Making social awareness, Making avilable information to all is the main target of this PAGE. This PAGE is created for our Nalgonda people. You can find all the information about Nalgonda here.Here mainly we discuss about
What we have to develop for better society? Problems we are facing in our daily life? What is happening in the present generation? Our Facebook Group @ https://www.facebook.com/groups/thenalgonda/
Our page @ https://www.facebook.com/Nalgonda
Website:http://nalgondadistrict.in/
Friends, please share any information you have regarding the latest happenings in our city! No abusing.No hatred comments..Users violating code of conduct will be banned permanently. About Me :
బహుళార్థసాధక ప్రాజెక్టుకు సరైన నిర్వచనం చెప్పగల నాగార్జున సాగర్ ఈ జిల్లాకు ప్రధాన ఆకర్షణ. మానవ నిర్మిత ఆనకట్టలలో ఆసియాలోనే ఇది అతిపెద్దది. క్రీ.శ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నివసించిన బౌద్ధమతాచార్యుడైన ఆచార్య నాగార్జునుని పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టును 1955 లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూప్రారంభించాడు. జలాశయం మధ్యలోని నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ కృష్ణా నది పొడవునా 3568 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన రిజర్వు అడవి దేశంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలన్నింటికంటే పెద్దది. జిల్లాలోని యాదగిరి గుట్ట, తెలంగాణాలోని పర్వత ప్రాంత దేవాలయాల్లో ఎంతో పేరుపొందింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి గుడి అన్ని ప్రాంతాలవారికి దర్శనీయ పుణ్యక్షేత్రం. దేవాలయ నిర్మాణ రీతి ప్రాచీన ఆధునిక సంప్రదాయాల కలగలుపుగా ఉంటుంది. ఏటా రథోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవం, పెళ్ళిళ్ళు విరివిగా జరిగే ప్రదేశం. జిల్లాలోని ఆలేరుకు సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలోని కొలనుపాక జైన మతానుయాయులకు ఒక పవిత్ర యాత్రాస్థలం. ప్రస్తుతం ఇక్కడ శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైన దేవాలయం నిత్య పూజారాధనతో విలసిల్లుతోంది. కాకతీయుల నాటి ప్రసిద్ది చెందిన శివాలయాలు సూర్యాపీట మండలం లోని పిల్లలమర్రి గ్రామంలో కలవు. వాడపల్లి తీర్ధం ఈ జిల్లాలో అతి పెద్ద శైవ క్షేత్రము.శివరాత్రి నాడు పుణ్యస్నానాలు అచరించడానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు. ఇది కృష్ణా ,మూసీ మరియు అంతర్వేది సంగమం.
బుద్ధుడి శిల్పం
హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన పర్యాటకకేంద్రం. ఈ చారిత్రాత్మ ప్రదేశానికి ఈ పేరు బౌద్ధసన్యాసి నార్జునుడి కారణంగా వచ్చింది. ఈ ప్రదేశంలో పండితుడైన ఆచార్య నాగార్జునుడు విద్యాకేంద్రాన్ని స్థాపించాడు. ప్రస్థుతం ఇక్కడ నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించబడి ఉంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రపంచంలో పొడవైన మానవ నిర్మిత ఆనకట్టగా ప్రసిద్ధిగాంచింది. నాగార్జునసాగర్ ఆనకట్ట కింద 10 లక్షల కంటే అధికమైన ఎకరాల సాగుబడి జరుగుతుంది.
ఈ ఆనకట్ట నిర్మించే సమయంలో త్రవ్వకాలలో బౌద్ధసంస్కృతికి చెందిన శిధిలాల పురాతన అవశేషాలు బయటపడ్డాయి. వెలికితీసిన పురాతన అవశేషాలను సుందరమైన నాగార్జున కొండ మీద బధ్రపరిచారు. ఈ కొండ మానవ నిర్మిత సరస్సుకు కేంద్రంలో ఉన్నది. పవిత్రమైన బౌద్ధస్థూప అవశేష మిగులు భాగాలను స్థూప, విహారాలు, ఒక విశ్వవిద్యాలయం మరియు పవిత్రమైన బలిపీఠం జాగ్రత్తగా రిజర్వాయర్‌కు తూర్పు భాగంలో ఉన్నాయి.
నాగార్జున కొండ
మానవ నిర్మిత సరస్సు మధ్య మనోహరమైన ద్వీపం ఉంది. నాగార్జున కొండ త్రవ్వాకాలలో 2వ 3వ శతాబ్ధానికి చెందిన బౌద్ధసంస్కృతిక స్థూపం బయటపడ్డాయి. ఈ కొండను చేరటానికి విజయపురి వద్ద ఉన్న జెట్టి అనేప్రదేశంలో బోటు సేవలు లభ్యం ఔతాయి.
129 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదు విమానాశ్రయం నుండి ఇక్కడకు వాయుమార్గంలో ప్రదేశానికి చేరవచ్చు. రైలు మార్గంలో ఇక్కడకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచర్ల నుండి చేరవచ్చు.
యాదగిరిగుట్ట
మహర్షి ఋష్యశృంగుని కుమారుడైన యాదగిరి అనే సన్యాసి వలన ఈ కొండకు ఈ పేరు వచ్చింది. యాదర్షి ఇక్కడ ఉన్న ఒక గుహలో ఆంజనేయుడి అనుగ్రహంతో నరసింహుని గురించి తపమాచరించాడు. ఈ కొండ నల్గొండ లోని భువనగిరి మరియు రాయగిరి మధ్యలో ఉన్నది. యాదర్షి ఘాఢతపస్సుకు మెచ్చి నరసింహుడు ఐదు రూపాలలో సాక్షాత్కరించాడు. జ్వాలానరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అనేవి ఆ ఐదు రూపాలు. ఇలా ప్రత్యక్షమైన నరసింహ రూపాలు ఈ కొండలలో స్వయంభువులుగా వెలసి భక్తుల పూజలు అందుకుకుంటున్నాడు. అందుకనే ఇది పంచ నరసింహ క్షేత్రం అయింది. పురాణ కధనం ప్రకారం యాదర్షికి మొదట జ్వాలా నరసింహుడిగా ప్రత్యక్షమైన జ్వాలా నరసింహరూపాన్ని దర్శించే శక్తి లేని యాదర్షి కోరిక మీద నరసింహుడు తరువాత యోగనరసింహుడిగా దర్శనమిచ్చాడు. యాదర్షి అంతటితో సంతోషపడక లక్ష్మీ సహితంగా దర్శనమివ్వమని కోరడంతో ఓడిలో లక్ష్మీసహితంగా లక్ష్మీనరసింహుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీనరసింహుడు ఆళ్వారుల పూజలు అందుకుంటున్నాడు. ఊగ్రనరసింహుడి ఉగ్రతను తగ్గించడానికి గరుత్మంతుడు గండభేరుండ పక్షి రూపంలో స్వామికి ముందు నిలిచి స్వామి ఉగ్రతను తగ్గిస్తుంటాడు. ఈ శిలను దాటి వంగుతూ వెళ్ళి స్వామిని దర్శించాలి. ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయుడు. యాదర్షి స్వామిని ఈ ప్రదేశాన్ని తనపేరుతో పిలవాలని కోరాడు. అందుకే ఇది యాదగిరి గుట్ట అయింది. చాలాకాలం నుండి ఇక్కడ లక్ష్మీనరసింహుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
చంద్రవంక జలపాతము
ఎత్తిపోతల జలపాతముకు దిగువగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన కొండచరియలలో చంద్రవంక జలపాతము ఉంది. ఈ జలపాతము పచ్చని కొండల నుండి 21.3 మీటర్ల నుండి కింద ఒక మడుగులోకి పడుతూ ఉంటుంది. ఈ జలపాతాన్ని తరచూ పర్యాటకులు దర్శిస్తుంటారు.
ఈ సుందర జలపాతము 60 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న చంద్రవంకానది నుండి ప్రవహించే జలాల వలన ఏర్పడింది. ఈ జలపాతం నాగార్జున కొండకు 21 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంది. అక్కడ ధ్యానంచేసిన ఒక యతీశ్వరుడి వలన ఈ జలపాతానికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో కొన్ని కొండ గుహాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వారు ఇక్కడి దైవాలను పూజిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం రహదారి మార్గంలో హైదరాబాదు నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది విజయపురి సమీపంలో ఉంది.
నందికొండ
నందికొండ అంటే క్రిష్ణా నదీ తీరంలో ఉన్న చిన్న పల్లెటూరు. ఇది మిరియాలగూడకు 64.37 కిలో మీటర్ల దూరంలో ఉంది. చాలా ప్రముఖమైన ఈ నిర్మాణం ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి చేత నిర్మించబడిన కోట. దృఢమైన గోడలు, కందకము, ద్వారాలు మరియు బురుజులు కలిగిన ఈ కోటలో ఒక దీర్ఘచతురస్రాకార రంగస్థలం (స్టేడియం)ఉంది.
పోచంపల్లి
1950 లో ఆచార్యా వినోభాభావే ఇక్కడి నుండి తన ఉద్యమాన్ని ఆరంభించాడు. ఇది బోంగిర్ నుండి 14.48 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే బీబీనగర్ నుండి 9.66 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పిల్లలమర్రి
ఇక్కడ అద్భుతమైన చిత్రాలు, సున్నితంగా చెక్కబడిన స్థంభాలు కలిగిన పురాతన కాకతీయ ఆలయాలు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ప్రదేశం ప్రసిద్ధ కవి అయిన పిల్లల మర్రి పిన వీరభద్రుని పుట్టిన ప్రదేశం.
కొలనుపాక
ఇది హైదరాబాదు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా చారిత్రక ప్రసిద్ధమైనది. ఇది 93.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఒకప్పుడు సమృద్ధి కలిగి ఉన్న ప్రదేశం. పాత కోట యొక్క శిధిలాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ఒకప్పుడు ఎ.డి. 11వ శతాబ్ధం ఇది కల్యాణి చాళుక్యులకు రెండవ కోటగా ఉన్నప్పుడు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.
ఇంకా కొన్ని ప్రముఖ ప్రాంతాలు : రాచకొండ, గాజుల కొండ, ఏలేశ్వరం, ఫణిగిరి,భోంగిర్ ఫోర్ట్,మటంపల్లి,వడపల్లి,పంగల్,సుంకిశాల,
"PLEASE NOTE THIS NOT A OFFICIAL PAGE OF THE NALGONDA GOVT"