా నున్న ప్రతి క్షణమూ వస్తూంటాయి.ఆలోచనలను క్రమబద్ధం చేసి మంచికి ఉపయోగించుకోవాలి.వెలకట్టలేని ఈ ప్రకృతి వరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించవద్దు! మరణంలో ఆలోచనలు ఆగిపోవా? ఆలోచనలన్నీ ఆగిపోతే మీ కేమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?
సంవత్సరాల తరబడి,ఎందరి వలననో సాధ్యంకాని పనులు ఒక్క క్షణంలో అంచనా వేయబడి పూర్తవుతాయి.అంతటి అద్భుతశక్తులున్న మనిషి తన సమయాన్నంతా భవిష్యత్ ప్రణాళికలో గడపకూడదు. అలా చేస్తే ప్రస్తుత బరువు బాధ్యతలకు దూరమవుతాడు.ఎరుకతో ఆలోచనలు, పనులు ఒకదాని ననుసరించి మరొకటి జరగడమే ఆదర్శవంతం.మీ కుటుంబ ఇష్టాలకు,మీ ఇష్టాలకు అతీతంగా ఆలోచించడం నేర్చుకోండి.అలా కానిచో విసుగు బాధ కల్గుతాయి.ప్రకృతి, దాని పనులు,నిర్మాణక్రమము,విశ్వము,ప్రపంచము మరియు సమాజము గురించి నిరంతరం లోతుగా ఆలోచించండి.మీ స్వంత అనుభవాలతో వాటి నుండి మీరు పొందిన బాధ సంతోషాలతో పోల్చుకోండి.శాంతి,సంతోషాలు మీ దేహానికి,మనస్సుకు కల్గుతాయి.
తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి

పైన నీలిరంగు లింక్ క్లిక్ చెయ్యండి
Subscribe VeWa Vethathiri https://www.youtube.com/vewavethathiri
(Click on subscribe and bell icon)

You can view/hear t TVhe daily blossoms in Telugu @ 6am IST everyday

Stay tuned for a new Video everyday @ 6 am IST

15. ఆలోచనలు ఆలోచనలు ఆత్మ నుండి వేరుగా లేవు;ఆలోచనలు ఘనపరిమాణము, వేగము,కాలము మరియు దూరము పరిధుల లోనే కాకు...

https://youtu.be/7659W8m5G2Aజూన్.  11      ఆత్మసాక్షాత్కారము               నేనెవరు? నేనొక వస్తువునా? శక్తినా?స్థూలశరీరాన...
11/06/2021

https://youtu.be/7659W8m5G2A

జూన్. 11
ఆత్మసాక్షాత్కారము

నేనెవరు? నేనొక వస్తువునా? శక్తినా?స్థూలశరీరాన్నా?ఇవన్నీ ఒకదానినుండి మరొకటి వేరుగా నున్నాయా?”నేను” వీటన్నిటిలో ఏ ఒక్కటీ కాదు.అన్నింటి సమన్వయమే “నేను” అని లోతైన విశ్లేషణ తెలియజేస్తుంది. తనలోని చైతన్యాన్ని ఎరుగకుండా, ఈ స్థూలశరీరమే “నేను”అని అనుకునే పరిస్థితిలో వ్యక్తి ఉన్నాడు.
శక్తి కణములు మరియు శరీరాన్ని నిర్వహించే శక్తికణముల స్వభావమైన చైతన్యము యొక్క కలయిక ఫలితంగానే స్థూలశరీరం ఏర్పడింది. నిశ్చలబ్రహ్మము యొక్క గతిశక్తే శక్తి కణములు.కాబట్టి విశ్వముగా విశ్వములోని జీవులు, నిర్జీవులుగా ప్రకటితమయ్యే బ్రహ్మమే “నేను”.వస్తువులలో శబ్దము లేదా కాంతి యొక్క గుణాలు భిన్నంగా ఉన్నప్పటికీ, ప్రాథమికంగా ఆ రెండూ సమానమే; బ్రహ్మము యొక్క భౌతిక రూపాలు.
అదేవిధంగా వస్తువుననుసరించి చైతన్యపు గుణాలు వేరుగా నుండవచ్చు కాని ప్రాథమికంగా అది సమానమే.ప్రత్యేకమైన లక్షణాలతో,భిన్న రూపాలలో శక్తికణములుగా ప్రకటిత మయ్యే సర్వ వ్యాపకమైన దైవమే మనలోని” నేను”.అవసరాలు, అలవాట్లు మరియు పరిస్థితుల ననుసరించి జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేసే చైతన్యము కూడా అదే.
“నేను” మరియు “విశ్వము”భిన్నమైనవి కాదు;”నేను” ప్రకృతి కన్నా భిన్నం కాదు.అది పలువిధాలుగా ప్రకటితమయ్యే” ఏకము”;మూలముగా‘ఏకము’వస్తువులుగా ‘భిన్నము’.అన్నింటిలో నున్న సర్వవ్యాపకమైన నిరాకార బ్రహ్మములోనే భిన్నత్వమున్నది. ఈ సర్వవ్యాపకము,నిరాకారమైన బ్రహ్మము లేదా దైవమే ప్రతి ఒక్కరి యందున్న “నేను.”
*తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి*
పైన నీలిరంగు లింక్ క్లిక్ చెయ్యండి
Subscribe VeWa Vethathiri https://www.youtube.com/vewavethathiri
(Click on subscribe and bell icon)

You can view/hear t TVhe daily blossoms in Telugu @ 6am IST everyday

Stay tuned for a new Video everyday @ 6 am IST

Mind Think || Self Realisation || ఆత్మ సాక్షాత్కారము || 2020ఆత్మ సాక్షాత్కారముప్రాథమికంగా స్థూలశరీరం,ప్రాణశక్తి,మనస్సు మరియు సత్యము అ....

https://youtu.be/msUIKDQjZZg జూన్.    9      ఆత్మపరిశీలన      మనస్సు పంచేంద్రియాల చేత మరియు ఉద్రేకాలచేత ప్రభావితమైనంత వర...
09/06/2021

https://youtu.be/msUIKDQjZZg
జూన్. 9
ఆత్మపరిశీలన

మనస్సు పంచేంద్రియాల చేత మరియు ఉద్రేకాలచేత ప్రభావితమైనంత వరకు, మనిషి వ్యక్తపరిచే ఆలోచనలు,మాటలు,చేతలు ఎరుకను కోల్పోతాయి.దేశ కాల పరిస్థితులనుబట్టి ఆలోచనలు,మాటలు,చేతలు భిన్నంగ ఉన్నప్పుడు సమస్యలు, బాధలు చోటు చేసుకుంటాయి.త్రికరణాలను నిశితంగా పరిశీలించి, పరీక్షిస్తే అనవసరమైనవాటిని గుర్తించి,తొలగిస్తే వాటి స్థానంలో ఉన్నతమైన వాటిని ఉంచవచ్చు. ఈ విధానాన్నే “ఆత్మ పరిశీలన” అంటారు.
ప్రారంభములో ఒక వారం రోజులుమీ ఆలోచనలను విశ్లేషించడానికి కేటాయించండి. మీ గదిలో కూర్చుని వంటరిగా ఉదయము, సాయంత్రముమీ ఆలోచనలెలాంటివో గమనించండి; బాధను ,దు:ఖాన్ని కల్గించేవాటిని గుర్తించి,మీ మనస్సులో వాటికి స్థానం లేదనే విషయాన్ని గట్టిగా నిర్థారించుకోండి. పదే పదే ఈ స్వయం సలహాను గుర్తు చేసుకుంటూ మీ నిర్ణయాన్ని బలోపేతం చేయండి.
మరుసటి వారం మీరు మామూలుగా మాట్లాడే మాటలను ఇదే విధంగా విశ్లేషించండి; ఇతరులను బాధించే కఠినమైన మాటలను గుర్తించండి; గట్టి నిర్ణయం తీసుకుని, జాగ్రతగా వాటిని దూరంచేయండి.మూడోవారంలో మీ పనులను గతంలోలాగే విశ్లేషించండి.ఇతరులను బాధించే పొరపాటు పనులను గుర్తించి వాటిని కూడా దూరం చేయండి.ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు ఎరుకతో ఉండి శ్రద్ధగా మీ నిర్ణయాన్ని పరిరక్షించండి.
క్రమబద్ధమైన ఆత్మ పరిశీలన ద్వారా మిమ్మల్ని మీరు పవిత్రమొనరించుకోండి. తద్వారా చెడు ఆలోచనలు,మాటలు,పనులు దూరమౌతాయి. మూడు వారాలు కొనసాగించే ఈ సాధనవలన జీవితమంతా ఎరుక ఉంటుంది.మార్పులు చోటుచేసుకుని జీవితం సంతోషము మరియు సంతృప్తితో నిండి పోతుంది.
తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి

పైన నీలిరంగు లింక్ క్లిక్ చెయ్యండి
Subscribe VeWa Vethathiri https://www.youtube.com/vewavethathiri
(Click on subscribe and bell icon)

You can view/hear t TVhe daily blossoms in Telugu @ 6am IST everyday

Stay tuned for a new Video everyday @ 6 am IST

ఆత్మపరిశీలన మనస్సు పంచేంద్రియాల చేత మరియు ఉద్రేకాలచేత ప్రభావితమైనంత వరకు, మనిషి వ్యక్తపరిచే ఆలోచనలు,మాటలు,చే.....

https://youtu.be/mgSVV6BoPN8మే  30    *ఆధ్యాత్మిక సారాంశము*         ప్రజలు శాంతియుతంగా, ఉన్నతంగా జీవించాలంటే నైతికవేత్తల...
29/05/2021

https://youtu.be/mgSVV6BoPN8
మే 30
*ఆధ్యాత్మిక సారాంశము*

ప్రజలు శాంతియుతంగా, ఉన్నతంగా జీవించాలంటే నైతికవేత్తలు, అధికారంలో నున్నవారు, ధనికులు, పారిశ్రామిక వేత్తలు మరియు నాయకులు ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక పరిపూర్ణత కొరకు ప్రయత్నించాలి. భగవత్సాక్షాత్కారానికి ఆత్మసాక్షాత్కారమొక్కటే మార్గం.ఇదే ఆధ్యాత్మిక సారాంశము.
*తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి*

పైన నీలిరంగు లింక్ క్లిక్ చెయ్యండి
Subscribe *VeWa Vethathiri* https://www.youtube.com/vewavethathiri
(Click on subscribe and bell icon)

*You can view/hear t TVhe daily blossoms in Telugu @ 6am IST everyday*

Stay tuned for a new Video everyday @ 6 am IST

, thought, -19, ్యాత్మిక సారాంశము The Gist of Spiritualityప్రజలు శాంతియుతంగా, ఉన్నత...

https://youtu.be/ognR0imZ3hMమే. 29                *దైవీస్థితి*       సర్వవ్యాపకమైన దైవీస్థితి యొక్క ప్రతి కర్మ పొరపాట్లక...
29/05/2021

https://youtu.be/ognR0imZ3hM
మే. 29
*దైవీస్థితి*

సర్వవ్యాపకమైన దైవీస్థితి యొక్క ప్రతి కర్మ పొరపాట్లకు తావు లేకుండా స్థిరమైన న్యాయంతో ఉంటుంది. భగవంతుని మొక్కు తీర్చుకోవడానికి ఒక వ్యక్తి 5 కొబ్బరికాయలు కొట్టి, సమస్యలు రాగానే అందుకు బాధపడ్తాడు. సమస్యలు తను చేసిన తప్పుల ఫలితమేనని అర్థం చేసుకో లేకపోతాడు.

*తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి*

పైన నీలిరంగు లింక్ క్లిక్ చెయ్యండి
Subscribe *VeWa Vethathiri* https://www.youtube.com/vewavethathiri
(Click on subscribe and bell icon)

*You can view/hear t TVhe daily blossoms in Telugu @ 6am IST everyday*

Stay tuned for a new Video everyday @ 6 am IST

, thought, -19, ైవీస్థితి The Divine సర్వవ్యాపకమైన దైవీస్థితి యొక్క ప్రతి కర్మ...

https://youtu.be/-UQ8ra8-wPMమే. 28       *మంత్రములు*       మనస్సు దేనిమీదైనా కేంద్రీకరించబడితే ఆ వస్తువు యొక్క స్వభావాన్...
28/05/2021

https://youtu.be/-UQ8ra8-wPM
మే. 28
*మంత్రములు*

మనస్సు దేనిమీదైనా కేంద్రీకరించబడితే ఆ వస్తువు యొక్క స్వభావాన్ని, రూపాన్ని తీసుకుంటుంది; ఇంకోవిధంగా చెప్పాలంటే మనస్సు ఆ వస్తువుగా మారిపోతుంది. మనస్సు ఆ వస్తువుతో ఏకీభావము నొంది, ఎదగడానికి దానిని ఉపయోగించు కుంటుంది.మంత్ర,యంత్ర మరియు తంత్ర పేర్లతో జరిగే ఆరాధనలో ఇదే సూత్రం ఉపయోగించబడుతుంది.

*తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి*

పైన నీలిరంగు లింక్ క్లిక్ చెయ్యండి
Subscribe *VeWa Vethathiri* https://www.youtube.com/vewavethathiri
(Click on subscribe and bell icon)

*You can view/hear t TVhe daily blossoms in Telugu @ 6am IST everyday*

Stay tuned for a new Video everyday @ 6 am IST

, thought, -19, ంత్రములు Mantras మనస్సు దేనిమీదైనా కేంద్రీకరించబడితే ఆ వస్తువు యొక్క స్వభావాన్ని,ర...

https://youtu.be/qqrLtPttUycమే.  26   *ధ్యానము లేదా ఆత్మపరిశీలన*         ఆత్మపరిశీలన ధ్యానానికి సహకరిస్తుందా లేదా ధ్యానమ...
26/05/2021

https://youtu.be/qqrLtPttUyc
మే. 26
*ధ్యానము లేదా ఆత్మపరిశీలన*

ఆత్మపరిశీలన ధ్యానానికి సహకరిస్తుందా లేదా ధ్యానము ఆత్మపరిశీలనను మెరుగు పరుస్తుందా?
జవాబు:-అవి రెండూ ఒకదానితో మరొకటి పరస్పరం సహకరిస్తాయి.
*తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి*

పైన నీలిరంగు లింక్ క్లిక్ చెయ్యండి
Subscribe *VeWa Vethathiri* https://www.youtube.com/vewavethathiri
(Click on subscribe and bell icon)

*You can view/hear t TVhe daily blossoms in Telugu @ 6am IST everyday*

Stay tuned for a new Video everyday @ 6 am IST

ధ్యానము లేదా ఆత్మపరిశీలన Meditation or Introspection ప్రశ్న:-స్వామీజీ,ఆత్మపరిశీలన ధ్యానానికి సహకరిస్తుందా లేదా ధ్యానము ఆత్మపరి...

https://youtu.be/kh6sR3js35Mమే. 25      *సంతృప్తికర జీవితం*         ధ్యానసాధన ద్వారా ముద్రలు తొలగించబడతాయా?ధ్యానం చేసే ప...
25/05/2021

https://youtu.be/kh6sR3js35M
మే. 25
*సంతృప్తికర జీవితం*

ధ్యానసాధన ద్వారా ముద్రలు తొలగించబడతాయా?ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ సంతృప్తికర జీవితాన్నే గడుపుతారా?

*తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి*

పైన నీలిరంగు లింక్ క్లిక్ చెయ్యండి
Subscribe *VeWa Vethathiri* https://www.youtube.com/vewavethathiri
(Click on subscribe and bell icon)

*You can view/hear t TVhe daily blossoms in Telugu @ 6am IST everyday*

Stay tuned for a new Video everyday @ 6 am IST

సంతృప్తికర జీవితం The Contented Life ప్రశ్న:-స్వామీజీ,ధ్యానసాధన వ్యక్తి జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుందని మీరు చెప్తారు. ధ....

https://youtu.be/JDSHwA2wDnAమే. 24       ఏడు జన్మలు ప్రశ్న:-స్వామీజీ,మనిషి యొక్క 7 గత జన్మలు మరియు 7 పునర్జన్మలు అంటే ఏమ...
24/05/2021

https://youtu.be/JDSHwA2wDnA
మే. 24
ఏడు జన్మలు

ప్రశ్న:-స్వామీజీ,మనిషి యొక్క 7 గత జన్మలు మరియు 7 పునర్జన్మలు అంటే ఏమిటి?
జవాబు:-పునర్జన్మలు 7మాత్రమే కాదు అంతకన్నా చాలా ఎక్కువ. ఒక సారి ఏర్పడిన ముద్ర 7తరాల వారిలో క్రియాశీలం కాకుంటే తుడిచి పెట్టుకుపోతుంది.ఒక తరం అంటే సాధారణంగా 20 సంవత్సరములు;ప్రతి ముద్ర 140 సంవత్సరాలలో ఎప్పుడైనా మళ్ళీ క్రియాశీలం కావచ్చు.తర్వాత అది విశ్వకాంతంలోకి అదృశ్యమైపోతుంది.

*తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి*

పైన నీలిరంగు లింక్ క్లిక్ చెయ్యండి
Subscribe *VeWa Vethathiri* https://www.youtube.com/vewavethathiri
(Click on subscribe and bell icon)

*You can view/hear t TVhe daily blossoms in Telugu @ 6am IST everyday*

Stay tuned for a new Video everyday @ 6 am IST

ఏడు జన్మలు The Seven Births ప్రశ్న:-స్వామీజీ,మనిషి యొక్క 7 గత జన్మలు మరియు 7 పునర్జన్మలు అంటే ఏమిటి? జవాబు:-పునర్జన్మలు 7మాత్ర...

https://youtu.be/lbzQhNC7-IEమే 23      *ప్రపంచశాంతి*        ప్రపంచపౌరులందరూ ఈ క్రింది అంశాలున్నంతకాలం శాశ్వత శాంతిని పొం...
23/05/2021

https://youtu.be/lbzQhNC7-IE
మే 23
*ప్రపంచశాంతి*

ప్రపంచపౌరులందరూ ఈ క్రింది అంశాలున్నంతకాలం శాశ్వత శాంతిని పొందగలరా?
అయితే ఎలా?
తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి
*తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి*

పైన నీలిరంగు లింక్ క్లిక్ చెయ్యండి
Subscribe *VeWa Vethathiri* https://www.youtube.com/vewavethathiri
(Click on subscribe and bell icon)

*You can view/hear t TVhe daily blossoms in Telugu @ 6am IST everyday*

Stay tuned for a new Video everyday @ 6 am IST

ప్రపంచశాంతి World Peace ప్రపంచపౌరులందరూ ఈ క్రింది అంశాలున్నంతకాలం శాశ్వత శాంతిని పొందగలరా?1.దేశాల మధ్య రాజకీయవిభేదాల...

Address

Hyderabad
500074

Opening Hours

Monday 7am - 5pm
Tuesday 7am - 5pm
Wednesday 7am - 5pm
Thursday 7am - 5pm
Friday 7am - 5pm
Saturday 7am - 5pm
Sunday 7am - 5pm

Telephone

+919963461661

Alerts

Be the first to know and let us send you an email when Sky Hyderabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sky Hyderabad:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram