Devender Reddy Super Specialty Hospital

Devender Reddy Super Specialty Hospital Devender Reddy Hospital: Expert care, healing lives. Your trusted destination for superior healthcar

15/11/2024
మానవత్వం చాటుకున్న డా. దేవేందర్ రెడ్డి*****నిర్మల్ పట్టణానికి చెందిన డా.దేవేంద రెడ్డి ఆసుపత్రి నిర్వాహకుడు డా.దేవేంద రెడ...
30/08/2024

మానవత్వం చాటుకున్న డా. దేవేందర్ రెడ్డి
*****
నిర్మల్ పట్టణానికి చెందిన డా.దేవేంద రెడ్డి ఆసుపత్రి నిర్వాహకుడు డా.దేవేంద రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేసే ఆయన తాజాగా ఓ నిరుపేద కుటుంబానికి అత్యంత ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించారు. నిర్మల్ కు చెందిన చొక్కాల శంకర్ వృత్తిరీత్యా ఓ ఆలయంలో పూజారి. నెలరోజుల క్రితం ఇంట్లో స్నానాల గదిలో ప్రమాదవశాత్తు పడిపోవడంతో కాలికి తీవ్ర గాయమైంది. అది కాస్తా పెరిగి పెద్దదై ప్రాణాల మీదకే తీసుకొచ్చింది. ఆయన పనిచేస్తే కానీ పూటగడవని ఆ కుటుంబానికి ఇదో పెద్ద భారమై కూర్చుంది. ఏ ఆధారం లేని ఆ వ్యక్తిని కాపాడుకునేందుకు కుటుంబసభ్యులు దేవుడిపైనే భారం వేశారు. ఈలోపు ఆ సమాచారం తెలుసుకున్న డా. దేవేందర్ రెడ్డి తన ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ముందుకొచ్చారు. 15 రోజుల పాటు ఐసీయూలో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తూ, నిపుణులైన వైద్యులచే చికిత్స చేయిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో శంకర్ రెండు, మూడుసార్లు మరణం అంచులదాకా వెళ్లారు. అతనికి గ్యాస్ గ్యాంగ్ సోకడంతో కుడికాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురైంది తప్పనిసరి పరిస్థితుల్లో కాలిని తొడ పైభాగం వరకు తొలగించాల్సి వచ్చింది. అటు కుటుంబసభ్యులకు దైర్యం చెప్తూ, ఇటు బాధితుడికి సాంత్వన చేకూరుస్తూ అక్కడి. వైద్య సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు. ఖరీదైన వైద్యం ఉచితంగానే అందించడంతో బాధితుడు త్వరగానే కోలుకున్నాడు. గురువారం ఆయనను డిశ్చార్జి చేశారు. ఇదే వైద్యం హైదరాబాద్ వంటి నగరాల్లో చేస్తే రూ.15 లక్షలకు మించి ఖర్చయ్యేది. తమ పాలిట దేవేందర్రెడ్డి దేవుడయ్యారని ఆయన కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆశలు వదులుకున్న తమకు ఈ వైద్యుడే ఆశాదీపమయ్యాడంటూ కొనియాడారు. సేవలందించిన వైద్యులు అరుణరెడ్డి, ఆశ్విర్ రెడ్డి, శ్రీనివాసయాదవ్, థియేటర్ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ కు ఇంటిల్లిపాదీ కృతజ్ఞతలు తెలిపారు.
దేవేందర్ రెడ్డి తన పుట్టినరోజునే శంకర్ను డిశ్చార్జ్ చేసి తన జన్మదిన కానుకగా బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు

Address

Opp. Maremma Temple, Khanapur Road
Nirmal
504106

Alerts

Be the first to know and let us send you an email when Devender Reddy Super Specialty Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Devender Reddy Super Specialty Hospital:

Videos

Share