Chethana Foundation for Mental Health

Chethana Foundation for Mental Health Counselling Services

🧠 చేతన సైకాలజీ లెర్నింగ్ సెంటర్📢 ప్రకటన*మహిళా హక్కులకు మార్గదర్శక కోర్సు*🆓 ఉచిత సర్టిఫికేట్ కోర్సు రిప్రొడక్టివ్ జస్టిస్...
06/07/2025

🧠 చేతన సైకాలజీ లెర్నింగ్ సెంటర్
📢 ప్రకటన
*మహిళా హక్కులకు మార్గదర్శక కోర్సు*
🆓 ఉచిత సర్టిఫికేట్ కోర్సు రిప్రొడక్టివ్ జస్టిస్ పై డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
https://chat.whatsapp.com/Kurz7bdARaoI4jjwgjONuf?mode=ac_c
మహిళా మరియు బాల హక్కులపై అవగాహన పెంచే లక్ష్యంతో, "రిప్రొడక్టివ్ జస్టిస్" పై షేరింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ కార్యక్రమంలో భాగంగా ఉచిత సర్టిఫికేట్ కోర్సును చేతన సైకాలజీ లెర్నింగ్ సెంటర్ అందిస్తోంది.

ఈ కోర్సు ప్రధాన అంశాలు:
*రిప్రొడక్టివ్ హక్కులు* *సురక్షిత గర్భస్రావ సేవలు* *మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సవరణ చట్టం – 2020* *ట్రాన్స్ జెండర్ మరియు వికలాంగుల హక్కులు* *సర్రోగేసీ మరియు బయోఎథిక్స్*
*కోర్సు ఆధారం*:
ఈ కోర్సు గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ నిర్వహించిన శిక్షణా కార్యక్రమంపై ఆధారపడినది. ఇందులో 70% కంటే ఎక్కువ మార్కులు సాధించిన డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి గారికి GNLU డైరెక్టర్ ప్రొఫెసర్ (డా.) సంజీవి శాంతకుమార్, రిజిస్ట్రార్ డా. నితిన్ మాలిక్, మరియు సెంటర్ హెడ్ డా. ఆశా వర్మ సర్టిఫికేట్ ప్రదానం చేశారు.

ఇది భారతదేశంలో మొదటి రిప్రొడక్టివ్ జస్టిస్ కోర్సు — ఇది చట్టపరమైన, వైద్య, నైతిక మరియు సామాజిక కోణాలను కలిపి అధ్యయనం చేస్తుంది.

📌 ప్రయోజనం: న్యాయ, వైద్య, సామాజిక రంగాల్లో పనిచేసే వారిని సాధికారత పర్చడం.
🎯 లక్ష్యబృందం: న్యాయవాదులు, కౌన్సెలర్లు, సామాజిక కార్యకర్తలు, ఆరోగ్య నిపుణులు మరియు ఇతర ఆసక్తి గల అభ్యర్థులు.

📅 చివరి తేదీ: జూలై 10
📞 రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి: 9703935321

👉 ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి – ఉచితంగా జ్ఞానం పొందండి!

విద్యార్ధులు మార్పు కోసం ముందంజ వేయాలి — డాక్టర్ భూపతి రజినీ దేవిhttps://hindudayashankar.com/education/students-must-le...
30/06/2025

విద్యార్ధులు మార్పు కోసం ముందంజ వేయాలి — డాక్టర్ భూపతి రజినీ దేవి
https://hindudayashankar.com/education/students-must-lead-the-way-for-change-says-bhupathi-rajini-devi/
కౌన్సిలింగ్ విద్యార్ధుల సర్టిఫికెట్ వేడుకలో డాక్టర్ రజినీ దేవి
సైకాలజీ శిక్షణలో చేతన సైకాలజి లెర్నింగ్ సెంటర్ సేవలు ప్రశంసనీయమైనవి - డా. భూపతి రజినీ దేవి
చేతన సైకాలజి లెర్నింగ్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కౌన్సిలింగ్ విద్యార్ధుల సర్టిఫికెట్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్‌ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భూపతి రజినీ దేవి కౌన్సిలింగ్ సైకాలజీ అనేది కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఇది మనిషి మనసును అర్థం చేసుకునే కళ అని అన్నారు. డా రజనీ దేవి చేతన సైకాలజీ లెర్నింగ్ సెంటర్ నిర్వహించిన కౌన్సిలింగ్ సైకాలజీ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ముకరంపురలోని అపూర్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డా రజనీ దేవి మాట్లాడుతూ ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు భవిష్యత్తులో వ్యక్తిగతంగానే కాక సమాజంలో కూడా మార్పు తీసుకువచ్చే మార్గదర్శులుగా ఎదగాలి. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచే బాధ్యత ఇప్పుడు మీ భుజాలపై ఉంది అని తెలిపారు. ఈ సందర్భంగా చేతన సైకాలజీ లెర్నింగ్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత సైకాలజీ కౌన్సిలింగ్ కోర్సులో 90 మంది నమోదు చేసుకోగా 37 మంది ఉత్తీర్ణులైనట్టుగా వీరికి సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలిపారు.అనంతరం సైకాలజీ విద్యార్థులు డాక్టర్ రజినీ దేవిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో దేశబోయిన దివ్యభారతి, చొప్పదండి హరిత, పస్ల భవాని, ఓరగంటి స్వప్న, మునిగంటి సతీష్, సత్యానందం, పీక రాకేష్, గుండాల రామకృష్ణ, నకిడి ప్రదీప్, వై రమేష్ తదితరులు హాజరయ్యారు.

📢 FLASH FLASH!! RESULTS ANNOUNCED 🎉Certificate Course in Counselling Psychology🧠 Organised by Chetana Psychology Learnin...
26/06/2025

📢 FLASH FLASH!! RESULTS ANNOUNCED 🎉
Certificate Course in Counselling Psychology
🧠 Organised by Chetana Psychology Learning Centre

We are thrilled to announce that the results are out!

🌟 37 students have passed with First Class with Distinction! 🌟

Congratulations to all successful candidates for your dedication and excellence!

📌 Results are now available on our official website:
👉 https://cpa2017.jimdofree.com/certificate-course-in-counselling-psychology/

🎓 Chetana Psychology Learning Centre – Nurturing Minds, Transforming Lives

ఓ చిన్నారి అడుగు... నేటి చదువు ద్వారా రేపటి ప్రపంచం వైపు!  -డా. అట్ల శ్రీనివాస్ రెడ్డిరిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ | సెక్స్...
13/06/2025

ఓ చిన్నారి అడుగు... నేటి చదువు ద్వారా రేపటి ప్రపంచం వైపు! -డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి
రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ | సెక్స్ ఎడ్యుకేటర్ | క్లినికల్ న్యూట్రిషనిస్ట్ & డైటీషియన్ | స్పెషల్ ఎడ్యుకేటర్ | ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321
స్కూల్ కెళ్లే రోజు... చిన్ని హృదయాల్లో పెద్ద ఆశలు...
తల్లిదండ్రుల ఆశలు... ఉపాధ్యాయుల అండతో పిల్లల అభివృద్ధి ప్రారంభం

*ప్రత్యేక విద్య ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేయాలి**ప్రత్యేక అవసరాల విద్యార్థుల సంక్షేమమే మా లక్ష్యం* – *సెటా రాష్ట్ర ప్రధాన కా...
09/06/2025

*ప్రత్యేక విద్య ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేయాలి*
*ప్రత్యేక అవసరాల విద్యార్థుల సంక్షేమమే మా లక్ష్యం* – *సెటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి* అట్ల శ్రీనివాస్ రెడ్డి

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో సి.ఎస్.ఐ.హెచ్.పి.డి. స్కూల్ ఫర్ హియరింగ్ ఇంపైర్ యందు కార్యక్రమ *కోఆర్డినేటర్ జక్కుల దయానంద్* ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహించబడుచున్న *కంటిన్యూయస్ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్* కార్యక్రమ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా *స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి* హాజరైనారు. ఈ సందర్భంగా డాక్టర్ అట్ల మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల విద్యార్థుల సంక్షేమమే మా లక్ష్యం, ప్రత్యేక అవసరాలున్న బాలబాలికలకు నాణ్యమైన విద్యను అందించాలని, ప్రత్యేక విద్య ఉపాధ్యాయ ఖాళీల భర్తీ మరియు ఆర్.సి.ఐ. గుర్తింపు పొందిన టీచర్లకు ఉద్యోగ అవకాశాలు జీత భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం సి.ఆర్.ఈ. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ.ఎన్.టి. డాక్టర్ రామరాజు, సూర్యప్రకాశరావు, జక్కుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అట్ల శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
*స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ*
9703935321

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు సెటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్ల శ్రీనివాస్ రెడ్డి వినతిమోడల్ సహిత విద్యా పాఠశాల ఏ...
03/06/2025

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు సెటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్ల శ్రీనివాస్ రెడ్డి వినతి

మోడల్ సహిత విద్యా పాఠశాల ఏర్పాటుకు కృషి చేయాలి - అట్ల శ్రీనివాస్ రెడ్డి సెటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అట్ల ను అభినందించిన మంత్రి బండి

జూన్ 2 సోమవారం రోజున స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్ల శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని కలిసి, ప్రత్యేక అవసరాల పిల్లల కోసం నియోజకవర్గ స్థాయిలో మోడల్ ఇన్‌క్లూజివ్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన విద్యా ఉపకరణాలు అందజేయాలని, రిసోర్స్ రూమ్‌ల ఏర్పాటుకు కృషి చేయాలని వినతిపత్రం సమర్పించారు. అనంతరం స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ (సెటా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన అట్ల శ్రీనివాస్ రెడ్డి కి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్,బిజెపి నాయకులు ఎన్నం ప్రకాష్, పాదం శివరాజ్, నరహరి లక్ష్మారెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.
అట్ల శ్రీనివాస్ రెడ్డి సెటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పత్రికా ప్రకటనసమ్మిళిత విద్య విభాగం ఏర్పాటుకు వినతి సెటా రాష్ట్ర కార్యవర్గం వృత్యంతర శిక్షణ  పొందే ప్రత్యేక ఉపాధ్యాయులకు...
02/06/2025

పత్రికా ప్రకటన

సమ్మిళిత విద్య విభాగం ఏర్పాటుకు వినతి సెటా రాష్ట్ర కార్యవర్గం
వృత్యంతర శిక్షణ పొందే ప్రత్యేక ఉపాధ్యాయులకు సి.ఆర్.ఈ. పాయింట్లు

తేది: 31.05.2025 శనివారం రోజు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం, ఈ రోజు ఎస్.సి.ఈ.ఆర్.టి డైరెక్టర్ గాజర్ల రమేష్ గారిని కలిశారు. ఈ సందర్భంగా ఎస్.సి.ఈ.ఆర్.టిలో ప్రత్యేకంగా సమ్మిళిత విద్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సెటా రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి అట్ల శ్రీనివాస్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో సమ్మిళిత విద్య విభాగం ఏర్పాటు ద్వారా ప్రత్యేక ఉపాధ్యాయుల శిక్షణ, వనరుల సమన్వయం మెరుగవుతుందని పేర్కొన్నారు. వృత్యంతర శిక్షణ పొందే ప్రత్యేక ఉపాధ్యాయులకు సి.ఆర్.ఈ. పాయింట్లు కేటాయించే ప్రక్రియ ప్రారంభించాలని ఇందుకోసం ఆర్.సి.ఐ. తో చర్చలు జరపాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక ఉపాధ్యాయుల పాత్రను మరింత శక్తివంతంగా మార్చేందుకు, శిక్షణలు, వనరులు, విధానాల సమన్వయం అత్యంత అవసరం. సమ్మిళిత విద్యకు ప్రభుత్వం బలంగా మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు గజ్జెల శశికళ సభ్యులు శెట్టి నీలిమా, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సెటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్ల శ్రీనివాస్ రెడ్డి 97039 35321

ప్రాణాలతో చెలగాటం డా అట్ల శ్రీనివాస్ రెడ్డి సైకాలజిస్ట్
30/05/2025

ప్రాణాలతో చెలగాటం డా అట్ల శ్రీనివాస్ రెడ్డి సైకాలజిస్ట్

స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బత్తుల రాజేంద్రప్రసాద్, అట్లశ్రీనివాస్ రెడ్డి ...
30/05/2025

స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బత్తుల రాజేంద్రప్రసాద్, అట్లశ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ లో పద్మనాయక స్పెషల్ ఎడ్యుకేషన్ కాలేజిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తేది: 28.05.2025లో బుధవారం రోజున నిర్వహించడం జరిగినది. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులుగా బత్తుల రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్య దర్శిగా అట్ల శ్రీనివాస్ రెడ్డిలను తెలంగాణలోని 23 జిల్లాల నుండి విచ్చేసిన జిల్లా అధ్యక్ష, ప్రధానకార్మదర్శి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది.
రాష్ట్ర కార్య వర్గ సభ్యులు ఆధ్యక్షులు బత్తుల రాజేంద్ర) ప్రసాద్, ప్రధాన కార్యదర్శి అట్ల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి జి. మహేందర్, మీడియా కన్వీనర్లు జి.నరేశ్, బి. రాకేశ్, ఉపాధ్యక్షులు ఎస్. గౌతమి, జి. శశికళ, రమేశ్, జి. సునిల్ కుమార్, సంయుక్త కార్యదర్శులు ఆర్. మహేష్, కె. సంజీవులు, కె. రామకృష్ణ, కె.చంద్రమోహన్, కార్యవర్గసభ్యులు డి. పుభాకర్, ఎ. శివకుమార్, డి. పవన్ కుమార్ ఎన్నికైనట్లు ఎన్నికల పరిశీలకులు సైదులు పుకటించారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల స్పెషల్ టీచర్ లు పాల్గొన్నారు

Atla Srinivas Reddy SETA G.S. 9703935321

భ్రమల మాయలో జీవితాలు: స్కిజోఫ్రెనియాకనిపించని కల్లోలాన్ని ఎదుర్కొంటున్న మనుషులు - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డిరిహాబిలిటేషన...
24/05/2025

భ్రమల మాయలో జీవితాలు: స్కిజోఫ్రెనియా

కనిపించని కల్లోలాన్ని ఎదుర్కొంటున్న మనుషులు - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి

రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ | సెక్స్ ఎడ్యుకేటర్ | క్లినికల్ న్యూట్రిషనిస్ట్ & డైటీషియన్ | స్పెషల్ ఎడ్యుకేటర్ | ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321

ఉచిత ఆన్లైన్ స్కిల్ డెవలప్మెంట్ సైకాలజీ కోర్సులు - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డికరీంనగర్ చైతనా సైకాలజికల్ లెర్నింగ్ సెంటర్ ...
22/05/2025

ఉచిత ఆన్లైన్ స్కిల్ డెవలప్మెంట్ సైకాలజీ కోర్సులు - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి
కరీంనగర్ చైతనా సైకాలజికల్ లెర్నింగ్ సెంటర్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఉచిత సైకాలజీ ఆన్లైన్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులు బీపీఎల్ కుటుంబాలకు చెందిన విద్యార్థులు, యువకులకు వృత్తిపరమైన నైపుణ్యాలు సాధించడానికి సహాయపడుతుంది. సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ కౌన్సెలింగ్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ మరియు కెరియర్ కౌన్సెలింగ్ కోర్సులు ప్రవేశం పొందడానికి గ్రాడ్యుయేషన్ లేదా పీజీ సైకాలజీ ఉన్నవారు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. *Online Psychology Courses*
Interested candidates are requested to share their details via WhatsApp in the following format:
• Name
• Educational Qualification
• Mobile Number
• Address
• Do you have a White Ration Card? (Yes/No)

Contact 97039 35321 వివరాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 97039 35321 నంబర్కు కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా లేదా mail id atlasrinivasreddy.dietexpert@gmail.com లలో సంప్రదించవచ్చునని, ఇట్టి అవకాశంను యువత సద్వినియోగం చేసుకోవాలని డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

విషపూరిత సంబంధాలు... మౌనంగా సహిస్తే, మనసు ముక్కలవుతుంది - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డిరిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ | సెక్స్ ఎ...
22/05/2025

విషపూరిత సంబంధాలు... మౌనంగా సహిస్తే, మనసు ముక్కలవుతుంది - డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి

రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ | సెక్స్ ఎడ్యుకేటర్ | క్లినికల్ న్యూట్రిషనిస్ట్ & డైటీషియన్ | ఫ్యామిలీ కౌన్సెలర్ 9703935321

Address

Karimnagar
505001

Alerts

Be the first to know and let us send you an email when Chethana Foundation for Mental Health posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Chethana Foundation for Mental Health:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram