Dr. Vunnam Maruthi Chowdary

  • Home
  • Dr. Vunnam Maruthi Chowdary

Dr. Vunnam Maruthi Chowdary Young TDP Leader | Dedicated My Life Is For People Of Kalyanadurgam |

నేడు మా ఎర్రంపల్లి స్వగ్రామం నందు MPUP ప్రభుత్వ పాఠశాలలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపా...
15/08/2025

నేడు మా ఎర్రంపల్లి స్వగ్రామం నందు MPUP ప్రభుత్వ పాఠశాలలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు......

కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన 'మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం' హామీ ఈ ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో అమల...
01/08/2025

కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన 'మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం' హామీ ఈ ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో అమలు కాబోతోంది. ఈ పథకానికి 'స్త్రీశక్తి' అని పేరు పెట్టారు. ఇందు కోసం మహిళలకు జారీ చేసే 'జీరో ఫేర్ టికెట్' పై 'స్త్రీశక్తి' అని ముద్రించి ఉంటుంది. ఛార్జీ ఎంత? ప్రభుత్వ రాయితీ ఎంత అనే వివరాలు కూడా ఉంటాయి....

ఇందుకు అనుగుణంగా ఆర్టీసీ సిబ్బంది వినియోగించే టిమ్స్ యంత్రాలు, యూటీఎస్ సాఫ్ట్ వేర్ లో మార్పులు కూడా చేసారు. జీరో ఫేర్ టికెట్లు జారీ చేయడంపై అన్ని బస్ డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి శిక్షణ మొదలైంది...



02/07/2025

ఎమ్మెల్యే పై కుట్ర ఆరోపణల పై రియాక్షన్...

01/07/2025

ఎస్పీ గారు మీడియా సమావేశంలో దాదాపు 450 స్టాంపు తనిఖీ చేసామన్నారు.

డి.ఎస్.పి గారేమో నేను మారుతి చౌదరి పట్టించారని అంటారు..

ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారా? లేక ప్రజలను మభ్యపెడుతున్నారా..? టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నం మారుతి చౌదరి....

మీడియా ద్వారా తెలుపుతున్నాను ఇది ఇంతటితో అయిపోలేదు....

అనంతపురం ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్న ఉన్నం మారుతి చౌదరి నిన్న ముఖ్యంగా నాపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వడానికి మీడియా ముందుకు వచ్చాను. నేను ఇక్కడే కళ్యాణదుర్గంలో పుట్టి ఇక్కడే పెరుగుతూ స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న నాకు ఎవరు ఎలాంటివారో ఏమేమి చేస్తున్నారో నాకున్న పరిచయాల వల్ల వాళ్ళు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఎర్రప్ప అలియాస్ బాబు మీ సేవలో అవినీతి జరుగుతుందని అలాగే ఈ స్టాంపులలో మరియు ప్రభుత్వానికి కట్టవలసిన నాలా చలనాలు తప్పుడు మార్గంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని నాకు సమాచారం అందించారు. ఇది వాస్తవమా? కాదా? అని మీసేవ నిర్వాహకుడు ఎర్రప్ప అలియాస్ బాబుని నేను చరవాణి ద్వారా రెండుసార్లు అడిగాను, అందుకు సంబంధించి మా ఇద్దరి మధ్య సంభాషణ రికార్డింగ్ లు కూడా ఉన్నాయి ఏమి మాట్లాడమన్నది మీకు వినిపిస్తా. అంతే తప్ప మరెప్పుడు మీసేవ బాబుని ఫోన్ ద్వారా గాని లేదా మరెప్పుడూ సంప్రదించలేదు.

ఇందులో గత పది రోజులుగా మా వాళ్లు చాలామంది బాధపడుతున్నారు. ఇదే విషయంపై స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖకు తెలియజేశాను. దీంతో అధికారులు అప్రమత్తమై ఎర్రప్ప అలియాస్ బాబు మీ సేవను తనిఖీ చేశారు. ఈ కక్షతో నన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని మీ ద్వారా తెలుపుతున్నాను. కేవలం ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని బాధ్యత గల పౌరుడిగా తెలియజేసినందుకు మరియు మరిన్ని అవినీతి అక్రమాలను బయటకు తీస్తున్నారన్న అక్కసుతో ఈ విధంగా నాపై నెపం వేసి కుట్ర చేస్తున్నారు.

ఆశ్చర్యకరమైన విషయమేమంటే కళ్యాణదుర్గం డిఎస్పి రవిబాబు గారు ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టిన వ్యక్తులను వదిలేసి బయట పెట్టిన వారిపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసం. ఒకసారి ఆడిట్లో బయటపడిందని మరోసారి మారుతి చౌదరి బయట పెట్టాడని ఇలా పోలీసులు భిన్న ప్రకటనలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రజలకు అన్ని విషయాలు మీడియా ద్వారా తెలుపుతున్నాను ఇది ఇంతటితో అయిపోలేదు...

01/07/2025

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన వారిని వదిలేసి. నాపై నిందలా..?

మరికొద్ది క్షణాల్లో మీడియా సమావేశం...
Telugu Desam Party (TDP) Nara Chandrababu Naidu Nara Lokesh

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం కొత్త మిద్దెల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నాదెండ్...
01/07/2025

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం కొత్త మిద్దెల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నాదెండ్ల పాతన్న గారి సతీమణి సరస్వతమ్మ అనారోగ్య కారణంతో స్వర్గస్తులయ్యారు. ఆమె భౌతిక కాయానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి పూలమాలవేసి నివాళులర్పించారు....

ఈరోజు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు......
29/06/2025

ఈరోజు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు......

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి విమానాశ్రయంలో స్వాగతం పలికి...
20/06/2025

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు..




ప్రగతి - సంక్షేమాల కలయికతో సుపరిపాలనకు తొలి అడుగు పడింది...  #సుపరిపాలనలోతొలిఅడుగు
12/06/2025

ప్రగతి - సంక్షేమాల కలయికతో సుపరిపాలనకు తొలి అడుగు పడింది...
#సుపరిపాలనలోతొలిఅడుగు



28/05/2025

మన తెలుగుదేశం పార్టీకి ₹10,00000/- లక్షల రూపాయలు విరాళం అందించినందుకు మన AP CM Nara Chandrababu Naidu గారు 'మహానాడు' వేదిక పై ప్రకటించారు....

తెలుగు జాతికి అండ తెలుగుదేశం జెండా.. ప్రజల గుండెల నిండా పసుపు జెండా రెపరెపల మహానాడుకి ఆహ్వానం.....
27/05/2025

తెలుగు జాతికి అండ
తెలుగుదేశం జెండా..
ప్రజల గుండెల నిండా
పసుపు జెండా రెపరెపల మహానాడుకి ఆహ్వానం.....



నీ మరణం ఎప్పటికీ వృధా కాదు. నిన్ను  కన్న తల్లిదండ్రులకు నా సెల్యూట్....పాకిస్థాన్ దాడిలో వీర మరణం పొందిన ఇండియన్ ఆర్మీ జ...
09/05/2025

నీ మరణం ఎప్పటికీ వృధా కాదు. నిన్ను కన్న తల్లిదండ్రులకు నా సెల్యూట్....

పాకిస్థాన్ దాడిలో వీర మరణం పొందిన ఇండియన్ ఆర్మీ జవాన్ మురళి నాయక్ కు నా ఆశ్రు నివాళి. దేశ రక్షణలో తన చివరి రక్తపుబొట్టు వరకు శతృ దేశంతో పోరాడి వీరోచిత మరణం పొందారు. వీరుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నా. ఓ యోధుడా..! నీ మరణం ఎప్పటికీ వృధా కాదు. నిన్ను కన్న తల్లిదండ్రులకు నా సెల్యూట్.....

Address


515761

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Vunnam Maruthi Chowdary posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram