23/09/2021
ఆరోగ్య రహస్యం
ఆరోగ్యకరమైన ఆహారం తినండి.
ఉప్పు మరియు పంచదార తక్కువగా తీసుకోవాలి.
హానికరమైన కొవ్వులు తీసుకోవడం తగ్గించండి.
హానికరమైన ఆల్కహాల్ వాడకాన్ని నివారించండి.
ధూమపానం చేయవద్దు.
చురుకుగా ఉండండి.
మీ రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోండి.
సురక్షితమైన నీటిని మాత్రమే తాగండి
మీ చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోండి
అల్పాహారం
ఉదయాన్నే బియ్యంతో చేసిన ఇడ్లీ, దోశలకు దూరంగా ఉండాలి. వాటి బదులు జొన్నలు, మినుములుతో చేసిన ఇడ్లీ, దోశలను తినండి. ఇడ్లీ, దోశ వారానికి ఒకసారి మాత్రమే తినండి.
దోశలను నెయ్యితో కాల్చుకోండి నూనెను పూర్తిగా దూరం చేయండి.
ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు, అలచందలు చాలా మంచి ఆహారం.
మొలకెత్తిన గింజలు అత్యంత ఆరోగ్యకరం.
పూరీలు, మైసూర్ బోండా లాటివి తక్కువగా తీసుకోవడం మంచిది
మధ్యాహ్న భోజనం ఆరోగ్య చిట్కాలు
పాలిష్ బియ్యం కన్నా ముడి బియ్యం రాగి సంగటి, జొన్న అన్నం, కొర్ర అన్నం మొదలైనవి ఆరోగ్యకరమైన ఆహారం.
మధ్యాహ్న భోజనంగా అన్ని రకాల కూరగాయలను తీసుకోండి. అన్నింటినీ నూనెలు లేకుండా చక్కగా వండుకొని తినవచ్చు.
ఖచ్చితంగా వారానికి మూడు సారులు ఆకు కూరలు తినాలి. దీనిని ఖచ్చితంగా పాటించండి
రాత్రి భోజనం
రాత్రి ఖచ్చితంగా 7:00 లేదా 8:00 గంటల మధ్యలో రాత్రి భోజనం పూర్తి చూసుకోండి
రాత్రికి రెండు లేదా మూడు జొన్న రొట్టెలు తీసుకొనటం అత్యంత ఆరోగ్యకరం.
వేపాకులను మజ్జిగలో మెత్తగా రుబ్చీ ఆ పేస్టును కాలిన గాయాల పై రాస్తే ఉపశమనంగా ఉంటుంది.
శరీరం పై కాలిన చోట పాలమీగడ రాస్తే బాధ తగ్గటమే కాదు, శరీరం రంగు కూడా మారుతుంది.
ఒక కప్పు నీళ్ళల్లో గుప్పెడు తులసి ఆకులు, చెంచా మిరియాల పొడి వేసి బాగా మరగించి అందులో రవ్వంత తేనె లేదా పంచదార కలిపి వేడిగా త్రాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వు పదార్థాలు తక్కువ వుండే ఆహారపదార్థాలు తీసుకోవాలి.
మధుమేహంతో బాధపడేవారు నిత్యం ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే ఎంతో మేలు.
మనం త్రాగే నీరు విషయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య చిట్కాలు
మనిషికి కావలసిన ప్రధాన వనరులలో నీరు ఒకటి, అందుకే త్రాగే నీరు విషయంలో అత్యంత శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా వుంది.
దీనికోసం మనం త్రాగే నీళ్లని కనీసం 3డు నెలలకు ఒక్కసారి అయిన టెస్ట్ చేసుకోవాలి .
ఇక్కడ కొంత మందికి సందేహం రావచ్చు పాతరోజులలో చెరువులలో, బావులలో, పంపులలో నీరు త్రాగేవాళ్ళం కదా, అప్పుడు ఈ టెస్ట్లు ఏమి చేయలేదు కదా అని అంటారు. నిజమే కానీ ప్రకృతి, పరిసరాలు ఈ రోజులలో ఎంత కలుషితం అయ్యాయో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సగంపైనా శారీరక రోగాలకు కారణం కలుషితమైన నీరు త్రాగడం వల్ల వస్తున్నాయి అని మరచిపోవద్దు.
నీటిని టెస్ట్ చేయడానికి రెండు రకాల టెస్ట్ ఉన్నాయి.
P.H టెస్ట్
T.D.S టెస్ట్
సాధారణ నీళ్లు యొక్క పీహెచ్ విలువ 7, కాబట్టి పిహెచ్ టేస్ట్ చేసిన తరువాత 6.5 నుండి 8.5 ఉన్నా నీటిని త్రాగడానికి అనుకూలం పిహెచ్ 9 కన్నా ఎక్కువ ఉన్న నీరు త్రాగడానికి అనుకూలం కాదు ఈ నీటిలో అలైన్ స్వభావం ఎక్కువ ఉంటుంది.
టీ.దీ.యస్ టెస్ట్. 400 రూపాయలకు ఈ పరికరం ఆన్‌లైన్ స్టోర్లలో లభ్యమౌతుంది. త్రాగేనీరు యొక్క టి.డి.యస్, కనీసం 100 పి.పి.యం నుండి అత్యధికంగా 500 పి.పి.యం. వరకు ఉండవచ్చు. గమనించినట్లయితే మనం బయట దొరికే 20 లీటర్ల వాటర్ క్యాన్లలో ఉండే నీటి యొక్క టి.డి.యస్. 50 ఏ.పి.యం, కన్నా తక్కువ ఉంటోంది చాలావరకు ఇది గమనించాల్సిన విషయం. తక్కువ టి.డి.యస్ ఉంది అంటే a నీటిలో తక్కువ విటమిన్లు ఖనిజ ఉన్నాయి అని అర్థం
ఆహారం ఆరోగ్య చిట్కాలు:
పాలు త్రాగటం ఆరోగ్యకరమైన అలవాటే కానీ, కచ్చితంగా పాలు త్రాగాలని అని ఏమి లేదు. ఎందుకంటే తెల్ల నువ్వులలో కూడా పాలులో ఉన్న కన్న ఎక్కువ క్యాల్షియం దొరుకుతుంది. కాబట్టి పాల మీద మనకున్న అవగాహనలో మార్పు రావాలి.
వేడిగా ఉండే పదార్ధాలను తినటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఆకు కూరలను పిల్లలు, పెద్దలు పెద్దగా తినడానికి ఇష్టపడరు. కానీ, వారానికి కనీసం మూడు సార్లు ఆకు కూరలు కచ్చితంగా తినాలి. ముఖ్యంగా తోటకూర చాలా చాలా మంచిది. ఈ అలవాటును ఇప్పుడు మనం మన పిల్లలకు నేర్పకపోతే భవిష్యత్తులో వాళ్ళ పూర్తిగా ఆకు కూరలను మర్చిపోయే ప్రమాదం ఉంది.
పిల్లలకు ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు, అలచందలు మొదలైనవాటిని పెట్టడం చాలా చాలా మంచిది. కనీసం వారానికి రెండు రోజులైనా ఈ స్నాక్స్ వారి ఆహారంలో ఉండేట్లు చూచవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది.
వారానికి మూడు లేదా నాలుగు సార్లు నల నువ్వుల ఉండలు, వేరుశనగ ఉండలు, సున్నుండ (బెల్లంతో చేసినవి) ఖచ్చితంగా పెట్టాలి.
వారానికి రెండు లేదా మూడు సార్లు కాలాన్ని బట్టి దొరికే అన్నిరకాల పండ్లను స్నాక్స్ పెట్టవచ్చు.
వారానికి రెండు లేదా మూడుసార్లు జీడిపప్పు, బాదంపప్పు, పిస్తావు లాంటివి కూడా ఖచ్చితంగా స్నాక్స్ గా పెట్టాలి.
ఆహార్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్యాకేజ్ ఫుడ్ అన్ని ఆపేయాలి. నూడిల్స్, కుంకురే, లేస్, బింగో, ప్యాకేళ్ల ….స్వీట్స్ మొదలైన అన్నిటికి పిల్లలను దూరంగా ఉంచాలి. వీటిలో ప్రిజర్వటీస్గా కలిపే రసాయనాలు చాలా హానికరం.
నూనెలతో చేసే అన్ని పదాల ఉదాహరణకు పునుగులు, బజ్జీలు సమాసాలు మొదలైన వాటి పిల్లలను దూరంగా ఉంచండి, మసాలాలు, వేపుడు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచండి.
మన ఆహార పదార్ధాల తయారీలో చెక్కర వాడకాన్ని తగ్గించాలి
ఒక ప్రముఖ పత్రిక కథనం ప్రకారం ఒక మనిషి తన జీవిత కాలంలో తీసుకోవాల్సిన ఆహారం కన్నా రెండు లేక మూడు రెట్లు తీసుకొంటున్నారని కధనం కాబట్టి మితాహారం ఆరోగ్యకరం
పెద్దలు ఆరోగ్య విషయంలో గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశాలు
ఉదయాన్నే మూడు లేదా నాలుగు నానబెట్టిన బాదం పప్పును తినటం చాలా మంచిది,
ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి కచ్చితంగా అలవాటుగా చేసుకోండి,
ప్రతి మనిషికి కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం.
ఉప్పు వినియోగం గణనీయంగా తగ్గాలి. వాడకానికి సముద్రపు ఉప్పు చాలా మంచిది.
టీ, కాఫీలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. రాగిజావ ఆరోగ్యానికి చాలా మంచిది.
ఫంక్షన్స్ కి , వేరే ప్రదేశాలకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తినవలసి వస్తే వాటిలో మనకు సౌలభ్యంగా ఉండేవాటిని ఎంచుకొని మరీ తినాలి. సాధ్యమైనంత వరకు బయట తినటానికి నిరాకరించడమే మంచిది.
కూరగాయలను, పండ్లను మార్కెట్ నుండి తెచ్చిన తరువాత గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి 15 నిమిషాలపాటు ఉంచండి. ఆ తరువాత ఆ నీటిని పారపోసి మరలా వాటిని కడిగి పెట్టుకోండి. మరొక సారి కడగటం వల్ల చాలా వరకు హానికరమైన రసాయనాలను తొలగించవచ్చు.
నీరు త్రాగటం చాలా మంచి అలవాటు. కనీసం రోజుకు 5 లీటర్లు నీరు అయినా త్రాగాలి. వీలైతే చల్లని నీరు కన్నా గోరు వెచ్చని నీరు ఆరోగ్యానికి అత్యంత మంచిది. ఉదయాన్నే ఒక లీటరు నీళ్ళు ఖచ్చితంగా త్రాగండి.
రాత్రి 7:00 గంటల లోపు లేదా ఖచ్చితంగా 8.00 గంటల లోపు ఆహారం తీసుకోండి. తిన్న తరువాత కనీసం ఒక అరగంట అయిన కచ్చితంగా నడవండి