10/10/2025
మన నిర్మల్ పట్టణంలో ప్రముఖ మానసిక వైద్యులు డా సురేష్ అల్లాడి గారు డా అల్లాడి మైండ్ క్లినిక్ లో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత వైద్యం అందించి పెయింటింగ్, కలరింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాము.1992 లో మొదటిసారిగా WHO, ప్రపంచ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ సంయుక్తంగా ప్రారంభించాయి. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించడం, అపోహలు తొలగించడం, మానసిక రోగులకు అవసరమైన మద్దతు ఇవ్వడం. ఈ యేడాది థీమ్ " అందుబాటులో అత్యవసర, విపత్తు పరిస్తితుల్లో మానసిక ఆరోగ్య సేవలు" అని తెలిపారు.