VOICE TRUST

VOICE TRUST To raise our VOICE for national intigrity, sovereignty and solidarity with the spirit of freedom fighters. To provide free
* Food
* Education
* Medicine s

 #రేనాటివీరుడికివందనం #ఆంధ్రజ్యోతికిఅభివందనం
20/01/2025

#రేనాటివీరుడికివందనం
#ఆంధ్రజ్యోతికిఅభివందనం

కులబందువులకు నమస్కారం🙏.స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతిసి, రాష్ట్ర ప్రభుత్వం *స్టేట్ ఫెస్టివల్ (రాష్ట్...
27/12/2024

కులబందువులకు నమస్కారం🙏.

స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతిసి, రాష్ట్ర ప్రభుత్వం *స్టేట్ ఫెస్టివల్ (రాష్ట్ర పండుగగా)* నిర్వహించుటకు నిర్ణయం తీసుకొంది. దీనికి సంబదించిన G O త్వరలో (2 - 3 రోజుల్లో) వెలువడుతుంది.
సభావేదిక కూడా ప్రభుత్వం (సిఎం గారి నిర్ణయం మేరకు) నిర్ణయిస్తుంది. గత 20 రోజులుగా B C వెల్ఫేర్ డిపార్ట్మెంట్ , B C సెక్రటరీ ఆఫీసు నుండి సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. సభను (జిల్లా స్థాయిలో కలెక్టర్ మరియు జిల్లా మంత్రివర్యులు ఆధ్వర్యంలో) పూర్తిగా ప్రభుత్వ లాంచనాలతోనే నిర్వహించాలని కోరడం జరిగింది.

కావున, కులబందువులు నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పండుగను మనమందరం కలిసి మెలసి ఐక్యతతో నిర్వహించి (పార్టిసిపేట్) విజయవంతం చేద్దాం...

ఇట్లు
*అఖిల భారత ఒడ్డే ఓబన్న సేవా సమితి*
నంద్యాల.

మొట్టమొదటి సారిగా ఉమ్మడి కడప జిల్లాలో స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ వడ్డే ఓబన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శ్రీకార...
06/02/2024

మొట్టమొదటి సారిగా ఉమ్మడి కడప జిల్లాలో స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ వడ్డే ఓబన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఉమ్మడి కడప జిల్లా (రైల్వే కోడూరు నియోజక వర్గ) కుల బంధువులకు ధన్యవాదాలు.

ఈ యొక్క కార్యక్రమం మొదటగా ఫిబ్రవరి 08న నిర్వహించాలని తలచిన, కొన్ని అనివార్య కారణాలు వల్ల వాయిదా(postponed) చేసి *15/02/2024* న నిర్వహించ తలచారు. కావున, ఫిబ్రవరి 15 న జరిగే ఈ కార్యక్రమానికి కులబందువులు మరియు స్వాతంత్ర్య సమర స్ఫూర్తి ఉన్న ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుచున్నాము.

జై వడ్డెర
జై జై వడ్డెర
జోహార్ ఓబన్న
వడ్డెరల ఐక్యత వర్ధిల్లాలి.



*'చందమామ రావే'* ఈ పాటను తెలుగులో మొదటి వాగ్గేయకారుడు (గాయకుడు-కవి) తాళ్లపాక అన్నమాచార్య రాశారు. ఈ లాలిపాట పాడి తల్లి తన ...
23/08/2023

*'చందమామ రావే'* ఈ పాటను తెలుగులో మొదటి వాగ్గేయకారుడు (గాయకుడు-కవి) తాళ్లపాక అన్నమాచార్య రాశారు. ఈ లాలిపాట పాడి తల్లి తన ఓడిలో నిద్రపట్టని పిల్లలు బహుశా ఆంధ్రప్రదేశ్‌లో, భారతదేశంలో మరియు ప్రపంచ దేశాలలో కూడా ఉండకపోవచ్చు. చందమామ రావే' అని తల్లి అంటే ఎప్పటికీ రాదేమో అనుకున్న మన కలను నిజం చేసిన మన *ISRO (Indian Space Research Organization)* హృదయపూర్వక అభినందనలు ప్రతి భారతీయుడు తరఫున *అఖిల భారత ఒడ్డే ఓబన్న సేవా సమితి (ABOSS)* తేలియచేస్తున్నది.

Failure teaches,

Success specks

Congrats and all the best ISRO for the future achivings.

77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నంద్యాల జిల్లా పరేడ్ గ్రౌండ్లో, స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలను సన్మానించి, ...
16/08/2023

77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నంద్యాల జిల్లా పరేడ్ గ్రౌండ్లో, స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలను సన్మానించి, అభినందనలు తెలుపు కార్యక్రమంలో భాగంగా ప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు *శ్రీ వడ్డే ఓబన్న* గారి వంశీయులు అయిన శ్రీ వడ్డే బాలనారసింహుడు ను సన్మానిస్తున్న రాష్ట్ర *ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మాన్య శ్రీ ఎస్ బి అంజాధ్ భాషా గారు మరియు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఐ ఎ ఎస్ గారు*, నంద్యాల ఎమ్మెల్యే శ్రీ రవించద్ర కిషోర్ రెడ్డి గారు, నంద్యాల ఎంపీ శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు మరియు జిల్లా ప్రజాప్రతినిధులు.

కార్యక్రమంలో భాగంగా మంత్రివర్యులు అంజధ్ భాష గారితో మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది వీరులను స్మరించుకోవడం కోసం వారి జయంతి, వర్దంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది. అదే విధంగా శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి, వర్ధంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరగా.. ఆయన స్పందిస్తూ మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీ పంపండి పరిశీలించి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కిషోర్ రెడ్డి గారితో మాట్లాడుతూ నంద్యాల లో ఓబన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు స్థలం కేటాయించాలని, విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరడం జరిగింది. ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి అఫిషియల్ ఏర్పాటు చేయుటకు కృషి చేస్తాను అని చెప్పడం జరిగింది.
అది త్వరలోనే నెరవేరాలని కోరుకుంటూ..

మీ

వి. బాల నరసింహుడు.

స్వేచ్ఛ సులభంగా రాదు. ఈ దేశాన్ని ఈనాటి స్థితికి చేర్చిన మన  స్వాతంత్ర్య సమర యోధులుకు, జాతీయ నాయకులకు మనమందరం రుణపడి ఉంటా...
15/08/2023

స్వేచ్ఛ సులభంగా రాదు. ఈ దేశాన్ని ఈనాటి స్థితికి చేర్చిన మన స్వాతంత్ర్య సమర యోధులుకు, జాతీయ నాయకులకు మనమందరం రుణపడి ఉంటాము. దేశభక్తి గల పౌరులుగా, మన పౌర బాధ్యతలను నిర్వర్తించడానికి కలిసి కట్టుగా కృషి చేద్దాం. మన వైవిధ్యాన్ని బలహీనతగా చూడక, బిన్నత్వం లో ఏకత్వమనే మన గొప్ప బలంతో కలిసి పని చేయడం ద్వారానే మనం దృఢమైన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాన్ని నిర్మించగలము.

ఈ సందర్భంగా అఖండ భారత ప్రజానీకానికి
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితమే నేటి మన స్వతంత్ర భారతదేశం, అలాంటి మహానుభావులలో ఈ రేనాటి గడ్డపై దేశ స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం పోరాడిన మహానుభావుల గురించి ఈ రోజు ఆంధ్ర జ్యోతి పత్రిక లో ఈనాటి ప్రచురణ.

🙏 *వసుదకు వందనం - వీరుల త్యాగలకు శిరసాభివందనం*🙏కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అజాది కా అమృత్ మహోత్సవ్ లో బాగంగా ఉయ్యాలవ...
10/08/2023

🙏 *వసుదకు వందనం - వీరుల త్యాగలకు శిరసాభివందనం*🙏

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అజాది కా అమృత్ మహోత్సవ్ లో బాగంగా ఉయ్యాలవాడ మండలం రేగడి పాపంపల్లి గ్రామం నందు మండల పంచాయతీ రాజ్ శాఖ అధ్వర్యంలో *నా భూమి - నా దేశం, నేల తల్లికి నమస్కారం - వీరులకు వందనం* కార్యక్రమంలో భాగంగా మొదటి తరం స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ ఉయ్యాలవాడ నారసింహ రెడ్డి గారు, శ్రీ వడ్డే ఓబన్న గారు అలాగే కలియుగ దానకర్ణుడు శ్రీ బుడ్డా వెంగళ రెడ్డి గారు పేర్లతో మరియు గౌరవ ప్రధాన మంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు & గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గార్ల సందేశాలతో కూడిన శిలాఫలకాన్ని మండల ఎంపిడిఓ శ్రీ ఉమా మహేశ్వర రావు గారు, శ్రీ రవిప్రకాష్ (APM), శ్రీ వేంకటేశ్వర రావు (EOPRD) గారు, శ్రీమతి సుచరిత (పంచాయతీ సెక్రటరీ) గారు, గ్రామ సర్పంచ్ శ్రీమతి చాబోలి లక్ష్మీదేవి గారు, ఎంపీపీ శ్రీ కపురం శివమ్మ గారు, ఉప సర్పంచ్ శ్రీ కందుల వేంకట సుబ్బారెడ్డి గారు,శ్రీ ఆకుల రవికుమార్ FA గారు ఓబన్న గారి వారసులు శ్రీ వడ్డే బాల నరసింహుడు, శ్రీ వేంకట నారసింహ రాజు గారు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం వీరుల త్యాగాలను, సేవలను స్మరించుకుంటూ మట్టి ప్రమిదలలో చేసిన దీపం వెలిగించి, పుష్పాంజలి ఘటించడం జరిగింది.

*వసుధకు వందనం* లో భాగంగా ఆ వీరుల త్యాగాలకు గుర్తుగా మొక్కలు నాటడం జరిగింది.

ఎంపిడిఓ శ్రీ ఉమా మహేశ్వర రావు గారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వేచ్చా వాయువులును ప్రసాదించిన ఆ మహనీయులను, వీరులను స్మరించుకోవాల్సిన భాధ్యత మన అందరిపై ఉంది అన్నారు. ఏపీమ్ రవి ప్రకాష్ గారు దేశ జాతీయ బావం, సమైక్యత కోసం 2047 కి సంపూర్ణ భారత్ కోసం ప్రతి పౌరుడు కలసి కట్టుగా పనిచేయాలని ప్రతిజ్ఞ చేపించారు.

అనంతరం గ్రామ సర్పంచ్ జెండా ఆవిష్కరణ గావించి, గ్రామ ప్రజలు అధికారులు జాతీయ గీతాలాపన గావించడం జరిగింది.

*వీరులకు వందనం* లో బాగంగా మొదటి తరం స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ వడ్డే ఓబన్న గారి వారుసులైన శ్రీ వడ్డే బాల నరసింహుడు ను అధికారులు, ప్రజా ప్రతి నిధులు సన్మానించడం జరిగింది.
అనంతరం
బాల నరసింహుడు మాట్లాడుతూ..తెలుగు గడ్డ మీదనుంచి ఇంచుమించు 175 ఏళ్లు క్రితం బ్రిటిష్ ప్రభుత్వం పై సాయుధ పోరాటానికి దిగిన శ్రీ ఉయ్యాలవాడ నరింహారెడ్డి గారు - శ్రీ వడ్డే ఓబన్న గారు, ఆనాడు ఆ రకమైన పోరాటానికి దిగినప్పుడు ఇండియాలో అప్పటికి సిపాయిల పితూరి (1857) కూడా జరిగి ఉండలేదు. భారతీయుల్లో ముఖ్యంగా పల్లె ప్రాంతాలు లో జాతీయ భావ బీజాలు సైతం సరిగా పురుడు పోసుకో లేదు.
మరి ఏ ప్రేరణతో, ఏ అవగాహనతో, ఏ శక్తుల ఆసరాతో వీరు బ్రిటిష్ వారితో తలపడ్డారో మన ఆంధ్ర చరిత్రకారులు పరిశీలించలేదు.
చరిత్రకు సంబంధించి పెక్కు విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉన్నట్లే ఈ తిరుగుబాటు ఉద్యమాన్ని కూడా చులకనగా తీసి వేసే వారిని గురించి ఆచార్య S.C సర్కారు సరైన సూచనలు ఒకటి చేశాడు.

*""The risings against British authority have often enough been dismissed as the outcome of the machinations of a number of dispossessed malcontented persons. But ofcourse the problem is where the following came from, and why did people respond to the 'intrigues' of the interested parties. It is after all a superficial view of history to remain satisfied with attributing all disturbances to 'agitators'...'*
(S. C. సర్కార్).

వడ్డె ఓబన్న గారి గురించి వీరగాథల కెక్కిన తీరును బట్టి ఆయన గురించి పేరు, ఊరు లేని జానపదులు రచించిన జానపద పాటలు, కోలాటపు పాటలు, వీరగాదలు తదితర జానపద గేయాల సరళిని బట్టి చూస్తే పరాయు ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న వొక చిన్న విప్లవ వీరుడిగా వారినీ మనం భావించవలసి ఉంటుంది.

ఎన్నో ఏళ్లుగా 'పిచ్చిగుంట్ల' పాడే పాటల్లో గాని, కోలాటపాటలు లోగాని వీరి గురించి ఉన్న 'జానపద సారస్వతం' తక్కువేమీ కాదు.
ఇన్ని ఉన్న వీటిని పట్టించుకున్న చరిత్రకారులు ఎవరు ఇంతవరకు లేరనే చెప్పాలి.

ఆధునిక చరిత్ర రచన పట్ల మన వారి అలక్షానికి ఇదొక మచ్చుతునక గా పేర్కొనవచ్చు. నేల విడిచి సాము చేయడం మన చరిత్రకారులకు ఆనాదిగా వస్తున్న విద్యే...
జానపద పాటలు, కోలాటం పాటలు, ఆదర పత్రాలు, గ్రంధాలు ఇన్ని ఉన్నప్పటికీ వీటిని సద్వినియోగం చేసుకోలేక పోవడం మనవాళ్ల ఆజ్ఞతకూ నిదర్శనం.

అయితే చరిత్ర రచనకు ప్రభుత్వ రికార్డుల్లో ఒకటే వేదం కాదు, కారాదు. సంపూర్ణ సత్యం అంతా అందులోనే దాగి ఉండదు. వాటిలోనే సర్వ వివరాలు సాక్షాత్కారం కావు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ఇట్టి విలువను గురించి ఒక అజ్ఞాత చరిత్రకారుడు హెచ్చరిస్తున్నారు చూడండి.

*"...... the student should remember that their value (the value of the government records) is not so great as their scope. They may be relied on to tell the truth but not the whole truth. They exhibit the mechanical accuracy and stiffness of an auto mation without the warm passions and emotions that inform all human affairs. Seldom do these old volumes strike the personal note. For that we must turn to private journals, to letters to friends or enemies, or semi-official letters, perhaps, long since passed into oblivion. The student must therefore be warned against accepting the part for the whole or from allowing his judgement to be unduly influenced by the inhuman propriety of these official documents.*

'Hand book to the Revenue Records of the Ceded Districts, Madras, 1932.'

ప్రభుత్వ రికార్డుల పరిమితులను గురించి ఇందులో సరైన హెచ్చరికలే ఉన్నాయి.

భారత స్వాతంత్రోద్యమ పోరాట చరిత్రలో ఎక్కువగా తిరుగుబాట్లు జరిపిన వారి పేర్లు, ఉద్యమాలు నడిపిన వారి పేర్లే లిఖించబడ్డాయి. కానీ, ఏ పోరాటానికైనా సామాన్య ప్రజలే ముందుంటారు అవసరమైన సందర్భాలలో తమ ప్రాణాలను తృణప్రాయంగా బలి దానం చేస్తారు అటువంటి వారి త్యాగాలకు చరిత్రలో సరైన చోటు కల్పించబడలేదు అని చెప్పడంలో సందేహం లేదు.

ఆంధ్ర దేశంలోని రేనాటి గడ్డ పై జరిగిన విప్లవంలో వడ్డే ఓబన్న గారు ముఖ్యపాత్ర వహించారు. వడ్డెరలను, బోయలను, చెంచులు, యానాదులు, వెనుకబడిన సంచారజాతి లనే కాక, రైతులను కూడా కలుపుకొని పదివేల మంది సైన్యంతో సైన్యాధ్యక్షుడు గా బ్రిటిష్ వారితో వీరోచిత పోరాటాలు చేసి అమరుడైన అతనికి చరిత్రలో సముచిత స్థానం కల్పించలేకపోయారు చరిత్రకారులు...

విదేశీ ప్రభుత్వ వ్యవస్థ పై ఆనాడు ఎవరు తిరుగుబాటు చేసిన అది భారతీయుల స్వేచ్ఛకోసం చేసిన తిరుగుబాట్లే అవుతాయి, వారందరూ స్వాతంత్ర్య సమర యోధులే అవుతారు. ఇలాంటి జాతీయ నాయకులను (స్వాతంత్ర సమరయోధులను) వారు ఒక ప్రాంతం కోసమో, మతం కోసమో, కులం కోసమో పోరాటం చెయ్యలేదు, కాబట్టి వారిని ఒక ప్రాంతానికి, కులానికి ఆపాదించకుం ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన భాద్యత మనందిరిపైన ఉంది.

నేడు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశ పెట్టిన అజాది కా అమృత్ మహోత్సవ్ లో బాగంగా మరుగున పడిన స్వాతంత్ర్య సమర యోధులు ను వెలికితీసి వారిని త్యాగాలను, సేవలను ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఈ సందర్భంగా మోడి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుచున్నాని" బాల నరసింహుడు గారు అన్నారు.

అమరుల త్యాగాలుకు గుర్తుగా గ్రామం నుంచి ఢిల్లీ కి పంపుటకు శిలాఫలకం వద్ద మట్టిని కలశాలతో నింపి మండల కేంద్రానికి పంపాలని ఫీల్డ్ అసిస్టెంట్ కి అధికార్లు చెప్పడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ వాలంటరీ లు, గ్రామస్థులు పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఉయ్యాలవాడ మండల అధికారులకు, గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, గ్రామ పెద్దలకు మరియు గ్రామ ప్రజలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏

కార్యక్రమం కోసం ఘనం గా ఏర్పాట్లు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీ ఆకుల రవి కుమార్ గారి ప్రత్యేక ధన్యవాదాలు 🤝🤝.

మీ

వడ్డే బాల నరసింహుడు.
9666672510.

Address

Nandyal
518501

Alerts

Be the first to know and let us send you an email when VOICE TRUST posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram