B.KothaKota

B.KothaKota B. KothaKota is a Mandal in Chittoor District, Andhra Pradesh - 517370
(214)

06/01/2026

బి.కొత్తకోట లో నీటి సమస్య🥺

.kothakota

నీటి సమస్య.!!  B.KothaKota
06/01/2026

నీటి సమస్య.!!

B.KothaKota

 #తనభార్యనులేపుకెళ్లినవ్యక్తినిఅన్నతోకలిసిహత్యచేసినభర్త #తనకల్లుపోలీసస్టేషన్గేటుఎదుటేవేటకొడవలితోదాడిచేసిహత్యఏపీలోని సత్య...
05/01/2026

#తనభార్యనులేపుకెళ్లినవ్యక్తినిఅన్నతోకలిసిహత్యచేసినభర్త
#తనకల్లుపోలీసస్టేషన్గేటుఎదుటేవేటకొడవలితోదాడిచేసిహత్య

ఏపీలోని సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాగినేపల్లికి చెందిన ఈశ్వరప్ప అనే వ్యక్తిపై అన్నదమ్ములు హరి, చిన్నప్ప వేటకొడవళ్లతో దాడి చేశారు. తనకల్లు మండల పోలీస్ స్టేషన్ గేటు ఎదుటే అతన్ని నరికి దారుణ హత్యకు పాల్పడ్డారు. మహిళతో అక్రమ సంబంధమే ఈశ్వరప్ప హత్యకు కారణంగా చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరి భార్యతో ఈశ్వరప్ప అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం హరి భార్యను ఈశ్వరప్ప తీసుకెళ్లిపోయాడు. భార్య కనపడటం లేదని హరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హరి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.

పోలీసులు ఈశ్వరప్ప, హరి భార్యకోసం వెతుకులాట ప్రారంభించగా.. నెల్లూరులో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో నెల్లూరులో ఉంటున్న ఈశ్వరప్పతో పాటు హరి భార్యను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున తనకల్లు పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న హరి, వాళ్లఅన్న చిన్నప్ప ఇద్దరు అర్ధరాత్రి 3గంటల సమయంలో కాపుకాచి ఈశ్వరప్ప ను పోలీస్ స్టేషన్ గేటు ఎదుట వేట కొడవలితో నరికి దారుణంగా హత్య చేశారు. కారు దిగి స్టేషన్లోకి వెళ్తుండగా.. అన్నదమ్ములు ఇద్దరు కొడవళ్లతో దాడి చేసి.. నరికి చంపారు. ఈ ఘటనతో హరి భార్య అక్కడి నుంచి పరారైంది.

01/01/2026
Andhra Pradesh: కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన షురూ.. కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ.కొత్త జిల్లాలకు క...
31/12/2025

Andhra Pradesh: కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన షురూ.. కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ.

కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జేసీలు వచ్చేదాకా ఉమ్మడి జిల్లా అధికారులే ఇన్‌చార్జులుగా కొనసాగనున్నారు. డిసెంబర్ 31 నుంచి అన్నమయ్య జిల్లా కార్యకలాపాలు మదనపల్లి కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు రాయచోటి నుంచి పనిచేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారుల కార్యాలయాలు నేటి నుంచి మదనపల్లె నుంచి జరుగుతాయి.

నేటినుంచి ఐదు రెవెన్యూ డివిజన్లు అమల్లోకి..

అడ్డరోడ్డు జంక్షన్, అనకాపల్లి జిల్లా
అద్దంకి, ప్రకాశం జిల్లా
పీలేరు, అన్నమయ్య జిల్లా
మడకశిర, శ్రీసత్యసాయి జిల్లా
బనగానపల్లి, నంద్యాల జిల్లా

Madanapalle - మదనపల్లె B.KothaKota

Be alert.!!B.కొత్తకోట ప్రజలారా మీ కోసం..!
30/12/2025

Be alert.!!

B.కొత్తకోట ప్రజలారా మీ కోసం..!

29/12/2025

#మదనపల్లికాదు #అన్నమయ్యజిల్లానే...!!

ఇక అన్నమయ్య జిల్లా పేరును అలాగే ఉంచగా.. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. రాజంపేట కేంద్రంగా జిల్లా కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాయచోటినే కొనసాగించాలంటూ అక్కడ కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాయచోటి కాకుండా మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక బనగానపల్లె, అడ్డరోడ్లను డివిజన్లుగా ఏర్పాటు చేయనుండగా. పెనుగొండను వాసవీ పెనుగొండగా మార్చాలని నిర్ణయించారు. అలాగే విశాఖలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయించారు. జనవరి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం స్ఫష్టం చేసింది.

Madanapalle - మదనపల్లె Horsley Hills - హార్సిలీ హిల్స్

29/12/2025

.Kothakota









#
madanapalle









*ములకలచెరువు ఎస్సైగా ఎం ప్రతాప్ బాధ్యతలు...* *ములకలచెరువు ఎస్సైగా ఎం ప్రతాప్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా...
29/12/2025

*ములకలచెరువు ఎస్సైగా ఎం ప్రతాప్ బాధ్యతలు...*

*ములకలచెరువు ఎస్సైగా ఎం ప్రతాప్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు*అసాంఘిక కార్యక్రమాలు,జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.పోలీసు సిబ్బంది నూతన ఎస్సై కు శుభాకాంక్షలు తెలిపారు*.

B.KothaKota

25/12/2025

నూతన సంవత్సరం దృశ్య ఆంధ్రా ఊటీ అయిన హార్సిలీహిల్స్‌లో ఆంక్షలు -- బహిరంగంగా మద్యం సేవించడం నేరం -- కఠిన చర్యలు తప్పవు -- మదనపల్లె డీఎస్పీ S.మహేంద్ర స్పష్టం

నూతన సంవత్సరం - 2026 దృశ్య బుధవారం (31.12.2025) ఉదయం నుండి గురువారం (01.01.2026) రాత్రి వరకు 2 వీలర్స్, 3 వీలర్స్ కొండ పైకి వెళ్ళడానికి అనుమతి లేదు.
కార్లు మరియు RTC బస్సులకు మాత్రమే అనుమతి వుంటుంది.
వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపరాదు.
హార్సిలీహిల్స్ లో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు.
పర్యాటకులను ఇబ్బందికి గురి చేయకూడదు.
కొత్త సంవత్సర సంబరాలను రాత్రి 12 గంటలకు ముగించాలి.
హోటల్ యాజమాన్యం వారి తప్పనిసరిగా ఆంక్షలు పాటించాలి.. గదులలో మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా చూసుకోవాలి.
తేదీ 31.12.2025 ఉదయం నుండి తేదీ 01.01.2026 రాత్రి వరకు హార్సిలీహిల్స్ లో డ్రోన్ మరియు CCTV కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
పర్యాటకులు అందరూ పోలీస్ వారికి సహకరించి నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని తెలియజేశారు.

B.KothaKota Horsley Hills - హార్సిలీ హిల్స్ Madanapalle - మదనపల్లె

Address

Bangalore Road
Kothakota
517370

Alerts

Be the first to know and let us send you an email when B.KothaKota posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram