17/03/2025
🌟 డాక్టర్ పి కృష్ణంరాజుకి పుంగనూరు కౌరక్షక అవార్డు 🌟
డా. కృష్ణంరాజుకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్
ప్రాచీనవైద్యనిపుణులు, మినియేచర్ ఆవుల సృష్టికర్త కాకినాడకి చెందిన డా॥పి. కృష్ణంరాజుని మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు ఆసోషియేషన్ ఆఫ్ మహారాష్ట్రవారు కృష్ణంరాజుని పుంగనూరు గో రక్షక్ అవార్డ్ తో సత్కరించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మార్చి 16 ఆదివారం జరిగిన సభలో సినీ కథానాయకుడు సుమన్ చేతుల మీదుగా కృష్ణంరాజు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధనకోసం ఆమరణ నిరాహారదీక్షచేసి అసువులు బాసిన అమరజీవి పొట్టిశ్రీరాములు జన్మదిన సందర్భంగా నిర్వహించిన ఈ సభకి ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అధ్యక్షత వహించగా హీరో సుమన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో తెలుగు కమ్యూనిటీ,కల్చర్,కామర్స్ రంగాల అభివృద్ధికోసం టి.ఏ.ఎం.సి.సి.ఐ. వారధి చేస్తున్న కృషిని రఘురామ ప్రస్తుతించారు. దేశంలోనే పుంగనూరు ఆవుల పోషణ, అభివృద్ధి కోసం దశాబ్దకాలంగా పని చేస్తున్న డాక్టర్ కృష్ణంరాజుని ఉపసభాపతి అభినందించారు.
నాడీపతి రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించిన డాక్టర్ కృష్ణంరాజు ఆవులపై పరిశోధన చేసి ప్రతిపాదించిన ఆవుతో ఆలింగనం, ‘కౌ హగ్గింగ్’ విధానం ప్రస్తుతం ప్రపంచమంతటా వైరల్ గా మారింది. ఆవు హగ్గింగ్ వెనుక చాలా సైన్స్ ఉంది. మనం ఆవులను కౌగిలించుకున్నప్పుడు, మన మెదడు ఆక్సిటోసిన్, డోపమైన్ మరియు సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది. తద్వారా మానసిక స్థిరత్వం, ఆనందం, ఆత్మవిశ్వాసం మనలో మెరుగుపడతాయి.
ప్రస్తుతం భారతదేశంలో అంతరించిపోయే దశలో ఉన్న, పుంగనూరు జాతి ఆవులని తమ నాడీపతి గోశాలలో డాక్టర్ కృష్ణంరాజు అభివృద్ధి చేసి రైతులకి అందించి వారికి మేలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వంత జాతి ఈ పుంగనూరు ఆవు.కాకినాడ జిల్లా, ఏలేశ్వరం మండలం, లింగపర్తిలో డాక్టర్ కృష్ణంరాజు స్థాపించిన నాడీపతి గోశాలలో,ఏప్రాంతంలోనూ, ఎవరిదగ్గరా లేనన్ని మూడువేలకి పైగా పుంగనూరు ఆవులులని పోషిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.ఇంటికి దూరమై, మనిషికి భారమైన ఆవుమీదకి జనం మనస్సు మళ్లీ మల్లేలా కృష్ణంరాజు పుంగనూరుఆవులనుంచి మినియేచర్ ఆవు జాతిని అభివృద్ధిచేసి, ప్రధానమంత్రి నరేద్రమోడీనుంచి మొదలుకుని దేశంలోని అన్నిరకాల ప్రముఖులవరకూ అందరి నుంచీ అభినందనలని అందుకున్నారు.
ఈ సభలో ఎన్.టి. ఆర్. జిల్లా కలక్టర్ లక్ష్మీషా, ఎఫ్.టి.ఎ.ఎమ్. అధ్యక్ష,కార్యదర్శులు గంజి జగన్ బాబు, కంటే అశోక్ ,పలువురు కవులు కళాకారులూ, నగరప్రముఖులూ ,మూడు రాష్ట్రాలకి చెందిన ఫెడరేషన్ సభులూ పాల్గొన్నారు.
Dr. P. Krishnam Raju Honored with the Punganur Gou Rakshaka Award
Another Prestigious Award for Dr. Krishnam Raju
Renowned ancient medicine expert and creator of miniature cows, Dr. P. Krishnam Raju from Kakinada, has been honored with yet another prestigious award. The Federation of Telugu Associations of Maharashtra (FTAM) has recognized his dedication to cattle conservation by conferring upon him the Punganur Gou Rakshaka Award.
Dr. Krishnam Raju received this award from renowned actor Suman at a grand ceremony held at Tummalapalli Kalakshetram, Vijayawada, on Sunday, March 16. The event was organized in honor of Amarajeevi Potti Sriramulu on his birth anniversary, in remembrance of his ultimate sacrifice for the formation of Andhra Pradesh. Andhra Pradesh Legislative Council Deputy Chairman Kanumuri Raghu Rama Krishna Raju presided over the event, while actor Suman attended as the chief guest.
Raghu Rama Krishna Raju commended TAMCCI (FTAM) for its contributions to the development of Telugu culture, commerce, and community in Telangana, Andhra Pradesh, and Maharashtra. He also praised Dr. Krishnam Raju for his decades-long dedication to preserving and promoting Punganur cattle, one of India’s rarest indigenous breeds.
Founder of the Nadipathy Research Foundation, Dr. Krishnam Raju’s research on cow therapy and “Cow Hugging” (Gou Alinganam) has gained global recognition. He has scientifically explained that hugging a cow releases oxytocin, dopamine, and serotonin, the happiness hormones that improve mental stability, happiness, and confidence.
Dr. Krishnam Raju has been reviving and conserving the endangered Punganur cattle breed at his Nadipathy Goshala and providing these indigenous cows to farmers, ensuring their sustainability. Punganur cows, native to Andhra Pradesh, are among the smallest and rarest cattle breeds in the world. At Nadipathy Goshala in Lingaraparti, Yeleswaram Mandal, Kakinada District, Dr. Krishnam Raju has successfully reared over 3,000 Punganur cows, a feat unmatched anywhere else. His work has played a vital role in bringing back the importance of cattle in human life.
By developing the miniature cow breed from Punganur cows, Dr. Krishnam Raju has received recognition from Prime Minister Narendra Modi and various other eminent personalities across the nation.
The event was graced by NTR District Collector Laxmisha, FTAM President G***a Jagan Babu, FTAM Secretary Kante Ashok, several poets, artists, and key representatives from three states, making it a grand celebration of Telugu heritage and cattle conservation.
डॉ. पी. कृष्णम राजू को पुङ्गनुरु गौ रक्षक अवार्ड से सम्मानित किया गया
डॉ. कृष्णम राजू को एक और प्रतिष्ठित पुरस्कार
प्राचीन चिकित्सा विशेषज्ञ और मिनिएचर गायों के सृजनकर्ता डॉ. पी. कृष्णम राजू को एक और प्रतिष्ठित पुरस्कार से सम्मानित किया गया है। फेडरेशन ऑफ तेलुगु एसोसिएशंस ऑफ महाराष्ट्र (FTAM) ने गौ संरक्षण के प्रति उनके समर्पण को मान्यता देते हुए पुङ्गनुरु गौ रक्षक अवार्ड प्रदान किया।
डॉ. कृष्णम राजू को यह सम्मान रविवार, 16 मार्च को विजयवाड़ा के तुम्मलपल्ली कला क्षेत्रम में आयोजित एक भव्य समारोह में प्रसिद्ध अभिनेता सुमन के हाथों प्रदान किया गया। यह समारोह अमर जीवि पोट्टि श्रीरामुलु की जयंती के अवसर पर आयोजित किया गया था, जिन्होंने आंध्र प्रदेश के गठन के लिए अपने प्राणों की आहुति दी थी। इस कार्यक्रम की अध्यक्षता आंध्र प्रदेश विधान परिषद के उपाध्यक्ष कनुमुरी रघु राम कृष्णम राजू ने की, जबकि अभिनेता सुमन मुख्य अतिथि के रूप में उपस्थित रहे।
रघु राम कृष्णम राजू ने FTAM द्वारा तेलंगाना, आंध्र प्रदेश और महाराष्ट्र में तेलुगु संस्कृति, वाणिज्य और समुदाय के विकास के लिए किए जा रहे कार्यों की सराहना की। उन्होंने डॉ. कृष्णम राजू द्वारा दशकों से पुङ्गनुरु गायों के संरक्षण और विकास में दिए गए योगदान की भी प्रशंसा की।
नडिपथी रिसर्च फाउंडेशन के संस्थापक डॉ. कृष्णम राजू ने गाय चिकित्सा और “गौ आलिंगन” (Cow Hugging) पर किए गए अपने अनुसंधान के माध्यम से वैश्विक पहचान प्राप्त की है। उन्होंने यह वैज्ञानिक रूप से प्रमाणित किया कि गाय को गले लगाने से ऑक्सीटोसिन, डोपामिन और सेरोटोनिन जैसे “हैप्पी हार्मोन्स” स्रावित होते हैं, जिससे मानसिक स्थिरता, आनंद और आत्मविश्वास में वृद्धि होती है।
डॉ. कृष्णम राजू भारत में विलुप्त हो रही पुङ्गनुरु नस्ल की गायों के पुनरुद्धार और संरक्षण में अहम भूमिका निभा रहे हैं। उन्होंने अपनी नडिपथी गौशाला में इस नस्ल को विकसित कर किसानों को यह स्वदेशी नस्ल प्रदान की, जिससे उन्हें आर्थिक और पारंपरिक रूप से लाभ हो रहा है। पुङ्गनुरु गाय, जो आंध्र प्रदेश की मूल नस्ल है, दुनिया की सबसे छोटी और दुर्लभ गायों में से एक है। काकीनाडा जिले के येलेश्वरम मंडल के लिंगरापर्ती में स्थित नडिपथी गौशाला में डॉ. कृष्णम राजू ने 3,000 से अधिक पुङ्गनुरु गायों का पालन-पोषण कर एक अनोखा कीर्तिमान स्थापित किया है।
गायों से दूरी बना चुके समाज में पुनः गायों के प्रति प्रेम जागृत करने के उद्देश्य से उन्होंने पुङ्गनुरु गायों से मिनिएचर गायों की नई नस्ल विकसित की। उनके इस कार्य की प्रधानमंत्री नरेंद्र मोदी सहित कई प्रतिष्ठित व्यक्तियों द्वारा प्रशंसा की गई है।
इस कार्यक्रम में एनटीआर जिला कलेक्टर लक्ष्मीशा, FTAM अध्यक्ष गंजि जगन बाबू, FTAM सचिव कंते अशोक, कई कवि, कलाकार और तीन राज्यों के प्रमुख प्रतिनिधि उपस्थित रहे, जिससे यह आयोजन तेलुगु विरासत और गौ संरक्षण के उत्सव का प्रतीक बन गया।