24/05/2024
ఈ రోజు ప్రపంచ స్కిజోఫ్రెనియా డే.
*జనాభాలో ప్రతీ 100 మందిలో ఒకరికి ఈ జబ్బు ఉంటుంది.
స్కిజోఫ్రెనియా లక్షణాలు టూకీగా:
*శరీరంలో అన్ని భాగాలకు జబ్బులు పట్టినట్టే 'మనసు'కూ జబ్బు చేస్తుంది
*మనసులో బోలెడు తునకలు ఉంటాయి. అందులో 'ఆలోచన' కూడా ఒకటి.
*స్కిజోఫ్రెనియి మనిషి 'ఆలోచన'కు పట్టే జబ్బు.
*ఆలోచన మందగించటం, లేదా అదుపు తప్పటం ఇందులో కీలక లక్షణం .
*ఆలోచన అదుపు తప్పటం వల్ల ప్రవర్తన మారిపోతుంది.
*పరిసరాలతో/సమాజంతో. మమేకంకాలేక పోవటం
* నిదానం, మెతకదనంగా మారిపోవటం
*వ్యక్తిగత శుభ్రత లేకపోవటం
*పని/చదువులో మందగింపు
*తనలో తానే నవ్వుకోవడం, మాట్లాడుకోవటం
*నిస్తేజంగా ఉండిపోవడం
*అనుమానం: భాగస్వామిని అనుమానించడం, అక్రమసంబంధం అంటగట్టడం, తనను గురించి చెడుగా అంటున్నారని చెప్పటం, చేతబడి చేసారనటం, తనకు విషం పెడుతున్నారని అనుకోవటం,తనమీద కుట్ర జరుగుతోందని భావించటం
*గాల్లో నుంచి మాటలు వినపడటం.
*రేడియో, టీవీల్లో తన గురించే చెబుతున్నాయని భావించటం
*తన ఆలోచనలు ఇతరులకు తతెలిసిపోతుందని భావించటం
*తనను అతీంద్రియ శక్తులు అదుపు చేస్తున్నాయని అనుకోవటం,
*తన మెదడును ఇతరులు అదుపు చేస్తున్నారని అనుకోవటం
*తనకు జబ్బు ఉందని గుర్తించ లేకపోవటం
*వైద్యాన్ని నిరాకరించడం
*Self identity కోల్పోవటం
ఇంకా బోలేడు ఉన్నాయి...
అందరిలో పైన చెప్పిన లక్షణాలు అన్నీ ఉండవు. ఇందులో రకాలను బట్టి కలగా పులంగా ఉంటాయి.