Sri Anantha Padmanabha Vedic Astro Research centre

Sri Anantha Padmanabha Vedic Astro Research centre Iam International Professional Vedic Astrologer with 24 years of Experience in Vedic Astrology

28/01/2023

*నేను ఎవరు ?*
➖➖➖

*కా తే కాంతా కస్తే పుత్రః* *సంసారోఽయమతీవ విచిత్రః*
*కస్య త్వం కః కుత ఆయాతః*
*తత్త్వం చింతయ తదిహ భ్రాతః||*

*--- ఆదిశంకరుల భజగోవిందం నుండి...*

*నీ భార్య ఎవరు? నీ పుత్రుడు ఎవరు? ఈ సంసారము చాలా విచిత్రమైనది. నీవెవడివాడవు? ఎవడవు? ఎక్కడినుండి వచ్చావు? ఓ సోదరుడా! తత్త్వమునాలోచింపుము.*

*1) కాతేకాంతః...*

*నీ భార్య ఎవరు..? ఇప్పుడు నీ భార్య అనబడే స్త్రీ వివాహానికి ముందు ఒకరి కుమార్తె. ఆమె పుట్టుకలోగాని, పెరగటంలోగాని నీకు ఏ ప్రమేయమూ లేదు. ఆమె ఎక్కడో పుట్టింది. నీవు ఎక్కడో పుట్టావు. అయినా పెళ్ళితో మీ ఇద్దరకూ ముడిపెట్టటం జరిగింది. పోనీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ప్రయాణిస్తారు గదా.. చివరిదాకా ఇలా కలిసే ప్రయాణిస్తారా..? అదేం లేదు. ఈ ప్రయాణంలో ఎవరో ఒకరు ముందుగా దిగిపోతారు. ఆ రెండవ వారు ఒంటరి ప్రయాణం సాగించాలి. అంటే జన్మించటం ఒక్కసారి జరగలేదు. వెళ్ళిపోవటం కూడా ఒక్కసారిగా జరగటం లేదు. ఈ మధ్యలో మాత్రం కొంతకాలం విడిగాను, కొంతకాలం కలసి మెలసి జీవిస్తారు అంతే.*

*ఇదంతా రైలు ప్రయాణం లాంటిది. ఒక ప్రయాణీకుడు మద్రాసులో రైలెక్కాడు. కొంతదూరం ప్రయాణించి నెల్లూరు రాగానే మరొక ప్రయాణీకుడు ఆ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.* *లోకాభిరామాయణంతో ప్రారంభమై రాజకీయాలు, సినిమాలు, వేదాంతం అన్నీ మాట్లాడుకున్నారు. ఎంతో ఆత్మీయులయ్యారు. మొదటి ప్రయాణీకుడు చీరాల రాగానే దిగిపోయాడు. రెండవ ప్రయాణీకుడు మొదటివాణ్ణి విడిచి ఒంటరిగా, దీనంగా ప్రయాణించి విజయవాడలో దిగిపోయాడు. ఇంతే వారి మధ్య సంబంధం.*

*భార్యాభర్తల సంబంధం కూడా ఇలాంటిదే. అందుకే తత్త్వ విచారణ చేసి ఈ బంధం ఎట్టిదో సరియైన అవగాహన చేసుకోవాలి. అప్పుడే నీవు ఎలా ప్రవర్తించాలో సరిగ్గా తెలుస్తుంది.*

*2) కస్తే పుత్రః...*

*అలాగే నీ కుమారుడెవరు..? అని కూడా విచారించు. పుట్టిన దగ్గర నుండి అతడు నీకెంతో ప్రేమాస్పదుడైన కుమారుడు. మరి.. అంతకుముందు..? అతడు నీ భార్య గర్భంలో పిండం. అంతకు ముందో..! అతడు నీలో బీజరూపం..! ఆ బీజం ఎలా వచ్చింది..? నీవు తిన్న ఆహారం ద్వారా నీలో తయారైంది..! మరి ఆ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది..? భూమిలో నుండి వచ్చింది. అంటే మట్టి అనేక మార్పులు చెంది, ఆహారంగా మారి, ఆ ఆహారం నీలో బీజంగా మారి, ఆ బీజం నీ భార్య గర్భంలో ప్రవేశించి పిండంగా మారి, అది వృద్ధి చెంది శిశువుగా వ్యక్తమైంది.*

*అంటే మట్టి యొక్క చివరి రూపమే నీ కుమారుడు అన్నమాట. మరి నీవు ఎవరు..? నీవూ అంతే.. కాకపోతే ఆ బిడ్డకన్నా కాలంలో నీవు ముందున్నావు. నీవు కూడా మట్టి యొక్క ఆఖరి రూపమే. ఈ లెక్కన చూస్తే కదులుతున్న ఒక పెద్ద మట్టి ముద్ద మరొక చిన్న మట్టి ముద్దను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది, ప్రేమను పెంచుకుంటుంది. విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు విల విలలాడి పోతుంటుంది. దూరంగా ఉండి ఈ రెండు మట్టి ముద్దల నాటకాన్ని మనం తమాషాగా చూస్తున్నాం అనుకోండి. నవ్వకుండా ఉండలేం. కాని అదే నాటకంలో మనం పాత్రధారులమై ఎంతో సీరియస్ గా ఆ మట్టి ముద్దల పాత్రలను పోషిస్తున్నాం. ఇదే భ్రమ, ఇదే మాయ, ఇదే అజ్ఞానం.*

*ఉన్నది ఉన్నట్లుగ చూడలేక… 'నాది - నాది' అని భ్రమలో పడి కొట్టుకుపోతుంటాం. ఎంత చిత్రం.. అందుకే ఈ సంసారం అతి విచిత్రం, తమాషా అయినట్టిది. ఇంతకీ ఈ సంసార బంధంలో చిక్కుకు పోయిన నీవు ఎవరు..? ఎవరి వాడవు..? ఎక్కడి నుండి వచ్చావు..? ఈ విచారణ ముఖ్యమైనది. వేదాంతంలో నేనెవరు..? అని విచారణ చేయటమే మానవ జీవిత సార్థక్యానికి ఏకైక ఉపాయం.*

*సమస్త దుఃఖాలకు అజ్ఞానానికి అంతమే ఈ "నేనెవరు..?" అనే విచారణయేనని భగవాన్ రమణ మహర్షుల వారి ఉపదేశం.*

*నేనెవరు..? నేను ఈ శరీరమా..? కాదు... ఇదొక గృహం లాంటిది. జడమైనది. ఇందులో కూర్చుని నేను నా పనులను నిర్వర్తించు కుంటున్నాను. మరి నేను మనోబుద్ధులా..? కాదు... అవి నేను పనిచేయటానికి ఉపయోగించుకొనే పనిముట్లు మాత్రమే. అవీ జడమే. వాటిని నేను ఉపయోగించు కుంటున్నాను.*

*మరైతే నేనెవరు..? దేహంలో కూర్చొని, మనోబుద్ధులను ఉపయోగించుకొని పనిచేసే జీవుడను. అయితే జీవుడనైన నేను ఎవరికి చెందిన వాడను..? ఎక్కణ్ణించి వచ్చాను..? నేను నిజంగా అంతటా వ్యాపించియున్న పరమాత్మకు చెందినవాడను. నేను వచ్చింది అక్కణ్ణించే. *

*మరి ఎక్కడకు వెళ్ళాలి..? ఆ పరమాత్మ వద్దకే...! పరమాత్మ నుండి వచ్చిన జీవుడు కొంతకాలం ఈ జీవన నాటకరంగంలో సుఖదుఃఖాలు అనుభవించి చివరకు ఆ పరమాత్మలో చేరిపోవాలి. అప్పుడే పరమశాంతి, శాశ్వతానందం...!

26/10/2022

::::::::::::*ఆందోళన* :::::::::::
మనం ఎక్కువగా క్రింద చెప్పిన కారణాల వల్ల ఆందోళన చెందుతాం.
*1)* భవిష్యత్తు లో కీడు నష్టం కష్టం కలగ వచ్చు అని ఊహిస్తూ, ఊహా నిజం అను కుంటాము
*2)* మనలను మనం తక్కువ అంచనా వేసి రాబోయే కష్టం భరించ లేము అనుకుంటాం.
*3)* రాబోయే రోజులన్నీ గడ్డు రోజులు అనుకుంటాం.
*4)* వ్యతిరేక పరిస్థితులను భూతద్దంలో చూస్తాం.
*5)* పర్యవసానాలను సరిగ్గా అంచనా వేయం,మంచిని చిన్నగా చూసి చెడును పెద్దగా చూస్తాం.
*6)* సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకోము.
*7)* ఎప్పటి కప్పడు రిలాక్స్ అవ్వకుండా టెన్షన్ తోనే జీవిస్తూ ఉంటాము.
మీరు ఆందోళన నుంచి బయటకు రావాలంటే, మీ జీవితం పై అవగాహనకు మరియు మరిన్ని వివరాలకై చింతలపూడి మురళీ మోహన్ శర్మ గారు, అంతర్జాతీయ జ్యోతిష్య నిపుణులు 9959463336.

23/10/2022

స్నేహం ఎప్పుడూ #లేనివాడితో చేయకూడదు!!
#కలవారితోనే చేయాలి!!
నిజం!!
ఆ లేనివాడు మరెవరో కాదు..
బుద్ధి లేనివాడు..
జాలి లేనివాడు..
సద్గుణాలు లేనివాడు..
ప్రేమ లేనివాడు..
దానగుణం లేనివాడు..
దైవ భక్తి లేనివాడు..
మానవత్వం లేని వాడు..
క్షమ లేనివాడు...
ఇలాంటి వారు దరిద్రం జేబులో పెట్టుకొని తిరిగేవారు.. పక్కవారికి కూడా అంటిస్తారు!!
అందుకే సాక్షాత్తు భగవంతుడు కూడా ఇవన్నీ #కలవారితోనే స్నేహం చేశాడు!!

21/10/2022

*_ #ఈ క్రింది ఔషధాలు ఎప్పటికీ మందుల షాపులలో దొరకవు..... *

1. వ్యాయామమే ఔషధం.
2. ఉపవాసం ఔషధం.
3. సహజ ఆహారమే ఔషధం.
4. నవ్వు ఔషధం.
5. కూరగాయలు ఔషధం.
6. నిద్ర ఔషధం.
7. సూర్యకాంతి ఔషధం.
8. ఎవరినైనా నిస్వార్ధంగా ప్రేమించడం ఔషధం.
9. ప్రేమించబడడం ఔషధం.
10. కృతజ్ఞత అనేది ఔషధం.
11. నేర ప్రవృత్తిని వదలడం ఔషధం.
12. ధ్యానం ఔషధం.
13. మంచి స్నేహితులే ఔషధం.

ఈ ఔషధాలను తగినంతగా మీఅంతకు మీరే సంపాదించుకోవాలి..

పై ఔషధాలు సంపాదించుకుంటే, బజారులో ఉండే మందులషాపులో ఉండే ఔషధాలతో 99% అవసరమే ఉండదు...🙏🙏🙏

Important information
13/10/2022

Important information

Subscribe, Like and share to ur groups
01/10/2022

Subscribe, Like and share to ur groups

Sri Anantha Padmanabha Jyothishalayam - Brahmasri Chintalapudi Murali Mohana Sarma Garu, International Professional Vedic Astrologer - +91 9959463336.Career...

మనిషి మాంసాహారముయ ఎందుకు తినకూడదు' అని అనడానికి కొన్ని కారణాలు...1. ప్రకృతి సిద్ధమైన కారణాలు2. శరీర నిర్మాణ కారణాలు3. మా...
21/09/2022

మనిషి మాంసాహారముయ ఎందుకు తినకూడదు' అని అనడానికి కొన్ని కారణాలు...
1. ప్రకృతి సిద్ధమైన కారణాలు
2. శరీర నిర్మాణ కారణాలు
3. మానసిక కారణాలు
4. ఆధ్యాత్మిక కారణాలు

1. ప్రకృతి సిద్ధమైన కారణాలు:-
మాంసాహార జంతువులు మాంసాహారము మాత్రమే భుజిస్తాయి., శాకాహార జంతువులు శాకాహారాన్ని మాత్రమే భుజిస్తాయి. మనిషి మాంసాహారా, శాకాహారా అని తెలుసుకోవాలంటే - మనిషికి, మాంసాహార జంతువులకు గల అలవాట్లను పోల్చి చూద్దాము.
మాంసాహార జంతువులైన పిల్లి, కుక్క, పులి ఇవన్నీ నీటిని నాలుకతో తాగుతాయి. శాకాహార జంతువులైన ఆవు, గేదె మరియు మనిషి పెదవుల సహాయంతో నీటిని తాగుతారు.
మాంసాహార జంతువులకు పుట్టిన పిల్లలు 2,3 రోజులకు కానీ కళ్ళు తెరువవు. కానీ, మానవ శిశువు పుట్టిన వెంటనే కళ్ళు తెరవడము జరుగుతుంది.
మాంసాహార జంతువుల గోళ్లు వంపు తిరిగి ఉంటాయి. శాకాహార జంతువులకు గోళ్ళు ఒంపు తిరిగి ఉండవు.
మాంసాహార జంతువులకు మాంసము చీల్చటానికి 'కోరపళ్ళు' ఉంటాయి. మనిషికి 'కోరపళ్ళు' ఉండవు.
ఈ తేడాలను గమనిస్తే మనిషి 'ప్రకృతి సిద్ధంగా శాకాహారి' అని, మాంసాహారము తినటము ప్రకృతి విరుద్ధము అని తెలుస్తోంది.

2. శరీర నిర్మాణ కారణాలు:-
మనిషి జీర్ణాశయంలో ఆహారము 3 లేక 4 గంటలు మాత్రమే నిలువ ఉంటుంది. ఆ సమయము మాంసాహారము పూర్తిగా జీర్ణము అవ్వడానికి సరిపోదు. అసంపూర్ణంగా జీర్ణమైన మాంసాహారంలో 'టాక్సిన్ అమినో ఆమ్లాలు' (విష పదార్థాలు) ఉత్పన్నమవుతాయి. వీటి ఉత్పత్తి వల్ల కాలేయము, మూత్రపిండాలు సరిగా పనిచేయవు. జీవ రసాయనిక చర్యలు కుంటుపడి గ్యాస్ సమస్య పెరుగుతుంది. "అసంపూర్ణ జీర్ణము సకల రోగాలకు మూలము", అందువల్ల మాంసాహారము మానవ శరీరానికి నిషిద్ధము.

3. మానసిక కారణాలు:-
ఒక కోడిని కోసేటప్పుడు, అది ఎంతో బాధతో గిలాగిలా కొట్టుకుంటుంది, భయంతో రెక్కలు టపటపలాడిస్తుంది. అతి భయము వల్ల దాని శరీరంలో కొన్ని విష పదార్థాలు ఉత్పన్నమవుతాయి. ఈ విష పదార్థము కోడి యొక్క శరీరము అంతా వ్యాపించి ఉంటుంది. అంటే ఆ కోడి తింటున్నప్పుడు దాని భయాన్ని కూడా తింటున్నామన్నమాట. ఇదే పరిస్థితి ఏ జంతువుని తిన్నా జరుగుతుంది. ఆ జంతువు యొక్క భయాలే మనలోని 'మానసిక ఆందోళనలు'.

4. ఆధ్యాత్మిక కారణాలు:-
చనిపోయిన శరీరాన్ని 'మృత కళేబరాలు' అంటారు. అలాంటి మృత కళేబరాలను మన శరీరంలో పడవేసి 'దేవాలయము' వంటి శరీరాన్ని 'శ్మశాన వాటిక'గా చేసుకోకూడదు.
మనకు కనబడే స్థూల శరీరము చుట్టూ, ఎనర్జీ బాడీ ఉంటుంది. మాంసాహారము తినడము వలన ఈ ఎనర్జీ బాడీ క్షీణిస్తుంది. ఆ కారణంగా 'రోగ నిరోధక శక్తి' తగ్గిపోతుంది, దీని వల్ల రోగాలు సంభవిస్తాయి.
మనలో ప్రవేశించే విశ్వప్రాణశక్తి మాంసాహారము వల్ల ఉత్పన్నమయ్యే 'నెగటివ్ ఎనర్జీ' ఆటంకపరుస్తుంది. అందుకే "మాంసాహారము తినకూడదు"

మనకు వచ్చే ఆలోచనలు రెండు రకాలు.1)మంచివి2)చెడ్డవి.       1) మంచి ఆలోచనలు.మూడు రకాలుA) మనస్సుకి శాంతిని చేకూర్చేవి B) ఇతరు...
09/09/2022

మనకు వచ్చే ఆలోచనలు రెండు రకాలు.1)మంచివి2)చెడ్డవి.
1) మంచి ఆలోచనలు.మూడు రకాలు
A) మనస్సుకి శాంతిని చేకూర్చేవి
B) ఇతరుల పట్ల దయ, కరుణ ప్రేమ,జాలి కలిగించేవి
C)ఎలాంటి కోరికలు లేనటువంటివి.
ఇవి కలిగి వుంటే పెంపొందించు కోవాలి.లేనివి కలిగించుకోవాలి.
వీటిలో నివాసం వుండాలి.వీటితో బంధం కలిగి వుండాలి.వీటినే మననం చేసుకోవాలి.
2) చెడ్డ ఆలోచనలు.ఇవి మూడు రకాలు
A) రకరకాల కోరికలతో నిండినవి
B) కోపాన్ని తెచ్చి పెట్టేవి
C) హింసాత్మక మైనవి.
కలిగిన వాటినుండి విముక్తి పొందాలి. క్రొత్తవి పుట్టకుండా చూడాలి.
వీటితో కుస్తీ పడొద్దు.అణచ వద్దు.వీటిని పట్టించుకోకండి, సాక్షిగా వుండండి.
ఇట్లు
ఆలోచనాపరుడు లేని ఆలోచనలు

31/08/2022

Address

Narsapur
Narasapur
534275

Telephone

+919581965556

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Anantha Padmanabha Vedic Astro Research centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sri Anantha Padmanabha Vedic Astro Research centre:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram