Deetya Chest Clinic

Deetya Chest Clinic Consult for any lung and chest related problems

12/08/2024
భాగ్యనగరంలో ఒక బిచ్చగాడు  మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతనికి చాలా  రోజుల నుంచి భోజనం లేదు... అంటే ఆకలి మరణం....
05/06/2024

భాగ్యనగరంలో ఒక బిచ్చగాడు మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతనికి చాలా రోజుల నుంచి భోజనం లేదు... అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే భిక్షుకుని జోలె లో అక్షరాల మొత్తము 1లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. "బిచ్చగాడి దగ్గర భారీ మొత్తమని". ఇక్కడ బాగా గుంజి పడేస్తున్న విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న భిక్షుకుడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా.. రోజులు వారాల నుంచి ఆకలితో ఉన్నాడు.. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది మానసిక శాస్త్రము.
"మంకీ ట్రాప్" .
అవును కోతులను వేటాడటానికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ... ఖచ్చితంగా కోతి చేయిపట్టే అంత రన్ధ్రం చేస్తారు. ఈ రన్ధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టే అంత పెద్దది గా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది.. ఇక ఈ రంద్రంలో కోతి కి కావలసిన అరటిపండో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రన్ధ్రములో చేయి పెట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్నా... ప్రమాదం పొంచి ఉన్నా.. కోతి మాత్రం ఆ పిడికిలిని తెరువలేకపోతుంది.తాను పట్టుకున్నది వదులలేక పోతుంది.చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము.
నిజంగా మనకు ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతున్నామా ? అయితే ఇటువంటి మంకీ ట్రాప్ లో మనం ఉన్నట్లే.. రోజువారి కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బులను దాచిపెట్టుకొని హాస్పిటల్ కు వెళ్ళటానికి కూడా మనసు ఒప్పుకోకుండా తనువు చాలించిన చుట్టాలు నాకు ఉన్నారు. నిజంగా డబ్బు అంతగా కట్టి పడేస్తుందా అంటే..డబ్బు కాదుకాని మన తత్వం మనల్ని ట్రాప్ లో పడేస్తుంది. నిశితంగా పరిశీలిస్తే మన వస్తువులను మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది..... చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. మనకు తెలియకుండానే మనం అదే ట్రాప్ లో ఉన్నామని తెలుసుకొనుట లేదు.
ఎప్పుడో తెగిపోయిన ఒక బన్ధాన్ని పట్టుకొని ఇప్పటికీ ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేము?
ఒక మాట పంతానికి ఇంకెన్నో బన్ధాలను దూరం చేసుకొని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా?
వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటూనో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లలను నిర్లక్ష్యం చేసిన పెద్దలు నాకు బాగా తెలుసు.
మేము పరాజితులమని వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. అందుకే చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్ లో ఏమైనా ఉన్నామేమో! చూసుకోవలె.
అది బన్ధం కావచ్చు ,డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టివేసి ఉంచుతుందేమో గమనించుకోవలె. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవలె. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం.
మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు...
నో చెప్పలేని మొహమాటాలు...
తిరిగి అడుగలేని అప్పులు...
దణ్డించలేని ప్రేమలు...
ఊపిరి సలుపనివ్వని పనులు...
ఒత్తిడిని పెంచే కోరికలు....
ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు...
పేరు వెంట చేసే పరుగులు....
అన్నీ మంకీ ట్రాప్ లే!!
వదులుట గొప్పా ? పట్టుకొనుట గొప్పయా? ? అంటే..
సీతను వదిలే ఉంటే రావణుడు బతికిపోయే వాడు.. కద! అందుకే కొన్నిటిని వదిలి వేయుట అలవాటు చేసుకుందాం.. మరింత మనశ్శాన్తితో ఉందాము.
Author - Unknown

బుద్ధుడిలా బతికేయడం సులభంబుద్ధుడి భార్యలా బతకగలరా ?జ్ఞానం సంపాదించిన బుద్ధుడు తన భార్య బిడ్డను చూడడానికి వచ్చాడుభార్య ఇల...
03/06/2024

బుద్ధుడిలా బతికేయడం సులభం
బుద్ధుడి భార్యలా బతకగలరా ?
జ్ఞానం సంపాదించిన బుద్ధుడు తన భార్య బిడ్డను చూడడానికి వచ్చాడు
భార్య ఇలా ప్రశ్నించింది
నన్ను వదిలి వెళ్లారు పరవాలేదు కానీ నాతో ఒక్క మాట చెప్పి వెళ్ళుండొచ్చు. నేను మీ ఆలోచనకు అడ్డు చెప్పి ఉండను కదా కానీ మీరు నన్ను నమ్మలేదు అన్నదే ఎక్కువ బాధ కలిగించింది. ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టారని అడిగింది
బుద్దుడు తన భార్య దగ్గర క్షమాపణ కోరి నేను చెప్పకుండా వెళ్ళింది నీకు భయపడి కాదు నాకు భయపడి నిన్ను బిడ్డను చూస్తే ఎక్కడ నా మనసు మారిపోతుందో అని చెప్పాడు
భార్య మళ్ళీ ఒక ప్రశ్న అడిగింది ఈ రాజ్యాన్ని వదిలి వెళ్లకుండా ఇక్కడే మీరు ఆ జ్ఞానాన్ని సంపాదించ ఉండలేరా అని
నిజమే నేను కొండలు అడవులు ఆశ్రమాలు వెతుక్కుని వెళ్లాల్సిన పని లేదు కానీ ఇక్కడ నుండి వెళ్లేప్పుడు నాకు అది అర్థం కాలేదు అన్నాడు
అందరూ బుద్ధుడి గురించే మాట్లాడుతారు కానీ ఆయన భార్య యశోధర గురించి ఆలోచించరు
బుద్ధుడు వెళ్ళినట్టే తన భార్య అర్దరాత్రి గడప దాటి ఉంటే ఈ లోకం ఆమెను మంచిది అని చెప్పేదా??
లేచిపోయింది అని చెప్పి ఉండేవాళ్ళు,ఇప్పుడు కూడా అక్కడ వారు అనని మాటలు లేవు
పెద్ద వయసేమి కాలేదు అందంగా ఉంది ఇంత రాజ్యము ఆవిడ సొంతమే తనకు నచ్చినట్టు ఉండొచ్చులే అని నిందలేసింది
పసి పిల్లాడు నాన్న కోసం అడుగుతుంటే అర్థం కానీ అతనికి ఏమని చెప్పి సముదాయించిందో ఎంత పోరాడిందో
ఇవన్నీ వదిలేసి ఎటువంటి సమస్య లేకుండా సన్యాసం పుచ్చుకున్నాడు బుద్ధుడు
అన్నీ ఉన్నా సన్యాసిలానే బతికింది యశోధర
ఏది కఠినం ఏది కష్టం
ఎవరు సన్యాసం పుచ్చుకున్నది చెప్పండి....
Author - Unknown

Contact deetya clinic 090149 53286
27/05/2024

Contact deetya clinic 090149 53286

Contact deetya clinic for COPD treatment contact number 090149 53286
26/05/2024

Contact deetya clinic for COPD treatment contact number 090149 53286

25/05/2024

Contact deetya clinic for asthma treatment 090149 53286

Consult for any lung and chest related problems

05/05/2024

Hi everyone …we created page for deetya chest clinic …please follow our page

Address

Plot Number 37, Alwal Hills Road Number 9 , Hi Tension Road And Old Alwal
Hyderabad
500010

Opening Hours

Monday 9am - 10pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 5pm
Friday 9am - 10pm
Saturday 9am - 10pm
Sunday 10am - 7pm

Telephone

+919110393351

Website

Alerts

Be the first to know and let us send you an email when Deetya Chest Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Deetya Chest Clinic:

Share